top of page

ఆడ జన్మ

Writer's picture: Pitta Govinda RaoPitta Govinda Rao


 'Ada Janma' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 24/09/2024

'ఆడ జన్మ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ జగములో అందరి కంటే హీనంగా చూసేది ఒక్క ఆడదాన్ని మాత్రమే. కానీ.. ! ఆడది లేకుండా ఎవరు బతకలేరు. స్వాతంత్ర్యం రాకముందు రోజుల్లో ఆడది వంటింటికే పరిమితం అయిందే తప్పా.. ఆడదాన్ని దుర్భుద్దితో చూసే రోజులైతే మాత్రం కాదు. ఎప్పుడైతే ఆడది బయట ప్రపంచంలోకి వచ్చి మగవారితో సమానంగా పోటీ పడిందో అప్పటి నుంచి ఆడదాని పై మగవాళ్ళ దుష్టి మరో రకంగా మారిపోయింది. అవి ఈరోజుల్లోనే జరుగుతున్నాయి. 


ఇంత జరుగుతున్నా.. చివరకు ఆడది పుడితే ఏడ్చేవాళ్ళు, మగబిడ్డ పుడితే నవ్వేవాళ్ళు కోకొల్లలు. ఆడపిల్ల పుడితే వీరికి ఎంత కాలుతుందంటే ఒక ఆవు మగ పెయ్యికి జన్మనిచ్చినపుడు ఎంత దుఃఖంతో ఉంటారో అంతగా. 


రాళ్ళ బెలగాం గ్రామంలో కూడా ఇదే తంతు. అయితే ఆ ఊరిలో పుట్టిన వారిలో సగం కంటే ఎక్కువ మంది పిల్లలు మగపిల్లలే. పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న ఆ ఊరిలో శంకుమయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఊరిలో తెలివైన వ్యక్తి మరియు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఏకైక వ్యక్తి అతనే. అయినా పేదరికం అంటారా.. ఓ మున్సిపల్ కార్యాలయానికి వాచ్మెన్ అతడు. నిజాయితీ కలిగిన వ్యక్తి. అతడి భార్య ప్రసవ దినాలు దగ్గర పడుతున్న కొద్దీ ఊరిలో అందరూ మగ బిడ్డే అని ఒక అంచనకు వచ్చేశారు. 

అంతేనా.. ! శంకుమయ్యకు కూడా మగబిడ్డ పుడుతున్నాడు. అతడు కష్టాలు, పేదరికాన్ని జయిస్తాడని కూడా మాట్లాడుకోసాగారు. శంకుమయ్యకు మాత్రం అలాంటి ఆలోచనలు ఏవీ లేవు. ఎవరైనా ఒక్కటే అనే ధోరణి అతడిది. 


చివరకు శంకుమయ్య భార్య జనాల ఊహలు, అంచనలను తలకిందులు చేసి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే! శంకుమయ్య ఎగిరి గంతేశాడు. తన ఇంటికి ఒక దేవత వచ్చిందని, తన కష్టాలు తీరుతాయని ఊరూరా కాలర్ ఎగురేసుకు తిరిగాడు. అవును. నిజమే కదా.. ? వందమంది మగ పిల్లలు ఉన్నా ఇంట్లో సందడి ఉండదు కానీ.. ! ఒక్క ఆడపిల్ల ఉంటే ఎంతో వెలుగులా ఉంటుంది. 


ఊరు జనాలు శంకుమయ్యను 

 "అందరూ మగపిల్లలకు జన్మనిస్తే నీ భార్య ఆడపిల్లకు జన్మనిచ్చి మన ఊరు సెంటిమెంట్ పాడు చేసింద"ని ఆడిపోసుకునేవాళ్ళు. మగ పిల్లలు అయితే వృద్ధాప్యంలో చూసుకునేవాళ్ళని. ఈ ఆడపిల్ల అత్తోరింటికి వెళ్ళటమేగాక శంకుమయ్యను మరింత పేదోడిగా మార్చిందని ఎద్దేవా చేసేవాళ్ళు. 


ఆ మాటలకు శంకుమయ్య భార్య కన్నీరు పెట్టుకునేది. శంకుమయ్య మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా కూతురు పుట్టినందుకు ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు. దివ్య పాండియన్ అని పేరు పెట్టాడు. కొన్నాళ్ళకి స్కూలుకు పంపటం మొదలెట్టాడు. ఊరి జనాల మాటలు మరింత పెరిగాయి. 

"శంకుమయ్యకు బుర్ర కూడా లేదని, ఇంత పేదరికంలో ఉండి అత్తోరింటికి వెళ్ళిపోయే ఆడపిల్లను చదివించటం అవసరమా.. ? ఆ డబ్బు పొదుపు చేస్తే వృద్ధాప్యంలో పనికొస్తుంది కదా" అనేవాళ్ళు. 


ఎవరు ఎన్ని మాటలన్నా తనకు ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టరని శంకుమయ్యకు తెలుసు. అందుకే ఆమెను బాగా చదివించాడు. మైనార్టీ పూర్తి అయ్యాక తన గతాలు, ఊరి విషయాలు, ఊరు చరిత్ర ను అన్నీంటిని తెలిపే వాడు. దివ్యకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం. అది కూడా తన సొంత పట్టణంలో సాదించాలని పట్టు. ఎందుకంటే ఈ ఊరు జనాలకు మగపిల్లలే ఇష్టం. ఆడపడుచులు వద్దు. ‘ఆడపిల్లలు అత్తారింటికి పోతారు. తల్లిదండ్రులను చూసుకోరు’ అనే భ్రమ ఉంది కాబట్టి, తానే ఆడపిల్లగా ఏదో సాధిస్తే తప్ప వీరికి బుద్ధి రాదని బలంగానే నిర్ణయించుకుంది. 


