top of page

సంచిక పొంగింది - ఎపిసోడ్ 1


'Sanchika Pongindi - Episode 1' - New Telugu Web Series Written By BVD Prasada Rao

'సంచిక పొంగింది - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"బిజియా?"

"లేదు లేదు. చెప్పు."

"నీతో మాట్లాడాలి."

"మాట్లాడుతున్నావుగా." నవ్వుతుంది సంచిక.


ఎడమ చెవి వైపు నుండి సెల్ఫోన్ ను.. కుడి చెవి వైపుకు మార్చుకున్నాడు శ్రీకర్.


"హలో. ఏమైంది. మాట్లాడు." సంచిక గందిక ఐంది.


"ఇలా కాదు. నీతో కల్సి మాట్లాడాలి." విషయం చెప్పాడు శ్రీకర్.


"సరే. ఎలా."

"ఎక్కడ ఉన్నావ్." అడిగాడు శ్రీకర్.


"ఇంట్లోనే." చెప్పింది సంచిక.

"ఏం చేస్తున్నావ్." అడిగాడు శ్రీకర్.


"మమ్మీ.. డాడీ డ్యూటీస్ కు వెళ్లారు. నేను జికె బుక్ చదువుతున్నాను." చెప్పింది సంచిక.

"చిక. నేను బయట ఉన్న. ఇటు నుండి నీ వద్దకు వస్త. అర గంటలో నీ చెంత ఉండగలను."

"వెల్కమ్ కర్."


శ్రీకర్ ఆ కాల్ కట్ చేసేశాడు.


సంచిక తన బెడ్రూంలో ఉంది. చేతిలోని సెల్ఫోన్ ను మంచం మీద పడేసింది. మంచం దిగి.. దిండు మీద ఉన్న బుక్ ను తీసి షెల్ఫ్ లో సర్దింది. తన బెడ్రూం నుండి హాలు లోకి వచ్చింది. సోఫాలో కూర్చుంది. టీపాయ్ మీది న్యూస్ పేపర్ తీసుకుంది.


సంచిక, శ్రీకర్ మంచి పరిచయస్తులు.. ఒకరికి ఒకరు హితులు.. స్నేహితులు.


డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. ఇద్దరికీ పరిచయం మొదలైంది.

ప్రస్తుతం.. ఇద్దరూ పిజీలు చేసి.. జాబ్స్ కై ప్రయత్నాలు చేస్తున్నారు.


అర గంట తర్వాత..

'ఇంకా కర్ రాలేదేంటి.' అనుకుంది.


చేతిలో పేపర్ టీపాయ్ మీద పడేసింది. లేచింది. తన బెడ్రూం లోకి వెళ్లింది. తన సెల్ఫోన్ తో తిరిగి హాలు లోకి వచ్చింది. మళ్లీ సోఫాలో కూర్చుంది. శ్రీకర్ కు ఫోన్ చేసింది.


అప్పుడే.. శ్రీకర్.. సంచిక ఇంటి దరిన బైక్ ఆపాడు. వస్తున్న కాల్ కు కనెక్ట్ అయ్యాడు.

"చిక." అన్నాడు.


"ఎక్కడ." అడిగింది సంచిక.

"ఇంట్లో." నవ్వుకుంటున్నాడు శ్రీకర్.


"అదేంటి. రావడం లేదా." విస్మయమవుతుంది సంచిక.

"ఇదిగో బయలు దేర్త."


"అర గంటలో తగలడతానన్నావ్." చిరాకవుతుంది సంచిక.

"అన్నానా." సరదాగా అన్నాడు శ్రీకర్.


కోపమయ్యింది సంచిక.


"కూల్. కూల్. షూర్ గా అర గంటలో నీ ముందు ఉంటాగ."


సంచిక.. విసురుగా ఆ కాల్ కట్ చేసేసింది. అదే విధంన చేతి లోని సెల్ఫోన్ ను సోఫా మీద పడేసింది. చిర్రు బుర్రులు చేపట్టింది.


