top of page

సంచిక పొంగింది - ఎపిసోడ్ 3


'Sanchika Pongindi - Episode 3/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao

'సంచిక పొంగింది - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు.


ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు.


అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు.

పెళ్లికాని యువతీయువకులు ఇలా ఒక గదిలో ఉండటం మంచిది కాదంటారు పోలీసులు.

ఆ మాటలకు కోపం వస్తుంది సంచికకు.

సంచికకు ఇబ్బంది రానివ్వ వద్దని శ్రీకర్ తల్లి, అతనితో చెబుతుంది.


ఇక సంచిక పొంగింది ధారావాహిక మూడవ భాగం చదవండి..


ఒక పక్షం తర్వాత..

గతంలోని రిటన్ టెస్ట్ లో క్వాలిఫై కావడంతో.. ఇంటర్వ్యూ అవకాశం పొందారు సంచిక, శ్రీకర్ లు.

ప్రస్తుతం దానికై వచ్చి.. వేచి ఉన్నారు వాళ్లు.


అక్కడ తమ లాగే వచ్చి.. చాలా మంది ఉన్నారు.


"ఒన్ ఈస్ట్ త్రీ అనుకోవచ్చా." అడిగాడు శ్రీకర్.


అతని పక్కనే కుర్చీలో కూర్చున్న సంచిక.. "మే బి." అంది.


"టోటల్ పోస్టులు ట్వింటీ కదా."


"య. వచ్చిన వారిని చూస్తే.. రమారమీ ఫిఫ్టీ ఎబౌలా తోస్తున్నారు." చెప్పింది సంచిక.


"కానీ. చూద్దాం." అనేశాడు శ్రీకర్.


అతడు చుట్టూ చూస్తూ ఉన్నాడు.

సుమారుగా సంచిక కూడా అలానే కదులుతుంది.

అప్పుడే.. ఆమె చూపున.. ఓ మూలగా కూర్చున్న ఒకామె పడింది.

ఆమె.. చాలా నెర్వస్ లో ఉన్నట్టు సంచికకు తోచింది.

దాంతో మరింత పట్టుగా అటే చూస్తుంది.


'ఆమె అభ్యర్థి ఐ ఉంటుంది.' అనుకుంది సంచిక.


శ్రీకర్ వంక చూపు తిప్పి.. "కర్." అంది.


శ్రీకర్.. "ఉఁ." కొట్టాడు.


"ఆమెను చూడు." చెప్పింది సంచిక.. అటు చూపుతూ.

ఆమెను చూశాడు శ్రీకర్.


"ఏంటి. తను ఆందోళనగా ఉంది." అన్నాడు.


"అదే. నాకూ అలానే తోచింది." అంది సంచిక.


"ఏమై ఉంటుందో." శ్రీకర్ అటే చూస్తున్నాడు.


సంచిక ఏమీ మాట్లాడ లేదు.

"వెళ్లి పలకరిద్దామా." అడిగాడు శ్రీకర్.


"చేద్దాం." అనేసింది సంచిక.

ఆ ఇద్దరూ లేచారు. అటు నడిచారు.

ఆమె ముందు ఆగారు.


"హలో." అంది సంచిక.

ఆమె తలెత్తింది. ఆమె ముఖం చెమటతో తడి తడిగా ఉంది.


"దేనికి కంగారు." అడిగాడు శ్రీకర్.

ఆమె తికమకవుతుంది.


"కూల్ కూల్." అంటూనే.. ఆమె పక్క కుర్చీలో కూర్చుంది సంచిక.


"ఇంటర్వ్యూకేనా." అడిగాడు శ్రీకర్. అతడు నిల్చునే ఉన్నాడు.


ఆమె 'అవును' అన్నట్టు తలాడించింది.


"మీరు రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యే.. ఇక్కడికి రాగలిగారు. సో. మీరు కేపబుల్ పర్షనే. సో. నో వర్రీస్. ఇంటర్వ్యూను కూడా మీరు బాగా ఎదురుకోగలరు." చెప్పింది సంచిక.

ఆమె.. సంచికనే చూస్తుంది.


తన పేరు చెప్పి.. "ఈమె సంచిక. మీ పేరు." అన్నాడు శ్రీకర్.


