Profile
About
నా పరిచయం **************** పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం Patrayudu kasi viswanadham విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు). స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం విజయనగరం జిల్లా. నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట) వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట. ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం. సేకరణలు: ********** 1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.