top of page

గర్వము హరించును సర్వము

Updated: Nov 10, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #GarvamuHarinchunuSarvamu, #గర్వముహరించునుసర్వము


'Garvamu Harinchunu Sarvamu - New Telugu Poem Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 29/10/2024

'గర్వము హరించును సర్వముతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


హానికరము గర్వము

చేయునోయి పతనము

చూడ నిప్పు వంటిది

వదిలినచో మంచిది


గర్విష్టుల హృదయము

ఉప్పొంగే సంద్రము

వెల్లువలా వచ్చును

పెనుముప్పు తెచ్చును


అహంకారుల స్నేహము

జీవితాన క్షామము

ఉంటేనే క్షేమము

వీలైతే దూరము


హృదయాలను గాయము

చేస్తుందోయ్! గర్వము

శృతి మించితే కనుక

కోల్పోదుము సర్వము


బుసలుగొట్టు సర్పము

అందరికీ నష్టము

మొదట అదుపు చేస్తే

సమకూరును లాభము


-గద్వాల సోమన్న




Comments


bottom of page