top of page

ప్రసాదం

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Prasadam, #ప్రసాదం, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguCrimeStory


Prasadam - New Telugu Story Written By - Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 28/12/2024

ప్రసాదం - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


ఆరోజు పరిపూర్ణానంద స్వామి భగవద్గీత ఉపన్యాసం వినడానికి రాజమండ్రి వెళ్ళాల్సి ఉంది. సమయానికి బస్సు లేక పోవడం తో సాయంత్రం ఏడు గంటలికి ఉపన్యాసం వినడానికి అమలాపురం బస్ స్టాండ్ నుండి టాక్సి లో బయలుదేరాను. అప్పుడు సమయం నాలుగు గంటలు 

 *****

ఒంటరి గా ప్రయాణం విసుగు పుడుతుందని ముక్కామల దగ్గర డ్రైవర్ తో మాటలు కలిపాను. అతని మాటలతో తెలిసింది అతను ముంబాయి నుండి వచ్చాడని. ముంబాయ్ నుండి అమలాపురమా ? ఆశ్చర్య పోయాను. అడిగితే డ్రైవర్ తన కధ చెప్పడం ప్రారంభించాడు. 


 *****

డ్రైవర్ పేరు రహీమ్ ! అతను చిన్న కంపెనీ లో ముంబయి లో పనిచేసే వాడు. జీత భత్యాలు కూడా బాగా ఉండేవి. రహీమ్ కి పెళ్ళయ్యింది. ఒక కొడుకు పుట్టాడు. సమస్య అప్పుడు ప్రారంభ మయ్యింది. రహీమ్ కొడుకు కి పెద్ద తల పుల్లల్లా చిన్న చేతులు. మామూలు గా శరీరం లో కదలికలు రావడానికీ చాలా కాలం పట్టింది. డాక్టర్లు పిల్ల వాడికి నాలుగేళ్ళు వచ్చేసరికి రహీమ్ పిల్ల వాడు మానసిక వికలాంగుడు అని తేల్చారు. రహీమ్ పిల్ల వాడికి మాటలు రాలేదు. డాక్టర్ల కోసం చాలా ఖర్చు చేసాడు. రహీమ్ పని చేస్తున్న కంపెనీ ఎమ్ డి నాలుగైదు లక్షలు దాకా ఖర్చు పెట్టాడు. తరువాత ఎమ్ డి కొడుకు మేనేజ్ మెంటు లోకి వచ్చాక రహీమ్ పిల్ల వాడి గురించి పట్టించుకోవడం మానేశాడు. ఆ తరువాత పొరపాటు చేసాడని రహీమ్ ని ఉద్యోగం నుండి తీసేసారు. రహీమ్ ఉద్యోగం వెతుక్కుంటూ మద్య ప్రదేశ్ వచ్చాడు. మధ్య ప్రదేశ్ లో రహీమ్ పిల్ల వాడి పరిస్ధితి అద్వాన్నం గా మారింది. డాక్టర్లు పిల్ల వాడికి బ్రెయిన్ హెమరేజ్ అని ఆపరేషన్ చెయ్యాలన్నారు. 


 ********

టాక్సి రావులపాలెం దగ్గర ఆగింది. రహీమ్ చాయ్ తాగుతారా అడిగాడు. రహీమ్ కొడుకు గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. టీ త్రాగిన తరువాత టాక్సి బయలుదేరింది !


రహీమ్ తన కొడుకు కోసం తనకు వారసత్వం గా వచ్చిన ఇంటిని అమ్మేశాడు. మెదడు కి ఆపరేషన్ రహీమ్ కొడుకు తండ్రిని గుర్తు పట్టడం మొదలు పెట్టిడు. రహీమ్ కధ చెబుతూ కళ్ళు తుడుచుకోవడం చూసాను. రహీమ్ కొడుకు పరిస్ధితి లో మార్పు లేదు. ఎప్పుడూ కుర్చీ లోనే..


భార్య చనిపోయాక రహీమ్ ఆంధ్రా వచ్చేసాడు. లోన్ తో టాక్సి కొనుక్కున్నాడు. రహీమ్ కధ ఆపి టాక్సి నడుపుతున్నాడు. 


కొబ్బరి చెట్ల మీద నుండి వచ్చే గాలి చల్లగా తగులుతోంది !

రహీమ్ కి ఇన్ని కష్టాలా ? అనిపించింది ! రాజమండ్రి చేరగానే టాక్సి దిగుతూ అడిగాను


"రహీమ్, నీ పిల్లాడి తో ఇన్ని బాధలు పడ్డావు కదా,, పిల్లవాడిని వదిలి వెయ్యాలనిపించ లేదా ? "


"సార్! మామూలు పిండి నే ప్రసాదం అని అంటే కళ్ళకి అద్దుకుని తింటాం కదా. దేవుడిచ్చిన ప్రసాదం వాడు! వాడి నవ్వు లో వాడి అమ్మ కనిపిస్తుంది. "


నేను అవాక్కయ్యాను!. నేను ఇన్ని సంవత్సరాలు గా భగవద్గీత వింటున్నా, చదువుతున్నా కాని జీవితం లో గీతను ఆచరించే రహీమ్ ఎంతో ఎత్తు లో నిలిచాడు. 


"చిల్లర తీసుకోండి సార్ " అంటూ నా చేతి లో మూడు వందలు ఉంచాడు 500 తీసుకుని. 

"వద్దులే ఉంచు "


"సాయం చేయగలిగితే నా కొడుకు లాంటి పిల్లల్ని చూసే సంస్ధ కి విరాళం ఇవ్వండి "


టాక్సి వెళ్ళి పోయింది !

నేను ఉపన్యాసం జరిగే చోటు వైపు వెడుతున్నాను. 


 ****

రచయిత చెప్పిన కధ :


రహీమ్ ఎవరో కాదు భగవద్గీత ఉపన్యాసం వినడానికి అమలాపురం నుండి వచ్చిన భద్రం గారి అక్క కొడుకు !


భద్రం గారి అక్క ఇంటర్ లోనే ముస్లిం ని ప్రేమించి ఇల్లు విడిచి వెళ్ళి పోయింది. పుట్టింటి వైపు రాలేదు. 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






תגובה אחת


mk kumar
mk kumar
28 בדצמ׳ 2024

ప్రసాదం" అనే ఈ హృద్యమైన కథ, మానవీయ విలువలను, ప్రేమను, త్యాగాన్ని అద్భుతంగా చిత్రిస్తుంది. కథానాయకుడు రహీమ్, తన మానసిక వికలాంగుడైన కొడుకు కోసం ఎంతో కష్టపడతాడు. అతను తన కొడుకును దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తాడు. కథ చివరలో, రహీమ్ కథకుని అక్క కొడుకు అని తెలిసి, కథకుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

לייק
bottom of page