నవ్వితే లక్ష
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #NavvitheLaksha, #నవ్వితేలక్ష, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Navvithe Laksha - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 12/11/2024
నవ్వితే లక్ష - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"అక్కా..! ఇదిగో స్వీట్స్ తీసుకో..కొత్త ఉద్యోగంలో మొదటి జీతం వచ్చింది...." ఆనందంగా అన్నాడు ఆనంద్.
"యాభై దాటాక.. నీకు ఎవరు ఇచ్చారు ఉద్యోగం..? చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యలేవు గానీ..రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చెయ్యి..ఆరోగ్యం చూసుకో రా ఆనంద్".
"ఆరోగ్యం బాగోలేదని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న నాకు, ఇంట్లో ఏమీ తోచట్లేదు..ఏం చెయ్యను అక్కా ? అయినా అది చిన్న ఉద్యోగం కాదు..పెద్ద ఉద్యోగమే, పెద్దగా కష్టపడడం కుడా లేదు..కుర్చీలో కూర్చోవడమే..".
"ఏమిటో ఆ ఉద్యోగం..నాకు ఇప్పటివరకూ చెప్పనేలేదు..".
"చిన్నప్పుడు నేను లాఫింగ్ క్లబ్ లో పని చెయ్యడం చేత.. నాకు ఇప్పుడు ఆ అనుభవం బాగా ఉపయోగపడింది అక్కా..".
"నువ్వు ఎప్పుడు పనిచేసావు..? మాకు అసలు తెలియనే లేదే"
"కాశ్మీర్ లో జాబ్ చేస్తునప్పుడు...అక్కడ జాబ్ చేస్తూ..అక్కడే లాఫింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యాను..నాలుగు చిన్న సినిమాలలో కూడా నటించాను"
"అవును..అప్పట్లో అవి పెద్దగా ఆడలేదు.."
"ఆడకపోయినా..నాకు చాలా మంచి పేరు వచ్చింది అక్కా..! ఏ కారణం లేకుండా నవ్వడమే కదా లాఫింగ్ క్లబ్ లో చేసే పని..నవ్వు వచ్చినా రాకపోయినా.. అదే పనిగా నవ్వుతూ ఉండాలి..అదే ఇప్పుడు నన్ను కామెడీ షోకి జడ్జీ గా చేసింది.."
"అయినా.. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారుగా.. నిన్నే ఎందుకు జడ్జీ గా సెలెక్ట్ చేసినట్టు..?"
"ఈ రోజుల్లో చాలా టీవీ ఛానల్స్ వచ్చేసాయి, అందులో కామెడీ షోస్ కి జడ్జీలు దొరకట్లేదు.. మా లాంటి వారిని వెతికి మరీ సెలెక్ట్ చేస్తున్నారు. ఆ దేవుని దయ వలన మా ఆవిడకి కుడా అక్కడే ఒక మంచి లాఫింగ్ జాబ్ వచ్చింది.."
"మరి మీ ఆవిడ ఒప్పుకుందా..?"
"ఇంట్లో ఎప్పుడూ నన్ను చూసి నవ్వడం కాదు, అక్కడ నవ్వితే నాలుగు డబ్బులు వస్తాయి.. చీరలు, నగలు కొనుక్కోవచ్చు" అని అన్నాను అంతే..! వెంటనే ఒప్పేసుకుంది..
"ఇంతకీ మీ ఆవిడ అక్కడ ఏం చెయ్యాలో..?"
"జనాలకి ఎక్కడ నవ్వాలో తెలియక తికమక పడుతూ ఉంటే, మా ఆవిడ లాంటి ఒక నలుగురు అక్కడ కూర్చొని.. ఎక్కడ నవ్వాలో నవ్వి అందరికీ నవ్వాలని హింట్ ఇస్తుంటారు. కావాలంటే, చెప్పు..! నీకూ పార్ట్ టైం కింద..అక్కడే గెస్ట్ లాఫింగ్ రోల్ ఇప్పిస్తాను. నవ్వుకుని.. డబ్బులు ఇంటికి తీసుకుని వెళ్ళు..బావగారు తెగ సంతోషిస్తారు.."
"ఆలోచించి చెబుతాను. అయినా అదేంటి..నవ్వు వస్తే, నవ్వాలి గాని..ఇలాగ ఏమిటో..?"
"ఈ రోజుల్లో అంతే..జనాలకి ఎక్కడ నవ్వాలో కుడా గుర్తు చెయ్యాలి..లేకపోతే ఆ కామెడీ షోకి కిక్ ఉండదు..రేటింగ్స్ రావు"
"అయితే నీ ఉద్యోగం ఎలా ఉంది..? ఏం చెయ్యాలి..? బాగానే ఇస్తారనుకుంటాను జీతం.."
"అంతా ఏసీ లో కూర్చోవడం. మెత్తనైన కుర్చీ..పక్కనే ఒక లేడీ జడ్జీ. అన్నీ మాట్లాడడానికి ఒక అందమైన యాంకర్. జడ్జీలుగా మేము కామెడీ బాగుందని చెప్పి, మార్కులు ఇస్తే చాలు. వీటికి ఒక లక్ష ఇస్తారు..."
"నీ పనే బాగుందిరా..! మీ బావగారు రోజూ ఉదయం వెళ్లి రాత్రికి వస్తారు..ఇప్పటికీ ఆయనికి అంత జీతం లేదు...వారానికోసారి కుర్చీలో కూర్చొని నవ్వితే లక్షలా..?"
"అంతే కాదు..బాగా నవ్వితే..రేటింగ్స్ పెరిగి..పక్క ఛానల్ వారు మన పెర్ఫార్మన్స్ చూసి ఇంకో లక్ష ఆఫర్ ఇచ్చే ఛాన్స్ ఉంది...కాకపోతే ఒకటే తంటా.." అన్నాడు ఆనంద్.
"ఏమిటో అది..?"
"ఇంటికి వచ్చిన తర్వాత..దవడలంతా ఒకటే నొప్పులు..ఒక రెండు రోజుల వరకూ ఉంటాయి ఆ నొప్పులు. ఒక సంవత్సరం నవ్వాల్సిన నవ్వులన్నీ ఒక పూటలో నవ్వుతాము కదా మరి. ఇంకో ప్రాబ్లం కుడా ఉంది..రాత్రి నిద్ర మధ్యలో లేచి ఊరకే నవ్వడం..రోడ్డు మీద ఉండి ఉండి నవ్వడం చేత..కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. మెల్లగా అలవాటు చేసుకున్నాను..చుట్టూ జనాలకి కుడా అర్ధమైంది. ఇలాగే, మొన్న మా ఫ్రెండ్ భార్య చనిపోతే, పరామర్శించడానికి వెళ్ళాను. అంతా బాగానే ఉంది..కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత అలవాటు ప్రకారం నవ్వు మొదలైంది..ఆపుకోలేక చచ్చాననుకో..ఏం చేసేది.."
"ఎందుకు రా నీకు ఈ పాట్లు..హ్యాపీ గా ఇంటి పట్టున ఉండక..?"
"ఎన్నైనా చెప్పు..! లక్షలు చూస్తే, అవన్నీ మర్చిపోతాము అంతే..! నువ్వూ బాగా అలోచించు అక్కా..మంచి ఆఫర్! డబ్బులు ఎవరికీ ఇలా ఊరికే రావు!" అన్నాడు ఆనంద్.
**********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ





Comments