top of page
Original.png

జాతికి సారథులు

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #జాతికిసారథులు, #లలితకళలు

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 47

Jathiki Sarathulu- Gayathri Gari Kavithalu Part 47 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 25/11/2025

జాతికి సారథులు - గాయత్రి గారి కవితలు పార్ట్ 47 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


జాతికి సారథులు.

(వచన కవిత)

***********************

ఓ యువతీ యువకుల్లారా!ఉన్నతిని సాధించండి!

పోయిపోయి మూఢత్వములో మీరు మునిగిపోకండి!


చక్కని శాస్త్రములను శ్రద్ధగా మీరలు చదువుకోండి!

ప్రక్కవారికి సాయమందించగా పరుగుపెట్టి రారండి!


దీనజనులకు సతతము మీరు దిక్కుగా నిలబడండి!

దానధర్మములు చేసి దయతో సంఘమున మెలగండి!


స్త్రీల నెప్పుడు గౌరవించి వారికి శ్రేయమును కూర్చండి!

ఈ లోకమునందరూ కలిసి ఇంపుగా తయారు చేయండి!


జాతిలోని వివక్షతను సమూలంగా ధ్వంసము చేయండి!

నీతివంతులై నిత్యము నిష్ఠతో ధరణిపై పయనించండి!


తల్లిదండ్రులను ప్రేమించి తలవంచి బాధ్యతలను మోయండి!

కల్లాకపటము లేనట్టి బుద్ధిమంతులై కార్యములను సలపండి!


జ్ఞానవంతులై జాతికి సారథులై సమాజాన్ని దిషణతో నడపండి!

ఏ నాటికీ తరగిపోని సత్కీర్తిని పొంది ఈ శకానికాదర్శమవ్వండి!//


************************************


ree














లలిత కళలు

(వచన కవిత)

************************************


లలిత కళలు మదికి రససిద్ధి నందించు.

వెలలేని సంగతులు వీనులకు వినిపించు.


సేదతీర్చుచు చైతన్య ఝరిలోన ముంచు.

మోదమును కలిగించి బుద్ధిలో దీపించు.


జగత్తును జయించెడి విజ్ఞానము నందించు.

సుగుణాలు వర్థిల్లగ సుపథము చూపించు.


జంతుతతి నుండి విడిపోవు శక్తినే కలిగించు.

అంతమే లేనట్టి యా పరమాత్మనే చూపించు.


దిశలనే గెలవంగ  ధిషణను ప్రసాదించు.

దశదిశల వ్యాపించి సత్కీర్తిని పొలయించు.


కోరికలను తీర్చుచు గొప్పదనమును కూర్చు.

భారములు తొలగించు ప్రశాంతతను కలిగించు.


కళలు నేర్చు కొనుచు కాలమున పయనించు.

విలువైన విషయాలను నీవు పృథ్వికే బోధించు.//


ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:

నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page