top of page
Writer's pictureGoparaju Venkata Suryanarayana

స్నేహ బంధం


'Sneha Bandham - New Telugu Poem Written By Goparaju Venkata Suryanarayana

'స్నేహ బంధం' తెలుగు కవిత

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ


మానవాళి మనుగడ లో స్నేహబంధం!

ఎన్నటికీ మరువలేని మరపురాని అనుబంధం!!


ఊహ తెలిసి, ఆడేపాడే, పసిప్రాయంలో,

తారసపడే బడి స్నేహలు,

ఎన్నటికీ చెరిగిపోని, కల్మషరహితాలు!


తలచుకొన్న ప్రతిసారి,

గిలిగింతల మధురానుభూతులతో,

మైమరపించే సుమధుర జ్ఞాపకాలు!!


జీవన గమనంలో తదనంతరం,

ఎడబాసిన బాల్య స్నేహితులు,

చరమాంకంలో ఆకస్మికంగా,

తారసపడిన సమయంలో,


వారి హృదయస్పందనలో,

చెలరేగే ఆనందాతిరేకాలు,

అనుభవైకవేద్యం కావాలే కానీ,

వివరింపనలవికాదు, మాటలకతీతం!


ఇతిహాసంలో శ్రీకృష్ణ సుధామల సమాగమం,

అందుకు సోదాహరణ తార్కాణం!!


భారతంలో కర్ణుడు ధుర్యోధనుడికి,

కడవరకు కట్టుబడింది స్నేహబంధానికే!!!


మానవ సంబంధాలేవైనా,

స్నేహంతో ముడిపడినవే,

కలకాలం మనగలుగుతాయి!


భార్యాభర్తలు బంధంతో ఒక్కటైనా,

ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులైనా,

ఒకరికొకరు స్నేహం గానే,

వ్యవహరించాలని విజ్ఞులు,

చెప్పే అనుభవసారం!!


మైత్రీబంధం మానసికమైనది!

దానికి మనం చెల్లించే మూల్యం,

మోముపై మందహసం,

మంచి మనసుతో చల్లని మాట!


బదులుగా మనకు దక్కేది-

వారి ఆప్యాయత, ఆత్మీయత,

సహయసహకారాలు తదాదిగా అనేకం!!

వికలమైన మనసుకు ఊరట!

భవిష్యత్తు పై భరోసా!!


మరింకేం కావాలి-

ప్రశాంత నిశ్చింత జీవనానికి!!!

***


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!

174 views0 comments

Commentaires


bottom of page