కుటుంబ బాంధవ్యాలు
- Goparaju Venkata Suryanarayana
- Aug 8, 2023
- 2 min read

'Kutumba Bandhavyalu' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana
'కుటుంబ బాంధవ్యాలు' తెలుగు కథ
రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అది అమెరికాలో ఉదయం లలిత లేచి తీరిగ్గా కాఫీ కలుపుకుని సేవించే సమయం. సరిగ్గా అదే సమయం రోజూ అమ్మ జానకమ్మ గారి నుంచి ఇండియా సమాచారాలు వినటం దినచర్యగా జరిగే వ్యవహారం! కానీ అది ఆగిపోయి దాదాపు మూడు నెలలు దాటుతోంది!!
ఆ రోజు టెలిఫోన్లో అన్నయ్య రాఘవ ' హలో! లలితా! ఎప్పుడు బయల్దేరి వస్తున్నారు?' అని అడుగుతున్నాడు
నిజానికి ఆ బయల్దేరడం మూడు నెలల క్రిందటే జరగాల్సింది! పరిస్థితులు సానుకూలపడక దూరాభారం వల్ల కుదరక తండ్రి ఆఖరి చూపులకు కూడా నోచుకోలేక పోయింది తను.
ఆలోచననుంచి తేరుకుని, ' ఇప్పటికి అందరికీ కుదిరింది. వారంలో బయల్దేరి పది రోజుల్లోగా అక్కడుంటాం! ' అని
సమాచారమిచ్చింది లలిత.
తిరిగి అమ్మ ఆలోచనలలో పడింది!... చిన్నప్పుడు అమ్మ తననెలా సాకింది, అదే పద్ధతిలో తను తన కూతురినెంత గారాబంగా పెంచుతున్నది బేరీజువేసుకుని కళ్ళు చెమర్చగా ధీర్ఘంగా నిట్టూర్చి ప్రయాణ సన్నాహల్లో మునిగింది లలిత.
పది రోజుల్లో కుటుంబ సమేతంగా పుట్టిల్లు చేరుకుంది. ఇంట్లో అమ్మ పరిస్థితి అర్ధం కాని స్థితి!
ఆమె… ఎవ్వరినీ గుర్తుపట్టేలా లేదు! చిన్నప్పటి ఆటలు ఆడుతోంది! చిన్నప్పటి పాటలు పాడుతోంది! గలగలా మాట్లాడేస్తోంది! నవ్వుతోంది, నవ్విస్తోంది!! భర్త మరణం తాలూకు విషాదం కొంచెం కూడా కనపడటం లేదు!!
ఎప్పుడూ ఒక పాత బొమ్మను సముదాయిస్తూ కబుర్లాడుతూ గడుపుతోంది!!!
షాక్ నుంచి తేరుకున్న లలిత పంటి బిగువున దుఃఖాన్ని ఆపుకుంటూ ' ఏమిట్రా అన్నయ్యా! అమ్మ ఈ పరిస్థితి? '
' చూడు లలితా! నాన్న పోయినప్పటి నుంచి దిగులుతో అమ్మ మన లోకంలో లేదు! క్రమంగా ఇలా మారింది! అమ్మ చేతిలో బొమ్మను గుర్తుపట్టావా?.. అది నువ్వు చిన్నప్పుడు లాలించిన లల్లీ బొమ్మే! నాన్న గది ఖాళీ చేస్తుంటే బయట పడింది! చిన్నప్పుడు అమ్మ నీకు చేసే పనులన్నీ… జడెయ్యడం, అన్నం తినిపించటం, నిద్ర పుచ్చడం అన్నీ నువ్వు ఆ బొమ్మకు చేసి ఆడుకుంటుండేదానివి! అమ్మ చూసి మురిసి పోతుండేది!! ' అని పాత ఙ్నాపకాల్ని గుర్తు చేసాడు రాఘవ.
అమ్మ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ మాతృ ప్రేమ గుర్తులను తెరలు తెరలుగా గుర్తు చేసుకుంటూ గంటలు గడిపారా అన్నా చెల్లెలు!
సాయంత్రం జానకమ్మగారి చికిత్స కోసం వచ్చిన డాక్టరు గారిని సంప్రదిస్తే, ' మీ అమ్మగారి మెదడులోంచి దాదాపు పాతికేళ్ళ ఙ్నాపకాలు తుడిచిపెట్టుకు పోయాయి!.. మానసికంగా ఆమె పాతికేళ్ళ వయసుకు మారిపోయింది!! ' అని వివరణ ఇచ్చారు.
కొన్ని మానసిక వ్యాధుల వికల్పాలు భరించలేని కష్టాలకు బాధలకు ఉపశమన ఔషధంలా కూడా పనిచేస్తాయి!!!
***
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!
@lakshmipusuluri1993 • 7 hours ago
Excellent Annayya garu