"వాగ్దేవి." చెప్పగలిగింది ఆమె.


"ఈ ఊరేనా." శ్రీకరే అడిగాడు.


"అవును." తలాడిస్తూ చెప్పింది వాగ్దేవి.


"వెల్." అంటూనే వాగ్దేవి రెండు అర చేతుల్ని.. తన రెండు అర చేతులతో అందుకుంది సంచిక.


వాగ్దేవి అర చేతుల్ని.. తన అర చేతులతో నిమురుతూ.. "క్వాలిఫికేషన్స్ ఏమిటి." అడిగింది.


వాగ్దేవి మెల్లి మెల్లిగా చెప్పుతుంది..

"కాస్తా గట్టిగా మాట్లాడండి." చెప్పాడు శ్రీకర్.


వాగ్దేవి చెప్పడం ఆపి.. శ్రీకర్ ను చూస్తుంది.


"గట్టిగా మాట్లాడితే.. భయం పోతుంది. అందుకే అలా మాట్లాడమంది." చెప్పాడు శ్రీకర్.


"అవునవును." అంది సంచిక.


వాగ్దేవి తిరిగి చెప్పుతుంది. ఈ మారు కాస్తా గట్టిగా.

ఈ లోగా.. పిలవబడిన వారు.. ఇంటర్వ్యూ కై వెళ్లి.. వస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీకర్ ఉండుండి గమనిస్తూనే ఉన్నాడు.


"మన టెర్మ్ వచ్చే సరికి ఇంకా టైం పట్టేలా ఉంది." అన్నాడు.


"కావచ్చు." అంది సంచిక.. వాగ్దేవి చెప్పుతుంది వింటూనే.

కాస్సేపు పిమ్మట.. వాగ్దేవి చెప్పడం ఆపింది.


అప్పుడే.. వాగ్దేవితో.. "నీళ్లు తాగు." అంది సంచిక.


ఆ వెంబడే.. "కర్.. వాటర్ బాటిల్ ఇవ్వు." అంది.


శ్రీకర్.. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి.. వాటర్ బాటిల్ తీసి.. సంచికకు ఇచ్చాడు.

ఆ బాటిల్ ను వాగ్దేవికి అందించింది సంచిక.. దాని మూత తీసి.వాగ్దేవి కొద్దిగా నీళ్లు తాగింది. "థాంక్స్" చెప్పి.. తిరిగి ఆ బాటిల్ ను సంచికకు ఇచ్చేసింది.


సంచిక కొద్దిగా నీళ్లు తాగి.. "కర్ తాగు." అంటూ ఆ బాటిల్ ను శ్రీకర్ కు ఇచ్చింది.


శ్రీకర్ నీళ్లు తాగాడు. బాటిల్ మూతను సంచిక నుండి అందు కున్నాడు. ఆ బాటిల్ కు మూత పెట్టి.. తిరిగి దానిని తన సంచిలో పడేసుకున్నాడు.


"కర్.. ఇలా కూర్చో." అంది సంచిక.. తన పక్క కుర్చీని చూపుతూ.


శ్రీకర్ కూర్చున్నాడు.

సంచిక.. వాగ్దేవిని మాట్లాడిస్తూనే ఉంది. ఆమె బెదురును తగ్గించేందుకు యత్నిస్తుంది.


రమారమీ నలభై నిముషాల తర్వాత..

సంచిక కు కాల్ వచ్చింది. దాంతో తను ఇంటర్వ్యూకై లేచింది.


"ఆల్ ది బెస్ట్." చెప్పాడు శ్రీకర్.


"గుడ్ లక్." అనేసింది వాగ్దేవి.


సంచిక అటు నడిచింది.. "థాంక్స్.. థాంక్స్.." అంటూనే.


వాగ్దేవి మళ్లీ ఇబ్బందవుతుండడం గుర్తించాడు శ్రీకర్.

"మీరు అనవసరంగా వర్రీ అవుతున్నారు. చిక.. ఐ మీన్.. సంచిక ఇప్పటి వరకు చాలా చెప్పిందిగా. వాటిని పెడ చెవిన పెట్ట వద్దు." చెప్పాడు శ్రీకర్.


