'Subbulu Emayyaavu' - New Telugu Story Written By Penumaka Vasantha
'సుబ్బులూ! ఏమయ్యావు?' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
నాల్గు రోజులుగా పనిమనిషి సుబ్బులు, పనికి రావటం లేదు.
దానికి సెల్ ఫోన్ లేదు, కాల్ చెద్దామంటే! వాళ్ల, పిల్లలకూ ఫోన్లు ఉన్నాయి కానీ, నేను నంబర్ తీసుకోవటం మర్చిపోయా వాళ్లది. పెద్ద ఇల్లు. చేసుకోవటం కష్టమౌతుంది. ఒక్కరోజు కూడా నాగా పెట్టదు. అదీకాక, మా అత్తగారు మంచంలో ఉన్నారు. ఆవిడను చూసుకుంటూ, ఇంటిపనులతో సతమతమౌతున్నా. వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, పనికి రాకుండా ఉండదు. ఈ వీధిలో మా ఇంట్లోనే చేస్తుంది. దాని ఇల్లు, కూడా మా ఇంటికి చాలా దూరం లో ఉంటుంది.
మా వీధిలో చాలామంది, వాళ్ల ఇండ్లలో పని చేయమని, అడిగారు. అది ఒప్పుకోలేదు. నేను, రెండు ఇల్లలోనే పని చేత్తాను, మిగతా టైంలో పూలు, కూరలు అమ్ముకుంటాను. అదీకాక, నాకు మడుసులు నచ్చాలి, లేకపోతే, చెయ్యననేది.
"ఈ తులశమ్మ గారింట్లో చేస్తున్నావు, మా ఇంట్లో చేయమంటే, చేయవూ! అవిడలో ఏమి నచ్చిందనీ! నా ముందే, అడిగింది మా పక్కింటి, విజయ.
"ఆమె తినకపోయినా, నాకు పెడతది. ఆవిడ కాడ పదేళ్ల కాడి నుంచి చేత్తన్నాను. నాకు మాపిల్లలకు, బట్టలు ఇత్తది, డబ్బు సాయం చేత్తది, అందుకని ఈయమ్మ ఇల్లు, మాన”ననేది.
మా పిల్లలు, ఇంటికి వచ్చినా, ఒక్కపని చేయరూ. అబ్బా!, అక్కడ, చేసుకుని వస్తామని, ఇక్కడ రెస్ట్ తీసుకుని, వెళ్తారు. పిల్లలు వచ్చినపుడు రెండు పూటలా వచ్చి పని చేసేది.
మా పిల్లలు, "మమ్ములనైనా తిడుతుంది, కానీ సుబ్బులును ఒక్క మాట అంటే, అమ్మ వూరుకో”దనేవారు.
అలాంటి, సబ్బులు పదిరోజులుగా రావటం లేదు. అసలే నడుమునొప్పి, పక్కింటి, పనిమనిషిని, పిలిస్తే, అది ఈ వారంలో నాల్గు, నాగాలు పెట్టింది.
దేవుడికి, సుబ్బులుకు, ఏమవ్వకూడదని, పారాయణ మొదలెట్టాను. "మాకు కూడా మా ఉద్యోగాలకి, పిల్లలకోసం కూడా, ఇంత శ్రద్ధగా, పూజ చేయలేదు, కదమ్మా!" అని పిల్లలు ఫోన్లలో నిష్టూరమాడారు.
"మీరు, ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకుని, వెళ్తారు. పాపం, అమ్మగారు, చేసుకోలేదని ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సుబ్బులు, మానలే”దన్నాను.
"జీతం, డబ్బులు, ఇస్తావు, అవీ, ఇవి, పెడతావు, ఆ మాత్రం చేయదామ్మా!" మా కూతుళ్ళు, అంటే, 'మీకు జన్మనిచ్చాను, పోతూ ఈ ఆస్తులు కట్టుకుపోముగా! మీకే ఇస్తాము. ఈ పది రోజుల నుండి, నేను కష్టపడితే, వచ్చారా!' అందామనుకుని, ‘అమ్మా అలా ఎలా అంటావు, మాకిక్కడ, పిల్లలు, అత్తామామ అంటారు. అయితే ఇక మేము రాములే అక్కడికొచ్చి మేమే పనులు చేసే కంటే ఇక్కడే వుంటా మంటా’రనే మాటలు గుర్తుకు వచ్చి ఎందుకొచ్చిన గోలనీ అక్కడితో ఆపేసి.. ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను.
