'Vankaya Kura Kharidu Yabhai Velu' - New Telugu Story Written By Mohana Krishna Tata
'వంకాయ కూర ఖరీదు యాభై వేలు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కాంతం వీధి గుమ్మం దగ్గర నిల్చొని, ఎవరి కోసమో చూస్తున్నాది.
"కాంతం! ఎవరైనా వస్తున్నారా మన ఇంటికి?" అడిగాడు భర్త పేపర్ చదువుతూ..
"లేదండి! మెసేజ్ వచ్చిందండి ఉదయం. క్రెడిట్ కార్డు వస్తుందని!"
"క్రెడిట్ కార్డు అంటే అప్పు - తెలుసా? మీ పుట్టింటివారు పంపించే కట్నం కాదు"
"తెలుసులెండీ! మీకు ప్రతీది వెటకారమే!"
"వచ్చిందండీ.. కొరియర్.. కాంతం ముఖం వంద వాట్స్ బల్బ్ లాగ వెలిగిపోయింది. క్రెడిట్ కార్డు తీసుకొని దాచేసుకుంది కాంతం.
"ఏవండీ! రేపు మీ పుట్టినరోజు కదండీ! మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేయనా?"
"అప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి భర్త కళ్యాణ్ కు. అలాగే చెయ్యవే! గుత్తి వంకాయ లో ఉల్లిపాయలు సన్నగా తరిగి, కొత్తిమీర కారం దట్టించి చెయ్యవే కాంతం. నా బర్త్డే స్పెషల్ గా ఉంటుంది"
మర్నాడు ఉదయం..
"ఏవండీ! నన్ను సూపర్ మార్కెట్ లో డ్రాప్ చేయండి. మీ ఆఫీస్ కు వెళ్ళే దారిలోనే కదా"
"ఏం కొంటావ్ ఏమిటి?"
"మంచి తాజా వంకాయలండి"
కాంతం సూపర్ మార్కెట్ లోకి వెళ్ళింది. కళ్యాణ్ డ్రాప్ చేసిన తర్వాత ఆఫీస్ కు వెళ్ళాడు.
వంకాయలు ఎంచుతుంది కాంతం. ఈలోపు వెనుకనుంచి..
"కాంతం! ఎలా ఉన్నావ్?"
"సంగీత! ఎలా ఉన్నవే?"
"బానే ఉన్నానే కాంతం"
"నీ షాపింగ్ అయ్యాక, మనం ఎదురుగా రెస్టారెంట్ కు వెళదాం"
"అలాగే" అంది కాంతం
"కాంతం వంకాయలు తీసుకుంది. తన ఫ్రెండ్ వెంటనే పిలిచింది. ఇద్దరు రెస్టారెంట్ వెళ్లారు. ఫ్రెండ్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది కాంతం. సంగీత మెను కార్డు తీస్కొని, చక చకా పది ఐటమ్స్ ఆర్డర్ చేసింది.
" బ్రేక్ ఫాస్ట్ చేయలేదే కాంతం! బాగా ఆకలి వేస్తోంది. నువ్వూ.. ఏమైనా తీస్కో. "
"నాకు ఒక కాఫీ చాలు"
"కాంతం! నీ కొత్త సంసారం ఎలాగుందే? మీ అయన బాగా చూసుకుంటున్నాడా? "
మా ఆయనకేమీ బంగారం! బాగా చూసుకుంటున్నాడు. ఏమీ అడగరు పాపం. వారానికి రెండు సార్లు వంకాయ కూర, అప్పుడప్పుడు పూరి చేస్తే అయన హ్యాపీ. రాత్రి కాళ్లు పట్టి, సుఖపెడితే చాలు.
"సంతోషమే కాంతం"
ఈలోపు వెయిటర్ బిల్ తీస్కోచ్చాడు. కాంతం బిల్ చూసింది. 4000/- అయ్యింది.
"నేను అంత డబ్బులు తెలీదే! నువ్వు ఏమైనా తెచ్చావా?" అంది సంగీత
కాంతం బ్యాగ్ చూస్తున్నప్పుడు కార్డు కింద పడింది.
"నీకు క్రెడిట్ కార్డు ఉంది కదా! బిల్ పే చెయ్యవే" అంది సంగీత
"తప్పక కాంతం కార్డు ఇచ్చింది. కార్డు బోణి కొట్టింది.
"నేను ఇక వెళ్తానే సంగీత. లేట్ అయ్యింది"
ఇద్దరు బయటకు వస్తుంటే, మరో ఫ్రెండ్ జ్యోతి ఎదురుపడింది.
"ఇద్దరి ఫ్రెండ్స్ ను చూసి జ్యోతి.. ఇక్కడే ఉన్నారా? నా పెళ్ళి కుదిరిందే, షాపింగ్ కి వెళ్ళాలి. కాంతం! నువ్వు చీరలు బాగా కడతావు కదా.. నీ సారీస్ బాగుంటాయి.. రావే నాతో..
సంగీత! నువ్వూ రావే సరదాగా.. "
"కంగ్రాట్స్ జ్యోతి" అన్నారు ఇద్దరు.
తప్పక వెళ్ళింది కాంతం షాపింగ్ కి.. అతి పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లారు.
