top of page
Original.png

అర్పణ

#SudhavishwamAkondi, #Arpana, #అర్పణ, #సుధావిశ్వంఆకొండి, ##పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

ree

Arpana - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 17/04/2025 

అర్పణతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పూర్వం అప్పయ్యదీక్షితులు అనే ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన నిరంతరం భగవంతుని స్మరణతోనే ఉండేవారు. 


"మనసును పూర్తిగా భగవంతునికి అర్పణ చేస్తే జన్మ తరిస్తుంది. మనం ఎలా వున్నా, ఏ పని చేస్తున్నా, చివరికి బాహ్య స్పృహ లేని జ్వరానికి లోనైనా సరే, మానసిక రోగమే వచ్చినా కూడా, ఎటువంటి స్థితిలో వున్నప్పుడు అయినా మనసు భగవంతునిపై లగ్నం అయి వుండాలి. అటువంటి స్థితికి చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 


ఆ స్థితిని సాధించినప్పుడు జీవితపు చివరి క్షణంలో ఆ స్వామినే తలుస్తూ శరీరాన్ని విడిచి పెట్టి ముక్తిని పొందగలుగుతారు" అని శిష్యులకు బోధిస్తుండేవారు ఆయన.


శిష్యులకు బోధిస్తున్నా కానీ తను ఎంతవరకు సాధించానోనని ఆలోచన వచ్చింది ఆయనకు. ఒకసారి ఆయనకు తనలో ఎంతవరకు ఆ మానసిక అర్పణ భక్తి ఉందో పరీక్షించుకోవాలి అనుకున్నారు.


అందుకని తన శిష్యులను దగ్గరగా రమ్మని పిలిచి..


"శిష్యులారా! ఈ మందు తింటే మనిషికి పిచ్చి వస్తుంది. ఒక గంటసేపు ఉంటుంది పిచ్చి తీవ్రత! ఈ మందు నేను తిని ఆ గదిలోకి వెళ్తాను. మీరు తలుపు మూసి వేయండి. అక్కడే కిటికీ వద్ద కూర్చుని నేను ఏం చేస్తున్నానో చూడండి, నా మాటలు వినండి. ఏడుస్తూ తలుపు తీయమంటే తీయవద్దు! 


ఆ పిచ్చిలో నేను ఏమి మాట్లాడతానో జాగ్రత్తగా విని, అది అంతా రాయండి. ఏది మాట్లాడినా సరే! ఎటువంటి మొహమాటం పడకుండా రాయండి! ఆ తర్వాత నేను మామూలు స్థితికి వచ్చిన తరువాత, మీరు రాసింది నాకు చూపించండి! ఆ తీవ్రమైన పిచ్చిలో కూడా నాలో భగవన్నామస్మరణ వస్తుందో లేదో చూస్తాను. ఒక గంట తర్వాత ఈ మరో మందు తినిపించండి. మళ్ళీ మామూలు స్థితికి వస్తాను" అని చెప్పారు. 


సరేనన్నారు శిష్యులు.


ఆయన పిచ్చి కలిగించే మందు తిని, గదిలోకి వెళ్లారు. వెంటనే ఆయన శిష్యులు తలుపు వేసి, కిటికీ వద్ద రెడీగా కూర్చున్నారు ఆయన పలికింది వ్రాయడానికి. 


అప్పుడు దీక్షితులవారు ఆ పిచ్చిలో పరమేశ్వరుని పైన గొప్ప అద్భుతమైన స్తోత్రం చేశారు. గంట తర్వాత ఇంకో మందు తీస్కుని మామూలు స్ధితికి వచ్చారు. అంతటి మహనీయులు ఆయన. 


మనసు రోజూ ఏది గ్రహిస్తుందో ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, చివరి రోజుల్లో కూడా దాన్నే స్మరిస్తుంది.


అందుకే ఎప్పుడూ జ్ఞానేంద్రియాలతో మంచి పనులు చేస్తూ భగవన్నామస్మరణ చేస్తే మన మనసు అదే స్మరించి మనల్ని ఉద్ధరిస్తుంది. అందుకే మన పెద్దలు ఇంట్లో పనులు చేసుకునే ఆడవాళ్లు ఏవో ఒకటి భగవంతుని నామాలు పలుకుతూ పనులు చేసుకొమ్మని చెప్పారు. నలుగురు మగవాళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆ ఈశ్వరుని లీలలు చర్చించుకోమని చెప్పారు. అనవసరమైన మాటలు, గాసిప్స్ హస్కు కొట్టుకుంటూ కూర్చుంటే చివరి ఘడియల్లో అవే మనసులోకి వస్తాయి. జన్మ వ్యర్థం అవుతుంది.


ఇది చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్నాను మా తాతగారు భాగవత ప్రవచనాలు చేసేటప్పుడు చెప్పేవారట - సుధావిశ్వం


కృష్ణార్పణమస్తు


సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page