top of page

సంపత్ సినిమా కథలు - 10


'Sampath Cinema Kathalu - 10' New Telugu Web

Series Written By S. Sampath Kumar


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

లింగస్వామి, హాస్పిటల్ వెనుక గోడౌన్ లో మత్తు పదార్దాలు నిల్వ ఉంచినట్లు నారాయణకు చెబుతాడు కిరణ్.

డాక్టర్ సుజాతకు జరుగుతున్న విషయాలు చెబుతారు.

ఆమెతో తన తండ్రికి ఫోన్ చేయిస్తాడు కిరణ్.

లింగస్వామితో ఊటీకి వెళదామని చెబుతాడు రాజారావు.

ఇక సంపత్ సినిమా కథలు ధారావాహిక పదవ భాగం చదవండి..


పిచ్చి అవతారాన్ని ఒక రూములో కట్టేసి టైముకు తిండి పెట్టీ అప్పుడప్పుడు రంగ భీమలకు కనపడేటట్టు చేస్తున్నాడు నారాయణ.


“వీడు ఇంకా పిచ్చోడిలాగానే నటిస్తున్నాడు. వాడిని అలాగే నటించనీ. నీవు మాత్రం ఏమీ తెలియనివాడిలా ఉండు” అని కిరణ్ చెప్పడం వలన నారాయణ కూడ అలాగే ఏమీ తెలియనివాడిలా ఉన్నాడు.


నారాయణ, పిచ్చి అవతారం ఉన్న రూములోకి వచ్చాడు.

పిచ్చి అవతారం ఏమి తెలియనివాడిలా " నాకు ఇవ్వాల్సిన ఐదు కోట్లు ఎప్పుడూ ఇస్తావు " పిచ్చిగా నటిస్తూ అన్నాడు.


"రెండు రోజులలో ఐదు కోట్లు ఇచ్చి నీ పిచ్చికి విముక్తి కలిగిస్తా పద " అంటూ హాస్పటలకు తీసుకెళ్ళాడు. కాని అంతకు ముందు లాగానే రంగ భీమలకు కనపడకుండా ఒక చోట హాస్పటలలో ఒక రూములో దాచాడు, రంగ భీమలకు వాడు ఇక్కడే ఉన్నాడు అని చూపించడానికి.


హాస్పటల్ ఆవరణలో రంగ భీమ మాట్లాడుకుంటున్నారు.

"మనకు ఆ నారాయణ ఉన్నప్పుడే ఆ పిచ్చి అవతారం కనపడుతున్నాడు. మళ్ళి తర్వాత కనపడటం లేదు" అన్నాడు రంగ.


"అవును రా, మనం మనకు తెలియకుండానే మోస పోతున్నాం అనిపిస్తుంది."


"లేదు.. ఏదో ప్లాన్ వేసి రేపు నారాయణ ఉన్నప్పుడు ఆ నరసింహను రమ్మని చెబుదాం "అంటూ నరసింహకి కాల్ చేసి రేపు రమ్మని చెప్పాడు రంగ.


అంతలొ నారాయణ వచ్చి "ఏమి రా ఇద్దరి మధ్య గుస గుసలు భలే నడుస్తున్నాయి " అన్నాడు.


"అబ్బే.. ఏమీ లేదు"


"మీ గెస్ట్ హౌస్ లో మందు తాగుతుంటే ఆ దొంగ ఎవడో వచ్చి వంటి మీద ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు కదా.. అప్పటినుంచి మా ఆవిడతొ రోజూ గొడవ, ఇంట్లొ ప్రశాంతంగా ఉండకుండా పోతుందనే బాధ భీమతో పంచుకుంటున్నా, ఇంతలో నీవు వచ్చావు."


"అదా. నీకు శుభ వార్త చెబుతామని వచ్చాను. దొంగ తీసుకుని పోయిన బంగారం దొరికిందట. నాకు తెలిసిన పోలీస్ చెప్పాడు.. సొమ్ము ఇచ్చే ముందు మందు పార్టీ అడిగాడు.మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను."


"అవునా, అబ్బా.. ఎంతో ఆనందంగా వుంది.ముందు బంగారం ఇచ్చిన తర్వాత మందు పార్టీ అంటే బాగుండేది" అన్నాడు భీమ.


"ముందు మందు తాపాలి. తర్వాత బంగారు ఇచ్చాక మళ్ళీ కొంత ఇవ్వాలి. లేకుంటే దొరికిన బంగారు గోవిందా." అన్నాడు నారాయణ.

