top of page

ఉదయరాగాలు


'Udaya Ragalu- New Telugu Story Written By Ch. C. S. Sarma

'ఉదయరాగాలు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అది చెన్నై మహానగరం వలసరవాకం ప్రాంతంలో ఒక వీధి. రాజంద్రన్ స్ట్రీట్. బాగా కలవారు ఉండే ప్రాంతం.

సమయం ఉదయం ఆరున్నర..


వీధి వీధి తిరిగి వ్యాపారం చేసికొనేవారు ఒకరి తరువాత ఒకరు ఆ వీధిలో ప్రవేశించి, వారు విక్రయించే వస్తువులను హెచ్చుస్థాయి స్వరంతో అరుస్తారు. ఆయా వస్తువులు కావలసిన వారు ఇండ్లలో నుంచి బయటికి వీధిలోకి వచ్చి ఆ విక్రయదారుని సంప్రదించి కావలసిన వాటిని కొనుగోలు చేస్తారు.


1. అతని పేరు కూరగాయలు కుమారప్పన్ :- వారి నాలుగు చక్రాల సైకిల్ టైర్ల బండిలో రకరకాల కూరగాయలు వున్నాయి. కత్తిరికాయ (వంకాయ), వెండకాయ (బెండకాయ), బీకంకాయ (బీరకాయ), పావక్కాయ (కాకరకాయ), పచ్చిమిర్చి (పచ్చిమిరపకాయలు), వెంగాయం (ఎఱ్ఱగడ్డలు), సాంబరు వెంగాయం (చిన్నఎఱ్ఱగడలు) సాంబార్‍లో తమిళియన్స్ ఎక్కువగా వాడుతారు.

పై పేర్లను టేప్‍చేసి రికార్డర్ ద్వారా హెచ్చు స్థాయిలో ఇంట్లో వుండేవారికి వినిపించేలా అప్పుడప్పుడు, తోపుడు నాలుగు చక్రాల వాహాన్ని తోసుకొని పోతూ సంకేతాన్ని వినిపిస్తారు కుమారప్పన్. ఆ కంఠస్వరం కుమారప్పన్‍దే. మహాకర్కశం..


2. ఆకుకూరల సీతమ్మ :- కుమారప్పన్ ముందుకు సాగి.. మరో వీధికి వెళ్ళగానే ఆకుకూరల సీతమ్మ (ఈమె తెలుగు మనిషే) వారి తల్లితండ్రి బిల్డింగ్ నిర్మాణపు కార్మికుడు.


సీతకు చదువు అబ్బలేదు. ఛామన చాయ, మంచి అందగత్తె. కుర్రకారు సీతమీద రాళ్ళేసి గలాట చేస్తారని, ఆమె తండ్రి కిష్టయ్య, తల్లి వసంత.. వారు పనిచేసేచోటే పనిచేసే యువకుడు గోపాల్‍తో పెళ్ళి చేశారు. వారి పెండ్లి జరిగి రెండు సంవత్సరాలు. ఇంకా బిడ్డలు కలుగలేదు. భర్త గోపాల్ బిల్డింగ్ కూలిగా, సీత ఆకుకూరల విక్రయదారిగా జీవితాన్ని గడుపుతున్నారు.


"పులిచికీరే (గోంగూర), అవిచికీరే (అవిశాకు), మురుంగి కీరే (మునగాకు), పొన్నగంటి కీరే (పనగంటి ఆకు), కొరెపెలే (కొరేపాకు), కొత్తిమేరే (కొతిమేరు) వెదురుతట్టలో తనవద్ద ఆరోజున వున్న ఆకుకూరల పేర్లను రాగయుక్తంగా పలుకుతూ ముందుకు నడుస్తు అన్ని కూరల ఆకుకట్టలను క్రమంగా బుట్టలో పెట్టుకొని తన శ్రావ్య కంఠంతో అరుస్తుంది. వయ్యారంగా నడుస్తూ కాళ్ళకున్న వెండి గజ్జలు ఘల్లుమని చిత్రంగా వినిపిస్తూంటాయి. అవసరమైన ఆడవారు ఇండ్లనుండి సీతను సమీపించి కావలసిన కూర ఆకు కట్టను కొనుక్కొంటారు. సీత సౌమ్యురాలు. పెద్దల ఎడల గౌరవం, మర్యాద. ఆ కారణం సీతను అందరూ అభిమానిస్తారు. ఆమె వద్ద ఆకుకూరలను కొంటారు. అలా విక్రయిస్తూ సీత ముందుకు సాగిపోతుంది. కూరల పేర్లను వీనులను సొంపుగా ఆలపిస్తూ..


