top of page

ఓ సీత కథ - పార్ట్ 1

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


 'O Sita Katha - Part 1/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 01/04/2024

'ఓ సీత కథ - పార్ట్ 1/2పెద్దకథ ప్రారంభం

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



 "రాజూ! నిద్ర లే. మీ తాతతో కలిసి, మీ నాన్న దగ్గరికి వెల్దువు, లే!" అంటూ సీత లేపింది రాజుని. నిద్ర పోయింది నాన్న అనే మాట వినటంతో. 


"నాన్న దగ్గరికా! అమ్మా”, మంచం మీద నుండి ఒక పల్టి కొట్టి లేస్తూ సంతోషంతో అన్నాడు రాజు.


 "అవునురా! లేచి తొందరగా తయారవ్వు, తాత వస్తాడు. నిన్ను తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర దింపి రావటానికి" దుప్పటి మడతేస్తూ అంది సీత. అప్పటివరకు రాజులో ఉన్న సంతోషం ఎగిరిపోయింది. 


"అదేంటి నువ్వు రావటం లేదా!" మొహం మాడ్చుకుని అన్నాడు రాజు.


 "లేదు. నాన్న నేను వస్తె ఇక్కడి పనులు ఎవరు చేస్తారు. నువ్వు వెళ్ళు తాతతో! నన్ను విసిగించకు”, విసుక్కుంటూ మంచం మీద నీరసంగా కూలబడింది సీత.


‘ఎందుకో అమ్మ ఈమధ్య ఇదివరకటి లాగా ఉండటం లేదు’ అనుకుంటూ ఏడేళ్ల రాజు మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చాడు. అమ్మ ఇంకా పడుకునే ఉంది. 


"అక్కడ ఇడ్లి పెట్టాను తిను. ఆ లాగుచొక్కా వేసుకుని తాత వచ్చేసరికి రెడీగా ఉండు. అక్కడ నాన్నను విసిగించమాకు, పిన్ని చెప్పినట్లు విను. ఎపుడైనా నాన్నను అడిగి నాకు ఫోన్ చెయ్యి. వద్దులే నేనే చేస్తా ఫోన్ నీకు!" అంది నీరసంగా.


 ఇంతలో రాజయ్య వచ్చి "ఏమ్మా రాజు రెడీగా ఉన్నాడా!”


 "ఆ రెడీ నాన్న!" అంది సీత.


"ఏంటమ్మా ఇంకా పడుకునే ఉన్నావు. ఒంట్లో ఎట్లా వుంది" అన్నాడు రాజయ్య కంగారుగా.


 "పర్లేదు నాన్న, మాత్ర వేసుకుంటాలే! తగ్గుతుంది" అంది సీత.


 'అయ్యో పిచ్చి తల్లి! మాత్ర వేసుకుంటే తగ్గే రోగమైతే ఎంతో బాగుండు. ఆ మాయదారి రోగం నీకే రావాలా!' కూతురు గురించి బాధ పడ్డాడు. 


"నాన్న వాడి బాగ్ సర్దాను. అక్కడ వాడ్ని దింపి వెంటనే వచ్చేయి."


 "ఆ రాకుండా అక్కడ ఉంటానా, నువ్వు ఏదైనా తిని మాత్ర వేసుకుని పడుకో తల్లీ!" రాజును తీసుకుని బస్టాప్ కు వచ్చాడు రాజయ్య.


 రాజు పట్నం వెళ్తున్నానని సంతోషంగా ఉన్నాడు, 'నాన్నను చూస్తాను. నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ల నాన్నలు వచ్చి స్కూల్ దగ్గర దింపి వెళ్తారు. అమ్మను ఎన్నిసార్లు అడిగినా ఏమి చెప్పదు, పట్నంలో ఉన్నారు వస్తారంటుంది. ఇంతవరకు రాలేదు, ఇపుడు నేను నాన్న దగ్గరే ఉంటాను అనుకునే సరికి ఎంతో ఆనందంగా ఉంది. కిటికీ పక్కన కూర్చుని ఎపుడు పట్నం వస్తుందా!' అని ఎదురు చూస్తున్నాడు.


