కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Su.. Dheera Episode 2' New Telugu Web Series Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో…
ప్రేమించానంటూ సు వెంటపడతాడు ధీర.
అతన్నివారిస్తుంది సు.
అయినా తన పట్టు వీడడు ధీర.
ఇక చదవండి...
"కట్" అన్నాడు డైరక్టర్.
ఆ వెంబడే తన కుడి చేతి బొటన వేలుని పైకి చూపుతూ..
"వెల్ డన్" అన్నాడు సుని చూస్తూ.
"థాంక్యూ" అంది సు. కెమెరా ఫ్రేం నుండి బయటికి వచ్చింది.
వెళ్లి.. కుర్చీలో కూర్చుంది.
మేకప్ మాన్ టచ్ ఆప్ లకై వచ్చాడు.
"ఫ్రేం నుండి రాగానే తయారైపోతావు. రిలాక్స్ కానివ్వవు. రా.. నీ పని కానిచ్చుకో." అంది సు నవ్వుతూనే.
టచ్ ఆప్ లు కాగానే.. అసిస్టెంట్ ఎంటరయ్యాడు.
అతన్ని గుర్రుగా చూసింది సు.
అతను నవ్వుతూనే.. తీయబోయే సీన్ ని వివరించేశాడు.
అతను వెళ్లబోతుండగా..
"నెక్స్ట్ కి టైం ఉందా" అడిగింది సు.
"పావు గంటలో తిరిగి షూట్ మొదలవ్వొచ్చు. డైరక్టర్ గారు కాఫీ కై వెళ్లారు." చెప్పాడు అసిస్టెంట్.
సు లేచింది. తనకి కేటాయించిన కారవాన్ వైపు మరో మారు వెళ్లింది.
దానిలోకి వెళ్ల గానే.. స్టమక్ ని రిప్రెష్ చేసుకుంది.
తన కారు వద్దకి వెళ్లింది. కారు లోకి వెళ్లి.. మినీ కిట్ ని తీసుకుంది.. దానిలోంచి మిగిలిన నారింజ చెక్కని తీసుకొని.. చకచకా తొనలు ఒలుచుకుంటూ.. నాలుగు తొనల్ని తింది. నేఫ్కీన్ తో పెదాల్ని సున్నితంగా అద్దుకుంది.
తిరిగి షూటింగ్ స్పాట్ లోకి వచ్చింది.
అప్పటికే డైరక్టర్ వచ్చి ఉన్నాడు.
తిరిగి షూటింగ్ మొదలైంది.
రెండు గంటల తర్వాత.. సాయంకాలం నాలుగు అప్పుడు..
"లంచ్ బ్రేక్" అన్నాడు డైరక్టర్.
సు దరికి వచ్చి.. "నెక్స్ట్ ఇంట్రో షూట్.. తర్వాత.. పేకప్." అంటూ నవ్వేడు డైరక్టర్.
దీర్ఘమైన నిశ్వాస పిమ్మట.. సు తిరిగి కారవాన్ వైపు నడిచింది.
కారవాన్ లోని తన అవసరాలు తీర్చుకొని.. మళ్లీ తన కారును చేరింది.
డోర్ మూసేసి.. ఇంజన్ ఆన్ చేసి.. ఏసీ వేసుకుంది. సీట్లో చేరబడింది. వెనుక్కు తల వాల్చుకుంది. కళ్లు మూసుకుంది.
కొంత సేపటి తర్వాత.. డోర్ మిర్రర్ మీది ధ్వనితో కళ్లు తెరిచి చూసింది.
బోయ్..
సర్దుకొని.. కూర్చుంది సు.
లంచ్ ప్లేట్ ని.. మినరల్ వాటర్ బాటిల్ ని అందించి.. బోయ్ వెళ్లి పోయాడు.
లంచ్ మొదలెట్టింది సు.
ఉదయం ఎనిమిదింటికి ఆదరాబాదరాగా టిఫిన్ కానిచ్చేసి.. షూటింగ్ కి వచ్చేసింది సు. తిరిగి పూర్తి తిండి.. ఈ టైంకి చేస్తుంది. మధ్య మధ్య చిరు తిళ్లుగా రెండు పళ్లును.. నాలుగు కప్పుల నీళ్లని తీసుకుంది.
