top of page

ఈశ్వరా.....

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సద్యోజాతుడైన ఈశ్వరుడిని షోడశోపచారాలతో నేను అర్చించిన మానసికపూజ -- నీరజ హరి ప్రభల. 


'Eswara' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 08/03/2024

'ఈశ్వరా' తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


ఈశ్వరా.....🙏


నిరాకారుడు, నిరహంకారుడు, త్రిగుణాతీతుడివి కనుక ఏ రూపమున నిన్ను కొలువ గలను? ఏ విధముగా నిన్ను అర్చించ గలను? 


పవిత్ర నదీజలాలతో నిన్ను ఆపాదమస్తకము అభిషేకిద్దామంటే పవిత్ర గంగనే నీ శిరస్సున ధరించితివి కదా! 


హాలాహలమును గళమున ఉంచుకుని వేడెక్కిన నిన్ను పరిమళ చందనముతో చల్లపరుద్దామంటే హిమశిఖరమే నీ ఆవాసము కదా! 


స్వర్ణమణి మాణిక్యాలతో నిన్ను పూజిద్దామంటే నాగరాజు అయిన వాసుకియే నీ కంఠాభరణము కదా !


శ్రుతి, లయలతో శ్రావ్యంగా గానం చేద్దామంటే సామగాన లోలుడివీ, ఓంకార స్వరూపుడువీ నీవే కదా! 


నాదధ్వని వినిపిద్దామంటే ఢమరుకాన్నే చేతిన పూనిన ప్రణవ నాదమునివి నీవే కదా!


వేదపారాయణము చేసి నిన్ను ఆనందింప చేద్దామంటే వేదోపాసన చేసిన దక్షిణామూర్తివి నీవే కదా !


పట్టువస్త్రములతో నిన్ను సత్కరిద్దామంటే జింక చర్మమే నీ ఆఛ్ఛాదన కదా !


నృత్య, నాట్యాలతో నిన్ను అలరిద్దామనుకుంటే నాట్యాధిపతి నటరాజ స్వరూపుడు నీవే కదా !


పంచ భక్ష్య పరమాన్నములతో తృప్తిగా నీకు నివేదన చేద్దామంటే సాక్షాత్తు అన్నపూర్ణయే నీ సతి కదా ! 


షోడసోపచారములతో నీకు సేవ చేద్దామంటే నందీశ్వరుడే నీ సేవకుడు కదా !


పుష్పాలతో అర్చించి పూలమాల వేద్దామంటే సర్పాన్నే కంఠమాలగా ధరించితివి కదా ! 


మధురమైన ఫలాలను సమర్పిద్దామంటే గరళాన్ని మ్రింగిన గరళ కంఠేశ్వరుడు నీవే కదా! 


పవిత్ర మందిరమున నిన్ను ఉంచి పూజించుదామంటే స్మశానమే నీ ఆవాసము కదా !


ఎక్కడ ఉన్నావో నీ ఉనికిని గుర్తిద్దామంటే ఆది, అంతము లేని సద్యోజాతుడివి నీవే కదా! 


ఏమిచ్చి నిన్ను సేవించుకోగలను ?

ఏ సేవలతో నిన్ను సంత్రృప్తిపరచను?

ఏ రూపమున నిన్ను పూజించను?


"ఏమున్నది? నా వద్ద - నేను, నా" అనే అహం తప్ప.


అహం వీడి, సత్యం తెలుసు కున్నాను.

నాలో జ్వలిస్తున్న జీవన జ్యోతివి నీవే.

 నాది అనబడే ఈ దేహము నాది కాదు - నీవిచ్చినదే.


దర్పము వీడి, అహంకారమును వీడి, నిర్మలమైన మనస్సును నీకు అర్పించి, అర్చించి నీలో ఏకమై, మమేకమై, శివైక్యము పొందుతాను ఈశ్వరా.!.

***


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


Video link

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





47 views0 comments

Commentaires


bottom of page