top of page

బాలానందం

Updated: Feb 22

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #Balanandam, #బాలానందం


Balanandam - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 14/02/2025

బాలానందం - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


బాలల్లారా రారండి కల్లాకపటం తెలియని మువ్వలు మీరు

మరువలేని మాటల మలయ సమీరాలు ఉన్న చోట ఉండరు


మీరున్న ఇళ్ళు దేవుని లోగిళ్ళు

పిల్లలు దేవుని ప్రతిరూపాలు

వెలిగే కన్నుల విరిసి విరియని 

పువ్వుల నవ్వులకురిసే వెన్నెలలు


కేరింతలతో కిల కిల ధ్వనుల

కోకిల పాటల కమ్మని గీతికలు

ఎదిగే వయసుల ,ఆటల పాటలతో  అలరించే   ఆనందపు అల్లరులు

   

 అమ్మా నాన్న  ఆశల దీపాలు అంతటా కాంతికి వెన్నెల పూలు

రమ్మనగానే రెక్కల పక్షుల వలె

వడిలో వాలే  చిన్నారులు


ముద్దుల మాటలతో పెద్దల మనసును దోచుకునే  బంగారు దొంగలు అల్లరి చేస్తూ అందరికీ  తారంగాల తారలు 


ఉట్టికెగిరేఉల్లాసాల ఉన్నతులు

స్వయం ప్రకాశ  తారలు

కలిసిన క్షణంలో కలహాలు

 వెన్న వంటి మనసులు


కోరికల కోసo కొట్లాటలు

క్షణంలో అల్లుకునే బంధాలు అపురూప స్వచ్ఛమైన స్నేహాలు

బడి అంటే భలే   మక్కువ 

తన పర బేధం లేక చదువులు , 


ఆటలు, పాటల

అవనికి అందం మీరే 

మృదువుగా,మురిపెంగా

నట్టింట నడయాడే

నయన జ్యోతులు మీరే మీరే


***

-యశోద గొట్టిపర్తి





תגובה אחת


Nagaraju Bhallamudi
Nagaraju Bhallamudi
15 בפבר׳

అద్భుతః

לייק
bottom of page