తండ్రి కష్టంతోనే కుటుంబం మొత్తం నడుస్తుండగా దివ్య, పై చదువులోకి అడుగుపెట్టింది. సంపాదన సరిపోకపోవటంతో రాత్రి వేళ రిక్షా తొక్కేవాడు శంకుమయ్య. అది చూసి ఊరి జనాలు తమ అంచనాలు నిజమయ్యాయని పకపకమని నవ్వుకోవటం మొదలెట్టారు. , కొందరు శంకుమయ్యకు ఉచిత సలహాలు ఇచ్చేవారు. 


శంకుమయ్యకు ఈ ఊరి జనాలపై ఒకే ఒక్క డౌట్.. ‘కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే ఆడదైతేనేం, మగవాడైతేనేం.. ఉద్యోగం కాదా.. ?’ అని. 


ఊరి జనాల మాటల తూటాల వలన దివ్య తన తల్లి కొంగు చాటున చదివి, తండ్రి చెమట చుక్కలతో, కడిగిన ఆణిముత్యంలా ఉద్యోగం సంపాదించింది. ఎక్కడో కాదు.. ! ఎక్కడైతే.. ఏ కార్యాలయంలో అయితే తన తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నాడో అక్కడే మున్సిపల్ కమీషనర్ గా ఉద్యోగం పొందింది. 

 

ఇన్నాళ్లు బయటవారి మాటలు భరించలేక తల్లి కొంగుచాటున చదివిన దివ్య ఇప్పుడు తన గెలుపు చప్పుడు వినిపించాలా.. లేక ఊరి జనాలకు బుద్ధి చెప్పాలా.. అని ఆలోచించింది. చివరకు రెండోదే సరైందని, లేకపోతే ఆడపిల్లను ఆడిపోసుకుంటారని అనుకుంది. 


శంకుమయ్య కూతురు ప్రభుత్వ ఉద్యోగం సాధించిందని తెలియగానే ఊరి జనాలు పూలమాలలు పట్టుకుని వచ్చారు. 

"ఎవరి కోసమండి ఆ పూలమాలలు" తెలిసే, తెలియనట్లు అడిగింది దివ్య. 


"ఇంకెవరికమ్మా.. నీకే " అన్నదో గొంతు. 


"అదేంటండి.. మొన్నటివరకు ఆడపిల్లని చదివిస్తే వృధా అని, మరింత పేదరికం వస్తుంది అని, అత్తారింటికి పోతుందని, డబ్బు కూడా దండగని, అసలు ఆడపిల్లని చదివించటమే బుర్ర లేనితనం అని మాట్లాడిన మీరే ఇప్పుడు పూలమాలలు పట్టుకురావటం విడ్డూరంగా ఉందే..? ఆడపిల్ల తల్లిదండ్రులను చూసుకోదా.. ? సరే మగపిల్లలే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారనుకుందాం. మరీ.. ! మీ కొడుకులేంటీ.. ఎక్కడో మహా నగరాల్లో ప్రయివేట్ వర్క్ చేస్తు మిమ్మల్ని ఇక్కడ వదిలేశారు? మీరు మంచం పడితే వాళ్ళు ఇక్కడ ఉండగలరా.. ? ఉంటే వారికి ఇక్కడ బతుకు ఉంటుందా.. ? పోనీ.. మిమ్మల్ని వాళ్ళ దగ్గరకు తీసుకొని పోతారా.. మీకు నమ్మకం ఉందా.. ? మీ అంతరాత్మ పై ప్రమాణం చేసి చెప్పండి. ఆడపిల్ల పుడితే బాధపడుతూ ఎద్దేవా చేసే మీరు, మీ కొడుకులకు పెళ్లి చేయటానికి మాత్రం ఆడపిల్లు కావాలి. అసలు నిజంగా బుర్రలేని వ్యక్తి నా తండ్రేనా.. ? కాదు, మీరే. ఒప్పుకుంటారా.. ? ఆడదానికి చదువు వద్దా.. మగవారినే చదివించాలనే మీ బుర్రలకు ఈ ఊరిలో ఇంతమంది మగపిల్లలు ఉండగా ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా.. ? మారండ్రా బాబు..

ఆడపిల్లని జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను, ఆడజన్మ ఎత్తిన నన్ను సూటిపోటి మాటలన్నారు. అండగా నిలిస్తే ప్రతి ఆడది ఒక అద్భుతం చేయగలదు. తొక్కబడిన చోట వేగంగా మొలకెత్తి పైకి లేచే సత్తా ఆడదాని సొంతం. గెలవక ముందు విమర్శించి గెలిచాక పూలమాలలతో వస్తే ఎవడికి కావాలి. వెళ్ళండి. వెళ్ళి మీ భార్యలు, మీ కోడళ్ళు ఆడపిల్ల పుడితే తిడతారనే భయంతో రోజులు గడుపుతున్నారు. వారిని ఓదార్చి ఎవరైనా ఒక్కటే అని చెప్పండి " ఆవేశంతో ఊగిపోయింది దివ్య. తప్పు తెలుసుకుని మౌనంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి నుండి ఊరిలోను, మెల్లమెల్లగా సమాజంలోను ఆడపిల్లపై గౌరవం పెరగసాగింది. 


*** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


50 views0 comments

Comments


bottom of page