top of page
Original.png

రా నేస్తం

Updated: Feb 4

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #RaNestham, #రానేస్తం

ree

Ra Nestham - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 27/01/2025

రా నేస్తంతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


నేస్తం

ఎన్నెన్ని సాయంత్రాలు 

నువ్వూ నేను

ఇక్కడ గడిపాం నేస్తం

ఈ గడ్డిపూలనడుగు

మన ఊసులు బాసలు 

కథలుగా చెప్తాయి

మనం కల్సి నడిచిన ఈ బాటలో

ప్రతి ఇసుక రేణువు 

నీ పాదాల మెత్తదనం చెపుతూ 

కవిత్వం రాస్తాయి

మనం కూర్చున్న ఈ పార్కు బెంచి 

నీ నా సాంగత్యపు వెచ్చదనం

 మళ్లీ మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది 

ఆ సాయంత్రపు నీరెండ

ఆ ఇంద్రధనస్సు

ఆ పిల్ల తెమ్మర

దూరంగా వినిపించే మురళి 


కాలం కర్కశంగా కాటు వేసినప్పుడు

నిశీధిలో నిలువెల్లా

వణికి నప్పుడు

ఒక తటిల్లతలా 

స్వాంతన ఇస్తాయి


రా నేస్తం రా

ఈ జీవన సంధ్యలో మరోమారు అక్కడ కూర్చుందాం

ఆ మధుర క్షణాలు మళ్లీ మళ్ళీ

జ్ఞప్తికి తెచ్చుకుంటూ

మరి కొన్ని రోజులు బతుకుదాం



-బులుసు రవి శర్మ 




Comments


bottom of page