top of page

చెప్పాలని ఉంది!

Updated: Nov 20, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#CheppalaniUndi, #చెప్పాలనిఉంది


Cheppalani Undi - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 12/11/2024

చెప్పాలని ఉంది! -  తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మాతృభాష గొప్పతనం

మాతృమూర్తి మంచితనం

చెప్పాలని ఉంది! ఉంది!!

కన్న తండ్రి త్యాగగుణం


అన్నదాత శ్రమదానం

సైనికుల అంకితభావం

చెప్పాలని ఉంది! ఉంది!!

గురువుకున్న విజ్ఞానం


చదువుకున్న తొలి స్థానం

ఆడపిల్లల అవసరం

చెప్పాలని ఉంది! ఉంది!!

ఘనమని కలుపుగోలుతనం


పదిమందికి ఉపకారం

మనసులోని మమకారం

చెప్పాలని ఉంది! ఉంది!!

గొప్పదని సహకారం


ఖర్చులేని దరహాసం

మంచి వారి సహవాసం

చెప్పాలని ఉంది! ఉంది!!

అదే మేటి బహుమానం


సాటిలేని స్నేహ ఫలం

గొంతు తడుపు భువిని జలం

చెప్పాలని ఉంది! ఉంది!!

మహోన్నతం  కవుల కలం


-గద్వాల సోమన్న



Comments


bottom of page