top of page
Original.png

దోషం


తల్లి మాటలు… కూతురు సంసారం నాశనం చేస్తాయా?
తల్లి మాటలు… కూతురు సంసారం నాశనం చేస్తాయా?

Dosham - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao

దోషం - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 06/05/2026

“తల్లి చెప్పిన మాటలు… కూతురు జీవితాన్ని almost పాడుచేశాయి!” 

జీడిగుంట శ్రీనివాసరావు గారి దోషం కథలో ఆ వైనం తెలుసుకోండి. . 


శశికాంత్ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన ప్రపంచంలో అన్నిటికంటే ‘చదువు’కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నమ్మకం ఒక్కటే—"తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులైతే, ఆ వంశంలో పుట్టే పిల్లలు ఆణిముత్యాల్లా మెరుస్తారు." అందుకే తన ఏకైక కొడుకు సుమన్ ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేసి అతనికి  సమానంగా చదువుకున్న అమ్మాయి కోసమే వెతికి మరీ కావ్య తో పెళ్లి జరిపించారు. కావ్య కూడా ఎం.టెక్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో పని చేస్తోంది.


​పెళ్ళైన కొత్తలో అంతా సాఫీగానే సాగింది. కానీ అసలు సమస్య శశికాంత్ భార్య మాధవి అనారోగ్యం పాలైనప్పుడు మొదలైంది.


ఒకరోజు పొద్దున్నే లాప్టాప్ పెట్టుకుని పనిచేసుకుంటున్న కొడుకు కోడలు దగ్గరకి వెళ్లి కోడలు కావ్య తో  "అమ్మా కావ్య మీ  ఆత్తయ్యగారికి ఒంట్లో బాలేదు కదా, ఆవిడ మంచం మీద మూలుగుతో వుంది, టేబుల్ మీద పాలప్యాకెట్ అలాగే వుంది, కొద్దిగా వంటగదిలోకి వెళ్లి కాఫీ కాచి ఇవ్వచ్చు కదా,ఈ పూట వంట పని చూసుకో తల్లీ అని మెల్లగా అన్నారు.


​కావ్య ఒక్క క్షణం ఆగి, "మావయ్య గారు, నాకు ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. పైగా నేను ఇంత చదువు చదువుకుంది ఆఫీసులో నా టాలెంట్ చూపించడానికి కానీ, కిచెన్‌లో గరిటె తిప్పడానికి కాదు. ఇంటి పనుల కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా?" అని సూటిగా అడిగింది.


​శశికాంత్ కి ఏం అనాలో తెలియక కొంతసేపటికి తేరుకుని  ఇంటి పని చేయడం తక్కువతనం అనుకుంటే ఎలా కావ్య, ఆరోగ్యం బాగున్నప్పుడు మీ అత్తగారే పనులన్నీ చూసుకుంటోంది, ఉద్యోగం చెయ్యడం ఇంటిపనులు మానేయాడానికి   క్వాలిఫికేషన్ కాదు కదమ్మా అన్నారు.

అక్కడితో మొదలైన చిన్న చర్చ కాస్తా పెద్ద గొడవగా మారింది కావ్య వాదన ఒక్కటే "చదువుకున్న స్త్రీ అంటే కేవలం సంతానాన్ని ఇచ్చే యంత్రం కాదు. నా తెలివితేటలు వంటగదిలో మగ్గిపోవాలా? సుమన్ కూడా చదువుకున్నవాడే కదా, తను ఎందుకు వంట చేయకూడదు? అని వాదించడం మొదలుపెట్టింది.


యింతలో శశికాంత్ భార్య  మాధవి వంటగాదిలోనుంచి గోడ పట్టుకుని నడుస్తో వచ్చి కొడుకు కోడలు కి కాఫీ కప్పులు అందించి, పోనీలెండి ఎందుకొచ్చిన గొడవ, ఈ పూటకి హోటల్ నుంచి భోజనం తెప్పించండి, సాయంత్రనికి నాకు జ్వరం తగ్గుతుంది అంది. మరి నాకు కాఫీ లేదా అన్నాడు శశికాంత్ భార్య వంక చూస్తో. వంటగది లో వుంది వెళ్లి తెచ్చుకోండి, వాళ్ళకంటే పని వుంది మీకేముంది, రిటైర్ అయ్యారు అంది.

యింత జరుగుతున్నా కొడుకు ఒక్కమాట భార్యతో అనకపోవడం బాధగా అనిపించిందిశశికాంత్ కి. జ్వరం తో వున్న తల్లి కాఫీ కలిపి యిస్తే థాంక్స్ అమ్మా అంటూ కాఫీ తాగుతున్నాడే గాని భార్యకి చెప్పలేకపోయాడు.

