top of page

జలుబు కుదిరింది

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #JalubuKudirindi, #జలుబుకుదిరింది, #TeluguKathalu, #తెలుగుకథలు


Jalubu Kudirindi - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 27/12/2024

జలుబు కుదిరింది - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కుమార్ కి వారం రోజుల నుంచి జలుబు దగ్గు, తుమ్ములు. అన్నిరకాల కాషాయలు తాగినా తగ్గలేదు సరికదా తన భార్య సరిత కి కూడా అంటించాడు. 


“మీరు బాధపడేది చాలక నాకు కూడా అంటించారు. మీకేం.. ముసుగుతన్ని పడుకుంటారు. వంట చెయ్యాలిసింది నేనేగా, అయినా దగ్గే అప్పుడు నోటికి టవల్  అడ్డం పెట్టుకుని దగ్గమని చెప్పినా వినలేదు” అంటూ గొడవ. 


“చూడు.. అరగంట నుంచి మాట్లాడిన మాట మాట్లాడకుండా మాట్లాడావు, దగ్గు రానేలేదు, అంటే నీ దగ్గు అంత ప్రమాదం లేదు, నేను చూడు కామా లేకుండా దగ్గుతున్నాను” అన్నాడు.


“ఛాలెండి సరసం, ముందు సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి చూపించుకుందాం. మా చుట్టం దగ్గుని అశ్రద్ధ చేసి ‘లేటు’ గా మారిపోయాడు” అంది. 


“నీ అపశకునం మాటలు తగలడా! అసలే దగ్గుతో భయపడి వణికిపోతోవుంటే, ఆ ఉదాహరణలు ఏమిటే” అంటూ ముసుగుతన్ని పడుకున్నాడు.  


“యిప్పుడేగా లేచారు, అప్పుడే పడుకున్నారేమిటి, క్యాబ్ బుక్ చేస్తాను, యిప్పుడే హాస్పిటల్ కి వెళ్దాం” అంది.


కుమార్ కి అదే మంచిది అనిపించి, ఓపిక లేకపోయినా మొహం రెండుసారులు కడుక్కుని, పౌడర్ పట్టించి, మంచి డ్రెస్ వేసుకుని కిందకి వచ్చాడు. 


“అదేమిటి పెళ్ళికి వెళ్తున్నట్టుగా తయారయ్యారు? మనం వెళ్ళేది హాస్పిటల్ కి” అంది సరిత.  


“తెలుసు, మనం నీరసంగా వెళ్తే హాస్పిటల్ వాళ్ళు మంచి బేరం దొరికింది అనుకుని, టెస్ట్స్ మీద టెస్ట్స్ చేస్తారు, పర్సు ఖాళీ చేసి పంపుతారు, అదే హుషారుగా ఉన్నటుగా కనిపిస్తే మందులతో సరిపెడతారు” అన్నాడు.


“బాగానే వుంది మీ తెలివితేటలు. డబ్బు ఖర్చు అవుతుంది అని రోగం దాచుకుంటామా.. అసలు హాస్పిటల్ కి వెళ్ళేదే రోగం ఏమిటో తెలుసుకుని తగ్గించుకోవడానికి. పదండి.. క్యాబ్ వాడు హారన్ కొడుతున్నాడు” అంది.


మొత్తానికి ఒక అరగంట తరువాత "హాచ్ " హాస్పిటల్ కి చేరుకున్నారు. “మీ వంతు రావడానికి ఒక గంట పడుతుంది అలా కుర్చీలో కూర్చోండి, టెంపరేచర్, బీపీ చూస్తాను” అంది నర్స్.


కుర్చీలో కూర్చుని టీవీ లో వస్తున్న వార్తలు చూసి సరిత అడిగింది, ‘కొద్దిగా భక్తి టీవీ పెట్టమని చెప్పండి’ అని.  


“చావు వార్తలు చూసి మరీ భయపడి చస్తే, ఎక్కువ టెస్ట్స్ చేయించుకుంటామని హాస్పిటల్ వాళ్ళు యివే పెడ్తారు” అన్నాడు కుమార్.


