top of page

అంజయ్య అతి తెలివి 

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #AnjayyaAthiThelivi, #అంజయ్యఅతితెలివి, #TeluguMoralStories, #నైతికకథలు


Anjayya Athi Thelivi - New Telugu Story Written By Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 13/11/2024

అంజయ్య అతి తెలివి - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రంగాపురంలో ధనవంతుడైన వెంకటపతికి సంతానం లేదు. భార్య కూడా కాలం చేసింది. దగ్గరి బంధువులు కూడా లేరు. వారసులు లేకపోవడంతో వెంకటపతి తనని చివరి రోజుల్లో ఎవరు బాగా చూసుకుంటారో వారికి తగిన పారితోషికం ఇస్తానని సన్నిహితుల వద్ద చెప్పేవారు. ఆ విషయం అలా అలా కొందరి వద్ద వ్యాపించింది. 


దాంతో అతని చుట్టూ ఉన్న పని వాళ్లు, బంధువులు అతనికి సేవలు చేసే విషయంలో పోటీ పడసాగారు. ఈ సంగతి ఆ ఊరిలోనే ఉన్న అంజయ్య అనే వ్యక్తికి తెలిసింది. అతడు పనీపాటా లేకుండా తిరిగే సోమరి. ఎలాగైనా సరే వెంకటపతి ప్రాపకం సంపాదించాలని తలచాడు అంజయ్య. అయితే అతనికి ఏ విధంగానూ వెంకటపతి వద్దకు వెళ్లే దారి కనబడలేదు. 


బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది.వెంకటపతి ప్రేమగా ఒక పిల్లిని పెంచుకుంటూ ఉన్నాడు. దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దాని పోషణ ధనవంతులు తప్ప మామూలు వారు చేయలేరు. ప్రతిరోజు దాన్ని తీసుకుని సాయంత్రం పూట వ్యాహ్యాళికి వెళ్లేవాడు వెంకటపతి. ఈ సంగతి తెలిసిన అంజయ్య సాయంత్రం పూట, వెంకటపతి పిల్లిని తీసుకుని నడకకు వెళ్లే సమయంలో, ఏదో రకంగా మాట కలిపాడు. ఆ పిల్లి ఎంతో ముచ్చటగా ఉందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు. 


అలా కొన్ని రోజులు పిల్లిని మచ్చిక చేశాడు.వెంకటపతితోనూ చనువు పెంచుకున్నాడు. అంజయ్యకు వెంకటపతి ఇంట్లో ప్రవేశం కూడా లభించింది. తాను పిల్లి కోసమే అక్కడికి వస్తున్నట్లు, ఆ పిల్లే తన ప్రపంచం అన్నట్లు అంజయ్య అక్కడి వారికి చెప్పేవాడు. తాను పారితోషికం మీద ఆశతో వచ్చినట్లు తెలియకూడదు అని దానికి వ్యతిరేకమైన కబుర్లు చెప్పేవాడు. ధనం శాశ్వతం కాదని, తుచ్ఛమైన ధనం కోసం మానవ సంబంధాలు చెడగొట్టుకోవద్దని ప్రవచనాలు చెప్పేవాడు. ప్రేమ, అభిమానాలు ముఖ్యమని చెప్పేవాడు.


 కొన్నేళ్లు గడిచిన తర్వాత వెంకటపతికి జబ్బు చేసింది. ఆ జబ్బుతోనే ఆయన చనిపోయాడు. అతని అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఊరి ప్రముఖులు సమావేశమైనారు. ఆయన బ్రతికుండగా రాసిన వీలునామాను చదివి అందులో చెప్పిన ప్రకారం అందరికీ పారితోషికాలు అందించారు. చివరగా అంజయ్య వంతు వచ్చింది. 


వీలునామా చదువుతూ వెంకటపతి అంజయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారని, అంజయ్య ఒక ఉన్నత భావాలు గల వ్యక్తి అనీ, అతనికి తుచ్ఛమైన డబ్బుతో పనిలేదనీ, అతనికి అందరిలాగా పారితోషికం ఇచ్చి అవమానించలేననీ చెబుతూ అతనికి ఇష్టమైన పిల్లిని అతనికి బహుకరిస్తున్నానని ఇక ముందు దాని బాగోగులు చూసే బాధ్యత అతనిదే అని వెంకటపతి రాశాడని చెప్పుకొచ్చారు. 


వీలునామా విన్న అంజయ్య కొయ్యబారిపోయాడు. తన అతితెలివి తన కొంప ముంచిందని మనసులోనే లబోదిబోమన్నాడు.

 ---------- 

పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:      'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                    వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                    బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

댓글 4개


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2024년 12월 02일

Veeraiah Katam

3 hours ago

good

좋아요

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2024년 11월 21일

Pula Afzal

5 hours ago

좋아요

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2024년 11월 17일

GA SQUARE CREATIONS

2 hours ago

❤❤❤

좋아요

mk kumar
mk kumar
2024년 11월 13일

Bagundi. Climax bagundi

좋아요
bottom of page