top of page

సంపత్ సినిమా కథలు - 7


'Sampath Cinema Kathalu - 7' New Telugu Web


Series Written By S. Sampath Kumar



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


గత ఎపిసోడ్ లో

పార్టీ ఇప్పిస్తానని రంగా, భీమాలను గెస్ట్ హౌస్ కి పిలుస్తాడు నారాయణ.

అక్కడ కిరణ్ మారువేషంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుంటాడు.

కిరణ్, కావ్యలు కలిసి ఉండగా సుజాత చూస్తుంది.

కావ్యను ఇంట్లో బంధిస్తుంది.

లింగస్వామితో, కిరణ్ ని అతని తండ్రి రాజారావు దగ్గరకు తొందరగా పంపెయ్యమని చెబుతుంది.


ఇక 'సంపత్ సినిమా కథలు’ ఏడవ భాగం చదవండి.


‘ఈ శివమ్మకు కావ్య అంటే పిచ్చి ప్రేమ. నేను లేనప్పుడు కావ్య రూముకు వేసిన గొళ్లెం తీసి కావ్యను బయటకి పంపినా పంపుతుంది’ అని కావ్య రూముకు తాళం వేసి ఎవ్వరికి కనపడకుండా దాచింది సుజాత.

కావ్య తన సెల్ కోసం వెతుకుతూ ఉంది.

తర్వాత గుర్తుకొచ్చింది, కారులో అమ్మ సెల్ గుంజుకొంది అని.

వెంటేనే " ముసలి. . ముసలి. . " అంటూ శివమ్మను పిలిచింది.

“నా సెల్ అమ్మ తీసుకొని ఎక్కడ పెట్టిందో ?”

"ఏమోనమ్మ. . అమ్మ ఉన్నప్పుడే అమ్మ రూములోకి వెళ్తాను, అయినా అమ్మ ఇంట్లో లేదు కదా. . చూసి వస్తా" అంటూ శివమ్మ సుజాత రూములోకి కెళ్ళింది. కానీ సెల్ ఎక్కడా కనపడలేదు.

"లేదమ్మా. . సెల్ మీ అమ్మ రూములో మరి ఎక్కడ పెట్టిందో"

"పోనీలే’

నా పాస్ వర్డ్ మమ్మీకి తెలియదు. కాని కిరణ్ తో కనీసం సెల్ లో మాట్లాడానికి కుదరడం లేదు. ఎలా. . అనుకుంటూ అలా కిరణ్ గురించి ఆలోచిస్తు బెడ్ మీద వాలి పోయింది.

అప్పుడే ఇంటికి వచ్చిన సుజాత కూడ తన రూములోకి వెళ్ళి, కుర్చీలో కూర్చొని కావ్యకు అసలు విషయము ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ అలా ఉండి పోయింది.

ఇంక కిరణ్ డాక్టర్ సుధ దగ్గరికి వెళ్లి తన ప్రేమను మీరే గెలిపించాలని అడిగే సరికి ఆమె సుజాత గురించి చెబుతూ అసలు నిజం చెప్పే ముందు ఈ కథ విను అంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది.

"ఊటి లో పుట్టి పెరిగిన సురేందర్, రాజారావు, లింగస్వామి ముగ్గురూ మంచి స్నేహితులు. లింగస్వామి బీద కుటుంబం నుంచి వచ్చినా, వీళ్లతో కలసి చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితుడుగా కాకుండా ఒక నమ్మకస్తుడుగా రాజరావుకు బాగా దగ్గర అవడం వలన ఊటిలో రాజారావు సురేందర్ లు కలసి చెసే తేయాకు తోటల పెంపకం సంబందించిన బిజినెస్ లింగస్వామి చూసుకొనేవాడు.

