top of page

సు..ధీర ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Su..Dheera Episode 1' New Telugu Web Series Written By BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు


ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారు రచించిన 'సు..ధీర' సీరియల్ నవల ఈ వారం నుండి ప్రారంభిస్తున్నాం. ఈ సీరియల్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతున్నాం.

ఇక కథ ప్రారంభిద్దాం.


"ఒప్పుకుంటే.. నేను జీవిస్తా.. కాదంటే.. నేను చనిపోతా.." చెప్పేశాడు ధీర.

ఉలిక్కి పడింది సు.

ధీరని ఎగాదిగా చూసింది.

"ఏమిటి నువ్వు.. నీ వాగుడు ఏమిటి?" చరచరా అంది సు.


"ఎన్ని మార్లు కలిసినా.. నీ వైపు పలుకు లేదు. నవ్వేస్తావు. నీ దారిన నువ్వు పోతున్నావు." చెప్పాడు ధీర.

"అందుకు.. 'చనిపోతాను' అన్నంత వరకు పోతావా" కసిరింది సు.

"అవును. అంతే. నీ పరిచయం నాకు కావాలి. నీ ఆదరణ నాకు దక్కాలి.. కాక పోతే.. నా బ్రతుకు వేస్ట్.."

"షటప్" ధీరకి అడ్డు పడింది సు.

ధీర చెప్పడం ఆపేశాడు.

త్వరత్వరగా తన స్కూటీని తీయబోయింది సు.

తన కుడి అర చేయిని గమ్మున చాచి.. ఆ స్కూటీని ఆపగలిగాడు ధీర.

సు చుట్టూ చూసింది.


చాలా వరకు.. తమకి దరిగా ఉన్నవారు.. తమనే చూస్తుండడం సు గుర్తించింది.

"నన్ను పోనీ" కసిరేలా అంది సు.


"ఎన్నాళ్లగానో.. నీతో మాట్లాడాలని.. ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అన్నీ విఫలమవుతున్నాయి. ఈ రోజు.. ప్రతి మారులా నువ్వు కారులో కాక.. లక్కీగా స్కూటీ మీద కనిపించావు.. అంతే.. పంతంతో.. నా బైక్ మీద నిన్ను ఫాలో అయ్యా.. నిన్ను ఇక్కడ ఆపగలిగా.. ఇక నిన్ను పోనీయను" చెప్పేశాడు ధీర.


ఈ పబ్లిక్ తతంగం సు కి గిట్టదు.. కనుక.. వెంటనే..

"నా కర్మ కాలి.. నా కారు రిపేరయ్యింది.. దానిని మెకానిక్ కి ఒప్పచెప్పి.. అతడిచ్చిన స్కూటీతో నా పనికి బయలు దేరా.. ఛ.. నడి రోడ్డున ఈ న్యూసెన్స్ ఏమిటి.. ఛఛ. ఇలా ఈ రోడ్డు మీద వద్దు.. రా.. కాఫీ కేఫ్ కి పోయి.. కూర్చొని.. మాట్లాడదాం" చెప్పింది.


ఆ వెంబడే.. తన స్కూటీ తీసి.. అటు కదిలింది.

ధీర కూడా తన బైక్ పై.. సుని అనుసరించాడు.

సు వెనుకెనుక్కు చూస్తూనే ముందుకు పోతుంది.

తన వెంబడే ధీర వస్తుండడం గుర్తించింది.

పాపు గంట పిదప.. మరి తప్పక.. అక్కడి కేఫ్ ముందు.. తన స్కూటీని ఆపి.. నిలిపింది సు.

ఆమెని అనుసరించాడు ధీర.

ఇద్దరూ కేఫ్ లోకి నడిచారు. ఒక కేబిన్ లో ఎదురెదురుగా.. చెరో కుర్చీలో కూర్చున్నారు.

వెయిటర్ రాగా.. రెండు కాఫీలకి ఆర్డర్ ఇచ్చింది సు.

ధీర.. ఆమెనే చూస్తున్నాడు.

