top of page

చేతులు మారిన నోట్లు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Chethulu Marina Notlu' Written By BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

ఎవరూ చూడడం లేదని తప్పులు చేస్తే భగవంతుడు ఊరుకోడు.

ఏదో ఒక రూపంలో చూస్తాడు..శిక్షిస్తాడు..

అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారు రచించారు.


బయట బైక్ నిలిపి.. ఇంట్లోకి చకచకా దూరాడు రావు.

కొడుకు చందుని పిలిచి, 'క్రికెట్ బ్యాట్ వగైరాలు కొనుక్కో' అంటూ కొన్ని నోట్లని

అందించాడు. తండ్రిని ఎగాదిగా చూస్తాడు చందు.

భార్య మతిని పిలిచి, 'గొలుసు వగైరాలు కొనుక్కో' అంటూ కొన్ని నోట్లని

అందించాడు. భర్తని చిత్రంగా చూస్తుంది మతి.

తల్లి రమణమ్మని పిలిచి, 'చీరలు వగైరాలు కొనుక్కో' అంటూ కొన్ని నోట్లని

అందించాడు. కొడుకుని వింతగా చూస్తుంది రమణమ్మ.

రావు ఎకాఎకీన వెళ్లి తన కొలీగ్ వెంకట్రావుని కలిసి, 'అవసరాలన్నావుగా.

సర్దుకో.' అంటూ కొన్ని నోట్లని అందించాడు. కొలీగ్ ని గజిబిజిగా చూశాడు వెంకట్రావు.

అటు నుండి అటు వెళ్లి రావు తన ఆఫీసర్ ని కలిసి, 'ప్రమోషన్ కి లైన్ క్లీయర్

చేయండి' అంటూ కొన్ని నోట్లని టేబుల్ మీద పెట్టాడు. కో-ఎంప్లాయిని బిత్తరగా చూశాడు

ఆఫీసర్.

తిరిగి ఇంటికి చేరి కడుపారా తినేసి మంచం ఎక్కాడు రావు.

***

గత చాన్నాళ్లుగా జరగనవి, తీరనవి ఇలా ఈ రోజు రావు చొరవతో తీరబోతుంటే

రావు కుటుంబ సభ్యులు మర బొమ్మల్లా బజారుకి పరుగులు తీశారు. చక్కగా తమకు

అందిన డబ్బు నోట్లతో తమకి కావలసినవాటి కొనుగోళ్లు చేపట్టారు.

వెంకట్రావు తన కొలీగ్ రావు ద్వారా తనకి అందిన నోట్లను తన అవసరాలకై

వెచ్చించడం మొదలెట్టేశాడు.

ఆఫీసర్ తన కో-ఎంప్లాయి రావు ద్వారా తనకి అందిన నోట్లని

వినియోగించుకున్నాడు. రావు ప్రమోషన్ కై మాత్రం తొందరవ్వడం లేదు.

***

డోర్ బెల్ చప్పుడుకి నిద్ర లేచాడు రావు. వెళ్లి తలుపు తీశాడు.

తన ఇంటికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ని చూసి, 'ఏం కావాలి' అడిగాడు రావు.

'మీరేనా రావు' అడిగాడు కానిస్టేబుల్.

'అవును నేనే' చెప్పాడు రావు.

'మీరు స్టేషన్ కి రావాలి' కానిస్టేబుల్ గందికగా చెప్పాడు.

'ఎందుకు?' రావు ఆశ్చర్యమయ్యాడు.

'యస్ ఐ సార్ తీసుకు రమ్మనమన్నారు' చెప్పాడు కానిస్టేబుల్.

'ఎవర్ని.. నన్నేనా' తికమకవుతున్నాడు రావు.

'ఆఁ. మిమ్మల్నే. అడ్రస్ ప్రకారం సరిగ్గానే వచ్చాను.' చెప్పాడు కానిస్టేబుల్, ఆ

ఇంటి తలుపుపై ఉన్న ఇంటి నెంబర్ ని మరో మారు చూస్తూ.

రావు ఆందోళన పడుతున్నాడు. 'ఇంట్లో ఎవరూ లేరు. తర్వాత వస్తాను'

చెప్పాడు.

కుదరదన్నాడు కానిస్టేబుల్. 'ఇంటికి తాళం వేసుకొని రా' గదమాయించాడు.

మరి తప్పక, ఇంటికి తాళం వేసి, ఆ తాళాన్ని పక్కింటి వాళ్లకి ఇచ్చేసి,

కానిస్టేబుల్ వెంట బయలుదేరాడు రావు ఈసురోమంటూ.

స్టేషన్ కి వెళ్లిన రావుతో క్లుప్తంగా విషయం చెప్పి, 'మా పెట్రోలింగ్ టీం సేకరణలు

మరియు సిసి కెమెరాల ఫుటేజ్ లు ఆధారంగా.. ఆ స్పాట్ లో మీ బైక్.. తర్వాత దాని

నెంబర్ ట్రేసవుట్ అయ్యాయి.. దాంతో మీ అడ్రస్ ఫేన్డవుట్ అయింది.. ఆ డబ్బు ఏది'

అడిగాడు యస్ ఐ.

బిత్తరయ్యాడు రావు. నీళ్లు నములుతున్నాడు. యస్ ఐ మరింత

కఠినమయ్యాడు.

చెప్పక తప్పక, 'కొద్దిగా ఉంది. మిగతాది ఖర్చు పెట్టేశాను' చెప్పేశాడు రావు.

'ఛుఫ్. భీతి, జాలీ లేక అంత నీఛంగా ఎలా .. నువ్వు మనిషివేనా ..'

అరుస్తున్నాడు యస్ ఐ.

అంతకు చాలా గంటల ముందు జరిగింది గిర్రున తలిచాడు రావు. తెల్లవారు

జూమున.. తను వస్తున్న.. అప్పటికి జన సంచారం అంతగా లేని ఆ మార్గంలో.. ఒక

బైక్ యాక్సిడెంట్ అయి పడి ఉంది. ఒక వ్యక్తి ఆ బైక్ కింద పడి ఉన్నాడు. గాయాలతో

మిక్కిలి రక్తం కోల్పోయాడు. రావు మాత్రం ఆ వ్యక్తిని పట్టించుకోక, అతని చెంత పడి

ఉన్న కేష్ బ్యాగ్ ని ఆదరాబాదరాగా తీసుకున్నాడు. దానిలో డబ్బు నోట్లని చూస్తూనే

ఆశ పడ్డాడు. వాటిని తక్షణమే తస్కరించేయాలని అనుకున్నాడు. ఆ డబ్బు నోట్లని తన

హేండ్ బ్యాగ్ లో పడేసుకొని, ఆ వ్యక్తి కేష్ బ్యాగ్ ని అక్కడే విసిరేసి, అక్కడ నుండి

జర్రున జారుకున్నాడు.

తర్వాత - టెక్నాల్జీ చేతికి చక్కగా చిక్కిపోయాడు.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.145 views0 comments

コメント


bottom of page