ఇలా.. ఇదే.. అటు ఇటుగా.. సుకి సదా అందే రీతి. ఐనా తను నొచ్చుకోదు. తను చేపట్టిన పనిని తాను తప్పు పట్టదు.
సు కోరి.. వచ్చింది ఈ వృత్తి వైపు. కనుకనే కష్టంని లెక్కించక.. ఇష్టంగా నెట్టుకు వచ్చేస్తుంది.
సు లంచ్ కానిచ్చేసిన కొద్ది సేపటికే.. తన సెల్ మోగింది.
అసిస్టెంట్ కాల్ తో.. షూట్ ప్లేస్ ని చేరింది.
మేకప్ మాన్ రడీగా ఉన్నాడు.
టచ్ అప్ లు ముగియగానే.. షూటింగ్ మొదలైంది.
పేకప్ తర్వాత.. మేకప్ రిమూవింగ్ లు.. డ్రస్ ఛేంజింగ్ లు కాగానే.. సు ఇంటికి బయలు దేరింది.. తన కారుతో.
అప్పుడు ఎనిమిది.
సు ఇంటిని చేరింది.
అప్పటికి తొమ్మిది దాటింది.
కారుని పార్క్ చేసి.. హేండ్ బేగ్ నుండి ఇంటి తాళం కీ తీసి.. తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్లింది సు.
సు ఇల్లు.. వాణిజ్యపరమైన ప్లేస్ లో.. మధ్య తరహాలో.. పొందికైన వసతులున్న.. ఒక డబుల్ రూమ్డ్ ఇండిపెండెంట్ హౌస్.
తలుపు మూసి.. తన రూంలోకి దూరిపోయింది సు. ఏసీ ఆన్ చేసి.. బట్టని దులిపేసేలా.. తన ఒళ్లుని భళ్లున.. బెడ్ మీద వాల్చేసింది.
అటు ఇటు దొర్లే ఓపిక లేకనే.. కదలక మంచం మీద చాలా సేపు ఉండిపోయింది సు.
ఆ తర్వాత.. లేచి.. బాత్రూం లోకి వెళ్లగలిగింది.
స్నానం కానిచ్చేసి.. నైటీని తొడుక్కొని.. డిన్నర్ ని.. ఆన్లైన్ లో పురమాయించుకుంది.
అప్పుడు పది దాటేసింది.
డిన్నర్ వచ్చేక.. దానిని పూర్తి చేసేసి.. మళ్లీ మంచం మీద వాలేసింది సు.
అప్పటికి పండెండు కావచ్చింది.
సు కి నిద్ర ఇట్టే పట్టేసింది.
ఆ తర్వాత.. తెల్ల వారుతుండగా.. ఉలిక్కి పాటుతో.. నిద్ర లేచింది.
పట్టుతో రిప్రెష్ ఐంది.
ఇంటి తాళం కీని వాచ్ మాన్ కి అందించింది.
తన కారుతో జిమ్ కి బయలుదేరింది.
సు ఇంటి తాళం కీని.. వాచ్ మాన్ తన భార్యకి ఇచ్చాడు.
ఆవిడ.. సు ఇంట్లోకి వెళ్లి.. ఇంటిని శుభ్ర పర్చింది. తిరిగి సు ఇంటి తాళం కీని భర్తకి ఇచ్చింది.
జిమ్ లో ట్రైనర్ సూచనల మేరకు.. తన అవసరాల మేరకు.. ఎక్సర్సైజ్ లు కానిచ్చేస్తుంది సు.
తిరిగి తను ఇంటికి వచ్చేసరికి..
ఏడవుతుంది.
వాచ్ మాన్ అందించిన తన ఇంటి తాళం కీని తీసుకుంది సు.
ఇంట్లోకి వెళ్లేక.. బాత్రూంలోని పనులు కానిచ్చేసింది సు.
ఫ్రిజ్ లోంచి.. బ్రెడ్ ముక్కలు.. రెండు గుడ్లు తీసుకుంది.
ఎలక్ట్రికల్ స్టౌ సహాయంతో.. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంది. తింది. ఆపిల్ జాస్ చేసుకొని తాగింది.
తన మినీ కిట్ ని సర్దుకుంది.
