top of page

ససేమిరా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Sasemira' Written By BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

సాత్వికంగా ఉండటం అతని స్వభావం.

తనను తక్కువ చేసినా సర్దుకుంటాడు.

ఆ స్వభావంతో భార్యకి బానిస అయ్యాడా? ఎదురు తిరిగాడా?

తన స్వభావాన్ని బలహీనతగా భావిస్తే అతని రియాక్షన్ ఏమిటి?

ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారి కథలో తెలుస్తుంది.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

ఆ విల్లా.. బహు సదుపాయాలు సమకూర్చబడి.. పసందుగా, కనువిందుగా

ఉంది.

'థాంక్స్ రచనా.' ఉబ్బి తబ్బిబ్బు అవుతూ పొర్లిపోతున్నాడు సాగర్.

రచనని కౌగిలించుకోబోయాడు.

ఆమె సున్నితంగా తప్పుకుంది. 'ఇది నా సొత్తు' అంది.

'ముమ్మాటికి' రచన మోహములో ఉన్నాడు సాగర్.

'నా పేరెంట్స్ నాకు ఇచ్చిన.. నా పెళ్లి కానుక.. ఈ విల్లా' గొప్పయ్యిపోతుంది

రచన.

సాగర్ చిన్నగా నవ్వేశాడు.

***

రచనకీ.. సాగర్ కీ.. ఈ మధ్యనే పెళ్లి ఐంది.

అంతకు ముందు.. ఇద్దరూ ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ లో వేరు వేరుగా అద్దె

ఫ్లాట్ లలో ఉండేవారు.

పెద్దలు సమక్షంలో ఇద్దరూ భార్యాభర్తలయ్యారు.

రచన తల్లిదండ్రులు.. విశాఖపట్నంలో ఉంటున్నారు.

రచన తండ్రి.. సివిల్ వర్క్స్ కాంట్రాక్టర్. సంపాదనని బాగా వెనుకేసుకున్నాడు.

రచన తల్లి.. భర్తతో కలిసొచ్చిన కలిమితో కలివిడిగా ఉంటుంది.

రచన.. ఏకైక కూతురు కావడంతో.. విచ్చలవిడిగా పెరిగింది. మరింత స్వేచ్ఛకై..

హైదరాబాద్ లో.. తండ్రి సన్నిహితుడి ఫుడ్ ప్రొసెసింగ్ కంపెనీలో.. కోరి.. జాబ్ లో

చేరింది.

అదే కంపెనీలో జాబ్ చేస్తున్న సాగర్ ని నచ్చింది. ఆ విషయం తల్లిదండ్రుల చెవిన

వేసింది.

ఆ తల్లిదండ్రులు మారు యోచన చేయక.. కూతురు ప్రతిపాదనకి సై అనేశారు,

ఆమె పై మక్కువతో. సాగర్ వివరాలు సేకరించారు. అతని తల్లిదండ్రులని కలిశారు.

చకచకా సాగర్ తో తమ కూతురు పెళ్లి జరిపించేశారు.

ఒక విల్లా కొని.. దానిని పెళ్లి కానుకగా కూతురుకి ముట్ట చెప్పారు.

ఆ విల్లాలోనే కొత్త కాపురం మొదలెట్టారు.. రచన, సాగర్ లు.

***

'ఈ విల్లా.. మెంటినెన్స్ బాధ్యత.. పూర్తిగా నీదే' చెప్పింది రచన ముద్దు ముద్దుగా.

'విత్ ప్లజర్' ఆనందమయ్యాడు సాగర్.

***

సాగర్ కుటుంబం చాలా సాధారణమైంది. అతనికి తల్లిదండ్రులు ఉన్నారు.

తోబుట్టువులు లేరు.

సాగర్ తండ్రి.. సొంతూరు సాలూరులో.. ఇళ్లులు కట్టించే ఆయన వద్ద మేస్త్రీ.

సాగర్ తల్లి.. సాధారణ గృహిణి.

సాగర్ చదువుని నమ్ముకున్నాడు. పీజీ పూర్తి చేయగలిగాడు. సొంతూరు విడిచి

హైదరాబాద్ వచ్చాడు. స్వయంకృషితో ఒక ఫుడ్ ప్రొసెసింగ్ కంపెనీలో జాబ్

సంపాదించుకోగలిగాడు.

అదే కంపెనీలో జాబ్ చేస్తున్న రచనని అడపాదడపా.. అదీ అప్రయత్నంగా

చూడడమే తప్పా.. రచనని పెద్దగా ఎరగడు సాగర్.

తల్లిదండ్రుల ద్వారా.. పెళ్లి కబురులు తెలిసేక.. రచనని గమనించడం

మొదలెట్టాడు సాగర్.

ఆమె చలాకీ కంటే.. ఆమె అందం సాగర్ ని ఆకట్టుకుందంటే అతిశయోక్తి కాదు.

