top of page
Original_edited.jpg

అర్హతలు

  • Writer: Divakarla Venkata Durga Prasad
    Divakarla Venkata Durga Prasad
  • Mar 17
  • 2 min read

#DVDPrasad, #డివిడిప్రసాద్, #అర్హతలు, #Arhathalu, #TeluguKathalu, #తెలుగుకథలు

ree

Arhathalu - New Telugu Story Written By - D V D Prasad

Published In manatelugukathalu.com On 17/03/2025

అర్హతలు - తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాలేజీ బ్యూటీ కవిత అందం కుర్రకారు గుండెల్లో గుబులెత్తిస్తోంది. ఆమెను మూగగా ఆరాధించేవాళ్ళే కాదు, వెంటపడి వేధించే వాళ్ళూ ఉన్నారు. ప్రేమలేఖలు అందించి భంగపడి, బెంగపడిన వాళ్ళూ ఉన్నారు. పని కట్టుకొని ఆమెను పలకరించి, ఆ నెపంతో పరిచయం పెంచుకోవాలని చూసేవాళ్ళూ ఉన్నారు. అయితే, కవిత ఎవర్నీ ఖాతరు చేసేదికాదు. తనకోసం ఏ రాకుమారుడో దిగివచ్చి వరిస్తాడని అమ్మెకో గట్టి నమ్మకం. 


నెలరోజులనుండీ ఆమె కరుణా కటాక్షం కోసం ఎదురుచూసే రాంబాబును అసలు పట్టించుకోలేదు. రాంబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆమెను ప్రసన్నం చేసుకొని ఆమె ప్రేమ పొందాలని చూస్తున్నాడు. 


"నిన్న ప్రేమలేఖ అందించాను.. " అంటూ సగంలో ఆగాడు రాంబాబు. 


"ఓ.. అది ప్రేమలేఖా! ఇంకా నేనేదో నా మీద కవిత రాసావనుకున్నా!" అంది కవిత తేలిగ్గా. 


"కాదు, ప్రేమలేఖే! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను. " సూటిగా, సుత్తిలేకుండా చెప్పాడు రాంబాబు. 

అతని తెగువకు, ధైర్యానికి ఆశ్చర్యపోయింది కవిత. రాంబాబు కేసి, అతను వేసుకున్న దుస్తులకేసి నిరసనగా చూసింది. "నన్ను ప్రేమించడానికి, పెళ్ళి చేసుకోవడానికి నీకేం అర్హతలున్నాయి?" అని అడిగింది. 


"ప్రేమించడానికి అర్హతలు కూడా కావాలా? ప్రేమిస్తే చాలదా? సరే! ఏమేం అర్హతలు కావాలి?" అన్నాడు. 


"నీకు కనీసం బైకు ఉందా?" అడిగింది కవిత కలువరేకులాంటి కనులు గిరగిరా తిప్పుతూ. 


"లేదు.. కానీ.. " అంటున్న రాంబాబు మాటల్ని సగంలోనే తుంచేసిందామె. 


"బైకు లేదు సరే, ఉండటానికి కనీసం టూ బెడ్ రూం ఫ్లాటైనా ఉందా?" అడిగింది విలాసంగా జడ తిప్పుతూ. 


"టూ బెడ్ రూము ఫ్లాట్ లేదు కానీ.. " అంటున్న అతన్ని అడ్డుకొని, "ఉద్యోగమేమైనా ఉందా, లేక రోడ్లు సర్వేచేస్తూ నాలాంటి వాళ్ళ దగ్గర ఫోజులు కొడుతున్నావా?" అంది. 


"ఉద్యోగం చెయ్యడంలేదు కానీ.. " అన్న రాంబాబువైపు ఆశ్చర్యంగా చూస్తూ, "మరి ఏం అర్హతలు ఉన్నాయి నన్ను పెళ్ళి చేసుకోవడానికి, డిగ్రీ అయినా పూర్తిచేసావా, అదీ లేదా?" అంది కవిత. 


"డిగ్రీ సంగతలా ఉంచు.. " అతను ఏదో చెప్పబోతూండగా, "నాకు కావలసిన అర్హతలు ఏవీ నీలో లేవు. నేను నిన్నెలా ప్రేమిస్తానని అనుకున్నాను. " వాలుచూపు విసుర్తూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయిందామె. 


తన మాటలు పూర్తిగా వినని కవిత వెళ్ళిన వైపు చూస్తూ హతాశుడై నిలబడిపోయాడు రాంబాబు. ఆ విషయమంతా తన స్నేహితురాలు కల్పనతో చెప్పి పడిపడి నవ్విందామె.

 

ఆర్నెల్ల తర్వాత కల్పన పెళ్ళి శుభలేఖ అందుకుంది. అందులో పెళ్ళికొడుకు ఫొటో, పేరూ చూసి ఆశ్చర్యపోయింది. కల్పన పెళ్ళాడబోయేది ఎవర్నో కాదు, తాను ఏ అర్హతలూ లేవని రిజెక్ట్ చేసిన రాంబాబే!


"వాడిలో ఏం చూసి పెళ్ళికి ఒప్పుకున్నావే కల్పనా! ఎర్రగాబుర్రగా ఉన్నా ఓ ఉద్యోగమూ లేదు, డిగ్రీ లేదు, ఇల్లూ వాకిలీ లేదు. " అంది విస్మయంగా. 


స్నేహితురాల్ని చూసి చిరునవ్వు నవ్వింది కల్పన. 


"రాంబాబుకి టూబెడ్ రూం ఫ్లాట్ లేదు నిజమే, కానీ ఓ పెద్ద విల్లా ఉంది. అలాగే ఉద్యోగం లేదు కానీ, వందమందికిపైగా ఉద్యోగాలిచ్చే పరిశ్రమలూ, వ్యాపారాలూ ఉన్నాయి. ఇంక డిగ్రీ విషయానికొస్తే.. రాంబాబు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంబిఏ కూడా చేసాడు. బైకు లేనిమాట కూడా వాస్తవమే కానీ, బిఎండబ్ల్యూ కారే కాదు, ఇంకా ఖరీదైన కార్లు అరడజను ఉన్నాయి, తెలుసా!" అంది కల్పన. 

అంతే! కళ్ళు తేలేసింది పాపం కవిత!


 ------


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page