3. తరువాత వచ్చేది పండ్లబండి యజమాని పాండు :- పక్కా తమిలియన్. వీరిదీ నాలుగు సైకిల్ చక్రాల వాహనమే. టెన్త్ ఫెయిల్. "యాపిల్, గ్రేప్స్, ఆరంజి, సపోటా, సాతుకొడి (గజనిమ్మ), గొయ్యాకాయ్ (జామకాయ), వాళపళం( అరటిపండ్లు), అనాసపళం (అనాసపండు)" తన కర్కశ కంఠంతో బిగ్గరగా అరుస్తాడు. ఆడ మగవారు ఆ సుమధుర గాంధారాన్ని విని ’అమ్మా వచ్చాడు.. కీచకన్ (కీచకుడు) అనుకొంటారు. తన స్వరాన్ని అసహ్యించుకొంటారు. ఆ ఫలాల్లో ఏదైనా ఫలం కావాలనుకొన్నవారు పాండును సమీపించి కొనుక్కుంటారు. ఒకచోట విక్రయం ముగియగానే పాండు తన సుమధుర కంఠాన్ని విప్పుతాడు. ముందుకు సాగుతాడు. ఆ నాదాన్ని విన్నవారి ఒంట్లో దడపుడుతుంది.


4. తదుపరి కార్పొరేషన్ చెత్త కలక్షన్ నాలుగు చక్రాల మినీ వాహనం :- వాహన చోదకుడు ముందున్న క్యాబిన్‍లో కూర్చుంటాడు) వెనుక లారీలో ఓపెన్ బాడీలో ప్లాస్టిక్ డ్రమ్ములు. టమిక్‍ల్లో సుమధుర గానం. డ్రయివర్ ఆ వస్తు సేకరణదారి. ప్రతి ఇంట్లో రెండూ ప్లాస్టిక్ డబ్బాలు తెలుపు, లైట్ గ్రీన్ గృహస్తులు తన గృహచెత్తను ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో, నల్ల ప్లాస్టిక్ కవర్లలో వేసి మూట కట్టి తమ ఇంటి చెత్తను ఆవరణంలో వున్న రెండు ప్లాస్టిక్ డబ్బాలో విడివిడిగా అంటే కూరగాయల శేషాలు, అన్నం, ఇల్లు చిమ్మిన దుమ్ము ధూళి ఒక డబ్బాలో, రెండవ డబ్బాలో ప్లాస్టిక్ కవర్లు తదితర ప్లాస్టిక్ వుపయోగపడని వాటిని నల్ల ప్లాస్టిక్ ప్రీమియం షాలీమార్ కవర్లలో వేసి బిగించి, వాకిటి ముందువున్న ప్లాస్టిక్ డబ్బాలో గృహస్థులు వేస్తారు.


ఆ వాహకులు గృహస్థులు తెల్లడబ్బాలో వేసిన ప్లాస్టిక్ తదితర సామానుల నల్ల కవర్లను, లైట్ గ్రీన్ డబ్బాలో వేసిన కూరగాయల వేస్టు, దుమ్ము ధూళితో వున్న షాలీమార్ కవర్లను లైట్ గ్రీన్ డబ్బాలో (గృహస్తులు వుంచిన) వాటిని తమ వాహనం డబ్బాల్లో రెండు రకాలుగా (నీలం/నలుపు) వున్న పెద్ద డబ్బాలలో వేసికొని ప్రక్క ఇండ్లవైపు పోతారు.


సుచీశుభ్రతా ప్రతి ఒక్కరికీ అవసరం. దాన్ని బట్టే మన ఆరోగ్యం వుంటుంది. పురజనుల క్షేమం కోసం, నగర కార్పోరేషన్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని దీక్షగా ప్రతినిత్యం నిర్వహిస్తారు. వారు అరవం (టమిల్)లో పాడేపాట.. వీనులకు విందుగా వుంటుంది. సుచీ శుభ్రతలను నగర శుభ్రతను గురించి తెలియజేస్తుంది.