తలుపుకి తాళం వేసేసి.. కీని తన హేండ్ బేగ్ లో పడేసుకొని.. వాచ్ మాన్ సెల్యూట్ కి స్పందించి.. షూటింగ్ కి బయలు దేరింది సు.. తన కారుతో.
అప్పుడే ఎనిమిదవుతుంది.
స్టూడియో ఎంట్రన్స్ లో.. చాలా మార్లులానే.. ఈ రోజు.. ధీర ఉండడం.. గుర్తించింది సు.
ఈ మారు మాత్రం.. తను చాలా పట్టుగా.. అతన్ని చూడనట్టే బిహేవ్ చేసింది.
గేట్ కీపర్ మైన్ డోర్ తెరవగానే.. జరజరా లోనికి వెళ్లి పోయింది కారుతో.
గేట్ మూసేశాడు కీపర్.
సు రాకని గుర్తించిన ఆమెని తీర్చిదిద్దే వారు చకచకా తమ తమ పనులకై సిద్ధమైపోయారు.
గంట వ్యవధిలోనే.. ఆ షూటింగ్ కై కావలసిన విధంగా సు తీర్చిదిద్దబడింది.
షూటింగ్ స్పాట్ లో.. అసిస్టెంట్.. స్క్రిఫ్ట్ పేపర్స్ ఇచ్చి.. వివరాలు తెల్పాడు.
"ఈ రోజు మీకు కో యాంకర్ కూడా ఉంటాడు" చెప్పాడు.
"ఎవరు" అడిగింది సు.
"అనుదీప్" చెప్పి.. అసిస్టెంట్ వెళ్లి పోయాడు.
కుర్చీలో కూర్చొని.. తన స్క్రిఫ్ట్ పేపర్స్ ని చూసుకుంటుంది సు.
కొద్ది నిముషాల తర్వాత..
"హాయ్ సు" అనుదీప్ వచ్చి పలకరించాడు. ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
"చాన్నాళ్ల తర్వాత.. తిరిగి మన కాంబినేషన్." అంది సు నవ్వుతూ.
"య. ఇరగ తీసేద్దాం." హుషారుగా అన్నాడు అనుదీప్.
"మరే. కొత్త విధం. హేండ్సమ్ గా ఉన్నావు. రెచ్చిపోదాం." చెప్పింది సు.
ఇద్దరూ నవ్వుకున్నారు.
"నా పిక్క పెరిగింది. మరి నీ పిక్కా" అడిగింది సు.. అనుదీప్ ని.
తమకి ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బుని.. ఈ ఇద్దరూ 'పిక్క' అనుకుంటారు.
"నాకు లేదు.. ఎంత" అడిగాడు అనుదీప్.
"పావు వంతు పెంచారు." చెప్పింది సు.
ఆ వెంటనే.. "నువ్వు అడిగి పెంచుకో." అంటూ చెప్పింది.
అప్పుడే.. అటు వచ్చిన ప్రొడక్షన్ మానేజర్ తో.. "ప్రొడ్యూసర్ సార్ ఎక్కడా" అడిగింది సు.
అతడు ఓ మూలకి చూపాడు.
"వెళ్లు." అంది సు.
అనుదీప్ అటు కదిలాడు.
విష్ చేస్తున్న అనుదీప్ ని చూస్తూనే.. "వచ్చావా.. పేకప్ తర్వాత.. చెక్కు తీసుకో. ఈ ప్రోగ్రాంకి నీకు ఫిప్టీన్ పర్సంట్ పెంచి ఇస్తున్నాం." చెప్పాడు ప్రొడ్యూసర్.
అనుదీప్ "థాంక్స్" చెప్పాడు.
"సరే.. ఏమిటిలా వచ్చావు" అడిగాడు ప్రొడ్యూసర్.
"ఏమీ లేదు. ఊరకనే. షూటింగ్ ముందు కలవాలని." చెప్పాడు అనుదీప్ నవ్వేస్తూ.
"సరే.. షూటింగ్ చూసుకో. ప్రొగ్రాం హైప్ కి నీ వంతు మోజు.. ఆడియన్స్ కి ఇవ్వు. రేటింగ్స్ పెరుగుతుంటే.. ప్రొగ్రాంలు పెంచుకోవచ్చు. నీ కంట్రిబ్యూషన్ కి తగ్గట్టే ముట్ట చెప్పుతాంలే" అన్నాడు ప్రొడ్యూసర్ పొట్ట కదిలేలా నవ్వేస్తూ.