నర్స్ వచ్చి ముందుగా మీ యిద్దర్లో ఎవ్వరికీ ప్రాబ్లెమ్ అని అడిగింది. యిద్దరికి అన్నాడు కుమార్. అయితే మీకు టెంపరేచర్ చూస్తాను అని నోట్లో ధర్మామీటర్ పెట్టి చూసి, వెళ్ళిపోతోవుంటే, జ్వరం వుందా లేదో చెప్పకుండా వెళ్లిపోతున్నారేమిటి సిస్టర్ అన్నాడు. మీకు చెప్పాము, డాక్టర్ గారే చెప్పాలి అంటూ వెళ్ళిపోయింది.  చూసావా జ్వరం లేదంటే మనం యింటికి వెళ్ళిపోతామని రహస్యం గా ఉంచుతున్నారు అన్నాడు భార్యతో.


అక్కడ కూర్చొని వున్నవాళ్లు చాలా మంది దగ్గు తుమ్ములతో వుండటం చూసి, మనది సాధారణ దగ్గు అయ్యి, యిక్కడకి వచ్చి ఏ టీబీ నో అంటించుకోము కదా అన్నాడు. శీతకాలం అందరికి ఈ బాధ తప్పదు, ప్రతీదానికి బయపడకండి, డాక్టర్ చెప్పే అంతవరకు  ఆగచ్చుగా అంది విసుగ్గా భార్య.


అరగంట తరువాత నర్స్ కుమార్ ని  సవిత ని డాక్టర్ దగ్గరికి పంపించింది. లోపల మెళ్ళో సత్తాస్కోప్ తో ముప్పై దాటిని డాక్టర్ కూర్చుని వున్నాడు. 


“రండి, అలా కూర్చుని మీ బాధ ఏమిటో  చెప్పండి” అన్నాడు. 

“పది రోజుల నుంచి దగ్గు, జలుబు, తనకి మూడు రోజుల నుంచి. ఒకరి తరువాత ఒకరం దగ్గుతోనే వున్నాము” అన్నాడు.


“అలాగా, సరే ఈ టెస్ట్స్ చేయించుకుని రండి”, అంటూ నాలుగు రకాల టెస్ట్స్, ఎక్సరే  రాసి, వాడాలిసిన మందులు కూడా రాసాడు.  


“అదేమిటి సార్, టెస్ట్ రిపోర్ట్స్ చూడకుండానే మందులు రాసారు” అన్నాడు. 


డాక్టర్ గారు కొద్దిగా కంగారు పడి, “రిపోర్ట్ లో ఏముంటుందో మాకు తెలుసు. అందుకే మందులు రాసాను. మీరు వెళ్లి టెస్ట్స్ చేయించుకుని రండి” అన్నాడు. 


ఉసురుమాంటో బయటకు నడిచి టెస్ట్స్ కోసం అయిదు వేలు కట్టి టెస్ట్స్ చేయించుకున్నారు దంపతులు. ఎక్సరే అతనిని ఆడిగాడు, “బాబూ ఎక్సరే ఎలావుంది” అని.


“బాగానే వుంది సార్, డాక్టర్ గారికి చూపించండి” అన్నాడు. 


ఎక్సరే తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లారు కుమార్ సరిత.

డాక్టర్ గారు ఎక్సరే ని అటు ఇటు తిప్పి, “కొద్దిగా ఇన్ఫెక్షన్ వుంది, ఈ మందులు వాడి, వారం రోజుల తరువాత రండి” అన్నాడు.  

“అదేమిటి సార్ ఎక్సరే తీసిన కుర్రాడు, ఎక్సరే బాగానే వుంది అన్నాడు” అని అడిగాడు కుమార్.   

“అయితే ఇన్ఫర్మేషన్ తీసుకునే వచ్చారన్నమాట, వాడికి ఎక్సరే తీయ్యడమే తప్పా అందులో ఏముందో మాకు తెలుసు, అయినా విచిత్రం గా మీకు డాక్టర్ మీద డౌట్ వుంటే హాస్పిటల్ కి ఎందుకు వచ్చారు” అని విసుక్కున్నాడు డాక్టర్ గారు.


“మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ చాదస్తం వదలరా, డాక్టర్ కి కోపం వస్తే దేముడి దగ్గరికి పంపుతారు జాగ్రత్త” అంది సరిత. 


