top of page
Original.png

దీపావళి పండుగ

Oct 31, 2024
1 min read

Updated: Nov 10, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #దీపావళిపండుగ, #DeepavaliPanduga


'Deepavali Panduga - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 31/10/2024

'దీపావళి పండుగ' తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


బాలలకిష్టమైన

బాణసంచా వేడుక

అవనిలో అందరికి

అపురూప కానుక


అంబరాన్ని తాకే

సంబరాల జాతర

దీపావళి పండుగ

ఆనందం మెండుగ


దీపాల దొంతరలు

ఇంటింటా వెలుగులు

ఎంతో ప్రత్యేకత

ప్రసాదించు శుభములు


అజ్ఞానపు మబ్బులు

తొలగితే ప్రమోదము

మూఢనమ్మకాలే

ముదిరితే ప్రమాదము


మనశ్శాంతి ఉంటే

ప్రతిరోజూ పండుగ!

దిగులు పెట్టుకుంటే

జీవితమే దండగ!


ఘనమైన దీపావళి

బ్రతుకున శోభావళి

అసురులపై విజయము

అందరి పర్వదినము


-గద్వాల సోమన్న




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page