సు అస్థిమితంగా ఉంది.

ఇద్దరి మధ్య మాటలు మొదలవ్వలేదు.

సు తన హేండ్ బేగ్ ని టేబుల్ మీద పెట్టి.. తన గాగుల్స్ తీసి టేబుల్ మీద పెట్టింది. తర్వాత.. తన స్క్రాఫ్ ని విప్పి.. మడిచి.. తన హేండ్ బేగ్ మీద పెట్టింది.



"చూశావా.. నిన్ను ఎవరూ గుర్తు పట్టకుండా.. నువ్వు నల్ల కళ్లద్దాలతో.. క్లాత్ తో నీ మొహాన్ని మూసేసుకున్నావు.. కానీ.. నీ కదలికలని.. స్ట్రక్చర్ ని. చూసి.. నిన్ను నేను మాత్రం.. ప్రతి మారులా గుర్తు పట్టేశాను." సునే చూస్తూ.. గమ్మత్తుగా నవ్వేడు ధీర.


"చాల్లే.. నన్ను గుర్తు పట్టేస్తారని కాదు.. నా మొహం ఒడలిపోకూడదని.. నా జాగ్రత్త.. అంతే" తేలిగ్గా తేల్చేసింది సు.


"అవునవును.. నీది సుతి మెత్తని అందం." అన్నాడు ధీర చాలా ఇదిగా.

"నా అందమే చూస్తున్నావు. హు. నాలోని నేను.. నీకు తెలియదు." నవ్వింది సు.

వెయిటర్ వచ్చాడు.

సు ని చూశాడు. గుర్తు పట్టాడు. కాస్త తడబడ్డాడు.

మెల్లిగా కుదురవ్వుతూ.. సుకి, ధీరకి కాఫీలని సర్వ్ చేసి.. వెళ్లి పోయాడు.


"తాగు" చెప్పింది సు.. తన ముందున్న కాఫీ కప్పుని ముందుకి లాక్కుంది.

ధీర కాఫీ తాగుతున్నాడు.

సు కాఫీ తాగి.. ఖాళీ కప్పుని టేబుల్ మీద.. పక్కగా పెట్టింది.

ధీర కాఫీ తాగి.. తన ఖాళీ కప్పుని పక్కన పెట్టే వరకు సు ఆగింది.

తర్వాత..

"నా గురించి.. నీకు ఏమీ తెలియదు.." చెప్పుతుంది సు.


"భలే.. నువ్వు నాకు తెలియక పోవడమేమిటి.. నువ్వు ఒక యాంకర్ వి.. నిన్ను టివి లో ఏ రోజైతే చూశానో.. అది మొదలు.. నీ ప్రతి ప్రొగ్రాంని తప్పక చూడడం చేపట్టాను.. నీది మిక్కిలి పసందైన అందం.. నీ నవ్వు బాగుంటుంది.. నీ గొంతు రంజుగా ఉంటుంది.. మొత్తం మీద.. నువ్వు నాకు నచ్చావు.. నీ పరిచయం నాకు కావాలి.."


"ఆపాపు." ధీరకి అడ్డు పడి.. సర్రున అంది సు.

టక్కున చెప్పడం ఆపేశాడు ధీర.


"హు. ఏమిటి ఇది." విసుక్కుంది సు.

ధీర ఏదో అనబోయాడు.

"ఆగు. నన్ను మాట్లాడని." అంది సు.

ధీర ఆగాడు.

"అది వృత్తి.. ఒక నటన.. ఆ తెర బయట.. నేను వేరు.." చెప్పుతుంది సు.

ఆమెనే చూస్తున్నాడు ధీర.


"తెర మీది నన్ను.. అభిమానించే వారిని హర్ట్ చేయ రాదని.. నా భృతికి గండి పడ కూడదని.. నీ లాంటి వారి చేష్టలని భరిస్తున్నాను. దిగ మింగుతున్నాను. అందుకే నీతో రభస పడక.. నిన్ను నచ్చ చెప్పాలని.. ఇలా కలిసే అవకాశం నీకు ఇచ్చాను. అంతే." ఆగింది సు.


