'Anukoni Athidhula Rakatho Vachhe Ibbandulu' - New Telugu Story Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 30/03/2024
'అనుకోని అతిధుల రాకతో వచ్చే ఇబ్బందులు' తెలుగు కథ
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
ఈరోజు ఆదివారం సోమవారం బంధువుల ఇంట్లో పెళ్లికివెళ్ళాలి. జుట్టుకి హెన్నా పెట్టుకుందామని త్వరగా పనిముగించి హెన్నా అప్లై చేసాను. అంతలో ఫోను రింగ్ అయినది.
''హలో ఎవరండీ ?” అన్నాను. అప్పుడు టైం ఉదయం 9 గంటలు.
'నేను కృష్ణమూర్తిని. భార్గవగారు నాకు బాగా తెలుసును. మీ కజిన్ రాధాకృష్ణ నేను కలిసి పనిచేశాం. మీకు దగ్గిర్లోకి వచ్చాం. మీ ఇంటికి అరగంటలో వస్తాను. భార్గవగారికి చెప్పి ఇంట్లోనే ఉండమనండి.. '. అని దర్జాగా చెప్పి ఫోను పెట్టేసాడు ఆయన.
ఈ విషయం మావారు వాకింగ్ నుంచి వచ్చాక చెబితే, “ఆయన అంత క్లోజ్ కాదు. వస్తాను అంటే రావద్దు అనలేము.. ఏం చేస్తాం. భరించాలి” అన్నారు అయిష్టంగానే.
హెన్నా మూడుగంటలు ఉంచుకోవాలి. అరగంటలో వస్తాను అన్నారు. ఎలా అని కొంతసేపు ఉండి హెయిర్
వాష్ చేసుకుని అతిథిమర్యాదకు అన్ని రెడీచేసాను. అరగంటలేదు, గంటలేదు, రెండుగంటల తర్వాత వచ్చారు
నలుగురు. కూతురు అల్లుడు మనవడు సహా!
వాళ్ళు వెళ్లి మేము లంచ్ చేసేసరికి మరో రెండు గంటలు గడిచింది. అంటే రోజంతా వృధా ఐపోయిన్ది.
వస్తాను అని చెప్పిన పెద్దాయనకు హైదరాబాద్ పద్ధతులు అక్కడిదూరాలు తెలియకపోవచ్చు.
కానీ తీసుకువచ్చే వారికి ఎన్నాళ్ళుగానో వుంటున్నవారికి తెలుసుకదా!
నిర్లక్ష్యం. వాళ్ళు ఎలా పొతే మనకెందుకు మనకు నాలుగు పనులు కలిసి రావాలి. కారు పెట్రోలు కలిసిరావాలి.. మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అనుకుంటారేమో. ముందురోజు ఫోను చేసి రావచ్చా? అనిఅడగరు. సమయపాలన అసలేలేదు. అయ్యో లంచ్ టైం.. షుగరు వాళ్లకి ఇబ్బంది.
టైముకి మందులు వేసుకోవాలి. తినాలి. ఎటైనా వెడతారేమో. ఇంకెవరైనా వస్తారేమో. వాళ్లకి ఇబ్బంది ఏమో.. అని ఒక పధ్ధతి అంటూలేదు. ఇలాంటివారు వస్తే చిరాకు కలుగుతోంది.
అందులో మేము ఎక్కువగా అమెరికాలో ఉండటం వలన అక్కడి పద్ధతులు అలవాటు. వాటికి భంగం కలుగుతూ ఉంటే ఎప్పుడు మళ్ళీ అమెరికా వెళ్లిపోదామా అనిపిస్తుంది.
ఇది ఒక్కటే కాదు ప్రతి అంశంలో ఇక్కడివారు ఇబ్బంది పెడుతూ వుంటారు. కాస్తంత పరిచయానికి అతిగా
కలగ చేసుకుంటారు. ఇక పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగితే ట్రీట్మెంట్ చాలా ఘోరం. పిలుస్తారు. కాని ‘వచ్చేవా ?’
అని పలకరించరు. గిఫ్ట్ ఘనముగా ఇస్తే నాసిరకం చీర పెట్టేవారు ఒకరు, ఎందుకులే అని తక్కువలో తక్కువ వేయి నూట పదహార్లు ఇస్తే పట్టుచీర పెట్టినవారు వున్నారు. ఇదో పెద్ద సమస్య.
నేను శారీస్ కట్టుకోను అని తెలిసికూడా శారీ పెడితే వృధా. అసలు మీరు ఇవ్వొద్దు. నేను ఇవ్వను అనుకుంటాను. ఫామిలీ మెంబెర్స్ కి చెప్పేను. ''నాకు మనీ ఇవ్వండి. చీరలు సార్లు వద్దు అని. ! వాళ్ళు అర్ధం చేసుకుంటారు.
ఎవరైనా చనిపోతే అందరికంటే ముందుగా నాకు చెబుతారు అసలు వాళ్లకి చెప్పకుండా.
మాకేమి సంబంధం? పదిరోజులూ అయ్యాక ఎప్పుడో చెప్పవవచ్చు. కదా! వీలుచూసుకుని వెడతాం. డెడ్ బాడీ ఉండగానే కబుర్లు చెప్పేటంత దగ్గిర బంధువులు కారు. అయినా వెళ్లే పరిస్థితి ఇంట్రెస్టు ఉండకపోవచ్చు.
ఇదో పెద్ద తలనొప్పి అయిపొయిన్ది. ఎదో ముఖ్యమైన పని ఉండచ్చు. ఇలాంటి విషాద వార్తలు తట్టుకునే
మనసు ఉండదు. అది ఆలోచించరు.
క్రితం ట్రిప్పులో అన్ని చనిపోయినవారి వార్తలు వినాల్సి వచ్చింది. ''వాళ్ళు చనిపోడం కాదుగాని మాకు పనిషమెంట్ అనిపించి ఆరు నెలలు ఉందామని వచ్చినవాళ్ళం నాలుగు నెలలకే వెళ్లిపోయాం.
ఇదండీ అతిథులతో అగచాట్లు. మీలో చాలామంది కూడా పేస్ చేసి వుంటారు. టేక్ కేర్ ఆఫ్ రెలెటివ్స్!
--ఏ. అన్నపూర్ణ
Opmerkingen