“డబ్బు సంపాదించేది నేను, అయిదు వేలు లాగేసాడు, వెళ్లి మందులు కొనుక్కురా, నేను అలా కుర్చీలో కూర్చుని వుంటాను” అన్నాడు కుమార్.   


కుర్చీలో కూర్చున్న కుమార్ దగ్గుతో వుంటే, అక్కడే కూర్చుని వున్న జనం జేబుల్లో నుంచి మాస్క్లు తీసుకుని భయంతో పెట్టుకున్నారు.  మందులు తీసుకుని వచ్చి పదండి ఆటోలో వెళదాం అంది సరిత. 


యింటికి చేరుకున్న సరితా కుమార్ లు వారం రోజులు మందులు వాడినా జలుబు, దగ్గు తగ్గలేదు సరికదా, కుమార్ కి లంగ్స్ లో సౌండ్స్ రావడం తో భయపడిపోయాడు. ఎందుకైనా మంచిది హోమియో మందులు వాడితే మంచిదేమో అని అనుకుని తమ్ముడికి ఫోన్ చేసి, “అబ్బాయి, వారం రోజుల నుంచి విపరీతంగా దగ్గు, జలుబు. డాక్టర్ యిచ్చిన మందులు కూడా పనికిరాలేదు. నీకు తెలిసిన హోమియో డాక్టర్ పేరు చెప్పితే, నేను వెళ్లి చూపించుకుంటాను” అన్నాడు.


“పది రోజులనుంచి బాగుండకపోతే ఫోన్ ఎందుకు చెయ్యలేదు, డాక్టర్ మందులు వేసుకుంటే తగ్గదు, ముందు మీ దొడ్లో వున్న తమలపాకులు రెండు తీసుకుని దానిలో ఒక లవంగం, ఒక మిరియం, చిన్న అల్లం ముక్క పెట్టుకుని నములు ఉదయం, సాయంత్రం. రెండు రోజులలో తగ్గపోతుంది” అన్నాడు కుమార్ తమ్ముడు.


నిజంగానే రెండురోజులలో దగ్గు బాగా తగ్గిపోయింది. “ఈ రోజు డాక్టర్ గారు రమ్మన్నారు గుర్తుందా” అంది సరిత. 


సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కలిసారు. “చూసారా మీరు దగ్గటం లేదు, మేము మందులు వూరికే ఇవ్వమండి, పేషెంట్స్ బాగుండటమే మాకు కావలిసింది”’ అన్నాడు డాక్టర్ గారు. 


“అవునండి, దగ్గు బాగానే తగ్గింది” అంటూ జేబులో నుంచి కొన్ని తమలపాకులు తీసి బల్లమీద పెట్టి లవంగం కోసం వెతుకుంటున్న కుమార్ ని చూసి సిగ్గుపడుతో “మీరు మరీ చాదస్తం వాళ్ళు లా వున్నారు. నా ఫీజు యిలా తాంబూలంలో పెట్టి ఇవ్వక్కరలేదు” అన్నాడు డాక్టర్.


“అబ్బే ఫీజు గురించి కాదు మా వారి ఉద్దేశ్యం. ఈ తాంబూలం తో దగ్గు తగ్గింది” అని అంటూ భర్త చెయ్యి పట్టుకుని బయటకు నడిచింది సరిత.


జలుబు దగ్గుకి అల్లం, మిరియం, లవంగం తో తాంబూలం వాడండి.

జలుబు కుదురుతుంది.


శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













2 Comments


mk kumar
mk kumar
Dec 28, 2024

జలుబు కుదిరింది" అనే ఈ కథ, ఒక సాధారణ జలుబు బారిన పడిన దంపతుల జీవితంలోని హాస్య సంఘటనలను చిత్రిస్తుంది. చిన్న జబ్బును కూడా అతిశయోక్తి చేసి భయపడే మానవ స్వభావాన్ని, వైద్యులపై అపనమ్మకాన్ని, ఇంటి నివారణల ప్రాముఖ్యతను ఈ కథ చక్కగా తెలియజేస్తుంది.

Like

చాలా బాగుంది, శ్రీనివాస్ గారు.

చివరిలో మలుపు (ట్విస్ట్) ఒక మెరుపు.🌹💐👌👏👏G v Nageswara Sastry garu Engineer-in-Chief (R&B) ( Engineer in chief R&B కామెంట్ )

Like
bottom of page