top of page


ఒరు వరుట్టమ్ (ఒకవిషాదం)
కొడుకు భాస్కర్ కోసం ఆశగా చెంగల్పట్టులోని ‘HappyNest Towers’కు వచ్చిన భానుమూర్తికి చెన్నై సిటీ లైఫ్ చుక్కలు చూపిస్తుంది. బాల్కనీ లేని ఇల్లు, రాత్రి కురిసే సీలింగ్ వర్షం, ఎగిరిపోయే లిఫ్ట్, బాహుబలి లెవెల్లో బిగించిన ఏసీ రిపేర్లు, చివరికి తమిళ భాష రాక పనిమనిషితో పడ్డ తిప్పలు... నవ్వులు పూయిస్తూనే మెట్రో నగరాల అద్దె బతుకుల కష్టాలను ఆవిష్కరించే కథ ఇది.

Veereswara Rao Moola
3 hours ago4 min read


గంగానది తీరాన
పెళ్ళి కావాల్సిన వయసులో జాతకాల పేరుతో జీవితాన్ని కోల్పోయిన అమల కథ ఇది. ఒంటరితనం ఆమెను ఒక తప్పు నిర్ణయం వైపు నడిపించింది. ఆ తర్వాతి అపరాధ భావన, పశ్చాత్తాపం ఆమెను కాశీ గంగాతీరానికి చేర్చాయి. అదే సమయంలో శేషగిరికి ఆమెపై ప్రేమ కలిగింది. కానీ అతని జీవితంలో వచ్చిన ఆ నిజమైన భావనను చెప్పేలోపే అమల గంగలో కలిసిపోయింది. ‘గంగానది తీరాన’ స్త్రీ జీవితంపై మూఢనమ్మకాలు, ఒంటరితనం, సామాజిక తీర్పులు చూపే విషాద వాస్తవిక కథ.

Veereswara Rao Moola
Aug 284 min read


ఆ రాత్రి
లంబసింగి చలి, క్యాంప్‌ఫైర్, పాటలు, నవ్వులు… అంతా ఆనందంగా సాగుతున్న ఆ రాత్రి ఒక్క మాటతో భయానక మలుపు తిరిగింది. తమతో సరదాగా గడిపిన రాకేష్ వెనుక దాగిన గతం ఏమిటి? ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఝాన్సీ ఏం చేసింది?

Veereswara Rao Moola
Jul 185 min read


ఏకాకి నౌక
ఎప్పుడో మిరప పంటలు పండించి గర్వంగా బతికిన రైతు నరసింహ... నేడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గేటు వద్ద సెక్యూరిటీ గార్డు. పంట నష్టాలు, అప్పులు, భార్య మరణం, కొడుకు దూరం కావడం... ఒక్కొక్క దెబ్బతో అతని జీవితం ఎలా మారిపోయిందో చెప్పే హృదయస్పర్శి కథ.

Veereswara Rao Moola
Jun 224 min read


నలుగురి లో ఒకడు
ఒక బ్యాంక్ దోపిడీ... నలుగురు దొంగలు... కానీ పట్టుబడింది ముగ్గురే. ఆరు వేళ్లున్న ఒక వ్యక్తి ఆధారంగా ఇన్స్పెక్టర్ రంజిత్ నిగూఢ రహస్యాన్ని ఛేదించిన ఆసక్తికర క్రైమ్ కథ.

Veereswara Rao Moola
Jun 183 min read


అన్వేషణ - అబ్సర్డ్ కథ
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఒక యువకుడు తన ప్రేమికురాలి కోసం ప్రతి S3 కోచ్‌లో వెతుకుతూనే ఉంటాడు. ఆమె ఏ రైలులో వస్తుందో, ఏ ట్రైన్ నంబరో, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. అయినా అతని అన్వేషణ ఆగదు. అర్థరహిత నిరీక్షణ, జీవితంలోని వ్యర్థ అన్వేషణలు, అస్తిత్వవాద భావజాలాన్ని ప్రతిబింబించే చిన్న కానీ గాఢమైన అబ్సర్డ్ కథ.

Veereswara Rao Moola
Jun 62 min read
bottom of page