ఆ స్పేస్ లో..

"నేను నీ అభిమానిని కాదు.. ఆరాధకుడిని." చెప్పాడు ధీర.

"చాల్లే. నువ్వు మరీ ఫీక్స్ కి పోయావు. దయచేసి నా మానాన నన్ను పోనీ. పిచ్చి పిచ్చిగా వ్యవహరించకు. ప్లీజ్." చెప్పింది సు.


"తగ్గేదిలే" అన్నాడు ధీర.

"ఛుఫ్. ఆపు.. నువ్వు.. నీ సినిమా డైలాగ్ లు." చిరాకయ్యింది సు.

సు నే ధీర చూస్తున్నాడు.


"చూడు.. నా మాట వినిపించుకో.. నువ్వు తగ్గు. నా దారికి అడ్డు కాకు." చెప్పింది సు.


"నో. నువ్వు కాదంటే నేను భరించలేను.. నన్ను నమ్ము.. నిన్ను.. నిన్ను అక్కడ.. అక్కడ పెట్టి మహారాణిలా చూసుకుంటాను." చెప్పాడు ధీర.


"అరె. పిచ్చా. నీ సొదే నీదా. నా వైపుది పట్టించుకోవా. వద్దు. ఇవేవీ వద్దు.." సు.. సరళంగా మాట్లాడడానికే ప్రయత్నిస్తుంది.

"నేను తప్పుకోలేను. ఫిక్స్ ఐపోయా." సుకి అడ్డు పడి.. గబగబా చెప్పాడు ధీర.


సులో అసహనం రేజవ్వుతుంది.

ఐనా తమాయించుకుంటూ..

"ప్లీజ్. నా మాట విను. తెర మీది నేను.. అసలు నేను కాదు. తెర బయట.. నేను వేరు.. నీకు తెలీయనట్టు ఉంది. నీకు అవి వద్దు." చెప్పింది.


అప్పుడే సు సెల్ ఫోన్ యాక్టివ్ ఐంది.

హేండ్ బ్యాగ్ లోంచి ఆ ఫోన్ తీసి.. వస్తున్న కాల్ కి కనెక్టు ఐంది.

పలకరింపులు పిమ్మట.. కొన్ని మాటలు తర్వాత.. "అవునా సార్.. అర గంటలో.. మిమ్మల్ని కలవగలను. ఆ ప్రోగ్రాంకి నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా మీకు నా థాంక్స్" అంది.


ఆ కాల్ ని కట్ చేసి.. తిరిగి ఫోన్ ని బ్యాగ్ లో పడేసింది.

"నేను వెళ్లాలి" అంది ధీరతో.

ధీర తికమకవుతున్నాడు.

అప్పుడే.. లేస్తున్న సు ని చూస్తూ..

"ప్లీజ్.. ఆగు.. నన్ను కరుణించు.." అంటూ ఏదో చెప్పబోయాడు ధీర.


"హే. నాకు పనుంది. వెళ్లనీ." విసురుగా అనేసింది సు.

ధీర తడబడ్డాడు.

సు నించుని ఉంది. ధీరనే చూస్తుంది.

"ప్లీజ్.. ప్లీజ్.. కొద్ది సేపు.. కూర్చో.." చకచకా అన్నాడు ధీర.

విసుగ్గా కూర్చుంది సు.


"అర్థం కాదా.. వినుకో.. నాకు ఇలాంటి వ్యవహారాలు.. కుదరవు.. పడవు." చెప్పింది సు.

"అలా అంటే ఎలా.. నువ్వు నాకు నచ్చావు" చెప్పాడు ధీర.

"ఫో. ఏమిటీ పోరు. ఇక్కడితో ఆగిపోతే.. నీకే మంచిది." హెచ్చరికగా చెప్పింది సు.

ధీర వణికాడు.


"అరె. నువ్వు ఏమిటీ. నీ వైపు నుండే కానీ.. నా వైపు నుండి పట్టించుకోవా" అనేసింది సు.