"నాకు ఈ జాబ్ రావాలి. నాకు ముఖ్యం." చెప్పగలిగింది వాగ్దేవి.


"కాన్ఫిడెంట్ అవసరం. కాన్ఫిడెన్స్ వీడ వద్దు." చెప్పాడు శ్రీకర్.


ఆ వెంబడే.. ఆమెను మోటివ్ చేస్తున్నాడు.

వాగ్దేవి నెమ్మదవుతుంది.

"నీళ్లు తాగుతార." అడిగాడు శ్రీకర్.


"లేదు. వద్దు." చెప్పింది వాగ్దేవి.


పాపు గంటలోనే తిరిగి సంచిక అక్కడికి వచ్చేసింది.

అంతలోనే మరొకరిని పిలవడం జరిగింది.

"నాది ఐపోయింది. మరి.. నీది.. మీది ఇంకెప్పుడో." అంది సంచిక.


"ఎలా ఫేస్ చేయగలిగావు." అడిగాడు శ్రీకర్.


"గుడ్. నా వరకు బాగుంది." నవ్వింది సంచిక.


శ్రీకర్.. వాగ్దేవిల మధ్య కుర్చీలో కూర్చుంది.

"ఏమడిగారు." అడిగింది వాగ్దేవి.


సంచిక చెప్పుతుంది.

మరో పది నిముషాలు గడిచాక..

శ్రీకర్ కు కాల్ రాగా.. అతడు అటు కదిలాడు.


మిగతా ఇద్దరూ అతనికి 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.. అందుకు అతడు వారికి 'థాంక్స్' చెప్పాడు.


"క్వశ్చన్స్ రిపిట్ కావచ్చు.. కాకపోవచ్చు.. బట్.. నిబ్బరం, నిలకడ ముఖ్యం. అడిగింది శ్రద్ధగా వినాలి. చెప్పేది పట్టుగా చెప్పేయాలి. అంతే." చెప్పింది సంచిక.


వాగ్దేవి తలాడించింది.

తిరిగి శ్రీకర్ వచ్చేక..

"మనం.. వాగ్దేవిది కూడా ఫినిష్ అయ్యేకనే వెళ్దాం." చెప్పింది సంచిక.


"తప్పక." అంటూనే సంచిక పక్కనే కూర్చుండి పోయాడు శ్రీకర్.


మరో అర గంట తర్వాత..

వాగ్దేవికి పిలుపు వచ్చింది.

అప్పటి వరకు వాగ్దేవికి.. సంచిక, శ్రీకర్ బూస్టప్ అందిస్తూనే ఉన్నారు.


పావుగంట తర్వాత.. వాగ్దేవి తిరిగి వచ్చింది.

ఇప్పుడు తను చాలా కుదుట పడినట్టు అగుపిస్తుంది.

సంచిక, శ్రీకర్ సరదా అయ్యారు.


"మీ మూలంగానే నేను ఇంటర్వ్యూ బాగా ఫేస్ చేయ గలిగాను. మీకు థాంక్స్." చెప్పింది వాగ్దేవి.


ఆ వెంబడే.. "రిజల్ట్స్ మూడు రోజుల్లో వెల్లడి చేస్తారట." చెప్పింది.


"అవునవును." అంది సంచిక.

"వెళ్దామా." లేచాడు శ్రీకర్.


"వాగ్దేవి నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా." అడిగింది సంచిక.


వాగ్దేవి తన సెల్ ఫోన్ నెంబర్ చెప్పింది. దానిని తన ఫోన్ లో సెవ్ చేసుకొని.. వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేసింది సంచిక.

వాగ్దేవి సెల్ ఫోన్ రింగవుతుంది.


"అది నా నెంబర్. సేవ్ చేసుకో. మనం ఫోన్ కాల్స్ ద్వారా టచ్ లో ఉందాం." చెప్పింది సంచిక.


వాగ్దేవి "సరే." అంది.


ఆ ముగ్గురూ అక్కడి నుండి కదిలారు.


సంచిక, శ్రీకర్ తమ తమ వెహికల్స్ మీద.. వాగ్దేవి తన స్కూటీ మీద తమ తమ ఇళ్ల వైపు బయలుదేరారు.


======================================================================ఇంకా ఉంది..

=======================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
65 views0 comments
bottom of page