#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #కాంతికిరణాలు, #KanthiKiranalu, #బాలగేయాలు, #స్వగతాలు
Kavi Somannaku Ananthapuramlo Sanmanam - New Telugu Article On Gadwala Somanna
Published In manatelugukathalu.com On 25/11/2024
కవి సోమన్నకు అనంతపురంలో సన్మానం - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త , బాలబంధు గద్వాల సోమన్న రచించిన "స్వగతాలు" మరియు "కాంతి కిరణాలు" రెండు పుస్తకాలు అనంతపురం శాసన సభ్యులు గౌ.శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సాహితీమిత్రులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారల చేతుల మీద లేపాక్షి ఫౌండేషన్, అనంత కవితోత్సవం జాతీయ శతాధిక కవి సమ్మేళనం సందర్భంగా,ఆ సంస్థ అధినేత వడ్డే సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తూ, కవులు, పాఠకులు, పాత్రికేయ మిత్రుల సమక్షంలో పరిచయం చేయడం జరిగింది. అదేకాకుండా సోమన్న రచించిన యాభై పుస్తకాలు గ్రంథాలయానికి, వచ్చిన అందరికీ ఉచితంగా అందజేశారు. అనతి కాల వ్యవధిలో 60పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారి విశేష కృషిని ప్రశంసించి, సత్కరించటం విశేషం. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, తెలుగు వెలుగు అధ్యక్షులు శ్రీ టి.వి.రెడ్డి, ఎ. యస్.ఐ శ్రీ భాస్కరరావు, యస్.కె.యూనివర్సిటీ విశ్రాంత సూపరింటెండెంట్ శ్రీ పోకూరి చంద్రశేఖర్, శ్రీ లీలా మనోహర్, బాలసాహిత్యవేత్త శ్రీమతి కల్లమడి లక్ష్మీ, చిత్రకారుడు కుంచెశ్రీ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత శ్రీ హరికృష్ణ మున్నగువారు పాల్గొన్నారు.
Congratulations.