top of page
Original.png

మరో ప్రపంచం

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మరోప్రపంచం, #MaroPrapancham, #అమ్మమాటవిందాము

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 11

Maro Prapancham - Gayathri Gari Kavithalu Part 11 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 08/04/2025

మరో ప్రపంచం - గాయత్రి గారి కవితలు పార్ట్ 11 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


మరో ప్రపంచం

(వచనకవిత)

***************************

కులపు గోడల్నిపుడే కూల్చిపారేద్దాం!

మతపు మౌఢ్యాలనే మట్టుపెట్టేద్దాం!


 ఘనమైన పనులున్నో కలిసి మెలిసి చేసేద్దాం!

వెనుకబాటుతనాన్ని వెక్కిరించేద్దాం!


మదమాత్సర్యాలను మంటల్లో కలిపేద్దాం!

చెదపట్టిన భావాలను ఛిద్రంచేసేద్దాం!


బద్ధకాన్ని వదిలేసి ప్రగతిరథం నడిపేద్దాం!

శుద్ధాత్ములమై నిత్యం శుభాలెల్ల పొందేద్దాం!


చదువులన్ని చదివేసి జ్ఞానాన్ని పంచేద్దాం!

సదమలమౌ బుద్ధితో సంఘంలో నడిచేద్దాం!


తిమిరాన్ని తరిమేసే దీపాలను వెలిగిద్దాం!

మమకారపు కలిమితో మంచిబాట వేసేద్దాం!



అనుక్షణం ధిషణతో నందరమూ శ్రమిద్దాం!

దినదినమూ దేశాన్ని దివ్యంగా మలిచేద్దాం!


సమైక్యత కెప్పుడూ స్వాగతాలు చెప్పేద్దాం!

సమసమాజాన్నిపుడు సమర్థతతో నేలేద్దాం!


మరొక క్రొత్త ప్రపంచాన్ని మనమే సృష్టిద్ధాం!

చిరకాలం నూతనంగ జీవనాన్ని సాగిద్దాం!


చెట్టూచేమను పెంచి జీవులను రక్షిద్దాం!

 చుట్టుకొన్న ప్రకృతికి దాసోహమనేద్దాం!


భూమాతను పూజించి పుణ్యాన్ని కూడేద్దాం!

ఆ మాత యొడిలోనే హాయిగా నిదురిద్దాం!


చరితలో మన కీర్తిని శాశ్వతంగ నిలిపేద్దాం!

తరతరాలు నింగిలోన తారకలై వెలిగేద్దాం!


************************************

అమ్మమాట విందాము!


ree













అమ్మపాల కమ్మదనము అమ్మపాట తీయదనము 

అమ్మంటే తరిగని ధనము అమ్మ ఉంటేనేలే ధైర్యము 


అమ్మ వంటి దైవ మెచట?అవనిలోన కనము కనము!

భూమాతతోడ సమానము పూర్వపుణ్యతపోఫలము


అమ్మంటే ప్రేమామృతము అమ్మ వంట అమోఘము

అమ్మకొరకు విష్ణుమూర్తి ఆ దివినుండి ప్రయాణము


పాపడిగా అమ్మ యొడిలోపాలు త్రావటమే విచిత్రము!

జీవరాశి కంతటికి సతము శ్రేయమిడెడి దైవత్వము


అమ్మ దీవెన లందిస్తే మన కలవోకగానందు జయము!

కనుపించే దైవమనుచు కైమోడ్చి కాపాడుకొందాము!


అమ్మమాట వింటూ మన మందరమూ జీవిద్దాము!

అమ్మను నిత్యము పూజిస్తూ ఆ ఋణాన్ని తీరుద్దాము!//


*******************************

ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page