స్విగ్గి వాడితో భోజనం తెప్పిద్దాం అనుకుంటే చాలా శాఖాహర హోటల్స్ గ్యాస్ లేక మూతపడ్డాయి అని తెలిసి ఫ్రీజ్ లోనుండి బీరకాయలు, ఆలుగడ్డలు తీసి టేబుల్ మీద వేసుకుని తొక్కు తీయ్యడం మొదలుపెట్టాడు.  అది చూసిన కావ్య లాప్టాప్ పక్కన పెట్టి నేను తరిగి యిస్తాను మీరు లేవండి మామయ్యగారు అంది.


యింతలో ఫోన్ రింగ్ అవ్వడం తో ఫోన్ తీసుకుని ఆ అమ్మా చెప్పు, ఎలా వున్నారు, బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అంటూ అడగటం మొదలుపెట్టింది కావ్య తన తల్లిని.


మావి అయ్యాయి, నువ్వు ఏం తిన్నావు అంది. మా అత్తగారికి జ్వరం, నాకు ఆఫీస్ పని ఏమి తినలేదు అంది కావ్య.  అదేమిటే జ్వరం వస్తే వంట చేసుకోరా విచిత్రం కాకపోతే నాకు జ్వరం వస్తే వంట చేసుకోవడం మానేసానా అంది తల్లి.  యింతలో అటువైపు నుంచి తండ్రి తల్లిని నువ్వు నోర్ముసుకుని ఫోన్ పెట్టేసి రా, కూతురు సంసారం చెడకోట్టాడానికి రోజూ నాలుగు సారులు దానికి ఫోన్ చేసి హితభోదలు చేస్తావు అన్నాడు.


అందుకే తల్లిదండ్రుల వున్న సంబంధం వద్దు అన్నా వినలేదు మీరు యిప్పుడు ఆ ముసలాళ్ళకి ఏం వచ్చినా అమ్మాయి చూసుకోవాలి అంది కావ్య తల్లి.  నీ మొహం వాళ్ళు కూడా నీలాగా అనుకుంటే మన ఫొటోస్ గోడకి వుండేవి. మనం వాళ్ళదగ్గర కి వెళ్ళినప్పుడు వియ్యంకుడు గారు నిన్ను స్వంత చెల్లెలు లా చూసుకునేవాళ్ళు, పాపం ఆవిడ మనం వున్నన్నాళ్ళు రకరకాల వంటలు చేసేది. ఏమైనా కూతురు కాపురం చెడగొట్టాలంటే తల్లులే కారణం. రోజూ ఫోన్ చేయటం మానేస్తే అంతా బాగానే ఉంటుంది అన్నాడు కావ్య తండ్రి.


అయితే మీ అమ్మగారిని నేను బాగాచుసుకోకుండానే  జరిగిందా చెప్పండి ముందు అంది. చూసుకుంటే యిప్పుడు ఉండేవాళ్ళుగా అంటూ బయటకు నడిచాడు.


కూరలు తరిగి, కుక్కర్ పొయ్యి మీద పెట్టి వచ్చి భార్య దగ్గర కూర్చొని టెంపరేచర్ చూసి బయటకు వచ్చి చూస్తే కూర ముక్కలు టేబుల్ మీదా, కోడలు తల్లితో ఫోన్ మీద ఉండటం చూసి ఒరేయ్ అబ్బాయి నీ భార్య అలా గంటలసేపు మాట్లాడుతూ వుండే బదులు కొద్దిగా వంట పని చూడచ్చు కదరా అన్నాడు శశికాంత్ 


అదేమిటి తను వంట చేస్తోంది అనుకున్నాను వుండండి అని భార్య గదిలోకి వెళ్లి వచ్చి బీరకాయ ముక్కలు తీసుకుని వంటగది లోకి వెళ్తో "కూరా పప్పా నాన్న?" అంటున్న కొడుకు చేతిలో గిన్నె లాక్కుని, చేతగాని వాడా నీకు వంట చేత కాదు నీ పని చూసుకో అన్నాడు.