5. తరువాత పూల మునెమ్మ :- వెదురు బుట్టలో గులాబీలు, చామంతి పూలు, మల్లెపూలు, సంపంగి పూలు (సీజన్‍లను అనుసరించి) వుంచుకొని వీధిలో ప్రవేశిస్తుంది.


చామంతి కిలో నూట నలుబది రూబా (రూ140/-) కిలో, మల్లె రెండు మొళ్ళు (రెండు మూరలు, అరువది రూబా రూ60/-), బెంగుళూరు బటన్ రోజ్ కిలో నూట ఇరువది రూబా, సంపంగి కిలో నూట అంబది రూబా (రూ 150/- కిలో.. మునెమ్మ చక్కని రాగంతో రాగయుక్తంగా పై ప్రకటనను చేస్తూ వీధిన ఠీవీగా నడుస్తుంది. వయస్సు నలభై. ఛామనచాయ. ముఖాన అర్థరూపాయంత బొట్టు. మనిషి మంచి చూపరి. ఆమె ముఖంలో ఏదో ఆకర్షణ.


కావలసినవారు ఆడ మగ ఆమెను పిలిచి ఆపి, సమీపించి కావలసిన పూలను కొనుగోలు చేస్తారు. తూకం, మూర బాగా వేస్తుంది మునెమ్మ. ఆ కారణంగా ఆమెకు మంచిపేరు.


6. పేపర్ పాత సామాన్ల మస్తాన్ : వీరిది మూడు చక్రాల వాహనం. పాత వస్తువులు ఏవైనా సరే, న్యూస్ పేపర్లు, అట్టపెట్టెలు, పాత నోట్ బుక్స్, పాత పుస్తకాలు, పాత ఫ్యాన్, గ్రైండర్, ఫ్రిడ్జ్ వగైరాలను కొంటాడు.


పుస్తకాలు కిలో - 12/- రూపాయలు

పేపర్ హిందూ కిలో - 20 /- రూపాయలు

ఎక్స్ ప్రెస్ ఇతరివి కిలో - 15/- రూపాయలు

టమిల్ పేపర్ కిలో - 15/- రూపాయలు

టమిల్ వీక్లీస్ కిలో - 10/- రూపాయలు


మిగతా సామాన్లను పరీక్షించి తనకు తోచిన వెల చెబుతాడు. ఇంట్లో స్థలాన్ని ఆక్రమించి ప్రయోజనం లేని వస్తువులను పేపర్లు బుక్స్ ను మస్తాన్‍కు విక్రయిస్తారు. డిజిటల్ త్రాసులో తూకం వేసి, ఎన్ని కిలోలో నిర్ణయించి, తాను చెప్పిన వెల ప్రకారం డబ్బులు ఇచ్చి పాత సామాగ్రిని తీసుకొని వెళతాడు మస్తాన్.


వీరు తన కంఠాన్ని రికార్డు చేయించాడు. పళయ పేపర్ (పేపరు), నోట్స్, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్ తరమాన వెలకు వాంగపడుం.. (పాత పేపరు నోట్స్, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్ న్యాయమైన వెలకు కొంటాము)


ఆ గానంతో వారు వీధిలో ముందు సాగిపోతూంటాడు. ఏదైనా వస్తువును విక్రయించదలచిన వారు మస్తాన్‍ను పిలిచి వారి వేస్టు సామాగ్రి చూపించి, ధర విషయం మస్తాన్‍తో మాట్లాడి విక్రయిస్తారు.


7. సోఫాసెట్, బెడ్ రిపేరు, వీరి పేరు హిమామ్ సాహెబ్ :- వీరు సైకిల్ మీద పయనం. పళయ (పాత) సోఫా రిపేర్.. సోఫా బెడ్ రిపేర్.. మైక్‍లో ఆ నినాదంతో సైకిల్ మీద మెల్లగా ముందుకు సాగుతారు. ఆ పలుకు రాగయుక్తంగా వుంటుంది.