"ష్యూర్ సార్" అనేసి.. అనుదీప్ అక్కడ నుండి కదలాడు.
"సు మోసేసింది. అందుకే వీడు ఎగేసుకు వచ్చేశాడు. అనుకున్నదే" అన్నాడు ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ తో.
అనుదీప్ కి ఆ మాటలు చెవిన పడినా.. తొణక్కుంటా తన స్పాట్ కి పోగలిగాడు.
'ఇలాంటివి ఎన్నని వినలేదు. పట్టించుకుంటే అవసరాలు తీరవు' అని అనుకున్నాడు అనుదీప్.
షూటింగ్ పేకప్ తర్వాత.. తన చెక్కుని తీసుకొని.. తిరిగి ఇంటికి బయలు దేరింది సు తన కారుతో.
అప్పుడు రాత్రి తొమ్మిది దాటుతుంది.
మైన్ గేట్ బయట.. ధీర ఉండడం గుర్తించిన సు..
కారుని పక్కన ఆపి.. కారు దిగి.. ధీరని రమ్మనమంది.
ధీర రాగానే.. "ఏమిటిది. ఈ రోజు ఏమిటి ఇంత వరకు ఉన్నావు" అడిగింది.
"ఇరవై నాలుగు గంటలు గడిచాయి. నీ నుండి ఫోన్ లేదు" చెప్పాడు ధీర.
తల పట్టుకుంది సు.
"ఛ. ఏమిటి నువ్వు. హెడ్ ఏక్ గా.." విసుక్కుంది సు.
"చెప్పాగా. నీ అసలు చెప్పు. అది నాకు నచ్చక పోతే నేను తప్పుకుంటాను" చెప్పాడు ధీర దృఢంగా.
"అవునా.. ఐతే ఫోన్ చేస్తాలే" చెప్పింది సు.
"ఎప్పుడు" దీనంగా అడిగాడు ధీర.
"నాకు సమయం కుదరని.. వరుస షూటింగ్ లు.. రెస్ట్ లెస్ తో సతమతమవుతున్నాను." చెప్పగలిగింది సు.
"అయ్యో.. ఎందుకు నీకు ఇంత హైరానా.. నా మాట విను.. నిన్ను పువ్వులా చూసుకుంటాను. నీకు ఈ శ్రమ వద్దు.. ఈ పని వద్దు." గడగడా చెప్పాడు ధీర.
అంతలోనే బయటికి అనుదీప్ వచ్చాడు తన కారుతో.
సుని చూస్తూనే కారుని ఆపాడు. దిగాడు. అక్కడికి వచ్చాడు.
"ఏమిటి సు. ఎనీ ప్రోబ్లమ్." అడిగాడు.
అనుదీప్ ని చూసిన ధీర కలవరమయ్యాడు.
"అబ్బే.. ఏమీ లేదు. జస్ట్ నార్మల్." చెప్పింది సు.
"ఆర్ యూ షూర్" అన్నాడు అనుదీప్.
"థాంక్యూ ఫర్ యువర్ కన్సర్న్.. నేను మేనేజ్ చేసుకోగలను." నిశ్చలంగా చెప్పింది సు.
"ఐ నో.. నీ గురించి నాకు తెలుసుగా. కెన్ ఐ గో." అడిగాడు అనుదీప్.
"విత్ ప్లజర్" చెప్పింది సు.
ధీర గింజుకుంటున్నాడు. అనుదీప్ తెర మీదే కాదు.. ఇక్కడ కూడా సు తో చనువుగా మాట్లాడడం చూసి ఓర్వలేక పోతున్నాడు.
అనుదీప్ వెళ్లి పోయాడు తన కారుతో.
"వీడు.." అంటున్నాడు ధీర.
"నువ్వు వెళ్లు. నేను ఫోన్ చేస్తాగా." అంది సు.
"ప్లీజ్.. ఆలస్యం చేయకు." గుణుస్తున్నాడు ధీర.
"అలాగే." అంటూ కదిలి..
సు తన కారుతో అక్కడ నుండి బయలు దేరింది.
ధీర తన బైకుతో అక్కడ నుండి కదిలాడు తన ఇంటికి.