మరుసటి రోజు, సుబ్బులు, వచ్చింది, "అమ్మ గా”రంటూ!
ఆ పిలుపు, దేవుడు, ప్రత్యక్షమై, ఏమి కావాలి భక్తురాలా! అంటే కూడా అంత హాయిగా ఉండదు. సినిమాల్లో, ఆనందములో హీరో, హీరోయిన్లు, స్లో మోషన్ లో పరుగెత్తినట్లు, గేట్ దగ్గరికి పరుగెత్తుకెళ్లి "సుబ్బులు వచ్చావా!" అన్నాను.
"సుబ్బులు, ఏమయ్యావు ఇన్ని రోజులు"
అమ్మగారు! మా ఆయనకు, ఏక్సిడెంటయింది. ఈ పది రోజులు, ఆస్పటల్ లో సరిపోయింది. ఇయ్యాలే ఇంటికొచ్చాము. మీరు, పని చేసుకోలేరని వచ్చా”నని, ఇంటి బయట, లోపల, శుభ్రం చేసింది, అంట్లుతోమి, బట్టలు, మడత పెట్టి వెళ్ళింది. మా అత్తగారి గది శుభ్రం చేసి, ఆవిడకు కావాల్సినవి, సమకూర్చి పెట్టింది. పెద్దమ్మ గారు రేపటినుండి, రోజు వత్తాలే, అంది. దాన్నిచూసి మా అత్తగారి కళ్ళలో మెరుపు వచ్చింది.
సుబ్బులును చూడగానే, వంట్లో ఎంతో శక్తి వచ్చి, శక్తి(వి)మాను కాకుండా శక్తి విమన్, అయ్యాను.
‘సుబ్బులు.. నువ్వు నా పక్కనుంటే చాలు, అదే దైర్యం నా క’నుకున్నా మనసులో.
ఇంతలో మా వారు లోపలికి, వచ్చి "ఎంటోయి! సుబ్బులును చూడటంతోనే నీ మొహం తౌజెండ్ కాండిల్ బల్బ్ గా వెలిగిపోతుందిగా!” అన్నారు.
“ఇదిగో, సుబ్బులుకు వెళ్లేప్పుడు ఈ డబ్బులిచ్చి పంపు. రంగడు పనిలోకి వెళ్ళకపోతే ఏమి తింటారు వాళ్ళు" అన్నారు, మావారు.
పనయిపోయి వెళ్తున్న సుబ్బులును, "ఎలా అయ్యింది, ఏక్సిడెంట్, మీ ఆయన”కంటే.
"ఏమి సెప్తా, తాగి ఆటో తోలి బస్ ను గుద్ది కింద పడ్డాడు. చెయ్యి, విరిగింది. ఇక తాగనే.. సుబ్బులు అన్నాడు. పిల్లల పెళ్ళిల్లయి, ఎటువాల్లు అటు పోయినారు. ఇద్దరం కాయాకట్టం చేసి ఎట్టగో బతుకుతుంటే.. చేయి విరగొట్టుకుని, మంచంలో ఉండాడు. ఇంకా నయం, మడిసి బతికాడనీ! సంతోసం. ఆయన లేకుంటే, నేనేమీ సేత్తాను గోంగూర”.
“అవునే! సుబ్బులు, ఇపుడే, మీ ఆయన అవసరం ఎక్కువ నీకు. చివరదాకా మనతో ఉండేది భర్త కానీ, పిల్లలు కాదు, వాళ్ళేముంది, రెక్కలు రాగానే ఎగిరిపోతారు. రంగడిని జాగ్రతగా చూసుకో”.
వెళ్తున్న సుబ్బులుకు కొంత డబ్బిచ్చి, "ఇప్పటికైనా! మీ ఆయన మారతాడులే, బెంగ పడ”కన్నాను.
"చీకటి లేకపోతే, వెలుగు విలువ, తెలియదు సుబ్బులూ!" అన్నాను.
'ఏంటో! ఈ అమ్మగారు సెప్పేది ఓ పట్టాన అరదం కా’దని తల గోక్కుంటూ.. "ఆ మరే! పొద్దుట తొరగా వత్తానమ్మ గోరు" అంటూ వెళ్ళింది, సుబ్బులు.
***
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments