top of page

మన జన్మభూమి


'Mana Janmabhumi - New Telugu Story Written By Ch. C. S. Sarma

'మన జన్మభూమి' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


1947 లో యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటీష్ భారతదేశాన్ని భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలుగా విభజించడాన్ని.. భారత విభజన అంటారు. ఆనాటి సువిశాల భారతదేశం నేడు భారత్ రిపబ్లిక్ గాను.. నాటి పాకిస్థాన్ నేడు ఇస్రాయల్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్.. పీపుల్స్ రిపబ్లిక్ ఆప్ బంగ్లాదేశ్ లుగా విడిపోయి వున్నాయి.


భారత పాకిస్థాన్ విభజనను గురించి, భారత్ స్వాతంత్ర్య చట్టం 1947 లో వివరించారు, అట్టూరి మరియు వాఘా..


ఇండియా మరియు పాకిస్థాన్ ప్రముఖ బోర్డర్ క్రాసింగ్ పాయింట్స్ వాఘా. పాయింట్స్ అమృతసర్ నుండి 32 కిలో మీటర్స్ దూరం, లాహోర్ నుండి 24 కిలో మీటర్ల దూరంలో వుంది.


హిమ.. మొదటి పాక్ వైపు బోర్డర్ రక్షకులు చేత.. తరువాత భారత్ బోర్డర్ రక్షకుల చేత.. తన చేతిలో వున్న సంచి తనికీ చేయబడి.. భారత్ భూభాగంలో అడుగుపెట్టాడు. అది హిమ డెభైఆరు సంవత్సరాల కల. ప్రస్తుతం అతని వయస్సు ఎనభైఆరు. జన్మించింది ఆంధ్రప్రదేశ్.. నెల్లూరు జిల్లా.. నెల్లూరు.. నేరుగా తూర్పువైపుకు మరలి నేలపై పడుకొని భారత భూమాతకు సాష్టాంగ నమస్కారం చేశాడు హిమ.


అతని ఆచర్వను బార్డర్ రక్షక టీమ్ బ్రిగడియర్ ఈశ్వర్ చూచాడు. వారిని సమీపించాడు. వారికి తన చేతిని అందించి పైకి లేపాడు. కొంచెం దూరంలో వున్న వారి రెస్ట్ టెంట్ వైపుకి హిమ చేతిని పట్టుకొని నడిచాడు ఈశ్వర్.


ఇరువురూ ఆ గుడారంలో ప్రవేశించారు.

‘‘సార్!.. కూర్చొండి!..’’ చెప్పాడు ఈశ్వర్.


హిమ వణుకుతూ మౌనంగా కూర్చున్నాడు. దీనంగా వారి ముఖంలోకి చూచాడు.

‘‘మీ పేరు?..’’ అడిగాడు ఈశ్వర్.


హిమ విరక్తిగా నవ్వాడు.. రెండు క్షణాల తర్వాత.. ‘‘హిమ!..’’ మెల్లగా చెప్పాడు. దాహం, అన్నట్ల చేతితో సౌజ్ఞ చేశారు. ఈశ్వర్ పౌచ్ నుండి వాటర్ బాటిల్ తీశాడు. గ్లాసును చేతిలోకి తీసికొన్నాడు.

‘‘ఎక్కడికి వెళ్ళాలి?..’’


తాను వెళ్ళవలసిన వూరు పేరును వివరించాడు హిమ..


‘‘మీరు పుట్టింది ఎక్కడ?..’’


‘‘ఆంధ్రప్రదేశ్ నెల్లూరు..’’


‘‘ఇప్పుడు అక్కడ మీ వాళ్ళెవరైనా వున్నారా!..’’


‘‘వుండాలి సార్!..’’ తల ఆడిస్తూ విచారంగా చెప్పాడు హిమ.


ఈశ్వర్ గ్లాసునిండా మంచి నీళ్ళను నింపి హిమకు అందించాడు. హిమ గుటగుటా ఆ నీటికి త్రాగాడు. ఖాళీగ్లాస్ లోనికి చూచాడు. ఈశ్వర్ కు వారి చూపులోని భావన అర్థం అయింది. వారి చేతిలోని గ్లాస్ ను తన చేతిలోనికి తీసికొని.. నీరు నింపి వారికి ప్రేమగా అందించారు.


హిమ.. ఆ గ్లాస్ నీటినీ పూర్తిగా త్రాగాడు.

‘‘సార్!..’’


‘‘అడగండి!..’’


‘‘ఈ నీరు ఎక్కడనుండి మీకు వస్తూ వుంది సార్!..’’


‘‘గంగామాయి!..’’ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్. "మనదేశాన్ని వదిలి మీరు వెళ్ళి ఎంతకాలం అయింది?...’’


‘‘డెభైఏడు సంవత్సరాలు!..’’


‘‘పాక్ లో మీరు ఎక్కడ వుంటున్నారు?..’’


‘‘లాహోర్...’’


‘‘ఏం పని చేసేవారు?..’’


‘‘బూట్ పాలిష్..’’


‘‘షాపు.. వుందా!...’’


‘‘చిన్నది..’’


‘‘ఇప్పుడు మీరు వచ్చేశారుగా దాన్ని ఎవరు చూచుకొంటారు?..’’


‘‘నా మిత్రులు...’’


‘‘మీకు వివాహం!..’’


‘‘కాలేదు!..’’


‘‘కారణం?..’’


‘‘నేను అక్కడ బానిసగా బ్రతుకుతున్నాను. నా సంతతి బానిసలు కాకూడదు సార్!.. ఆ కారణంగా..’’ హిమ పూర్తిచేయకముందే..

‘‘వివాహం చేసికోలేదా!..’’ ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.


‘‘అవునుసార్!..’’


‘‘మీకు ఈ మన..’’ ఈశ్వర్ అడగకముందే..

‘‘మన భారతదేశం.. నా ప్రాణసమానం!..’’ ఆవేశంగా చెప్పాడు హిమ.


‘‘ఇంత కాలంగా ఈ మన దేశానికి ఎందుకు రాలేదు?..’’


‘‘రాలేదు.. ఎన్నో కారణాలు.. రాలేకపోయాను!..’’ విచారంగా చెప్పాడు హిమ.


‘‘మరి ఇప్పుడు?..’’


‘‘ఓ మంచి మనిషి సాయంతో రాగలిగాను..’’


‘‘మరలా తిరిగి పోతారా!..’’


‘‘వచ్చిన తరువాత పనికాగానే వెళ్ళిపోవాలిగా!..’’ చిరునవ్వుతో చెప్పాడు హిమ. ఆ నవ్వున రెండు అర్థాలు.


‘‘ఇంతకు మీరు వచ్చిన పనేమిటి సార్!..’’


‘‘నా జన్మభూమిని.. నా... నావారిని స్నేహితులను చూడాలని వచ్చాను సార్!..’’ క్షణం తర్వాత.. ‘‘సార్!..’’


‘‘చెప్పండి!..’’


‘‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా!..’’


‘‘అడగండి!..’’


‘‘మన బోర్డర్ పొడవు ఎంతసార్!..’’


ఈశ్వర్ నవ్వాడు..

‘‘ఏం సార్ నవ్వుతున్నారు?.. నేను తప్పుగా అడిగానా!..’’


‘‘లేదు లేదు.. సార్.. మీ ఉత్సాహానికి నాకు ఆనందం. ఈ లైన్ ఆప్ కంట్రోల్ ఇరుదేశాల మధ్యన 1947 ఆగస్ట్ 17వ తేదీన ఏర్పడిన ఒప్పందం. దీని పొడవు 3323 కిలోమీటర్లు (2065 మైళ్ళు) ఈ లైఫ్ కంట్రోల్ కాశ్మీర్ ను ఇండియా పాకీస్థానల నుండి విడదీసింది. ఆ ప్రాంతాన బౌండరీ లైన్ నిర్మాణము మిట్ట పల్లాల కొండప్రాంతం అయినందున ప్రపంచంలో కెల్లా అతి ప్రమాదకర మైనదైనందున.. బౌండరీలైన్ (లైన్ ఆప్ కంట్రోల్) నిర్మాణము జరుగలేదు. ఆ కారణంగా ఆ ప్రాంతం సమశ్యగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ పాక్ భారత్ ల మధ్య జరిగే పోరాటలకు.. ఆ సరిహద్దు సమస్య ముఖ్య కారణం!..’’ విచారంగా చెప్పాడు ఈశ్వర్.


‘‘అవునవును సార్!.. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ధన్యవాదములు..’’

ఆనందంగా నవ్వాడు హిమ.


‘‘సార్!.. నేను డెహ్రాడూన్ వెళుతున్నాను.. మీరు నాతో వస్తారా.. అక్కడనుండి ఢిల్లీకి ట్రయిన్ లో వెళ్ళి... ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవచ్చు..’’ అడిగాడు ఈశ్వర్.


‘‘మీకు అభ్యంతరం లేకపోతే వస్తాన్ సార్!..’’


‘‘నాకు అభ్యంతరంలేదు సార్!.. మీరు చాలా పెద్దవారు మీకు సాయంచేయడం నా ధర్మం..’’ నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్..


‘‘సార్!.. ధన్యవాదాలు.. ఇదే ఈ గడ్డవాసుల ఔన్నత్యం!.." హిమ చేతులు జోడించాడు..


అరగంట తరువాత మిలిటరీ వ్యాన్ లో హిమ ఈశ్వర్ తో కలసి డెహ్రాడూన్ కు బయలు దేరారు.

‘‘సార్!..’’


తూగుతూ వున్న హిమ తొట్రుపాటుతో ఈశ్వర్ ముఖంలోకి చూచాడు.

‘‘పిలిచారా సార్!..’’ అడిగాడు హిమ.


‘‘అవును సార్!.. ప్రస్తుతం మీ వయస్సు ఎంత?..’’


విరక్తిగా నవ్వాడు హిమ, కళ్ళ అద్దాలను సవరించుకొని..

‘‘సార్!.. మీరే చెప్పండి..’’ చిరుమందహాసం..


‘‘డెభై.. డెభై అయిదు లోపు.. కరక్టా సార్!..’’ అడిగాడు ఈశ్వర్.


‘‘తప్పు సార్!..’’


‘‘మరి ఎంత?..’’


‘‘ఎనభై ఆరు సార్!..’’


‘‘మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు సార్..’’


‘‘అలాగా!..’’ విరక్తిగా నవ్వాడు హిమ. కొన్ని క్షణాల తర్వాత.. "అంతా దేవుని దయసార్!.. మనం నిమిత్తమాత్రులం. ప్రతిదీ ఆపైవాని నిర్ణయమే!..’’ ఆకాశం వైపుచూచి చేతులు జోడించాడు హిమ.


‘‘అవును మీరు అన్నది నిజం..’’ ఈశ్వర్ జవాబు.


‘‘మిలిటరీలో మీరు చేరి ఎంతకాలం అయింది సార్!..’’ అడిగాడు హిమ.


‘‘పద్నాలుగు సంవత్సరాలు. ఇరవై నాల్గవ ఏట చేరాను..’’


‘‘అయితే మీకు మన భారత్ పాకీస్థాన్ ల గత చరిత్రంతా బాగా తెలుసుగా!..’’


‘‘అవును..’’


ఆ వివరాలు నాకు చెబుతారా సార్!..’’


‘‘దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్థాన్ బంగ్లాసైన్యం, తూర్పు బంగ్లాదేశీయులను భానిసలుగా చూచేవారు. వారిపై తమ అధికారాన్ని చూపేవారు. ఆ కారణంగా బంగ్లాదేశ వాసులకు ఆవేశం పెరిగి.. బెంగాలీ జాతీయ ఉద్యమం స్వీయ గుర్తింపు ఉద్యమం ప్రారంభం అయింది. 1971 పాకీస్థాన్, బంగ్లాదేశ్ జాతినిర్మూలన చేసిన మారణహోమాలకు ఫలితంగా బంగ్లా దేశంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు, సాయుధ సంఘర్షణ ఫలితంగా బంగ్లాదేశ్ ను స్వాతంత్ర్యం లభించి ప్రత్యేక దేశంగా ఏర్పాటయింది. 1971 మార్చి 25 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా.. పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికాధికారులు ముఠా ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రారంభించడంతో యుద్ధం మొదలయింది.. జాతీయ వాదులైన బెంగాలీ పౌరులు, విద్యార్తులు, మేధావులు మతపరమైన మైనార్టీలు.. సాయుధులను (పాక్ సైన్యాన్ని) వెదకి వెదకి చంపడం ఇందులోని ముఖ్య భాగం. సైనిక ముఠా 1970 పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను రద్దుచేసి.. ఎన్నికైన ప్రధాని షేక్ ముజిబుల్ రహ్మాన్ను అరెస్టు చేశారు.


1970 ఎన్నికల ప్రతిష్టంభన తర్వాత ఎగసిన శాసన ఉల్లంఘనను అణచివేయడానికి ఉద్దేశించి.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు, వైమానికి దాడులు జరిగాయి. స్థానిక ప్రజానీకంపై చేసిన దాడుల సమయంలో సహకరించేందుకు రజకార్లు.. ఆల్.బద్ర్. ఆల్.షామ్స్ వంటి రాడికల్ మతసేనలను పాకిస్తాన్ సైన్యం.. తయారు చేసింది. పాకిస్తాన్ సైన్య సభ్యలు సహకరించే సేనలు, సామూహిక హత్యలు, బహిష్కరణ, అత్యాచారాల్లో నిమగ్నులయ్యారు... రాజధాని ఢాకాలో విశ్విద్యాలయ మారణ హోమం సహా.. అనేక మారణ హోమాలు జరిగాయి.


కోటిమంది బెంగాలీ శరణార్తులు పొరుగున వున్న మన భారతదేశంలోనికి పారిపోయివచ్చారు. వారు కాక మరో మూడు కోట్ల మంది.. అంతర్గళంగా స్థాన భ్రంశం పొందారు. బెంగాలీలకు, ఉర్దూ మాట్లాడే స్థానికేతరులకు మధ్య వర్గపరమైన హింస చెలరేగింది. అకడమీకల్ గా పాకిస్తాన్ మిలటరీ చేసిన ఆకృత్యాలు జినోసెడ్ అను ఆంశంలో విస్తృత ఆమోదం వుంది.


బెంగాలీ సైన్యం, పారామిలిటరీ, పౌరులలో ఏర్పడిన జాతీయ విముక్తి సైన్యం, ముక్తి వాహిని చిట్టగాంగ్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ప్రకటన చేసింది. ప్రతిఘటించడంలో తూర్పు బెంగాల్ రెజిమెంట్, తూర్పు బెంగాల్ రైపిల్ కీలకమైన పాత్రపోషించింది. పాకిస్తానీ సైన్యానికి వ్యతిరేకంగా జనరల్ ఎం.ఎ.జి. ఉస్మానీ, 11 సెక్టార్ల కమాండర్లు బంగ్లాదేశీ బలగాలు మాస్ గెరిల్లా యుద్ధం చేశారు. సంఘర్షణ జరిగిన తొలి నెలల్లో వారు అనేక పట్టణాలు, నగరాలను విముక్తి చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యాక, పాకిస్తానీ సైన్యం ఊపందుకొంది. పాకిస్తానీ నౌకాదళానికి వ్యతిరేకంగా బెంగాలీ గెరిల్లా.. ఆపరేషన్ జాక్పాట్ సహా విధ్వంసాలు సృష్టించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై నవజాత బంగ్లాదేశీ వైమానిక దళం వైమానిక దాడులు చేసింది. నవంబరు కాల్లా రాత్రి వేళల్లో పాకిస్తానీ సైన్యం.. బారత్ లోనే నిలిచిపోయేలా బంగ్లాదేశీ బలగాలు చేయగలిగాయి. దేశంలోని పలు ప్రాంతాలపై నియంత్రణ సాధించారు.


బంగ్లదేశ్ ప్రాదేశిక ప్రభుత్వం 1971 ఏప్రిల్ 17న ముజిబ్ నగరంలో ఏర్పడింది. తర్వాత కలకత్తాకు మారి వలస ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వం అయింది. పాకిస్తానీ ప్రజా, సైన్య, దౌత్య వర్గాల్లో ఉన్న బెంగాలీలు బంగ్లాదేశీ ప్రావేశిక ప్రభుత్వంలోకి ఫిరాయించారు. (వచ్చేశారు) పశ్చిమ పాకిస్తాన్ లోని నిర్భంధితులైన వేలాది బెంగాలీ కుటుంబాలు అక్కడ నుండి ఆప్ఘనిస్తాన్ కు తప్పించుకొన్నారు.

బెంగాలీ సాంస్కృతిక కార్యకర్తలు రహస్య స్వాధీన్ బెంగాల్ రేడియో కేంద్రం నడిపారు. యుద్ధ నిర్వాసితులైన బెంగాళీ పౌరులందు రహస్యంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలకు, సానుభూతి కారణమయ్యాయి.


ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న మన భారతదేశం బంగ్లాదేశీ జాతీయవాదులకు గణనీయమైన దౌత్య, ఆర్థిక, సైనిక సహాయాన్ని అందించింది. బంగ్లాదేశ్ ప్రజల సహాయార్థం బ్రిటీస్, భారతీయ అమెరికన్ సంగీతకారులు ప్రపంచంలో కెల్లా మొట్ట మొదటి బెనిఫిట్ కాన్సర్ట్ న్యూయార్క్ లో ఏర్పాటు చేశారు. ఆ స్థాయిలోని బెనిఫిట్ కన్సర్ట్ లలో.. ఇది మొదటిది కావడం విశేసం. పాకిస్తానీ సైనికులు చేస్తున్న హింసను ఆపివేయాలంటూ సెనేటర్టెడ్ కన్నెడీ.. ఉద్యమాల ప్రారంభించారు. పాకిస్తానీ సైనిక్ నియంత యా వ్యాఖాన్ తో నిక్సన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగి యుండడం.. యుద్ధాన్ని సమర్థిసుతండడం పట్ల తూర్పు పాకిస్తాన్ లోని అమెరికా దౌత్యవేత్తలు సంచలనాత్మకంగా.. తీవ్ర అసమ్మతి తెలిపారు. దౌత్యవేత్త అర్చర్ బ్లడ్ పంపిన టెలిగ్రామ్.. తూర్పు పాకిస్తానీలపై.. పశ్చిమ పాకిస్తానీ సైన్యం.. చేస్తున్న ఆకృత్యాలు తెలుపుతూ.. దౌత్యవేత్త నుంచి అనూహ్యమైన తీవ్ర వ్యాక్యలు.. ఎంతో సంచలనాత్మకమయింది.


1971 డిసెంబర్ 3 న పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలో ముందస్తు (మొదట) వైమానిక దాడులను ప్రారంభించడంతో భారతదేశం యుద్ధంలో అడుగుపెట్టింది. ఆపైన ప్రారంభమైన భారత్ పాక్ యుద్దాన రెండు పక్షాలు తలపడ్డాయి. తూర్పున సాధించిన వైమానిక ఆధిపత్యంతో భారత్, బంగ్లాదేశ్ మిత్రపక్షాలు ముందుకు సాగగా.. డిసెంబర్ 16, 1971 న పాకిస్తాన్ ఢాకాలో లొంగిపోయింది. యుద్ధం దక్షిణాసియాలో రాజకీయ భౌగోళిక చిత్రపటాన్ని మార్చివేసి, ప్రపంచంలో కెల్లా ఏడవ జనసమర్థమైన దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. సంక్లిష్టమైన ప్రాంతీయ కూటముల కారణంగా యుద్ధ అమెరికా, సోవియట్ యూనియన్ చైనాల్లో ఉద్రిక్తతలు రేకెత్తిస్తూ ప్రచ్చన్న యుద్ధంలో ప్రధాన ఘటం అయింది. 1972 లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో చాలా వరకు బంగ్లాదేశ్ గణతంత్రాన్ని గుర్తించారు.


భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశాల మధ్య 1973 ఆగస్లు 28న కుదిరిన ఒప్పందమే ‘‘ఢిల్లీ ఒడంబడిక’’.. దీన్ని భారత్ పాకిస్తాన్ లు మాత్రమే అంగీకరించి ధ్రువపరచాయి. బంగ్లాదేశ్ విమోచనయుధం తరువాత పట్టుబడిన యుద్ధ ఖైదీలను, అదికారులను వెనక్కు పంపించేందుకు ఈ ఒడంబడిక తోడ్పడింది. బంగ్లాదేశ్ లో ఉండిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కురుకున్న వారిని తీసుకునెందుకు పాకిస్తాన్ నిరాకరించడం 195 మంది పాకిస్తానీ యుద్ధ నేరస్థులపై విచారణ చేపట్టటాన్ని పాకిస్తాన్ అడ్డుకోవడం వంటి వాటి వల్ల ఈ ఒప్పందంపై విమర్శలు వచ్చాయి.


సిమ్లా ఒప్పందం : భారత్ పాకిస్తాన్ ల మధ్య 1972 జూన్ 2 న హిమాచలప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది. 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత సంధి కుదిరింది.


ఆ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్ నుండి వేరుపడి బంగ్లాదేశ్ గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్త యుద్ధంగా మొదలైన ఆ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో.. అది భారత్ పాకిస్తాన్ యుద్ధంగా మారింది.. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశ పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేశాయి.


తమ సబంధాలను విషమం చేస్తున్నా ఘర్షణలకు, అంతం పలకాలనే రెండు దేశాల నివ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకొని వెళ్ళడమే కాకుండా భవిష్యత్తులో ఈ సంబంధాలను నిర్దశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.


మెక్ మహాన్ రేఖ : మెక్ మహాన్ రేఖ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర సరిహద్దుగా ఉంది. ఆ ప్రాంతమే 1962 నాటి భారత చైనా మధ్యన జరిగిన యుద్ధ క్షేత్రంలో ఈశాన్య భారతదేశానికి, టిబెట్ కు మధ్యన సరిహద్దు మెక్ మహన్ రేఖ. దాన్ని 1914 లో జరిగిన సిమ్లా సమావేశంలో హెన్రీమెక్ మహాన్ ప్రతిపాదించాడు. చైనా ప్రభుత్వం అది చెల్లదంటొంది. చైనా దాన్ని చట్టబద్ధతకు వివాదాస్పదం చేసినప్పటికీ ఈ రేఖయే రెండు దేశాల సరిహద్దుగా వ్యవహారంలో ఉంది.


బ్రిటిష్ ప్రభుత్వానికి విదేశాంగ మంత్రిగాను, సిమ్లా సమావేశంలో ప్రధాన వ్యవహార్తగానూ ఉన్న హెన్రీ మెక్ మహాన్ పేరిట ఆ రేఖను పిలుస్తారు. ఆ ఒప్పందంమై మెక్ మెహాన్.. టిబెట్ ప్రభుత్వం తరఫున లాంచెస్ పాత్రా సంతకాలు చేశారు.


ఈ రేఖ పశ్చిమాన బూటాన్ నుండి 890 కి.మీ. తూర్పున బ్రహ్మపుత్రానది మలుపు నుండి 260 కి.మీ. వరకు విస్తరించి ఉంది. ఎక్కువగా ఈ రేఖ హిమాలయ శిఖరాలమీద సాగుతుంది. సిమ్లా ఒప్పందాన్ని (మెక్ మహాన్ రేఖతో సహా) భారత ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. 1907 ఆంగ్లో రష్యన్ ఒప్పందానికి ఇది వ్యతిరేకంగా వుండటం అందుకు కారణం. ఈ ఒప్పందం 1921 లో రద్దైంది. అయినా మెక్ మహాన్ కరేఖను 1935 వరకూ ఎవరూ పట్టించుకోలేదు.


1935 లో బలాఫ్ కారో అనే బ్రిటిషు సివిల్ సర్వీసు అధికారి.. మెక్ మహాన్ రేఖను అధికారక మ్యాపులపై ముద్రించేలా బ్రిటిషు ప్రబుథ్వాన్ని ఒప్పించాడు.


మెక్ మహన్ రేఖను భారత చట్టబద్ధమైన సరిహద్దుగా గుర్తించగా, చైనా మాత్రం సిమ్లా ఒప్పందాన్ని ఈ రేఖనూ కూడా గుర్తించేందుకు నిరాకరించింది. టిబెట్ సార్వ భౌమిక దేశం కాదనీ, దానికి ఒప్పందాలు కుదుర్చుకునే అధికారం లేదని చైనా వాదన. రేఖకు దక్షిణాన 65000 చ.కి.మీ. ప్రాంతాన్ని టిబెట్ స్వాధికార ప్రాంతంలో భాగంగా చైనా మ్యాపులు చూపిస్తున్నాయి. దీన్ని దక్షిణ టిబెట్ అని చైనా అంటుంది.


1962 చైనా భారత యుద్ధంలో చైనా దళాలు ఆ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు ఆక్రమించుకొన్నాయి. చైనా గుర్తించిన వాస్తవాధీన రేఖ, ఇరు దేశాల సరిహద్దు తూర్పు భాగాన మెక్ మహాన్ రేఖ అని చెప్పబడే రేఖతో దాదాపుగా కలుస్తుందని 1959 లో దౌత్య పత్రంలో జౌఎన్ లై తెలిపారు.


1959 కి ముందు 14వ తలైలామా తవాంగ్ తో సహా, దక్ష్ణ టిబెట్ భారతదేశ సర్వభౌమాధికారాన్ని గుర్తించలేదు’’ అన్నాడు. 2003 లో వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమని ఆయన చెప్పారు. అయితే 2007 జనవరిలో 1914 లో బ్రిటిషు ప్రభుత్వము, టిబెట్ ప్రభుత్వమూ రెండు కూడా మెక్ మహాన్ రేఖను గుర్తించాయని ఆయన చెప్పాడు.


2008 లో బ్రిటీషు, టిబెట్ ప్రభుత్వాల ప్రతినిధులు సంతకాలు పెట్టిన ప్పందం ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగమని ఆయన చెప్పారు.


ఆ రీతిగా మన భారతదేశం స్వతంత్ర్యం సాధించే నాటికి ఆంగ్లేయుల విభజన ప్రకారం 562 ప్రిన్స్ లీ స్టేట్స్ గా వుండినది 1956 లో 14 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరొటరీస్ గా మారింది. అంతకుముందు 1953 స్టేట్స్ రికైగ్నేషన్ కమిటి ఏర్పడింది. 2000 సం.లో 15వ తేదీన దేశంలో 28 రాష్ట్రాలుగా ఏర్పడింది. 2014 జూన్ 2వ తేదీన 29వ స్టేట్ గా తెలంగాణ ఏర్పడింది. మరియూ 8 యూనియన్ టెరొటరీస్ వున్నాయి.


స్వాతంత్ర్యం సాధించిన తరువాత ప్రజల్లో పదవీకాంక్ష కులమత తత్వాలు, బేధ భావాలు పెరిగాయి. సఖ్యత సన్నగిల్లింది. కులభావన పెరిగింది.


పగలు ప్రతీకారాలు, డబ్బుతో ఓట్లను కొనడం.. చిల్లర మందులతో అమాయక ప్రజలను ఆకట్టుకొని పోటీలో గెలవడం నాయకులకు అలవాటైపోయింది.


మంచి.. మానవత్వం.. పేదల రక్షణ.. కేవలం పెదవులు పలికే పలుకులైనాయి. స్వవర్గీయ్యులకు ఆదరణ.. కాని వాని వారికి నిరాదరణ.. ప్రబలిపోతూ వుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశ.. డబ్బుతో దేన్నైనా హస్తగతం చేసికోగలమన్న ధీమా, కొందరి నాయకుల ప్రవృత్తిగా మారిపోయింది. ఆశయ సిద్ధి ముఖ్యమై స్వపర బేధాలు నశించాయి. గెలుపు సాధనే లక్ష్యంగా మారింది..


ఎంతో ఆవేశంతో చెప్పిన ఈశ్వర్ ఆపాడు.

‘‘సార్!..’’ హిమ పిలుపు


‘‘చెప్పండి సార్ నా దీర్ఘ ప్రసంగం మిమ్ములను విసిగించిందా!.. ’’ అడిగాడు ఈశ్వర్.


‘‘లేదు సార్!.. మీ మూలంగా నేను ఎన్నో క్రొత్త నాకు తెలియని విషయాలను తెలిసికో కలిగాను. మీకు నా ధన్యవాదములు..’’ చిరునవ్వుతో చెప్పాడు హిమ.


కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడచి పోయాయి.

ఈ వృద్ధునితో నేను ఇంతసేపు అనవసరమైన ప్రసంగాన్ని సాగించానా!.. ఏమో!.. ఏదో ఆవేశం నన్ను ఆవరించింది. గతంలో చదివినవి.. కళ్ళారాచూచిన కొన్ని దృశ్యాలు నాలో ఆవేశాన్ని కలిగించాయి. అందుకే ఇంత సేపు మాట్లాడకలిగాను, విరక్తిగా నవ్వాడు ఈశ్వర్.. కొన్ని క్షణాల తర్వాత..

‘‘సార్!..’’ పిలిచాడు ఈశ్వర్.


‘‘అంత చిన్న వయస్సులో మీరు నెల్లూరు వదలి లాహోర్ కు ఎలా చేరారు?..’’

హిమ ఆ ప్రశ్నవిని విరక్తిగా నవ్వాడు.


‘‘సార్!... అంతా దైవనిర్ణయం. మా తండ్రి అమీర్ నన్ను ఖసాబ్ దుకాణంలో తను చేసే మాంసం వ్యాపారాన్ని చూచుకొంటూ వుండమనేవాడు. నాకు చదువుకోవాలని ఎంతో ఆశ. తండ్రి ఒప్పుకోలేదు. ఒకరోజున ఇరువురి మధ్యని ఘర్షణ జరిగింది. నేను ఆయన మాటలను లెక్క చేయకుండా ఎదిరించాను. ఆవేశంతో నా తండ్రి నన్ను దారుణంగా కొట్టాడు. అడ్డు వచ్చిన మా అమ్మనూ కొట్టాడు. ఆమె తల వాకిట వున్న రాయికి తగిలింది. తల పగిలింది రక్తమయం. అమ్మ.. నా అమ్మ చచ్చిపోయింది సార్!..’’ బోరున ఏడ్చాడు హిమ.


ఈశ్వర్ హృదయం ఆ సంఘటనను విని ద్రవించింది. కళ్ళల్లో నీరు.. ‘‘వారం రోజులతర్వాత అర్థరాత్రి సమయంలో ఇంటి నుండి బస్టాప్ కు వచ్చాను. పంజాబ్ లారీ డ్రైవర్ క్లీనర్ టీ త్రాగాగుతున్నారు. వారిని సమీపించాను.


‘‘నాకు ఎవరూ లేరు. మీతో వస్తాను. సాయం చేస్తారా!..’’ కన్నీటితో అడిగాను. వారు సరే అన్నారు. లారీ ఎక్కేశాను. అడిగిన వారికి క్లీనర్ అని చెప్పాడు. ఆ డ్రయివరన్నతో నాలుగురోజుల తర్వాత లాహోర్ చేరాను.


ఓ సంవత్సరం రోజులు ఆ కన్నాసింగ్ గారి లారీలల్లో క్లీనర్ గా పనిచేశాను.


నాకు ఆడ్రయివర్ల అలవాట్లు నచ్చలేదు. త్రాగడం.. అఫై.. పనులు నన్ను చేయమనేవారు. నాకు అవి గిట్టని కారణంగా బూట్ పాలిష్ పనిని లాహోరులో ఒక వేప చెట్టు క్రింద ప్రారంభించాను. కొద్ది రోజుల్లోనే చాల మంది కష్టమర్లు ఏర్పడ్డారు. జీవితం ప్రశాంతంగా సాగింది. కాలం.. చిత్రంగా గడచిపోయింది. పదిమందికి మంచి చేసి మంచి పేరు సంపాదించుకొన్నాను.


తీరిక సమయంలో మనస్సులో తల్లి.. తండ్రి జ్ఞాపకాలు.. కళ్ళల్లో నీళ్ళు. ఇలాగే జీవితం సాగిపోయింది. వృద్ధాప్యం ఆవరించింది. జన్మభూమిని చూడాలనే ఆశ.. మనసు పదేపదే నన్ను భారత్ కు ఎప్పుడు వెళతావని ప్రశ్నించేది. నిన్నటికి ఆ సమయం ఆసన్నమయింది. లాహోరును వదలి బార్డర్ కు వచ్చాను. ఈ రోజు సరిహద్దులను దాటి నా జన్మభూమిపై కాలు మోపాను. తమరు పరిచయం అయినారు. ఈ క్షణంలో నాకు మనస్సున ఎంతో ఆనందంగా వుంది సార్!.. కన్నీటితో చెప్పాడు హిమ.


‘‘కొన్ని గంటల్లో మీ చిరకాల జీవిత ఆశయం తీరబోతూవుంది సార్!..’’ నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.


‘‘సార్!.. ఒక ప్రశ్న అడగనా!..’’


‘‘అడగండి సార్!..’’


‘‘మీ తల్లిగారు ఎక్కడవున్నారు..’’


‘‘డెహరాడూన్..’’


‘‘వారి వయస్సు..’’


‘‘యాభై ఆరు..’’


‘‘తమరి వయస్సు?..’’


‘‘ముఫ్పై ఎనిమిది..’’ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.


‘‘సార్!..’’


‘‘చెప్పండి..’’


‘‘మీకు వివాహం అయిందా సార్?..’’


‘‘లేదు..’’ విరక్తిగా నవ్వాడు ఈశ్వర్.


మీలాంటి వారు తప్పక వివాహం చేసికోవాలిసార్. నలుగురైదుగురు పిల్లలను కని, వారిని పద్ధతిగాపెంచి పెద్దచేసి.. మన భరత మాత సేవకులుగా.. మీలా తయారుచేయాలి సార్!..’’ చిరునవ్వుతో చెప్పాడు హిమ.


‘‘సార్!.. పాశ్చాత్యవిద్య, ఆధునిక కంప్యూటర్స్ సెల్స్ కారణాలుగా నేటి యువతులకు ఎంతో స్వాతంత్ర్యం లభించింది. ప్రేమ పేరుతో కులమతాలను పుట్టి పెరిగిన స్థలాన్ని.. తాత తండ్రుల ఖ్యాతిని గౌరవాన్ని, మరచిపోతున్నారు. పెద్దలకు లెక్క చేయకుండా ఆడంబరజీవితాన్ని వూహించుకొంటూ ప్రేమ వివాహాలు చేసికొంటున్నారు. సంవత్సరం పూర్తి కాకమునుపే అభిప్రాయ బేదాలు వలన.. విడాకులు తీసికొని విడిపోతున్నారు. వివాహ వ్యవస్థ కొందరి విషయంలో సంకఠతను సంతరించుకొంది. నేనూ.. ఒక యువతిని డాక్టర్ను ప్రేమించాను. పెండ్లి చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. కానీ.. సంవత్సరం రోజులు మా ప్రేమను తాను మరచి మరో వ్యక్తిని పెండ్లి చేసికొని అమెరికా వెళ్ళిపోయింది. హు.. ఆకారణంగా నాకు వివాహం మ్మీద ఆశక్తి నశించింది సార్. నాకు కావలసింది నా తల్లి క్షేమం ఆనందం.. నాదేశ వున్నతి.. రక్షణ. నా శేషజీవితం ఆ రెంటికీ అంకితం సార్!..’’ ఎంతో గంభీరంగా చెప్పాడు ఈశ్వర్.


హిమ కళ్ళు చమ్మగిల్లాయి. కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడచిపోయాయి.

‘హు.. సుధీర్ఘ నిట్టుర్పును విడచి హిమ..‘‘సార్!.. ఇక్కడికి డెహ్రాడూన్ ఎంత దూరం?..’’ అడిగాడు.

‘‘వచ్చేశాము సార్!.. ఇరవైనిముషాల్లో మిమ్ముల్ని రైల్వే స్టేషన్ వద్ద దింపుతాను..’’ డ్రయివర్ సలీమ్ జవాబు.


ఈశ్వర్ మదిలో తన తల్లి జ్ఞాపకాలు. తండ్రి ధీరజ్ మిలిటరీ ఆఫీసర్. కార్గిల్ యుద్ధంలో చనిపోయారు. ఆనాటినుంచి తల్లి శాంతి.. తమ తల్లి తండ్రిగా మారింది. తన ఇష్టానుసారంగా చదివించింది సైన్యంలో చేర్పించింది. తనకు తెలిసిన ప్రత్యక్షదైవం తన తల్లి శాంతి..

సలీమ్ కారును రైల్వేస్టేషన్ ముందు ఆపి తాను దిగాడు.


ఈశ్వర్ అతని చేతికి కొంత డబ్బు యిచ్చాడు. అతను బుకింగ్ ఆఫీస్ వైపుకు వెళ్ళాడు.

‘‘సార్ దిగనా!..’’


‘‘సలీమ్ మీటికెట్ ను తీసుకొస్తాడు..’’


‘‘సార్!.. మీకెందుకా శ్రమ!..’’


‘‘సార్ అది శ్రమకాదు. ధర్మం. మీలాంటి పెద్దవారు.. దేశ భక్తులు జీవితంలో తారసపడడం అన్నది.. గొప్ప విశేషం..’’ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.


సలీమ్ వచ్చాడు. చిల్లర టికెట్ ఈశ్వర్ కి ఇచాచడు. ఈశ్వర్ హిమ కారు దిగాడు. ఈశ్వర్ టిక్కెట్ ను హిమకు ఇచ్చాడు. ‘‘జాగ్రత్త సార్!..’’ అన్నాడు. కార్లో కూర్చున్నాడు. సలీమ్ కారు స్టార్ట్ చేశాడు. హిమకు బై చెప్పాడు. హిమ స్టేషన్ వైపుకు నడిచాడు.


* * *

రైలు నెల్లూరు రైల్వేస్టేషన్ లో ఆగింది. సమయం ఉదయం పదిగంటలు. పినాకిన్ ఎక్స్ ప్రెస్. హిమ రైలు దిగి, దిగన వారితో కలసి స్టేషన్ బయటికి వచ్చాడు.