కారులో ఉండగానే.. తన డిన్నర్ ని ఆన్లైన్ ద్వారా పురమాయించుకుంది సు.
సు దార్లో ఉండగానే.. తనకి అనుదీప్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.
బ్లూటూత్ సౌకర్యంతో ఆ కాల్ కి కనక్ట్ ఐంది సు.
కారుని సాఫీగా డ్రయివ్ చేస్తూనే.. అనుదీప్ తో మాట్లాడుతుంది సు.
"వద్దమ్మా.. ఈ స్పెషల్ కేర్ లు నాకు నప్పవు. నేను ఎలాంటి వాటినైనా హేండిల్ చేసుకుంటాను" చెప్పింది సు.
"ఎంత ఫేన్ ఐనా.. అలా మధ్యలో ఆగి మాట్లాడడం.. ఒక లేడీగా నీకు పనికి రాదు" అన్నాడు అనుదీప్.
"హే. ఈ మాటలే వద్దంటున్నా. నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావు ఏమిటి" అడిగింది సు.
"సర్లే. నువ్వు పరమ తిక్కదానివి" అనేశాడు అనుదీప్.
"కదా. మరి నన్ను కెలక్కు." అనేసింది సు.
"ఎనీవే. కో వర్కర్ వి కనుక.. చెప్పాను. నీతో పని.. నాకు మనీ.. దాని కోసమే ఈ ప్రాకులాట" నవ్వేడు అనుదీప్.
"కదా.. నాకు పని అంటే ఇష్టం.. అవసరం.. సో.. మనం కలిసి పని చేస్తూ.. ఎవరి తీరున వారం పోదాం." నవ్వింది సు.
"సర్లే. టెక్ కేర్.. గుడ్ నైట్" అన్నాడు అనుదీప్.
"థాంక్యూ. గుడ్ నైట్." అంది సు.
ఆ ఫోన్ సంభాషణ కట్ ఐన పది నిముషాల్లోనే.. సు తన ఇంటిని చేరుకుంది.
డోర్ మూస్తుండగానే డిన్నర్ అందుబాటుకి వచ్చింది.
డిన్నర్ బేగ్ పుచ్చుకొని.. డోర్ మూసుకుంది సు.
స్నానం తర్వాత.. డిన్నర్ కి సిద్ధమవుతుండగా సు ఫోన్ మోగింది.
తన కో యాంకర్ రజని నుండి ఆ కాల్ వచ్చింది.
ఆ కాల్ కి అటెండైంది సు.
"ఎక్కడా" అడిగింది రజని.
"ఇంట్లో" చెప్పింది సు.
"లీజర్ ఎప్పుడు" అడిగింది రజని.
"చెప్తా" అంటూ సు.. తన హేండ్ బ్యాగ్ నుండి చిన్న పుస్తకం తీసి.. పేజీలు తిప్పి..
"రేపు చిన్న చిన్న పేచ్ షూట్స్ ఉన్నాయి. మేబి.. ఆఫ్టర్.. ఈవెనింగ్ త్రీ తర్వాత ఖాళీ.. తర్వాత తిరిగి బిజీయే." చెప్పింది సు.
"అవునా.. మరే.. రేపు నాకు ఫుల్ ఖాళీ.. పాప.. హాస్బెండ్ లతో కలిసి.. యాదగిరి వెళ్తున్నా. నువ్వు రాగలవేమో అని ఫోన్ చేశా." చెప్పింది రజని.
"అయ్యో.. నాకు వీలు కాదే" చెప్పింది సు.
"సర్లే.. ఓకే." అంది రజని.
"హే రజనీ.. అన్నట్టు.. ఆన్లైన్ డెలివరీ అయ్యిందా.. అవే.. నీకై నేను పెట్టిన ఆ మేకప్ సరుకులు అందాయా" అడిగింది సు.
"రాలేదే.. వస్తే చెప్పేదాన్నిగా." చెప్పింది రజని.
"సర్లే.. గుడ్ నైట్" చెప్పింది సు.
"గుడ్ నైట్" అంది రజని.
వాళ్ల సంభాషణ ముగిసింది.
సు డిన్నర్ కై సిద్ధమైంది.
(కొనసాగుతుంది..)
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
చాల బాగా వ్రాసారు. చాలా ఆసక్తి కరంగా ఉంది.