 రాజు పక్కన కూర్చుని తన కూతురు గూర్చి ఆలోచిస్తూ బాధ పడుతున్నాడు రాజయ్య. నా కూతురుకు సీత పేరు పెట్టీ తప్పు చేసాను. ఆ సీతమ్మ తల్లీ! లాగా కష్టాలు పడుతుంది. అది పుట్టిన ఏడో సంవత్సరంలో దానికి తల్లి పోయింది. అవును ఇపుడు రాజుకు ఏడో సంవత్సరం కదూ! మళ్ళీ వీడికి వాళ్ల అమ్మ పోలిక రాదు కదా! ఏమి కాదులే" మళ్ళీ మనసును దిటవు చేసుకున్నాడు.


 రాజయ్య రామాపురములో ఐదు ఎకరాలకు ఆసామి. రాజయ్యకు, ఒక కొడుకు శంకర్, కూతురు సీత. సీతకు ఏడు యేళ్ల వయసులో భార్య సావిత్రి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. భార్య బతకటం కోసం రెండు ఏకరాలు పొలం అమ్మి వైద్యం చేయించినా బతకలేదు. 


 సీత! అప్పటినుండి ఇంట్లో పని చేసి ఆ ఊళ్ళోనే వున్న స్కూల్ కెళ్ళి టెన్త్ వరకు చదువుకుంది. కొడుకు వాసుకు చదువు అబ్బక వ్యవసాయం ఉన్న వూళ్ళో చేస్తున్నాడు. నేను పెద్దవాడ్ని అయ్యానని ఉన్న మూడెకరాలలో రెండు ఎకరాలు కొడుకుకు ఇచ్చాడు. ఒక ఎకరం కూతురు పేరు మీద పెట్టీ పెళ్లి చేసాడు రాజయ్య.


 పెళ్లయిన నాల్గు సంవత్సరాల వరకు బాగానే ఉంది. ఇంతలోనే వాళ్లమ్మకు వచ్చినట్లు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. పిల్లాడికి మూడో ఏడు వచ్చింది. వూరికినే... నీరసంగా ఎపుడూ జ్వరం అంటూ పడుకుని ఉండేది సీత. అల్లుడు రమేషుకు కొంచం స్వార్థం ఎక్కువ. 


 అదీకాక రాజయ్యకు, కూతురు అంటే గారాబం. ఊరిలో పండే ధాన్యం, కూరలు తీసుకొచ్చి కూతురి కిచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు అట్లాగే వూరి నుండి వచ్చిన రాజయ్యతో “మీ అమ్మాయిని తీసుకెళ్లండి. జ్వరంతో బాధ పడ్తుంది, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని వస్తుం”దన్నాడు రమేష్. 


భార్య మీద ఎంత ప్రేమో? అనుకుని “అలాగే బాబు తీసుకెళ్తాను”.


అపుడు రాముడు, భార్యను అడవుల్లో దింపి రమ్మని చెప్పాడు. ఇక్కడ సీత భర్త రమేష్ వైద్యం చేయిస్తే డబ్బులవుతాయనీ! భార్యను వాళ్ల నాన్నతో పంపాడు. 

 

 పక్కనున్న సిటీకి తీసుకెళ్ళి టెస్టులు చేయిస్తే క్యాన్సర్ అన్నారు. ఈ మూడేళ్ల నుండి వైద్యం చేయిస్తున్నాడు రాజయ్య. డబ్బులు అవుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఊరికి వచ్చిన తర్వాత సీత భర్తకు కాల్ చేసింది. ఇది సంగతనీ! " అవునా మరి వైద్యం అక్కడే ఉండి చేయించుకో! తగ్గిన తర్వాత కాల్ చెయ్యి వచ్చి తీసుకొచ్చుకుంటాను అన్నాడు రమేష్ నిరాసక్తత తో.


 అపుడే భర్త బుద్ది బయట పడింది. అప్పటి వరకు నా భర్త శ్రీరామచంద్ర మూర్తి అనుకుంది. కనీసం అయ్యో! నీకు ఇట్లా అయింది, బాబు ఎలా ఉన్నాడనీ! అడగని భర్తను తలుచుకుని ఇంకా మంచం పాలైంది సీత.


 అపుడు నాన్నకు చెప్పి, వాళ్లకు కొంచం దూరంలో ఒక గది అద్దెకు తీసుకుని ఉండసాగింది. నాన్న తనకు ఇచ్చిన పొలం తమ్ముడు తీసుకుని డబ్బులు ఇస్తే అవే పెట్టుకుని తింటున్నది సీత. ఆరునెలలు ఆగిన తర్వాత, రాజయ్యకు ఫోన్ చేసి రమేష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. 