చేతిలోని సంచిని క్రిందవుంచి ఒక సారి స్టేషన్ వైపు చూచాడు. డెబ్బైఏడేళ్ళ తరువాత చూస్తున్నాడు. అప్పటి తన వయస్సు పది సంవత్సరాలు.

‘ఎంతో మార్పు..’ మనస్సన ఆనందం.. దుఃఖం..


తన ఇల్లు వున్న వైపుకు నడిచాడు తన వారిని తల్లితండ్రి తలుచుకంటూ ‘ఇప్పడు ఆ స్థలంలో ఎవరున్నరారో!..’ అమ్మా బాప్ పైకి ఎల్లిపోయి వుంటారు. తన బాల్య స్నేహితుడు శివ.. ఇరువురూ ఒకే వయస్సువారు. కలిసి ఆడుకొనేవారు. పెన్నాలో మునిగేవారు. ఈతకొట్టేవారు. ‘ఇప్పుడు వున్నాడో లేదో!..


స్టేషన్ కు పడమటి వైపున వున్న తన ఇంటి ప్రాంతానికి వచ్చాడు. మట్టిరోడ్డు వెడల్పుగా సీమెంట్ రోడ్ గా మారివుంది.


పూరిగుడిశ.. నాడు తన ఇల్లు.. తండ్రి ఖసాబ్ పనే కాకుండా ఎద్దులకు, గుఱ్ఱాలకు నాడాలు కొట్టేవాడు. ఛమ్ కీ టోపీలు తయారు చేసేవాడు. టోపీల తయారీలో అమ్మ బాప్ కు సాయం చేసేది.

నేడు.. ఆ గుడిశ స్థానంలో రెండు అంతస్థుల మిద్దె. దిగాలు పడి తేరిపార చూచాడు. ఆ ఇంటికి కుడివైపున పెద్ద వేప చెట్టు.. దాని మీద ఎన్నో పక్షులు.. ఆ చెట్టు నాటి తను నాటిన చిన్న మొక్క.. బాగా ఏపుగా చాలా పెద్దదిగా ఎదిగింది.

చెట్టుక్రింద ఒక టీ బంకు..


హిమ మెల్లగా ఆ బంకును సమీపించాడు.

‘‘ఏం తాతా!.. టీ కావాలా!..’’


అయోమయస్థితిలో వున్న హిమ అవునన్నట్లు యాంత్రికంగా తల ఆడించాడు.


టీ షాప్ బాయ్.. రత్నం. టీ తయారు చేసి హిమకు సమీపించి చేతికి అందించాడు.

‘‘బాబూ!..’’


‘‘ఏం తాతా!..’’


‘‘ఇక్కడ ఖసాబ్ పఠాన్ వుండేవాడు కదూ.. ఆ స్థలం వారిదేగా!..’’ మెల్లగా అడిగాడు హిమ.


‘‘తాతా!.. మా నాయన చెబుతుండేవాడు అది పఠాన్ స్థలం అని. పఠాన్ ఆయన భార్యా చచ్చిపోయి ఇరవై ఏళ్ళయింది. చాలా సంవత్సరాలు ఆ పూరి ఇల్లు కూళిపోయి పిచ్చి చెట్లతో అడవిలా వుండేది. పదేళ్ళ క్రిందట కోమటివాళ్ళు కొనుక్కొని ఆ ఇల్లు కట్టారు..’’ చెప్పాడు టీబాయ్ రత్నం.


‘‘బాబూ!.. నీ పేరు?...’’


‘‘తాళ్ళూరి రత్నం తాత...’’


‘‘నీకు శివశర్మ తెలుసు నా బాబూ!..’’


‘‘ఎవరూ?..’’


‘‘శివశర్మ!..’’


‘‘ఓ ఆ అయ్యేరా!..’’


‘‘అవును..’’


"తెలుసు. ఆయనకు ఇప్పుడు నీ వయస్సే వుంటుంది.."


తల ఆడిస్తూ..

‘‘ఇల్లు ఎక్కడ బాబూ!..’’


‘‘దగ్గర్లోనే రంగనాయకుల స్వమి ఆలయానికి దక్షిణపు ప్రక్కన. చూపించనా!..’’


‘‘బాబు బాబు ఆ సాయం చేయిబాబు!.. నీకు పుణ్యం వుంటింది..’’


‘‘సరే తాతా రా!..’’


‘‘హిమ.. బాబూ టీ ఎంత?..’’


‘‘తాతా!.. డబ్బులొద్దు. మీరు నాతో రండి..’’ రత్నం హిమ చేతిని తన చేతిలోనికి తీసికొన్నాడు.


ఇరువురూ ముందుకు నడిచారు. పదినిముషాల్లో శివశర్మ ఇంటికి సమీపించారు.

‘‘తాతా ఇదే మీ దోస్తు ఇల్లు!.. శివతాతా.. శివతాతా!..’’ బిగ్గరగా పిలిచాడు రత్నం.

మూసియున్న తలుపును శివ తెరిచాడు. ఎదురుగా వాకిట వున్న హిమను రత్నాన్ని చూచాడు.

‘‘ఏరా రత్నం ఇలా వచ్చావ్?..’’ అడిగాడు శివశర్మ.


‘‘శివ తాతా!.. నా ప్రక్కన వున్నది ఎవరో చూడు..’’ నవ్వుతూ చెప్పాడు రత్నం.


శివ మెల్లగా వారిని సమీపించాడు. హిమను పరీక్షగా చూచాడు.

‘‘శివా!..’’ ఎంతో ప్రీతిగా కన్నీటితో పలకరించాడు హిమ.


శివశర్మ.. హిమను కళ్ళ అద్దాలను సరిచేసికొంటూ పరీక్షగా చూచాడు.

‘‘శివా!.. నేనురా!.. నీ హిమను..’’ ఆనంద పారవశ్యంతో గద్గద స్వరంతో పలికాడు హిమ.


శివ.. ‘‘ఒరేయ్ హిమా!.. నీవా!.. ఇంతకాలం ఎక్కడవున్నావురా?..’’ ప్రీతిగా హిమ చేతులను తన చేతుల్లోకి తీసికొన్నాడు.


హిమ.. శివశర్మకు కౌగలించుకొన్నాడు.

ఇరువురి హృదయాల్లో అంతులేని ఆనందం.. పరవశం..


‘‘తాతా నే వెళతా!..’’ వారికి చెప్పి రత్నం వెళ్ళిపోయాడు.