"ఒరే భీమ ... బంగారు దొరికింది అనే ఆనందంలో ఉంటే లేని పోని సందేహాలు ఎందుకు."


"సరే.. రేపే గెస్ట్ హౌస్ లో మందు పార్టీ " అని చెప్పి పోయాడు నారాయణ.


"ఆరే రంగ.. రేపు ఎలాగైనా నారాయణ, ఆ పిచ్చి అవతారాన్ని పట్టి ఇస్తామని నరసింహకు చెప్పాం కదా.. ఇప్పుడు నారాయణ ఇలా చెప్పి పోయాడు, ఎలా.." అన్నాడు భీమ.


"ఏమోరా.. నారాయణ మంచివాడిలా ఉన్నాడు.అనవసరంగా హాస్పటల్ పనిలో మన మీద పెత్తనం చెలయిస్తూన్నడని ఆ నరసింహతో చేతులు కలిపాము."


"అవునురా. ఈ హాస్పటల్ లో నారాయణతో కలిసిమెలిసి పని చేసేవాళ్ళం .నారాయణ దగ్గర మందు, ఆ నర్సింహ దగ్గర డబ్బులు వస్తాయని ఇన్ని రోజులు ఇలా చేశాం. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అది తెలియక ముందే మనమే ఇలా కక్కుర్తి పడ్డం అని చెబుదాం."


"ఇప్పుడే చెబుదాం"

"ఇప్పుడు వద్దు, గెస్ట్ హౌస్ లో మందు పార్టీ లొ చెబుదాం"

"మరి నర్సింహను రమ్మనాం కదా"

"రేపు కాదు , ఎల్లుండి రమ్మని చెబుదాం.తర్వాత వాడు పర్మనెంట్ గా రాకుండా ప్లాన్ వేద్దాం."

"సరే" అన్నాడు భీమ.

***

లింగస్వామి హాస్పటల్ కు వస్తున్నాడని ముందే తెలుసు. అతని రాకకై ఎదురు చూస్తున్నా రు సుజాత,నారాయణ.

లింగస్వామి కారులో హాస్పటల్ రాగానే సరాసరి సుజాత ఉండే రూములోకి వెళ్ళాడు.


లింగస్వామి చూసిన వెంటనే "వచ్చారా.....పదండి, కిరణ్ ఉండే రూములోకి వెళ్దాం " అంది. అక్కడే ఉన్న నారాయణ కూడ వీళ్లతో పాటు కిరణ్ ఉండే రూముకి వచ్చాడు.

అప్పుడు టీవీలో క్రికెట్ చూస్తున్న కిరణ్ వీళ్ల రాక చూసి టీవీ సౌండ్ తగ్గించాడు. తర్వాత "రండి అంకుల్" అన్నాడు.


"ఎలా ఉన్నావు"

"సుజాత ఆంటీ ట్రీట్మెంట్ వలన పర్ఫెక్ట్ అయ్యాను."


"వెరీ గుడ్, మరి సుజాత ట్రీట్మెంట్ అంటే ఏమనుకున్నావు.. థాంక్స్ సుజాత గారు.. మళ్ళి మా కిరణ్ ను మామూలు మనిషిగా చేసినందుకు"


"మరి మీరు అంతగా చెప్పిన తర్వాత డాక్టరుగా నా వంతు ప్రయత్నం చేస్తు బాగానే కష్ట పడ్డాను, కిరణ్ ను మామూలు మనిషిగా చేయడానికి. లేకుంటే ఈ హాస్పటలుకు రానిచ్చే దాన్ని కాదు " అని లింగస్వామి వంక చూస్తూ అంది.


సుజాత ఫేస్ చూసి ఎందుకు అలా అందో అర్థం అయ్యింది.

"సరే సుజాత. ఇంక కిరణ్ ను తీసుకుని పోవచ్చు కదా" అన్నాడు లింగస్వామి.


"హి ఈజ్ పర్ఫెక్ట్ లీ ఆల్రైట్. తీసుకెళ్లవచ్చు."

"అంకుల్.. నేను ఇంక కొన్ని రోజుల మన గెస్ట్ హౌస్ లో ఉండివస్తా."


"ఇప్పటికే మీ నాన్న నీవు ఎక్కడా ఉన్నావో ఏమై పోయావో తెలియక బెంగతో ఉంటే, ఇప్పటి వరకు ఎలాగో మీ నాన్న ను జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తున్నా. ఇంక లాభం లేదు. మనం వెళ్ళిపోవలసిందే.. ఇప్పుడు నీవు పర్ఫెక్ట్ లీ ఆల్రైట్ కదా.. మీ నాన్నకు కాల్ చేసి చెబుతా"


"వద్దు వద్దు అంకుల్ . ఎలాగో ఇన్ని రోజులు ఆగారు కదా ఇంక కొన్ని రోజులే"


"అక్కడ మీ నాన్న నీ మీద బెంగతో బిజినెస్స్ వ్యవరాలు పట్టించు కోవడం లేదు."