సురేందర్ చెల్లెలు డాక్టర్ సుజాత, రాజారావులు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ సంగతి మీ అన్న సురేందర్ కు చెప్పి పెండ్లి చేసుకుందాం అన్నాడు రాజారావు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. . సురేందర్ తో ప్రాబ్లం ఉండదు, పెండ్లికి. . అనుకుంది సుజాత. ఒక రోజు గెస్ట్ హౌస్ కి సుజాత, వాళ్ల అన్న సురేందర్ కోసం వచ్చింది. కాని అక్కడ రాజరావు ఒక్కడే ఉన్నాడు. రాజరావు అప్పుడు కాస్త మందు మీద ఉన్నాడు. ఎలాగో పెండ్లి చేసుకుంటాం అని సుజాతను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇంక సురేందర్ కి చెప్పి పెళ్ళి చేసుకుందాం అనుకునే లోపల సురేందర్ కు వీళ్ల ప్రేమ విషయం తెలియక ముందే ఒక కారు ఆక్స్ డెంట్ జరిగి చనిపోయాడు.

ఇంతలో రాజరావు, హైదరాబాద్ లో మామయ్యకు బాగా లేదని వెళ్లి హైదరాబాద్లో బాగా అస్తిపరులు అయిన తన మామయ్య కూతురును పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇల్లరికం అల్లుడుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇంకా అనేక బిజినెస్ లు చేసి కోట్లు సంపాదించాడు రాజరావు. తనను ప్రేమించి, దొంగతనంగా పెళ్లాడి, తనను తల్లిని చేసి, ఇంకో పెళ్ళి చేసుకున్న రాజారావు మోసం చేశాడని కోపంతో మాట్లాడం ఇష్టంలేక అతనికి దూరంగా ఉంది సుజాత.

తాను ఎలాంటి పరస్థితుల్లో ఇంకో పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని సుజాతకు చెప్పాలని ప్రయత్నం చేసినా లాభం లేక ఊటీకి పోవడమే మానుకొన్నాడు రాజారావు. . ఊటీలో ఉన్న బిజినెస్ అంత లింగస్వామికే అప్పజెప్పినాడు. తర్వాత ఊటీీ లో బిజినెస్ లింగ స్వామి చూసుకునేవాడు. ఊటిలో ఈ హాస్పటల్ రాజారావు, తన అన్న సురేందర్ లు కట్టించింది కావడం వలన సుజాత ఈ హాస్పిటల్ చూసుకుంటుంది.

ఆమె మంచితనం వలన హాస్పటల్ కి మంచి పేరు వచ్చింది. లింగస్వామి కూడ హైదరాబాద్లో బిజినెస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు అయినా ఊటిలో తేయాకు తోటల పెంపకం బిజినెస్ నడిపిస్తూ అప్పుడప్పుడు ఊటీకి వెళ్లివస్తుంటాడు. రాజారావు, సురేందర్ చనిపోయాక ఊటీకి పూర్తిగా రావడం బంద్ చేశాడు.

ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత అసలు నిజం తెలిసింది కదా. "

అంతే! కిరణ్ ‘అక్కడ ఉండలేక పోతున్నాను’ అని చెప్పి హాస్పటల్ కు వచ్చాడు.

అలోచిస్తూ ఉన్న సుజాత దగ్గరకి శివమ్మ కాఫీ కప్పుతో మెల్లగ వచ్చి "ఏమీ తినలేదు. కాఫీ అన్నా తాగు"

శివమ్మ పిలుపు కు ఈ లోకం లోకి వచ్చిన సుజాత కాఫీ కప్పు అందుకొని కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యీ నెక్ట్స్ అలస్యం చేయకుండ కావ్యను పిలచి అసలు నిజం చెప్పాలని మనసులో అనుకుంది.

ఇంతలో శివమ్మ

"అమ్మా! ఏమీ అనుకోనంటే ఒక్క మాట, కావ్యకు నచ్చిన వాడిని చేసుకుంటే మనం అంతగా బాధ పడలిసిన అవసరము ఏమి ఉంది"

"నీకేం తెలుసు, అది ఎవ్వరిని ప్రేమించింది తెలుసా, వింటే మతిపోతుంది. "

"అమ్మా! మీరు చెప్పేది ఏమీ అర్థం కావటం లేదు”

“అది ప్రేమించిన కిరణ్ ఎవరో తెలుసా? నా మెడలో తాళికట్టి ఒక బిడ్డకు జన్మ నిచ్చి నన్ను మోసం చేసిన ఆ రాజారావు కొడుకే ఈ కిరణ్. "

"అమ్మా! నిజమా. . అయితే ఆ దేవుడి లీల విచిత్రం. నేనొక నిజం చెబుతా. " అంటూ “కావ్య మీ కూతురు కాదు” అంది.

