top of page
Original.png

ఆత్మవిశ్వాసం

#Athmaviswasam, #ఆత్మవిశ్వాసం, #ManasaReddyChichili, #మానసరెడ్డిచిచిలీ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

                                               

Athmaviswasam - New Telugu Story Written By Manasa Reddy Chichili 

Published in manatelugukathalu.com on 11/03/2026

ఆత్మవిశ్వాసం - తెలుగు కథ

రచన: మానస రెడ్డి చిచిలీ 


వికలాంగ బాలుడిలో ఆత్మవిశ్వాసం పెంపొందించిన కథ


రాహుల్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండి ఒక కాలు బలహీనంగా ఉండటం వల్ల సరిగా నడవలేకపోయేవాడు. అందుకే కొంతమంది పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు. ఆ మాటలు విని రాహుల్ చాలా నిరాశగా ఉండేవాడు. “నేను ఏం చేయలేను” అని అతను అనుకునేవాడు.


ఒక రోజు అతని గురువు గమనించాడు. రాహుల్ చిత్రాలు చాలా బాగా గీయగలడని, అతని పుస్తకంలో ప్రకృతి, పక్షులు, జంతువుల అందమైన చిత్రాలు కనిపించాయి. గురువు అతన్ని పిలిచి, “రాహుల్, నీలో గొప్ప ప్రతిభ ఉంది. నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలా పెద్దవాడవుతావు” అని ప్రోత్సహించాడు.


ఆ మాటలు రాహుల్ మనసుకు ధైర్యం ఇచ్చాయి. అప్పటి నుండి అతను ప్రతిరోజూ ఎక్కువగా చిత్రాలు గీయడం ప్రారంభించాడు. కొద్ది రోజులకు పాఠశాలలో ఒక చిత్రలేఖన పోటీ జరిగింది. మొదట రాహుల్ భయపడ్డాడు, కానీ తనపై విశ్వాసంతో పోటీలో పాల్గొన్నాడు.


ఫలితాలు వచ్చిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ మొదటి బహుమతి గెలిచాడు. అతన్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు అతనికి చప్పట్లు కొట్టారు.

ఆ రోజు రాహుల్ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు.


శరీరంలో లోపం ఉన్నా, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు.

ఆ తరువాత రాహుల్ ఎప్పుడూ ధైర్యంగా, నమ్మకంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాడు.


సమాప్తం


మానస రెడ్డి చిచిలీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: https://manatelugukathalu.com/profile/manasa/profile

మానస రెడ్డి చిచిలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన కవయిత్రి. ఆమె రచించిన హైకూ మరియు టాంకా కవితలు Under the Basho, Mainichi Haiku వంటి అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె హైకూ 2025 సంవత్సరానికి సంబంధించిన Touchstone Award కు నామినేట్ చేయబడింది. అంతేకాకుండా, ఆమె నేరుగా జపనీస్ భాషలో కూడా హైకూ రచనలు చేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page