ఫస్ట్ చీరలు చూద్దాము ఫ్రెండ్స్! అంది జ్యోతి. జ్యోతి ఒక 300 చీరలు చూసింది. చీరలు చూపించే అతను అలసిపోయి ఇప్పటికే లీటర్ జ్యూస్ తప్పించుకొని తాగాల్సి వచ్చింది.
మాకూ, జ్యూస్ తెప్పించు బాబు! మా జ్యోతి బాగా అలసిపోయింది!
చివరకు రెండు చీరలు తీస్కుంది జ్యోతి. ఏమిటో కాంతం! కలర్ బాగుంటే, డిజైన్ బాగోదు. రెండూ బాగుంటే, బోర్డర్ బాగుండదు!
హమ్మయ్య.. !!! అని ఊపిరి పీల్చుకున్నాడు షాప్ వాడు. ఇలాంటి, కస్టమర్స్ రోజుకు నలుగురు వస్తే, నేను హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సిందే!
"కాంతం! నువ్వు కూడా తీసుకోవే రెండు చీరలు"
"ఇప్పుడేందుకే జ్యోతి.. తీసుకోవచ్చనుకో.. కానీ.. "
"తీసుకోవే.. ఈ రెండు చీరలు నీకు బాగుంటాయి.. నచ్చాయా?. "
"బాగున్నాయి!" మొహమాటం కొద్ది తీసుకుంది నచ్చిన 2 చీరలు.
"నీ బిల్ నువ్వే పే చేసుకోవాలే మరి. నాకు అంత బడ్జెట్ లేదు!" అంది జ్యోతి.
కార్డు మళ్ళీ స్వైప్ చేసింది కాంతం..
ఇప్పుడు నగలు సెక్షన్ కు పదండి ఫ్రెండ్స్!
నగలు వాడు ఆల్రెడీ జ్యూస్ తాగి రెడీ గా ఉన్నాడు. డిజైన్డ్ నగలన్నీ, ఒక్కొకటి గా తీయించి, ట్రై చేస్తుంది జ్యోతి.
అది బాగుంది.. చూపించండి.. ఇది ఇంకా బాగుంది..
ఈ డిజైన్ ఎలా ఉందే కాంతం?..
ఆ నెక్లెస్ చూపించండి.. ఆ పైన నెక్లెస్ చూపించండి.. అన్నిటికన్నా పైన ఆ హారం కూడా చూపించండి..
తెగ హడావిడి చేసింది.. జ్యోతి.
ఒక నెక్లెస్ మాత్రం, కాంతానికి బాగా నచ్చేసింది..
"తీసుకోవే.. అయితే.. అంది జ్యోతి"
కాంతం.. బ్యాగ్ లో క్రెడిట్ కార్డు.. నేను ఉన్నాను కదా!.. గో ఎహెడ్ అంటోంది..
కార్డు స్వైప్ చేసిన మెసేజ్ 30000 వచ్చింది.
ముగ్గురూ కలిసి షాపింగ్ బ్యాగ్స్ తో బయటకు వచ్చారు..
కాంతం.. ఇంటికి బయల్దేరింది..
అయ్యో! వంకాయ కూర కు కావాల్సిన పోపు సామాన్లు నిండుకున్నాయి.. మర్చిపోయానని.. మళ్ళీ సూపర్ మార్కెట్ కు వెళ్ళింది కాంతం.
పోపు సామాన్లు పాకెట్స్ ట్రాలీ లో వేసింది.. ఈలోపు పక్కన డిస్కౌంట్స్ బోర్డు చూసింది..
50 శాతం డిస్కౌంట్ సేల్..
ఇంట్లో ఉన్నవి, లేనివి, అవసరం లేనివి.. అన్నీ ట్రాలీ లో వేసేసింది..
క్రెడిట్ కార్డు మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లోంచి.. ఎప్పుడు బయటకు వద్దామా.. అని చూస్తోంది..
"ఎంత బాబు అయ్యింది?"
"10000/- మేడం"
కాంతం కార్డు స్వైప్ చేసింది..
టైం చూస్తే సాయంత్రం 5 అయ్యింది..
అన్నీ మోసుకొని, ఇంటి దారి పట్టింది కాంతం..
ఇంటి దగ్గర, వెయిట్ చేస్తున్నాడు కళ్యాణ్..
"ఎంత సేపు అయిందండి వచ్చి? ఫోన్ చెయ్యచ్చు కదండీ!" అని ఫోన్ చూసింది.. 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయ్..
"అయ్యో!.. ఫోన్ చూసుకోలేదండీ! అంటూ తలుపు తాళం తీసింది కాంతం"
"ఇంత లేట్ అయ్యిందేమిటి కాంతం?" అడిగాడు కళ్యాణ్
జరిగిందంతా.. చెప్పింది కాంతం.
అయితే.. నా వంకాయ కూర ఖరీదు 50 వేలు.. అని తల పట్టుకున్నాడు కళ్యాణ్.
మర్నాడు ఉదయం వంకాయలు తుడుస్తూ.. "ఏవండీ! హ్యాపీ బర్త్డే.." అని భయపడుతూ చెప్పింది కాంతం.
***
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
కథ బాగుందండీ -ఇకముందు రుచుల తెరువు పోకండి-అభినందనలు