అవసరమైన వారు హిమామ్ సాహెబ్ ను పిలిచి, తమ పాత సోఫా, సోఫాబెడ్‍ను చూపిస్తారు. రిపేర్ ఖర్చును హిమామ్ తెలియజేస్తాడు. తాను చేయబోయే విధానాన్ని గురించి విపులంగా చెబుతాడు. హిమామ్ చాలా చమత్కారంగా నవ్వుతూ మాట్లాడుతూ జనాల్ని ఆకర్షిస్తాడు. అది వ్యాపార లక్షణం. ఏ వ్యాపారికైనా కావాలసింది సరళ సౌమ్య సంభాషణ. అవసరమైన వారు అతని సేవను అందుకొంటారు.


8. సానాపుడికెరది (సానపెట్టేది) :-

కత్తి, వెడ్డు కత్తి, (గొడ్డలి) అరవామనె (కత్తిపీట) సానాపుడి కరది (సానపడుతాము)

వీరిపేర్లు అల్లామియా..


వీరి వాహనం సైకిల్.. దాని వెనుక క్యారేజికి సైకిల్ వాల్ - దానికి ఫెడల్.. ఆ వాల్‍ను క్రిందికి దించి, నేలనుంచి, పెడల్ తొక్కుతూ గ్రైండింగ్ స్టోన్‍తో, కత్తిని, కత్తిపీటను, డబ్బాలోని ఇనుముకు సంబంధించిన వాటిని పదునుపెడతాడు.


ఆయా వస్తువును అనుసరించి ఇరవై రూపాయలు మొదలు రెండు మూడు వందల వరకూ ఛార్జి చేస్తాడు అల్లామియా. ఇతను నల్లగా మొరటుగా ఉంటాడు. మాట పెళుసు. సౌమ్యత ఉండదు. అతను చేసే పనిలాగానే అతని వాలకం. ఒక్కొక్కరూ ఒక్కోరకం. లోకో భిన్నాతత్వం. కొత్త కత్తిపీట, కత్తి, గొడ్డలి, దోసె పెనము, దబ్బళం, కొడవలిలను కూడా విక్రయిస్తాడు.


అల్లామియా.. అవసరం వున్నవారు వారిని పిలిచి ఆపి వారి వస్తువులకు సాన పట్టించుకొంటారు. కావలసిన కొత్త వాటిని కొంటారు.


9. పళయ జరిగి శారీ, వేస్టీ, కండవ, పావడ (పాత జరిగి చీర పంచ, పైపంచ, పావడా) తరమాన వెలకు వాంగపడుం (న్యాయమాన వెలకు కొంటాము)


వీరు ఒకరు కాదు ఇరువురు, ఆడమగ. వాహనం చిన్నా మోటారు కారు. డ్రయివరు మగవారు.

మైక్‍లో వీరు.. పళయ సేల (చీర), వేస్టీ (పంచ), కండవ (పై పంచ) పావడా (పావడ) తరమాన వెలకు వాంగపడుం. వాంగమ్మా వాంగో వాగయ్య వాంగో తరమాన వెలకు (కొంటాము. అమ్మా అయ్యా రండి) వాంగె వుంగవాసిల్ ఇరుకరోమ్. (మేము మీ వాకిట్లో వున్నాము) నల్ల సమయం (మంచి తరుణం) అమ్మా, అయ్యా వాంగోవాంగో (అమ్మా అయ్యా రండి.. రండి) ఉంగ పళయ పొరుక్కళ్ ఎంగళకు కుడుంగో (మీ పాత వస్తువులను మాకు ఇవ్వండి) కాసు అల్లికోంగో.. (డబ్బును జవురుకొండి)

ఆడా, మగా మార్చి మార్చి ఆ సరాగ వచనాన్ని మైక్‍లో పదే పదే ఒకరు మార్చి ఒకరు చెబుతారు.


కొందరు గృహస్తులు.. వారి పాత జరిగ బట్టలను వారికి ఇచ్చి బేరమాడి డబ్బును తీసికొంటారు.

ఆ విధంగా.. ఆ వీధిలో వుదయం పన్నెండు గంటల లోపల మహానగరంలో అలాంటివారు ఒక్కరుకాదు ఎందరివో తమ ఉదయరాగాలు, వేరు వేరు వ్యక్తులు మూలంగా వినిపిస్తాయి. కొందరి నాదంలో సౌమ్యత.. కొందరి కంఠంలో కర్కశం.. ఏది ఏమైనా వారందరూ గృహస్థులందరికీ.. సహాయకులు.. ఆప్తులు.. హితులు..


***

సమాప్తం

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




41 views0 comments
bottom of page