ముక్కోటి ఏకాదశి
- Neeraja Prabhala
- Jan 10
- 1 min read
Updated: Jan 21
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ముక్కోటిఏకాదశి, #MukkotiEkadasi, #TeluguKathalu, #తెలుగుకథలు

Mukkoti Ekadasi - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 10/01/2025
ముక్కోటి ఏకాదశి - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
ఏకాదశీ… ఏకాదశీ…ముక్కోటి ఏకాదశి.
జగమెల్ల హరిప్రీతి ఏకాదశి.
మన ఇంట వైకుంఠ ఏకాదశి.
ఘనుడు అంబరీషుండు అనయంఋ ఈ వ్రతము సలిపి,
సాయుజ్యమును పొందె ఏకాదశి.
మూడుకోట్ల దేవతల కూడి గరుఢవాహనుడైన శ్రీహరి,
ఉత్తర ద్వారప్రవేశమున మనకు దర్శనమిచ్చి ధన్యులను చేసె ఏకాదశి.
సాగరమధనంలో హాలాహలం, అమృతం ఉద్భవించిన ఏకాదశి.
మురాసురిడిని సంహరించిన ఏకాదశి.
ఉపవాస వ్రతఫలితమిచ్చి పునర్జన్మ లేకుండా ముక్తినొసంగే పవిత్ర ఏకాదశి.
భక్తితో అర్చించి జన్మ సార్ధకం చేసుకునే కైవల్య ఏకాదశి.
వ్రత దానఫలితాలను అమోఘంగా ప్రసాదించే వైకుంఠ ఏకాదశి.
మూడుకోట్ల దేవతల అనుగ్రహం పొందే ముక్కోటిఏకాదశి.
హరి సంతసించి అభయమిచ్చే అరుదైన ఏకాదశి.
ముముక్షువులు సైతం ఈరోజుకై వేయికళ్లతో ఎదురుచూసే వైకుంఠ ఏకాదశి.
పాపులు సైతం శ్రీహరిని భక్తితో అర్చించి జన్మని సార్ధకం చేసుకునే ముక్కోటి ఏకాదశి.
సకల జీవులకు మోక్షాన్నిచ్చే మోక్షప్రదాయిని మోక్షజ్ఞ ఏకాదశి.
….నీరజ హరి ప్రభల.
Comments