"బెగ్డ్ యు.. ప్లీజ్.." చేతులు జోడించాడు ధీర.

అస్తవ్యస్తంగా కదిలింది సు.

"ఛఛ" అంది.

లేవబోయింది.

"ఆగాగాగాగు" గందికయ్యాడు ధీర.


తమాయించుకుంటుంది సు.

"నేను ఎంత చెప్పినా.. ఎలా చెప్పినా.. నీ గోల ఇంతేలా ఉంది. సో.. నన్ను రభస వైపుకి నెట్టకు. ఇక్కడితో ఆగిపో." అనేసింది సు.

"అది కాదు.. నా మాట విను.. నేను చెప్పవలసింది ఉంది" అన్నాడు ధీర.


"అబ్బా. ఇంకేం చెప్పుతావు.. ఇంకేం ఉంది.." చికాకయ్యిపోతుంది సు.


"ప్యూ మినిట్స్.. ప్లీజ్.." బతిమలాడుతున్నాడు ధీర.

"హు. సరే. వాగు.. త్వరగా కానీయ్. నేను అర్జంట్ గా వెళ్లాలి." చెప్పింది సు.


ధీర నే చూస్తుంది.

"నా విన్నపం కాదనకు. నీ చెంత లేకుండా నేను ఉండలేను. నువ్వు నాకు.."


"హే" టక్కున ధీరకి అడ్డు పడింది సు.

"ఆపు.. చెప్పిందే చెప్పుతావు. నా టైం వేస్ట్ చేస్తున్నావు. నన్ను ఇబ్బంది పెడుతున్నావు." అనేసింది సు గట్టిగానే.

ధీర గమ్మున బిక్కపోయాడు.

"నీకు క్లియర్ చేశానుగా. ఇక ఎట్టి హైరానా పడకు.. నా దారికి అడ్డు రాకు." చెప్పింది సు ధీరనే చూస్తూ.

ఆ వెంబడే.. టేబుల్ అంచున ఉన్న కాల్ బెల్ ని నొక్కింది.

ధీర గింజుకుంటున్నాడు.


వెయిటర్ వచ్చాడు.

"బిల్" అంది సు.

వెయిటర్ వెళ్లాడు.

సు నించుంది. స్క్రాఫ్ ని చుట్టుకుంది. గాగుల్స్ ని పెట్టుకుంది.

ధీర అవస్థ పడుతున్నాడు.


వెయిటర్ వచ్చాడు.

సు నుండి బిల్ కలెక్ట్ చేసుకొని.. వెళ్లి పోయాడు.

తర్వాత.. వెళ్లబోతున్న సుని ఆపగలిగాడు ధీర.


"నీతో ఇంకా మాట్లాడాలి." తంటా పడుతున్నాడు ధీర.

"నో మోర్" అనేసింది సు.

ధీర లేచి నిల్చున్నాడు.

"నీ గురించి.. అంతా తెలుసుకోవాలని నాకు ఉంది." అనగలిగాడు.

"వద్దొద్దు. నా పర్షనల్ సంగతులు.. నా నోట నుండి.. బయట పెట్టడం నాకు నచ్చదు." చెప్పింది సు.


ధీర మాత్రం.. గమ్మున కదిలి.. సు ముందుకి చేరి.. ఆమె పాదాలు తాకుతూ..


"ప్లీజ్ ప్లీజ్.." అన్నాడు దీనంగా.

సు వెనుక్కు జరుగుతూ..

"హే. ఏమిటి నువ్వు. లే లే." అంది.

ధీర లేచి నిల్చున్నాడు.


"నీ కోసం.. చచ్చే వరకు వచ్చేశాను. నన్ను నమ్ము. నీ పూర్తి విషయాలేవీ నాకు నిజంగా తెలియవు. నీ తెర బయటివి కూడా నాకు తెలియని. చెప్పు.. అవి నాకు కుదరక పోతే.. నేనే తప్పుకుంటాను. ప్రామిస్." చెప్పాడు ధీర బేలగా.


ధీరని ఎగా దిగా చూస్తూ..