"ఏమే. . పిచ్చి పట్టిందా, వాళ్లద్దిరి వావి వరసలు మరచిపోడానికి కొత్త నాటకం తెర లేపావా"

"అమ్మా! నిజం చెబుతున్నా. ఈ నిజం నాలోనే ఉండి నా చావుతో పోతుంది అనుకున్నా. కాని నిజం కదమ్మా. . అది నిప్పులాంటి. ది మనం దాచాలనుకున్న దాగదు అని ఆ దేవుడు ఇప్పుడు ఇలా బయటకు తెస్తాడు అనుకోలేదు. అంత ఆ దేవుడులీల" అంది.

"ఏమి నీవు చెప్పేది"

"అసలు నిజం చెబుతా విను. నేను పని చేస్తున్న నర్సింగ్ హోంకి రాజారావ్ నీకు పురిటి నొప్పులు వస్తుంటే కాన్పుకు తెచ్చారు కదా!

అప్పుడే నా కూతురు కూడ ఆదే సమయంలో పురిటి నొప్పులు వస్తే వచ్చింది. ఆ రాత్రి లేడీ డాక్టర్ వచ్చేంత లోపల ఒక పది నిమిషాలు తేడాతో ఇద్దరూ ఆడ పిల్లలని ప్రసవించారు. కాని నీకు జన్మించిన పాప పురిటి లోనే పోయింది. అప్పుడు నేను ఎలాగో నా కూతుర్ని మగడు

వదిలేసి వెళ్లిపోయాడు. . ఇంక ఆమెకు పుట్టిన పాపను పెంచడం కష్టమని అలాగే చనిపోయిన పాపను మా కూతురు దగ్గర, బ్రతికి ఉన్న పాపను మీ దగ్గర మార్చాను. ఎందుకంటె నా మనమరాలు సిరి సంపదలతో సుఖంగా పెరుగుతుందని. .

ఇంక నేను కూడ మీ ప్రేమకు ఎందుకు దగ్గర అయ్యానంటే నా కూతురు కూడ అనారోగ్యంతో కొన్నాళ్ళకే పోయింది. ఇంక మనమరాలిని చూసుకుంటూ మీ దగ్గర బ్రతికినంత కాలం ఉండవచ్చు అనుకున్నా. తర్వాత రాజారావ్ మిమ్మల్ని మోసం చేసినా, నా మనమరాలికి నీ దగ్గర సంతోషముగా వుంటుంది అని నమ్మకం ఉంది. అంత కన్నా ఎక్కువ గా కావ్య కోసం నీవు బ్రతుకు తున్నావని తెలుసు.

ఇప్పుడు ఆ రాజారావు మీద కోపం ఉన్నా అది దూరం చేసుకొని అతని దగ్గర అయి, నా మనమరాలిని ఆ కిరణ్ ను ఒకటి చేయండమ్మా! "

"శివమ్మా! నమ్మలేని నిజం చెప్పావు. నిజంగా ఆ దేవుడి లీల. అవును నిజం నిప్పలాంటిది. ఆ దేవుడికే తెలుసు ఎప్పుడు ఎలా బయట పెట్టాలో. బాబా. . నిన్ను నమ్ముకుంటే ఏ సమస్య అయినా తీరే పోతుంది" అనుకుంటూ దేవుడి రూములోకి వెళ్ళి సాయిబాబాను తనవి తీరా మొక్కింది సుజాత.

సుజాతమ్మ ఆ బాబాను మొక్కిందంటే కావ్య ప్రేమ కథ సుఖాంతమైనట్టే అని శివమ్మ సంతోషపడింది.

"అసలు నిజం కావ్యకు తెలిసింది. అమ్మ అత్త అయినా, నాకు అమ్మే” అంటూ “అమ్మా! కిరణ్ దగ్గరకు వెళ్ళుతా" అంది.

సుజాత "సరే " అంది.

సైకిల్ ఎక్కి కిరణ్ ఉన్న హాస్పిటల్ వెళ్ళింది కావ్య.

