top of page

నేల - నీరు - చెట్టు

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #NelaNiruChettu, #నేలనీరుచెట్టు, #TeluguKathalu, #తెలుగుకథలు

ree

Nela Niru Chettu - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 31/01/2025

నేల-నీరు-చెట్టు - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



చాలా సంవత్సరాల తర్వాత మధు వాళ్ల మామ ఇంటికి వచ్చాడు. చిన్నప్పుడు వేసవి సెలవులు వస్తే చాలు, ఇక్కడే వాలేవాడు. తర్వాత చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండటంవల్ల మావయ్య గారింటికి రాలేకపోయాడు. 


క్షేమసమాచారాలయ్యాక భోజనం చేసి నిద్రపోయాడు. మరుసటిరోజు తీరిగ్గా ఉండటంవల్ల ఇంటి పరిసరాలను గమనించాడు మధు. చాలా మార్పులు కనిపించాయి. 


చిన్నప్పుడు మామయ్య గారిది పెంకుటిల్లు. ఇంటి చుట్టూ చాలా స్థలం ఖాళీగా ఉండేది. తాను ఆ మట్టిలోనే ఆడుకొనేవాడు. ఇప్పుడు మావయ్య మేడ కట్టాడు. ఇంటి ఆవరణ అంతటినీ నాపరాళ్ళతో కప్పి సిమెంట్ పూత పూయించాడు. ఒక మూలగా వేపచెట్టు మాత్రం అలాగే ఉంది. మరొక మూలన బావి కూడా అలాగే ఉంది. 


బావిలోకి తొంగిచూశాడు. అది ఎండిపోయి చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. చిన్నప్పుడు చేతికందే అంత ఎత్తులో నీరు కనబడుతూ కళకళలాడుతూ ఉండేది, పెరటిలోని పూల మొక్కలకు తామే సరదాగా బావిలోని నీరు తోడి పట్టేవారు. ఇప్పుడు నీరే కాదు మొక్కలు కూడా కనిపించలేదు. అదే విషయం మామయ్యని అడిగాడు. 


"బావి ఎప్పుడో ఎండిపోయింది రా. పూడ్చాలంటే ఖర్చు అని అలా వదిలేశా. నీళ్లకే కరువుగా ఉంటే ఇక మొక్కలను పెంచే పరిస్థితి ఎలా ఉంటుంది?" అన్నాడు.


మధు ఆ రోజంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. మరుసటిరోజు మామయ్యని పిలిచి తన నిర్ణయం తెలిపాడు. మావయ్య మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత పకపకా నవ్వేడు. "ఏంటి నువ్వు బావిలో నీరు తెప్పిస్తావా? ఎలా?” అన్నాడు. 


"మీకెందుకు? నేను చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నాకు కావలసినవి అందజేస్తే చాలు" అని అన్నాడు మధు. 


"సరే నీ ఓపిక. నాదేం పోయింది " అంటూ అంగీకరించాడు మావయ్య. 


మరుసటి రోజునుండి పని ప్రారంభించాడు మధు. ముందుగా బావిని శుభ్రం చేయించి పూడిక తీయించాడు. బావికి కొంతదూరంలో ఆరడుగుల విస్తీర్ణంలో నాలుగడుగుల లోతు ఒక గుంత తవ్వించాడు. అందులో ఒక పొరలా రాళ్లని పరిచాడు. పైన ఇసుక మట్టితో నింపాడు. వాన పడినప్పుడు ఇంటి పైకప్పు నుంచి నీరు వెళ్లడానికి ఒక పైపు అమర్చి ఉంది. దానిద్వారా నీరు వీధి కాలువలోకి పోయేది. మధు ఆ పైపును తాను తవ్వించిన గుంత లోనికి అమర్చాడు. 


ఇప్పుడు వాన పడితే నీరు ఆ గుంతలోకి వెళ్తుంది. తరువాత పెరటిలో కొంతమేర చప్పట తొలగించి వానలు వచ్చాక మొక్కలు నాటమని మావయ్యకు సూచించాడు. కొన్ని రోజులు గడిపిన తర్వాత తన ఇంటికి వెళ్లిపోయాడు మధు.

 

 వేసవికాలం ముగిసింది. మెల్లిగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. చల్లని గాలులు వీచాయి. తర్వాత ఉధృతంగా వర్షాలు కురిశాయి. ఇంటి పైన కురిసిన నీరంతా గుంటలోకి ఇంకిపోయింది. ఒక రోజు తెల్లవారి చూస్తే బావి నిండా నీరు, చేతికి అందేటంత దగ్గరకు వచ్చింది. మావయ్య సంతోషంతో మధుకి ఫోన్ చేసి విషయం తెలిపాడు. 


"మనం చిన్నచిన్న ప్రయత్నాలు చేయకుండా బద్దకించడం వల్ల సమస్యలు పెనుభూతంగా మారుతున్నాయి. పట్టణాలలో నేల కనిపించకుండా కాంక్రీటుతో అలికిస్తున్నారు. దానివల్ల భూమిలోకి నీరు ఇంకకుండా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. స్వార్థంతో చెరువులు ఆక్రమించడం, కాలువలను పూడ్చడం వల్ల నీటి కొరత ఏర్పడుతోంది. 


అంతేకాదు. నేల లేకపోతే మొక్కలు పెరగవు. మొక్కలు లేకపోతే ఉష్ణోగ్రత పెరుగుతుంది. గాలి వీచదు. వర్షాలు కురవవు. నేల, నీరు, మొక్కలది అవినాభావ సంబంధం వాటి మధ్య బంధం తుంచేస్తే మనిషి మనుగడ ఉండదు. 


అందువల్ల పట్టణాలు నగరాల్లో నివసించేవారు తెలుసుకోవలసింది ఏమిటంటే వీలైనంత నేలను వదిలేసి పచ్చదనాన్నిపెంచితే నీటి కొరత అనేది ఉండదు. మనుషులు ఆరోగ్యంగా జీవించ గలుగుతారు" అంటూ చెప్పుకొచ్చాడు మధు. 

 ---------- 

పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

2 Comments



@veeraiahkatam4399

37 minutes ago

GOOD STORY

Like

shaik maktumsab

7 hours ago

❤❤

Like
bottom of page