 

 "అదేంటమ్మా మీ ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకుంటున్నాడు, నీకు తెలుసంటాడు ఏంటి!" సీరియస్ గా అన్నాడు రాజయ్య. 


"నాకు ఫోన్ చేసాడు నాన్న నేను పెళ్లి చేసుకుంటున్నానని, నేనే సరే అన్నాను. మీకు చెప్పలేదు, మీరు బాధ పడతారని. వంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర చూపించని ఆయన గురించి నేను బాధ పడటం ఎపుడో మానేసాను నాన్న. 


అందరూ నీలాగా! ఉంటారనుకోకు నాన్న. అమ్మ పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మమ్మలని పెంచి పెద్ద చేసావు. నేను మగవాళ్ళు నీలాగా ఉంటారని కలలు కన్నా. అవన్నీ కల్లలని ఇపుడే తెలుస్తుంది నాన్న"


 "నువ్వు పెళ్లి చేసుకో అనీ! చెప్పకుండా ఉండాల్సింది సీతా!" అన్నాడు రాజయ్య. 


"లేదు నాన్న. నాకు బతుకుతాననే ఆశ లేదు. అపుడు ఆయన మీద కోపం వచ్చిన మాట వాస్తవమే. ఇపుడు ఆయన వైపు ఆలోచిస్తే ఎన్నాళ్ళు ఆయన ఒంటరిగా ఉంటాడు. ఆయన చేసింది కరెక్టే! అనిపించింది."


 తర్వాత రమేషుకు అమ్మాయి పుట్టింది. నాన్న రాజయ్య సీతను హాస్పిటల్సుకు తిప్పుతున్నాడు. దానికి తోడు, మా అమ్మ లాగానే పోతానని సీతకు మనోవ్యాధి పట్టుకుంది. నేను పోతే నా పిల్లాడు దిక్కులేని వాడవుతాడనే దిగులుతో ఉంది సీత.


 అందుకే వాళ్ళాయనకు కాల్ చేసింది. మీ పిల్లాడిని మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను రోగిష్టిదనీ! వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా, నేను మిమ్మలను ఏమి అనలేదు. కనీసం కన్న కొడుకును వదులు కోరనుకుంటున్నాను" అంది.


 ఎలాగో, భార్యకు చెప్పి ఒప్పించాడు. మరుసటి రోజు సీతకు ఫోన్చేసి "సరే పంపించు రాజును" అన్నాడు, రమేష్ సీతతో. అందుకే ఇపుడు వాళ్ల నాన్నతో రాజు నిచ్చి ఇచ్చి పట్నం పంపుతుంది.


 పట్నం చేరారు, తాతా మనవడు. ఆ రోజు ఆదివారం అవ్వటం వల్ల రమేషు ఇంట్లో ఉన్నాడు. రాజయ్యను, పలకరించి రాజును దగ్గరకు తీసుకున్నాడు. రాజు వాళ్ల నాన్నను చాలా ప్రేమగా చూస్తున్నాడు. 


"నాన్నా!" అంటూ రమేషును అల్లుకుపోయాడు. రాజును ఒళ్ళో పెట్టుకుని సీత గురించి అడిగాడు. ఇంతలో రమేషు భార్య గౌరి రాజయ్యకు కాఫీ ఇచ్చింది. ఇంట్లో నుండి గజ్జెల పట్టీలు గౌను వేసుకుని రెండేళ్ల పాప బయటకు వచ్చింది. 'అమ్మ చెప్పింది నాకు చెల్లి ఉందని ఈ పాపే నా చెల్లి!' అనుకుంటూ రాజు పాపను ఎత్తుకున్నాడు.


 "బాబు జాగ్రత్త!" నేను వెళ్తానని బయలుదేరాడు రాజయ్య. వస్తూ మనవడి వైపు చూస్తే పాపను బొమ్మలతో ఆడిస్తూ బిజీగా ఉన్నాడు. “ఒరేయి రాజూ! వస్తాను టాటా!" చెప్పి ఊరు వెళ్ళాడు రాజయ్య. ఒక వారం గడిచింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


105 views0 comments

Comentarios


bottom of page