"మీలాంటి నమ్మకస్తుడు ఉండగా మా బిజినెస్స్ ఢోకా లేదు."


"అది నిజమే.. నా వయసు కూడ సహకరించడం లేదు. నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నా."


"అది కాదు అంకుల్.. మీరే అన్నారుగా నేను తీసిన వీడియో సెల్ ఆచూకీ కనపడగానే ఆ విక్రమ్ కి ఇస్తే డ్రగ్స్ రాకెట్ ముఠా పట్టించిన వాడిగా నా పేరు మారిమ్రోగుతుంది అని. అప్పుడు మా నాన్న టీవీ లో చూసి తెగ సంబర పడిపోతాడు. అందుకే అప్పటివరకు మా నాన్న కు నా గురించి తెలియకుండా ఉంటే మంచిది కదా అనుకున్నాము."


"అవును నిజమే. ఆ వీడియో సెల్ దొరికిందా."


"ఎక్కడ ఉందో గుర్తుకు వచ్చింది. కాని గుర్తుకు వచ్చాక తెలిసింది.." అప్పుడు జరిగిన సంఘటన చెప్పాడు.


'నేను అప్పటికే సెల్లో వీడియో తీసే ముందు నన్ను బంధించిన రూమ్ లో నాకు మత్తు నుంచి మెలకువ రాగనే నన్ను మళ్ళీ మత్తులోకి పంపాలని మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి ఒకడిని కాపలా పెట్టారు. తర్వాత సెల్లో వీడియో తీసేటప్పుడు ఇంకోడు చూసి వీడియో తీస్తున్నాడు అని అరచాడు . అప్పటికే తీసిన వీడియో మొత్తం తీశాను . ఎలాగైన సెల్ లాక్కొంటారు అని తెలుసు. అందుకే నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్న వాడిని చితక బాది వాడికే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను.


వాడు సృహ తప్పి ఉన్నాడు. ఇంక వాడి పాకెట్ లో ఉన్న సెల్ తీసి నా పాకెట్ లో ఉన్న సెల్ అక్కడ ఉన్న చిన్న గుంతలో దాచాను. నన్ను పట్టుకోవాలని వచ్చిన వాళ్లతో పెనుగులాడతూ ఉంటే ఆ షాలిని వచ్చి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. తర్వాత నా పాకెట్ లో ఉన్న వాడి సెల్ చూసి నా సెల్ అనుకోని తీసి పగల గొట్టారు. తర్వాత నేను ఇంక మత్తులో వెళ్ళాను. మళ్ళీ చూసేసరికి ఈ ఊటి హాస్పటల్లో ఉన్నా."


"ఓ అదా జరిగింది. అయితే ఆ వీడియో తీసిన సెల్ అక్కడే గుంతలో ఉంది అన్న మాట."


"అదే నీవు ఇక్కడికి వస్తే చెబుదామని ఉన్నా. ఇప్పుడు మనం విక్రమ్ కాల్ చేద్దాం . ఆ సెల్ వీడియో ఎక్కడ దాచాను అది గుర్తుకు వచ్చిందని."


"ముందు నీవు, నేను వెళ్లి ఆ సెల్ తీసుకొని వద్దాం. తర్వాత మనమే వెళ్ళి విక్రమ్ కి ఇద్దాం." అన్నాడు లింగస్వామి.

"సరే అంకుల్ నీవు ఎలా అంటే అలా" అన్నాడు కిరణ్.


"నేను చిన్న పని చూసుకొని వస్తాను.తర్వాత ఇద్దరం ఆ వీడియో సెల్ ఉన్న స్థావరం దగ్గరకి వెళ్ళుదాము ."


"సరే అంకుల్ "


లింగస్వామి వెళ్ళిపోయాక ముగ్గురు నవ్వుకున్నారు.

"ఇంకా అసలు కథ ముగింపుకి వచ్చింది" అని కిరణ్ అన్నాడు.

"ముందు విక్రమ్కు కాల్ చేయి" అంది సుజాత.

విక్రంకు కాల్ చేసి ఇక్కడ జరిగిన సంభాషణ అంతా చెప్పాడు కిరణ్.