‘‘మిత్రమా శివా!.. ఎలా వున్నావు రా!..’’ గద్గద స్వరంతో ఆడిగాడు హిమ.


‘‘ఆ పరమేవ్వరుని కటాక్షంతో నేను బాగానే వున్నారా!.. రా.. రా!..’’ స్నేహితుని చేతిని తన చేతిలోనికి తీసికొని ఇంట్లోకి నడిచాడు. శివ అర్థాంగి పార్వతి వారికి ఎదురయింది.


‘‘పారూ!.. నేను అప్పుడప్పుడూ చెబుతూంటానే నా బాల్యమిత్రుడు హిమ.. వాడువీడే.. దాదాపు డెబ్భైసంవత్సరాల తర్వాత నన్ను చూడాలని వచ్చాడు..’’ పరమానందంగా చప్పాడు శివశర్మ.

పార్వతి హిమకు నమస్కరించింది.


‘‘తల్లీ!.. నమస్సుమాంజలి..’’ సంతోషంతో చేతులు జోడించాడు హిమ.

ఇరువురు మిత్రులు ప్రక్కప్రక్క సోఫాలో కూర్చున్నారు.


పార్వతిలోనికి వెళ్ళి పెద్దగ్లాస్ నిండి మజ్జిగను తెచ్చి హిమకు అందించింది. తన భర్తకు మరోగ్లాసు అందించింది.


మజ్జిగ త్రాగుతూ.. శివ అడగగా.. హిమ తన గత చరిత్రను శివకు చెప్పాడు.


ఇరువురి నయనాలు ఆశ్రుధారలను వర్షించాయి.


‘‘రేయ్ శివా!..’’


‘‘ఏందిరా!..’’


‘‘మన వామనాచారి ఎలా వున్నాడు?..’’ అడిగాడు హిమ.


శివ నిట్టూర్చాడు విచారంగా..

‘‘హిమా!.. వాడు వెళ్లిపోయి ఐదు సంవత్సరాలు అయింది. వాడి కొడుకు నారాయణాచారి ఇప్పుడు మన రంగనాయకుల స్వామి దేవాలయం ప్రధానార్చకుడు..’’



‘‘శివా!..’’


‘‘ఏమిటి హిమా!..’’


‘‘అమ్మా నాన్నల గోరీలను చూడాలని వుంది. నీకు తెలుసా!..’’


‘‘ఆ.. తెలుసురా !..’’


‘‘అక్కడికి వెళదామా!..’’


‘‘వెళదాం పద. రెండు పూలమాలలు కొందాం..’’


ఆలయం ముందున్న పూల అంగడిలో రెండు పూల మాలలను కొన్నాడు శివశర్మ.

మిత్రులిరువురూ ముస్లిమ్ స్మశానానికి చేరారు. వారికి ముజావిర్ సలీమ్ కనుపించాడు. అతను హిమ తల్లితండ్రుల గోరీలను చూపించాడు.


హిమ కన్నీటితో పూల మాలలను తల్లి తండ్రి గోరీలకు సమర్పించాడు. బోరున ఏడ్చాడు.


స్నేహితుడు శివ హిమను హృదయానికి హత్తుకొని ఓదార్చాడు. ఇరువురూ ఆ ప్రాంతాన్నించి పెన్నానదికి వచ్చారు. వారు కలసి కబాడీ ఆడిన స్థలాన్ని.. నదీనీట మునిగి ఈతనేర్చుకొన్న ప్రదేశాన్ని చూచి బాల్య అనుభవాలను.. ఆ ఆనందాన్ని గుర్తుచేసికొన్నారు.


హిమ మరోసారి పెన్నాలో స్థానం చేశాడు. ఇరువురు మిత్రులు శివ ఇంటికి వచ్చారు.

శివ.. పఠాన్ మరణాన్ని గురించి.. హిమ తల్లి నిర్యాణాన్ని గురించి హిమకు తెలిపాడు. వారి ఇళ్ళ స్థలాన్ని హిమ మామ ఖాసిం, హిమ తండ్రి మరణానంతరం తల్లిని మోసగించి వ్రాయించుకొని స్థలాన్ని అమ్మిన వివరాలను హిమకు తెలిపాడు శివ.


ఆ రాత్రి శివ సతీమని పార్వతి.. ఇరువురు మిత్రులు ప్రక్కప్రక్కన కూర్చొనగా.. తాను వండిన వాటిని కొసరి కొసరి వడ్డించి, హిమ ఆనందంగా కడుపు నిండా తినేలా చేసింది.


వరండాలో శివ ప్రక్కప్రక్కన రెండు మంచాలు వేసి పడకలను అమర్చాడు.


చాలా పొద్దుపోయేదాకా మిత్రులిరువురూ వారి బాల్యాన్ని గురించి ఆనందంగా చర్చించుకొన్నారు, నిద్రించారు.


ఉదయం ఐదుగంటలకు శివశర్మ మేల్కొన్నాడు. హిమ మంచం వైపు చూచాడు. హిమగాఢనిద్రలో వున్నాడు.


‘‘హిమా!..’’ పిలిచాడు శివ.


జవాబు లేదు. హిమ మల్కొని లేడు.

‘‘హిమా!..’’ గట్టగా పిలిచాడు శివ.


హిమలో కదలికలేదు శరీరాన్ని తాకాడు శివ. చల్లగా వుంది.

హిమ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు. అతని ముఖంలో ఎంతో ప్రశాంతత.

హిమ శరీరాన్ని రెండు మూడు సార్లు శివశర్మ తాకిచూచాడు.

శివశర్మకు విషయం అర్థం అయింది. హిమ తన చివరికోరికను సాధించాడు. శాశ్వత నిద్రలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు.


శివశర్మ.. కొడుకు రఘునందనశర్మను పిలిచాడు. ముజావిర్ సలీమ్ ను పిలుచుకురమ్మని చెప్పాడు. రఘునంద మజ్జీద్ వైపుకు వెళ్ళాడు. ముజావిర్ సలీమ్ వచ్చాడు.


ముస్లిమ్ ఆచారం ప్రకారం.. హిమ శరీరాన్ని ఖబరస్తాన్ కు తరలించారు.


శివవర్మ ప్రియమిత్రుని పూల పల్లకిని మోశాడు. తల్లి తండ్రి ప్రక్కన హిమ గోరి వెలసింది.


శివ అశ్రుతర్పణంతో హితుడు హిమకు నివాళులర్పించాడు.


* * *

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.



76 views0 comments

Comments


bottom of page