"అవునా.. సర్లే.. ఫోన్ నెంబర్ ఇవ్వు. నా వీలు వెంబడి పిలుస్తా. నా తెర బయటి విషయాలు నీకు చెప్తా" చెప్పింది సు.


ధీర పొంగి పోయాడు. తన ఫోన్ నెంబర్ చెప్పుతున్నాడు.

"రాసి ఇవ్వు" చెప్పింది సు.

"పెన్ను పేపర్ లేవు." చెప్పాడు ధీర.


సు తన హేండ్ బ్యాగ్ లోంచి.. చిన్న బుక్కు.. పెన్ను తీసింది.

"చెప్పు" అంది.

ధీర చెప్పాడు.


అతడి ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని..

"సరే." అంటూ బుక్కుని.. పెన్నుని తిరిగి తన హేండ్ బ్యాగ్ లో పడేసుకుంది సు.


"నీ ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుగా" అన్నాడు ధీర.

"అదే.. అదే మరి.. నేను చేస్తానుగా" చెప్పింది సు.

"నమ్మొచ్చా" అయోమయంగా అన్నాడు ధీర.

"నమ్ము. నిన్ను నమ్మే కదా.. నా వివరాలు నా నోటతో చెప్పాలనే గా.. నీ నెంబర్ అడిగాను. ఓపిక పట్టు. త్వరలోనే మాట్లాడుకుందాం." చెప్పింది సు. తను అక్కడ నుండి బయటపడాలని గట్టిగా తలుస్తుంది.


దాంతో.. అక్కడ నుండి చరచరా కదిలి పోయింది.

ధీర మెల్లిగా తేరుకున్నాడు.

పిమ్మట.. బయటికి కదిలాడు.

ధీర కేబిన్ లోంచి రాగానే..

"సార్ సార్" పిలిచాడు వెయిటర్.

ఆగాడు ధీర.

'ఏమిటన్నట్టు' వెయిటర్ వైపు చూశాడు.


"ఏమిటి సార్.. ఆటోగ్రఫీ ప్లీజ్ అంటే.. వినిపించుకోకుండా సు గారు వెళ్లిపోయారు. కేబిన్ లో మీరు మాట్లాడుకుంటుండగా.. కలగచేసు కోరాదని ఆగాను.. ఆమె ఆటోగ్రఫీ కోసమే కేబిన్ బయటనే వేచి ఉన్నాను.." చెప్పుతున్నాడు వెయిటర్.


"బిజీ పర్షన్ కదా.. మరో మారు వీలైతే.. ట్రై చేయ్" చెప్పాడు ధీర గొప్పగా.


"సార్.. మీరు.. ఆమెకు బాగా కావలసిన వారిలా ఉన్నారు. మీరు.." నసిగాడు వెయిటర్.


"ఆమెకు బాగా కావలసిన వాడ్నే." అంటూ అక్కడ నుండి కదలబోయాడు ధీర.


అంతలోనే.. ధీరని వెయిటర్ షేక్హేండ్ కోరాడు.

వెయిటర్ చాచిన కుడి అర చేతిని.. తన కుడి అర చేతితో పట్టి.. గట్టిగా నొక్కి.. వదిలాడు ధీర.


"సు గారికి మంచి ఫాన్ ని సార్.." చెప్పాడు వెయిటర్.

ధీర తబ్బిబ్బు అయ్యాడు.


తర్వాత.. మీసం రుద్దుకుంటూ అక్కడ నుండి కదిలి పోయాడు.

సు ని తల్చుకుంటూ ఉప్పొంగి పోతున్నాడు.

(కొనసాగుతుంది..)

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



380 views2 comments

2 Comments


shahnaz bathul
shahnaz bathul
Jun 24, 2022

ప్రారంభం అదిరి పోయిందండి.తర్వాతి episode కొరకై నిరీక్షణ.

Like
BVD Prasadarao
BVD Prasadarao
Jun 25, 2022
Replying to

మీ ఆదరణకు ధన్యవాదాలండీ..

Like
bottom of page