top of page
Original.png

నా గులాబి

Updated: Jan 21, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #NaGulabi, #నాగులాబి


Na Gulabi - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 13/01/2025

నా గులాబి - తెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


రాత్రంతా రుచిర స్వప్నాల్ని కని

నూత్న ప్రాభాతంలో మంచు ముద్దలా చల్లగా పలకరిస్తుంది నా గులాబి  


మాఘమాసపు చలికి వణుకుతూ

వెచ్చటి చేత్తో నిమరమని వేడుకుంటుంది నా గులాబి


ఉత్తరపు గాలికి మధ్యాహ్నం తలూపుతూ

కిటికీలోంచి తొంగి తొంగి చూస్తుంది

 నా గులాబి


అందాల్ని వడ్డిస్తూ

సువాసనల్ని ఆఘ్రాణించమని

వయ్యారంగా కన్నుకొడుతుంది

 నా గులాబి


అందానికి దాసోహమై

స్వప్నాల పందిళ్ళలో విహరిస్తూ

తెంచుదామన్న నా వ్రేళ్ళని

కరెంటు షాకు లాంటి ముళ్లతో

కరుస్తుంది నా గులాబి.


-రవి శర్మ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page