top of page

అందరూ యోధులే..


'Andaru Yodhule' - Independence Day Wishes By ManaTeluguKathaluDotCom

'అందరూ యోధులే' - మనతెలుగుకథలు.కామ్ అందజేస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

***


అతడొక వ్యాపారి

ఇతడొక ఉద్యోగి

విద్యార్ధి ఒకడు

కార్మికుడొకడు


కానీ దేశానికి అవసరమైతే అందరూ యోధులే.

చిరునవ్వుతో ప్రాణాలు అర్పించేవారే.


రోజంతా పొలంలో గడిపే రైతులు కొందరు

ఇల్లు దాటి ఎరుగని మహిళలు కొందరు.

రాళ్లు కొట్టే వారూ మూటలు మోసేవారూ

ఉత్తప్పుడు సాత్వికులై ఉంటారు వీరు


కానీ దేశానికి అవసరమైతే అందరూ యోధులే.

చిరునవ్వుతో ప్రాణాలు అర్పించేవారే.

శ్రమ జీవి ఒకడు

భోగ లాలసుడు ఇంకొకడు.

బొద్దింకను చూసి పరుగెత్తే వాడు ఒకడు

బల్లికి జడిసేవాడు ఒకడు


కానీ దేశానికి అవసరమైతే అందరూ యోధులే.

చిరునవ్వుతో ప్రాణాలు అర్పించేవారే.

***


పాఠకులకు, రచయితలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


ఎందరో అమర వీరుల త్యాగఫలాన్ని వృధా పోనివ్వమని, మనం సైతం దేశం కోసం మనవంతు త్యాగానికి సంసిద్ధులమని ప్రతిన పూనుదాం.

***







1 Comment


sudershanap44
Aug 16, 2023

ఆచరణీయం-అభినందనీయం.

Like
bottom of page