"మరి ఆ వీడియో తీసిన సెల్ కోసం ఆ స్థావరనికి వెళ్ళారా. సెల్ దొరికిందా " విక్రముును అడిగాడు కిరణ్.

"నేను అక్కడికి పోతున్నా, సెల్ దొరికిన వెంటనే కాల్ చేస్తా."

***

ఊటీలో నర్సింహ ఇల్లు..

లింగస్వామి తన వారినందరినీ పిలిచాడు.

అందరు వచ్చారు.

కొడుకు ఉదయ్, బావ మరిది భాస్కర్ తో పాటు వీడియో తీసినప్పుడు అందులో ఉన్న ఆ ఇద్దరు కూడ వచ్చారు.


"భాస్కర్... కిరణ్ సెల్ మన స్థావరములో ఎక్కడ ఉందో చెప్పాడు. అక్కడ పోలీస్ నిఘా ఉంది. అందుకే ముందు ఆ డ్రగ్స్ మాఫియా డాన్ దావూద్ కి చెబితే వాడే వాళ్ల వాళ్ళను పంపిస్తాడు. అక్కడ కాపలా ఉన్న పోలీసు హతం తర్వాత నేను కిరణ్ ను తీసుకుని వస్తా. మా వెనుక మీరు రండి. దాచిన గుంతలో నుండి ఆ సెల్ కిరణ్ తీయగానే ఆ దావూద్ అనుచరులకు కిరణ్ మీద ఎటాక్ చేసి హతం చేయమని చెప్పు. ఇంక కథ సుఖాంతం.

ఇక్కడ మన నర్సింహ ఎప్పటి మాదిరే గోడౌన్ ఉన్న మన మత్తు మందుల సరకు రాత్రి వచ్చే లారీల్లో రవాణ చేస్తాడు."


అందరు “సరే " అన్నారు .

కిరణ్ ను తీసుకుని లింగస్వామి డ్రగ్స్ మాఫియా ముఠా స్థావరనికి బయలుదేరాడు.వీళ్ల వెనక నుండి లింగస్వామి కొడుకు ఉదయ్ బావమరిది భాస్కర్ వాళ్ల అనుచరులతో ఫాలోఅవుతున్నారు. ఇంతలో విక్రమ్ డ్రగ్స్ రాకెట్ ముఠా స్థావరానికి వెళ్ళాడు.


కిరణ్ చెప్పిన చోట ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నాడు విక్రమ్ .


అప్పటికి కిరణ్, లింగస్వామిలు అక్కడికి వచ్చేశారు.

అప్పుడు దావూద్ అనుచరుడు ఇంకొకడు విక్రమ్ మీద దాడి చేశాడు వాడ్ని విక్రమ్ చితక బాదుతుంటే వాడు తపించుకొని లింగస్వామి దగ్గరకు వచ్చి విక్రమ్ ఆ వీడియో సెల్ తీసుకొన్నాడు చెప్పాడు. కిరణ్ లింగస్వామి దగ్గరకు విక్రమ్ వచ్చి "లింగస్వామి గారు మర్యాద లోంగిపో" అంటు పిస్తోలు పట్టుకొని జీప్లో కూర్చోబెట్టాడు .


"కిరణ్ ఇదిగో వీడియో సెల్" అంటూ చూపాడు.ఛార్జింగ్ లేదు .తర్వాత ఛార్జింగ్ పెట్టీ చూద్దామని ఆ సెల్ భద్రంగా జేబులో పెట్టుకొన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లింగస్వామి కొడుకు ఉదయ్, బావమరిది భాస్కర్ లింగస్వామిని అదుపులో విక్రమ్ తీసుకోవడం దూరం నుండి చూసి. కిరణ్ కూడ నాటకం ఆడాడని తెలిసింది. ఇప్పుడు అక్కడ మనల్ని చూస్తే ప్రమాదం అని తెలిసి వాళ్ళకు కనపడకుండా వేరే చోటులొ వుండి నరసింహ కాల్ చేసి అక్కడ ఉన్న రాజరావును సుజాతకు సంబంధించి వాళ్ల ను కిడ్నాప్ చేయమని చెప్పాడు.


నరసింహ సరే అనగానే..

కొద్ది సేపు తర్వాత నరసింహ వాళ్లను కిడ్నాప్ చేసి ఎవ్వరికీ తెలియని చోట పెట్టాను అని చెప్పాడు.