కావ్య రాకను చూసి అసలు విషయము తెలిసినా ‘ఎందుకు కావ్య వస్తుంది. తాను కూడా తెలిసిన నిజం చెప్పడానికి వస్తుందా. ’ అనుకోని

కావ్య రాగనే డల్ గా ఉండకూడదు అనుకోని లేని నవ్వు తెచ్చుకొని సెల్ లో మాట్లాడుతూ మధ్య మధ్యలో నవ్వూతు కావ్య తన ముందు వచ్చి నిల్చున్నా తెలియనట్టు ఉన్నాడు.

అది గమనించి కిరణ్ కావాలని నటిస్తున్నాడని తెలుసుకొని అతని సెల్ లాక్కొని "కనపడకుంటే ఏమైపోయింది అని కనీసం తెలుసుకొనే ప్రయత్నం కూడా చెయ్యవా" కాస్త కోపం తెచ్చుకొని అంది.

ఏమిలా మాట్లాడుతుంది అనుకోని

"మన ప్రేమబంధం రక్త సంబంధంతో ముడి పడి ఉంది. అందుకే మీ అమ్మ మనల్ని కలవకుండా చేసింది"

"అవునా ఆ రక్త సంబంధం ఏమిటో చెప్పు"

"నా నోటి నుండి ఎందుకు. . మీ అమ్మనే ఆడుగు" అన్నాడు కిరణ్.

"అయితే మా అమ్మ మన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది మరి? నీ దగ్గర కు ఎందుకు ఇప్పుడు పంపింది"

"అవునా, మరి సుధ ఆంటీ చెప్పిన నిజం. . " అంటూ బుర్ర గొక్కున్నాడు కిరణ్.

"బుర్ర ఏమీ గొక్కుకున వద్దు. అసలు నిజం చెబుతా విను" అంటూ శివమ్మ అమ్మ కు చెప్పిన నిజం. . తాను సుజాత కూతురు కాదని, శివమ్మ మనమరాలు అని అసలు నిజం చెప్పింది కావ్య.

కిరణ్ ఒక్కసారి నిట్టూర్చి

"ఓ గాడ్ " అంటూ అనందంతో కావ్యను కౌగలించుకొన్నాడు.

***

మెరుపు టీవీ ఛానల్. .

యాంకర్ నిరుపమ తనదైన స్టైల్లో

‘సంచలన మెరుపు వార్తల నేపథ్యంలో ఈ రోజు కేవలం మెరుపు టీవీ అందిస్తున్న సంచలన వార్త.

బ్రేకింగ్ న్యూస్. .

డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు. .

క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి విక్రమ్ రెడీ టూ అటాక్ ఆపరేషన్ తో. .

ఊటీలో ఒక హాస్పిటల్ వెనుక రహస్యంగా ఎర్పాటు చేసుకున్న డ్రగ్స్ రాకెట్ స్థావరం మీద మెరుపుల దాడి చేసి అక్కడ నిల్వ ఉంచిన మత్తు పదార్థాలు గుట్టు రట్టు చేశారు. అక్కడ ఉండే వారిని అరెస్ట్ చేసి క్రైమ్ బ్రాంచ్ సీక్రెట్ రూమ్లోకి మిగత వివరాలు సేకరించడానికి తీసుకొచ్చాడు విక్రమ్.

ఈ ముఠా గుట్టు రట్టుకి తోడ్పడి ఎందరో యువతి యువకులను మత్తు నుంచి విముక్తి చేసిన యువ పారిశ్రామిక వేత్త కిరణ్, అతనకి సహకరించిన డాక్టర్ సుజాతలను యావత్ ప్రపంచం అభినందిస్తున్నాది. ఇప్పుడు మీరు ఆ కిరణ్ గురించి తెలుసుకోవాలని వుంది కదా. అయితే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది అనేది మేము సేకరించి అందించే ఈ కథనాలు చూడండి. ఇది కేవలం మెరుపు టీవీ అందిస్తుంది’

అనగానే ముందుగా కిరణ్ హుందాగా నడుచుకుంటూ వచ్చేది కనపడుతుంది.

తర్వాత ‘ఐ యామ్ కిరణ్’ అని చేయి ఎత్తి ఊపగానే

ఇంక ఫ్లాష్ బ్యాక్. .

హైదబాద్ లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారావు కొడుకు కిరణ్ అమెరికాలో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి తన తండ్రి చేస్తున్న బిజినెస్ వ్యవరాలు చూసుకోడానికి ఇండియాకు వస్తున్నాడు. .

