పెళ్లి వేడుక
- Yamini Rajasekhar
- Mar 30
- 3 min read
#YaminiRajasekhar, #PelliVeduka, #పెళ్లివేడుక, #యామినిరాజశేఖర్, #TeluguStories, #తెలుగుకథలు

Pelli Veduka - New Telugu Story Written By Yamini Rajasekhar
Published In manatelugukathalu.com On 30/03/2025
పెళ్లి వేడుక - తెలుగు కథ
రచన: యామిని రాజశేఖర్
పెళ్లి ఇరు కుటుంబాలు ఇరు మనసులని ఒకటి చేసి మనమంతా ఒకటే కుటుంబం అనేలా మహాత్సవోత్సవం. ఎటుచూసినా అయినవారు సాన్నిహిత్యాలు బంధువులు ఆప్తులు...
ఎంతోమంది జనసందోహం.. అటు ఇటు తెగ తిరిగేవారు... ఏమిటో హడావుడి ఎన్నటికి అర్ధం కాదు..
ఏది ఏమైనానా నేస్తం కూతురి పెళ్లికి బయలుదేరా అలా బస్సులో...ఆ బస్సులో ఓ పెళ్లి గుంపు ఒకటే కోలాహలం.
గోల అంతా ఇంతా కాదు... అలా చేరుకున్నా పెళ్ళి విడిదికి..
వచ్చిన వారిని పలకరించుకుంటూ.. పెళ్ళి వారు... అందరిని అలా చూస్తూ నా సాన్నిహిత్యాల నడుమ నేను నా కుటుంబం... ఏమిటో ఆ సంతోషం...ఓ వైపు అల్పాహారాల ఘుమఘుమలు... మరోవైపు ‘పదండి పదండి అంతా పెళ్లి సత్రంకి’ అని వినిపించే పలు గొంతుకలు..
ఎవరి విడిది గదిలో వాళ్ళు అందంగా అలంకరించుకుంటూ వస్త్రధారణలో మునిగిపోతూ ఎంతోమంది ఆడవారు అటు ఇటు పరుగులు తీస్తూ అంతా ముస్తాబై ఒకరి గదిలో ఒకరు అంతా సిద్ధమేనా అని గొంతుకలు పలకరించుకుంటూ ఏదో సంబరం…
అలా నేను .నా కుటుంబము ముస్తాబయింది. ఇంతలో అందరూ దిగుతున్నారా అని మరల వినిపించాయి గొంతులు. వెను వెంటనే అందరం దిగాలని కానీ ఇంతలో నా తలుపుని నేను ఉంటున్న గదిని ఒక అమ్మాయి వచ్చి .తలుపు తీస్తే ఆందాల బొమ్మలా ఉంది. తానేవరో నాకు తెలియదు. ఎంతో పరిచయం ఉన్న అమ్మాయిలా.. నా కూతురుతో సమానం. తాను కూడా లోపలికి వస్తూనే భాష వేరైనా ఆ పదానికి అర్థం ఒకటే.. లోకమంతా కూడా అంత ఆర్ద్రతతో అమ్మ అనే పిలుస్తారు. నన్ను పిలిచింది అమ్మా అని…
మా అమ్మాయి కూడా నన్ను చూసింది. ఎవరో మాకు తెలియదు. పెళ్లి కూతురు స్నేహితురాలు. చీర కట్టుకోవడం తెలియదు. ‘నాకు కడతావా అమ్మా’ అని మరోసారి పరభాషలో అడిగింది.
ఎంతో చక్కగా తనని నేను తయారు చేశాను. తాను సిద్ధమై తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో మరో అమ్మాయి వచ్చింది. తాను కూడా “అమ్మా! నాకు నా నేస్తానికి కట్టినట్టు చీర కడతావా” అని అడిగింది.
నాకు చీర కట్టడం కన్నా కూడా అమ్మ అని పిలుపులోని మాధుర్యం నన్ను నా మనసుని కలచివేసింది. ఎంత ఆనందం అంటే కన్న బిడ్డలే నేడు పిలవడానికి మమ్మీ అనే రోజు కానీ అలా వేరే అమ్మాయిలు వచ్చి నన్ను పిలుస్తుంటే నా పిల్లలు కూడా మా అమ్మని అలా పిలుస్తున్నారే అని ఒక వైపు నన్ను చూశారు. అయినా ఏదో నాకు తెలియని ఆనందం. అంతా సిద్ధమై కిందకి దిగాము..
ఇంతలో పెళ్లి మండపానికి బస్సు కదిలింది. అందరూ కూర్చున్నారు. ఒక్కసారిగా మరల బస్సు ఆగింది. ఎందుకో అర్థం కాలేదు. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. అందరూ ఎక్కారా అని అడుగుతున్నారు. అందర్నీ పర్యవేక్షించే ఒకతను అందరూ ఎక్కామని చెప్తున్నారు. దాదాపుగా ఇరవై ఐదు మంది ఉంటారు..
కానీ పెళ్లికూతురు సాన్నిహిత్యాలు వచ్చారా అని అడుగుతున్నారు కొంతమంది. అందరూ వచ్చారు కదా అని అడిగారు. కానీ ఇంకా కూడా నలుగురు అమ్మాయిలు రాలేదని ఎవరో అడిగారు. ఇంతలో నా వెనక వైపునే ఆ గొంతులో “అమ్మా! మేము కూడా బండిలో కూర్చున్నాం” అని పరభాషలో వాళ్ళ అన్నప్పుడు నాకు తెలియని ఆనందం ఉప్పొంగింది. అలా అంతా కలిసి పెళ్లి మండపానికి వెళ్లాం. ఎంతో ఘనంగా జరిగింది నా నేస్తం కూతురి పెళ్లి... అంతా
ఆశ్వీర్వదించాము కొత్త జంటని. ఆరగించాము విందు.
అంతా మరలా మొదలైంది.. ఎవరి గమ్యం వారు తిరిగి చేరుకోవాలని. అప్పుడేనా అనిపించింది..
తీసుకున్నాము అంతా చరవాణీలో చిత్రాలు..
అక్కడ కూడా ఆ అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి నాతో చిత్రాలు దిగారు. అంతా సాఫ్ట్ వేర్ అమ్మాయిలు. ఇక్కడ నా ప్రయాణం గురించి ఒక మాట చెప్పాలి..
తల్లి ఎవరికైనా తల్లే. ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని కంటారు కానీ వారి నుంచి ఏమీ ఆశించరు. కనీసం మనసార పలకరింపైనా ఉంటే చాలని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. అలాగా నా ఈ ప్రయాణంలో కలిసిన ఆ అమ్మాయిలు అమ్మ అని పిలవడం అనేది నాకు ఎప్పటికీ మిగిలిపోయే మరువలేని ఓ మధురానుభూతి....
మరలా ఎప్పుడైనా మనం కలుద్దాం అని నాకు ఓ
అమ్మాయి చిరు ముద్దు పెట్టింది...
నీతి : అమ్మాయంటే ప్రతి ఇంటి మహాలక్ష్మి. అందరిని కన్న తల్లి... అండి...
***
యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Comentários