వెంటనే భాస్కర్ రివాల్వర్ పట్టుకొని విక్రమ్ జీప్ దగ్గరకి వెళ్ళి రివాల్వర్ గురి పెట్టి

"మర్యాదగా మా బావను , ఆ వీడియో సెల్ ను ఇవ్వకుంటే కిరణ్ వాళ్ల నాన్నను. సుజాత తొ పాటు ఆమె కూతురు కావ్య ఇంక వాళ్ళకు సంబందించిన వాళ్లను కిడ్నాప్ చేశాము . ఇక్కడ మీరు పిచ్చి వేషాలు వేస్తే అక్కడ వాళ్లు ఉండరు."అన్నాడు.


"మీ బావను ఇప్పుడు నీకు అప్పజెప్పుతాం కాని వీడియో సెల్ మాత్రం మీరు కిడ్నాప్ చేసిన మా వాళ్లను వదిలితేనే ఇస్తాం"

"అయితే మీ ఇద్దరు ఆ జీప్ లో కాకుండా మా కారులోనే రావాలి"

"సరే" అన్నారు విక్రమ్, కిరణ్.


తర్వాత భాస్కర్ కారులో భాస్కర్ డ్రైవింగ్ చేస్తూ లింగస్వామి ముందు వెనుక సీట్లో విక్రమ్, కిరణ్ కూర్చొని అక్కడ నుంచి బయలుదేరారు

రాజరావును సుజాతకు సంబంధించి వాళ్లను కిడ్నాప్ చేసిన చోటుకు వచ్చారు.

***

విక్రమ్, కిరణ్ నవ్వుకుంటూ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్లో విక్రమ్ రూములోకి వచ్చారు.

కిరణ్, విక్రమ్ సెల్ కి ఛార్జింగ్ అయిపోయింటే ఛార్జింగ్ పెట్టీ సెల్ లో తీసిన వీడియో చూస్తున్నారు.

వీడియో సెల్ ఉండే సమాచారం ..


కిరణ్ సెల్ లో వీడియో రికార్డు చేసేటప్పుడు లింగస్వామి తన ఫేస్ కనపడకుండా తన ముందు నిలబడి మాట్లాడుతున్న దృశ్యం మరియు మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేసిన దాంట్లో లింగస్వామి ముందు వాళ్లు చెప్పిన మాటలు..

అందులో ఒకడు డ్రగ్స్ మాఫియా డాన్ దావూద్ అనుచరులకు సంబంధించి స్థావరాలు, సౌత్ ఇండియా లో ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వాటికి తమ పార్మ కంపెనీ నుండి మత్తు మందులు ఎలా సప్లయ్ ే చేస్తారు అనేది వివరంగా లింగస్వామి వివరిస్తున్నారు అక్కడే పక్కన ఇంకొకడు వివరాలు రాసుకుంటూన్నాడు.


విడియో చూసిన విక్రమ్ "కిరణ్.. నీవు తీసిన వీడియో ద్వార

డ్రగ్స్ మాఫియా డాన్ దావూద్ తో పాటు ఆతని స్థావరాల ఉనికి ఇంక లింగస్వామి కోడుకు ఉదయ్, బావ మరిది భాస్కర్ తో పాటు లింగస్వామి వీళ్లతో ఉన్న లింకులు బయటపడ్డాయి."


"అందుకే కదా సార్ ..తాను సర్వనాశనం అవుతాను అని ఆ లింగస్వామి నేను తీసిన సెల్ వీడియో చేజిక్కించుకోవలని ఇంత ప్రయత్నం చేశాడు కాని చివరికి మనం ఆడిన నాటకం వలన మన వలలో చిక్యడో ఇప్పుడు ఆతని నమ్మక ద్రోహనికి తగిన గుణపాఠం నేర్పాం."


అప్పుడే అక్కడికి విక్రం పై ఆఫీసర్ వచ్చాడు. అతనిని చూడగానే విక్రమ్ లేచి సెల్యూట్ కొట్టాడు.


"ఇంతకు మిమ్మల్ని లింగస్వామి ఆతని అనుచరులు కిడ్నాప్ చేసిన రాజరావును సుజాత కావ్య, శివమ్మలను కిడ్నాప్ చేసిన చోటికి తీసుకెళ్ళారు కదా.. అప్పుడు వాళ్ల నుండీ ఎలా తప్పించుకున్నారు " విక్రం పై ఆఫీసర్ అడిగాడు.

విక్రమ్, ‘కిడ్నాప్ కథ ఎలా ముగిసింది అనేది వివరంగా చెబుతా’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

=====================================================

ఇంకా వుంది. . .

సంపత్ సినిమా కథలు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో. .

=====================================================

S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.




25 views1 comment

1 Comment


Lingaswami Vemuganti • 8 days ago

Good narration

Like
bottom of page