top of page

మౌనం

Updated: Feb 4

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #మౌనం, #Mounam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Mounam - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 28/01/2025

మౌనం - తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


కోయిల మౌనంగా ఉంటే..

వసంతానికి విలువేముంది


చంటి బిడ్డడు ఏడవకుంటే..

తల్లి జోలపాటకు స్థానం ఎక్కడుంది


లోకంలో కష్టాలే లేకుంటే.. 

సుఖాలకి విలువేముంది 


ప్రపంచంలో అందమే లేకుంటే..

చూసే కళ్ళకు ఆనందం ఏది 


చెడు అనేది లేకుంటే..

మంచికి గుర్తింపు ఏది 


చీకటి పడకపోతే..

వెలుగుకోసం ఎదురుచూపు ఏది 


కృషి చేయకపోతే..

ఫలితము ఎలా దక్కేది


మనమధ్య ఆ చిరు కోపాలే లేకుంటే..

ప్రేమ ఎలా బలపడేది 


మాటాడక మౌనంగా నీవుంటే..

మన బంధానికి అర్ధమేముంది 


********


-తాత మోహనకృష్ణ

Profile Link:







Comments


bottom of page