#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #DesaBhakthi, #దేశభక్తి

Desa Bhakthi - New Telugu Poem Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 04/02/2025
దేశ భక్తి - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
దేశ భక్తి (ఆటవెలది)
1.కీర్తి లోన మేటి మన భారతంబట
కలిసి కట్టుగ నడవాలి ఒక్క
టిగను తోడ బుట్టులుగ జాతి మతములు
భరత మాత కన్న బిడ్డ లంటు
మంచి కార్య మెoచు మరువకు జన్మము
పెంచు దేశ మనెడు పసిడి వృక్షం
సిరుల పంటల శాంతి మమతల పూలను
పంచు దేశ భక్తి పరిమళమును

అమ్మాయి
1. ఆడ పిల్ల చదువు అర్థాంతరం చేసి
పెండ్లి తోటి బరువు పొమ్మనంటు
పిన్న వయసు లో నె పెద్దరికం తోటి
బాల్య స్వేచ్ఛ లేక బతుకు భయము
2. మనిషి దేహమునకు వచ్చు దశలంట నాలుగు
మోహ భావ మాయ మనసులోన
పురుషులకు కర్మ ఫలితము జీవితం
ముసలి తనము వయసు ముక్తి పథము
***

-యశోద గొట్టిపర్తి
Commentaires