నిముషం లోపునే డోర్ బెల్ మోగడంతో.. 'ఈ టైంన ఎవరు.' బయటికే అనేస్తూ.. లేచి.. చరచరా అటు కదిలింది.


డోర్ తీసింది. ఎదురుగా నవ్వుతూ శ్రీకర్.

షేకయ్యింది సంచిక.


లోనికి వస్తూ.. "ఏమిటా చూపులు.. కోపమే." అన్నాడు శ్రీకర్.

సంచిక గిర్రున కదిలి.. వచ్చి.. సోఫాలో పడింది.


డోర్ మూసేసి.. శ్రీకర్ ఆమె చెంతన చేరాడు.

"కోపంలో నువ్వు భలేగా ఉంటావోయ్. అందుకే ఇలా చేస్తుంటాను." చెప్పాడు శ్రీకర్.


"అఘోరించావు. చాల్లే." కసురుకుంటుంది సంచిక.

"సారీ రా." బతిమలాట చేపట్టేడు శ్రీకర్.


"కర్. డోన్ట్ రిపీట్. ఛ. ప్రతి మారూ నేనే బకరా అవుతున్నా."

"ఓ. ఇదో సరదా. హర్ట్ అవ్వొద్దు చిక."


"వద్దు వద్దు. ఇలాంటివి ఇక వద్దు." తేల్చేసింది సంచిక.

శ్రీకర్ మాట్లాడ లేదు.


"ఎన్నో సార్లు చెప్పాను. నువ్వు మళ్లీ మళ్లీ చేస్తున్నావ్." విసుక్కుంటుంది సంచిక.

శ్రీకర్ నవ్వేస్తున్నాడు.


"చాల్లే కానీ. ఏమిటిలా వచ్చావ్." అడిగింది సంచిక.

"ఓ గాడ్. బైక్ బేగ్ లో వదిలేశాను." అంటూనే లేచాడు శ్రీకర్. అటు కదిలాడు.


వెనుకే వస్తూ.. "నన్ను ఏడిపించే తొందరలో.. ఎకాఎకీన వచ్చేశావు కదూ." అంది.


"ఏడిపించడం కాదు రా. నీకు కోపం తెప్పించాలని.. ఆ కోపంలో నీ భలేతనాన్ని చూడాలని." చెప్పాడు శ్రీకర్.. డోర్ తీస్తూ.


ఆ ఇద్దరూ గుమ్మం ముందున్న శ్రీకర్ బైక్ ను చేరారు.

శ్రీకర్ బైక్ బేగ్ నుండి రెండు కవర్స్ తీశాడు.


"కొత్త అఫ్లికేషన్స్. పోస్టులు బాగున్నాయి. అప్లై చేద్దాం." చెప్పాడు. ఒక కవర్ సంచికకి ఇచ్చాడు.


"అబ్బా. కర్.. ఎన్నని అప్లై చేస్తాం. ఒకటీ తగల్దాయే." కవర్ లోని పేపర్స్ తీస్తుంది సంచిక.

"పద. లోనికి వెళ్లి చూద్దాం." కదిలాడు శ్రీకర్.


సంచిక.. శ్రీకర్ ను అనుసరిస్తుంది.

అర గంట తర్వాత..


ఇద్దరూ అప్లికేషన్స్ నింపేశారు.

"నీ కవర్ ఇలా ఇవ్వు. నేను.. నా దాంతో పాటు నీదీ పోస్టు చేసేస్తాను." చెప్పాడు శ్రీకర్.


"కొత్తా. ప్రతీ మారు చేసేదేగా." నవ్వింది సంచిక.


"ఖర్చులన్నీ రాస్తున్నాను. నీకు జాబ్ వచ్చేక.. వాటన్నింటినీ చెల్లించేయాలి."

