top of page

Profile

Join date: 15, ఫిబ్ర 2023

About

పరిచయం

గణితశాస్త్ర ఉపన్యాసకుడిగా దాదాపు 26 సంవత్సరాలు విద్యా బోధన చేసాను. దాదాపు రెండు సంవత్సరాలు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించి 2010లో పదవీ విరమణ పొందాను.

తెలుగు సాహిత్యం మీద మమకారంతో.. విద్యార్థి దశనుండి పెయింటింగ్స్ చేయడం.. కవితలు, కార్టూన్లు, కథలు రాయడం అలవాటు ఉన్నా విద్యాబోధన మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాణ్ణి. ‘ఎమ్సెట్ ప్రశ్నావళి-సాధనలు’ అనే గ్రంథాన్నిఆంగ్ల, తెలుగు మాధ్యమాలలో రాసాను. జె.పి.పబ్లికేషన్స్ వారు ముద్రించారు.

పదవీ విరమణ అనంతరం తిరిగి సాహిత్యం మీద నిర్విరామంగా కృషి చేస్తున్నాను. 2012 మార్చిలో ‘ముంబై ఒన్’ పక్ష పత్రికలో ‘అమ్మ మనసు అమూల్యం’ మొదటి కథ అచ్చయ్యింది. ఆ స్ఫూర్తితో రచనలు వేగవంతం చేసాను. నేటి వరకు దాదాపు 230 కథలు, 150 కవితలు, 200 కార్టూన్లు, రెండు నవలలు వివిధ పత్రికల్లో వచ్చాయి. కథలకు బొమ్మలు గీసుకుని, డిటిపి చేసుకుని పది పుస్తకాలు అచ్చు వేయించుకున్నాను. పాఠకులకు ఉచితంగా పంచుతున్నాను.

నా గ్రంథాలు:

  1. ఝాన్సీ, హెచ్.ఎం.(కథా సంపుటి)

  2. జీవన చిత్రం (ఆత్మకథ)

  3. జీవనగతులు(కథా సంపుటి)

  4. ప్రకృతిమాత(పిల్లల కథలు)

  5. మహా ప్రస్థానం(కథా సంపుటి)

  6. రామచిలుక (పిల్లల కథలు)

  7. అమ్మ ఒడి (కథా సంపుటి)

  8. రామబాణం (పిల్లల కథలు)

  9. జర్నీ ఆఫ్ ఏ టీచర్ (నవల)

  10. చెన్నూరి సుదర్శన్ కథలు(కథా సంపుటి)

‘అనసూయ ఆరాటం (నవల), జీవన చక్రం (నవల), ఆత్మకథ రెండవ ముద్రణ.. రాబోతున్నాయి.

మెప్పుకోలు:

రాష్ట్ర బెస్ట్ టెలిఫోన్ ఆపరేటర్ (1977), రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డు (2008), గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం, ఐతేభారతిచంద్రయ్య సాహిత్య పురస్కారం, గుర్రం జాషువా జయంతి సందర్భగా తెలుగు అకాడెమీ వారిచే ‘కవలల కలవరం’ కథకు సన్మానం, యాదగిరి ఛానెల్ ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో ఇంటర్వ్యూ, సి.ఎం. ఆర్ ఛానల్ లో ‘పోటువ’ కథ సమీక్ష ప్రసారం.. ఇంకా పలు కథలకు, కార్టూన్లకు బహుమతులు.

2016 -17 లో శ్రీ వాకాటి పాండురంగ రావు స్మారక జాగృతి కథా పురస్కారం లో ద్వితీయ బహుమతి లభించింది.

Overview

First Name
Sudarsan
Last Name
Chennuri

Sudarsan Chennuri

Writer
More actions
bottom of page