అప్పుడప్పుడు వంటగదిలోకి వచ్చి అత్తగారిని ఏ కూర ఎలా వండాలో అడిగి తెలుసుకునేది కావ్య 

 పోనీలెండి మెల్లగా అమ్మాయి తనే మారుతుంది మీరు ఏమి అనకండి, అయినా నాకు ఓపిక వున్నంతవరకు నేనే వంట చేస్తాను,కోడలు కూడా చిన్న పిల్ల. యిప్పుడే బరువు నెత్తిన పెట్టడం ఎందుకు అని అంటున్న అత్తగారి మాటలు విన్న కావ్య కి మనసులో అయ్యో అత్తయ్య చేత వంట చేయించుకునే బదులు కొద్దిగా తను కూడా వీలు చూసుకుని వంటలో సహాయం చెయ్యాలి రేపటి నుంచి అనుకుంది.


బద్ధకం పడుకుని వున్న భార్య మాధవి ని లేపడం యిష్టం లేక శశికాంత్ తలుపు తీసుకుని గేటుకి తగిలించిన పాల సంచిలో పాల పాకెట్స్ కోసం చెయ్యిపెట్టి రోజూ ఈపాటికి పాలు వస్తాయి ఈ రోజు యింకా రాలేదు ఏమిటో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. ఆశ్చర్యం పొయ్యి మీద పాలు కాచిపెట్టి ఉంచిన గిన్నె, ఫిల్టర్ నిండా వేడి డికాషన్  ఉండటం చూసి ఉదయాన్నే లేచి మాధవి మళ్లీపడుకుంది కోసం అనుకుంటూ వుండగా కోడలు కావ్య ఇదిగోండి మామయ్యగారు పేపర్ మీరు అలా వెళ్లి కూర్చోండి నేను కాఫీ చేసి యిస్తాను అనటం మరీ ఆశ్చర్యం వేసింది.


వంటగదిలో చప్పుడు కి మాధవి లేచి నీకెందుకు కావ్యా కాసేపు పడుకో నేను మీ మావయ్య కి కాఫీ కలిపి యిస్తాలే అంది. అత్తయ్యగారు మీకు కూడా ఈ రోజు నేనే కాఫీ యిస్తాను మీరు మొహం కడుక్కుని రండి అన్న కోడలిని చూసి అలాగే తల్లీ, మీ మామయ్యగారికి పంచదార వెయ్యకు అంది.


కోడలిలో యింత మార్పు ఎలా వచ్చిందో అనుకుంటున్న భార్యకి చెప్పాడు శశికాంత్ నిన్న రాత్రి కావ్య వాళ్ళ నాన్నగారు కూతురు కి మీ అమ్మ మాటలు విని సంసారం చెడకోట్టుకోకు పెళ్లి అయిన తరువాత ఉద్యోగం తో పాటు సంసారం విషయం కూడా తెలివితేటలతో నడపటం లో వుంది. అత్తమామలలోనే మమ్మల్ని చూసుకోవాలి. నువ్వు నీ అత్తమ్మమాల తో ప్రేమగా వుంటే నీ భర్తకి కూడా నీమీద ప్రేమ ఎక్కువ అవుతుంది, ఈ రోజు నువ్వు ఎలా ఉంటావో రేపు నీ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు అనేది గుర్తు పెట్టుకో అని అన్నారుట  అన్నాడు.


ఈ విషయం మీకెలా తెలిసింది అంది శశికాంత్ భార్య. అబ్బాయి మెసేజ్ పెట్టాడు, మీ కోడలు మారుతుంది నాన్నా అంటూ జరిగిన విషయం వ్రాస్తో అన్నాడు.


చిన్న పిల్ల యింకా ముద్దు ముచ్చట్లు తిరలేదు, నేను వున్నానుగా మొన్నటి వరకు మీకు అబ్బాయి కి వండిన దానిని యివ్వాలా కోడలికి వండాలేనా, మీరు ఆడవాళ్ళ విషయం లో కలగచెసుకొకండి అంటున్న భార్య వంక ఆశ్చర్యం గా చూసాడు  శశికాంత్.


భర్తకి సంబందించిన అత్తమామలతో మనకేమిటి అనుకుంటే తను మిక్కిలి ప్రేమించే భర్తకి కష్టం కలిగిస్తున్నాను అని తెలుసుకునే స్త్రీ అత్తమామలను తల్లిదండ్రులు లా భావిస్తుంది. కూతురు సంసారం బాగుండాలన్నా చెడిపోవాలన్నా  ఆమె తల్లిని బట్టే ఉంటుంది.  


 తస్మాత్ జాగ్రత్త. కూతురు సంసారం లో ఏమిజరుగుతోందో  రోజూ ఫోన్ చేసే తల్లులు తమ పిల్లల సంసారంలో సమస్యలకు తామే కారణం అవుతారు.

​                         

  శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):





జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@t.s.sbhargavateja6196

•31 minutes ago

Very good story srinivas rao garu

Like
bottom of page