"చిత్తం. అలాగే మహానుభావా." నవ్వింది సంచిక.


"తేలిగ్గా కాదు. గట్టిగానే అడుగుతున్న." చటుక్కున చెప్పాడు శ్రీకర్.

"కర్.. నేను కాదనలేదుగా." చెప్పింది సంచిక.


"స్నేహితుల మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలే ముద్దు." చెప్పాడు శ్రీకర్.

"ముమ్మాటికి. సర్దుబాట్లే ముచ్చట్లు." అనేసింది సంచిక.


"వాటర్ బాటిల్ తేవా." అడిగాడు శ్రీకర్.

"కాఫీ కలపనా." అడిగింది సంచిక.


"వద్దు వద్దు. లంచ్ టైం కావస్తుంది. ఇంటికి పోత." చెప్పాడు శ్రీకర్.

"ఇక్కడ లంచ్ చేసేయ్." చెప్పింది సంచిక.


"కర్రీ ఏమిటి." అడిగాడు శ్రీకర్.

"మమ్మీ చెప్పింది.. దొండకాయ, పప్పుచారు.." చెప్పుతుంది సంచిక.


"వద్దు వద్దు. మా ఇంట్లో ఫిష్. ఉదయమే బజారు చేశ." చెప్పాడు శ్రీకర్.


"అబ్బా.. ఎన్వీయా." నసిగింది సంచిక. లేచి డైనింగ్ హాలు వైపు కదిలింది.

అప్పుడే.. "అవును. రుచి చూస్తే నువ్వు లొట్టలు వేస్తావ్. ప్చ్. మీకు ఎన్వీ నప్పదుగా." అన్నాడు శ్రీకర్.


సంచిక ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్.. ఒక కుల్ఫీ తీసి తెచ్చింది.

వాటర్ బాటిల్ పుచ్చుకున్నాడు శ్రీకర్.

"ఛ. కుల్ఫీయ." అన్నాడు.


"రుచి చూస్తే నువ్వు లొట్టలు వేస్తావ్. మళ్లీ మళ్లీ అడుగుతావు. ప్చ్. నీకు కుల్ఫీ అఇష్టంగా." అంది సంచిక.


తను కుల్ఫీ చప్పరిస్తుంది.

శ్రీకర్ వాటర్ తాగాడు. ఖాళీ బాటల్ ను టీపాయ్ మీద పెట్టేస్తూ..

"మరి నేను వెళ్త." చెప్పాడు.. రెండు కవర్స్ పట్టుకొని.


"టేక్కేర్." చెప్పింది సంచిక.

గుమ్మం వరకు వెళ్లి.. శ్రీకర్ ను సాగనంపింది.


పది రోజుల తర్వాత..

సంచిక, శ్రీకర్.. రిటన్ టెస్టుకై.. తమ ఊరి నుండి మరో ఊరు వచ్చి ఉన్నారు.

ఇద్దరూ హోటల్ లో స్టే చేశారు.


మర్నాడు ఉదయం ఎగ్జామ్..

ఇద్దరూ రూంలో చదువుకుంటున్నారు.


సమయం రాత్రి 10.

"ఆకలి అవుతుంది." చెప్పింది సంచిక.


ఇద్దరూ రూంకి లాక్ వేసుకొని రెస్టారెంటుకు వెళ్లి.. టిఫిన్స్ కానిచ్చేసి.. తిరిగి రూంకి వచ్చేశారు.

తిరిగి చదువుకుంటున్నారు.


సమయం రాత్రి 12 దాటుతుంది.

డోర్ మీద కొడుతున్న చప్పుడుకు.. శ్రీకర్ వెళ్లి.. డోర్ తీశాడు.


ఎదురుగా పోలీసులు. జరజరా రూంలోకి వచ్చేశారు.


======================================================================ఇంకా ఉంది..

=======================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





69 views0 comments

Comments


bottom of page