పెళ్లి మాటలప్పుడే తెలిసింది సాగర్ కి.. రచన పెద్దింటి బిడ్డని. దాంతో ఆమెతో

పెళ్లి ఐతే.. గొప్పగా ఉంటుందని తలిచాడు.

ఏమైనా రచన చొరవతో అంతా చకచకా సవ్యమయ్యిపోయింది. ఇద్దరూ

భార్యాభర్తలయ్యిపోయారు.

***

'విత్ ప్లజర్.. అంటే చాలదు. చేతల్లో నన్ను ఇంఫ్రష్ చేయాలి' చెప్పింది రచన.

'తప్పక.. నీ మెప్పు పొందుతాను' నిబ్బరమవుతున్నాడు సాగర్.

'ఎలా' కుతూహలమయ్యింది రచన.

'తగ్గ వర్కర్స్ ని సమకూరుస్తాను. నా పరివేక్షణలో వాళ్లచే దీని మెంటినెన్స్ ని

చక్కగా చక్కదిద్దుతుంటాను' ధీమాగా ఉన్నాడు సాగర్.

'వర్కర్సా' కంగారయ్యింది రచన.

'అవును. స్కిల్డ్ పర్శన్స్ ని ఎంపిక చేస్తాను'

'చాలు చాలు. ఆపండి. వర్కర్స్ అట వర్కర్స్.. అదనం ఖర్చు.. ఎవరు భరిస్తారు'

గదమాయించింది రచన.

కంగు తిన్నాడు సాగర్. బెదురుగా రచనని చూస్తున్నాడు.

'అలాంటి చేతలు కట్టి పెట్టి.. పొదుపుతో పొందికగా పనులు కానీవ్వండి.'

సూటితనం ప్రదర్శించింది రచన.

తల గోక్కుంటున్నాడు సాగర్.

'చేతకాకపోతే.. సలహా అడగండి.. సొంత చేష్టలు వద్దు' ఖారాఖంఢీగా ఉంది రచన.

'సలహా ఇవ్వు' సాగర్ బేలయ్యి ఉన్నాడు.

'మీ నాన్నకి జీతం ఎంత' టక్కున అడిగింది రచన.

'పనులు బట్టే.. నెలకి.. ఐదు.. ఆరు వేలు ముడుతుంది' సాగర్ తికమక

అవుతున్నాడు.

'అక్కడ మీ ఇల్లు.. హుఁ. ఆ సింగిల్ గది ఇల్లు.. అమ్మేసి.. అక్కడ పనులు

మానిపించేసి.. మీ నాన్నని.. మీ అమ్మతో.. ఇక్కడికి తీసుకు వచ్చేయండి. ఆ గెస్టు

రూంలో వాళ్లు ఉంటారు. వాళ్లకి.. ఈ విల్లా సంరక్షణ అప్పగించండి' రచన దర్పము

చూపుతుంది.

సాగర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.

'ఎటూ మీ అమ్మ చేతి వంట.. మీకు పడే ఉంటుంది. మీరు నచ్చినవి

వండించుకోవచ్చు' చకచకా మాట్లాడుతుంది రచన.

సాగర్ తేరుకోలేకపోతున్నాడు.

'మీ నాన్న.. విల్లా పనులు తన పనితనంతో చక్కబెడుతుంటాడు.. మీ అమ్మ..

వంటల తర్వాత.. మీ నాన్న పనులకి తోడవుతుంటుంది.. పైగా.. ఇలా.. ఆ ఇద్దరూ..

మీ చెంతనే ఉంటారు. అలాగే.. వాళ్ల మూడు పూటల తిళ్లుకి.. ఏ లోటు ఉండదు. మీకూ

ఏ చింతా ఉండదు.' చెప్పుతుంది రచన.

సాగర్ కుతకుతలాడి పోతున్నాడు.

'ఏమంటారు.. ఆఁ. మీరు కాదనరు. మీ మెతకతనం మెచ్చే.. కావాలనే..

మిమ్మల్ని నా పక్కన నిలబెట్టుకున్నాను, భర్తగా. యూ ఆర్ ఎ సాఫ్ట్ గయ్.' చెప్పడం

ఆపింది రచన.

సాగర్.. అనిశ్చలంగా ఊగుతున్నాడు. కానీ అతని మనసు నిశ్చలంగా ఉంది.

అది అతని తల్లిదండ్రుల నిర్బంధంకి ససేమిరా అంటోంది.

దాంతో.. 'షటాప్ రచనా' అనేశాడు గట్టిగానే.

తొలిసారి సాగర్ ఎదురు తిరిగాడు.

***

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



358 views1 comment

1 Yorum


WEWU ENTERTAINMENT • 1 hour ago

Super 🥰💝 sir

Beğen
bottom of page