కిరణ్ ఏర్ పోర్ట్ నుండి కారులో ఇంటికి వచ్చాడు. .

రాజారావు, అతని ప్రాణ స్నేహితుడు లింగస్వామి మిగతా ప్రముఖులు స్వాగతము చెప్పగానే అందరికి నమస్కారాలు పెట్టుకుంటు వచ్చి తండ్రి రాజరావు కాళ్ళకు తర్వాత లింగ స్వామి కాళ్ళకు మొక్కాడు. తర్వాత లింగస్వామి మాట్లాడుతూ "ఈ రోజు కిరణ్ బాబు రెస్ట్ తీసుకుంటాడు రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మీటింగ్ లో రాజారావు తన చేర్మన్ పదవీ కిరణ్ కు అప్పజెప్పి తర్వాత బిజినెస్ వ్యవరాల చర్చ తర్వాత పార్టీ. " అని చెప్పగానే అందరు వెళ్ళిపోయారు.

కిరణ్ రూములో బెడ్ మీద రెస్ట్ తీసుకోని లేద్దాం అనుకొంటు వుండగ కాల్ వచ్చింది

ఎవరా. . అనుకుంటూ సెల్ చుస్తే ‘బెంగళూర్ వినయ్’ అని కనపడగానే లిఫ్ట్ చేసాడు.

"హై కిరణ్ ఎలా ఉన్నావురా"

"బాగున్నా"

"ఎలా ఉంది బెంగళూర్, "

"బెంగళూర్ కేమి సూపర్ గా ఉంది. అమెరికాకు పోయినప్పటినుండి బెంగళూర్ రాక చాలా రోజులైంది. రేపు వచ్చేయి"

"అమ్మో, అప్పుడే. . ఒక నాలుగు రోజుల తరువాత. . కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. "

"ఆరే. . నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశాను తెలుసా? మా చెల్లి పెళ్లి అనుకోకుండా సెటిల్ అయ్యింది. రేపే ముహూర్తం బాగుందని పెళ్లి చేస్తున్నారు. మళ్ళీ పెళ్ళికొడుకు అమెరికాకు పోతున్నాడు. ఎలాగో నీవు ఇండియాకు వచ్చావు కాబట్టి తమరు ఎలాగైనా రావలెను. లేకుంటే ఈ ప్రియ మిత్రుడు చాలా బాధ పడతాడు. "

కిరణ్ కు మళ్ళీ మాట్లాడే ఛాన్స్ యివ్వకుండా స్పీడ్ గా చెప్పాడు వినయ్.

ఇండియా కు వచ్చాడు. పెళ్లి కి బెంగళూర్ పొక తప్పదు.

బయట హాలులో తండ్రి రాజారావు, లింగస్వామి మాట్లాడుకుంటున్నారు.

కిరణ్ అక్కడికి వచ్చి వినయ్ చెళ్ళి పెళ్లి గురించి చెప్పాడు.

"నాకేమీ తెలియదు. . అంత మీ అంకుల్ లింగస్వామి ని అడుగు"

"దానిదేముంది, పెళ్లికి వెళ్ళిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నీవు వచ్చాక తీరిక ఉన్నాకే పెట్టుకుందాం".

"థాంక్స్ లింగం అంకుల్" అని చెప్పి బెంగళూర్ పోడానికి రెడి కావడానికి తన రూములో కి వెళ్లాడు.

రాజారావు ఇంటి బయట ఉన్న గార్డెన్ లోకి లింగస్వామి వచ్చి తన మొబైల్ నుండి కాల్ చేసాడు.

‘ మనం చేయాలనుకున్న పనికి ఇంత తొందరగా అవకాశంవస్తుంది అనుకోలేదు. ఇప్పుడు వచ్చింది’ అంటూ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు.

కిరణ్ బెంగళూర్ ఏర్ పోర్ట్ లో దిగి అలా బయటకు వచ్చిన వెంటనే షాలిని అనే అమ్మాయి ‘హలో కిరణ్’ అని పలకరించింది.

"మీరు ఎవరు"

"నేను మీ ఫ్రెండ్ వినయ్ చెల్లెలు ఫ్రెండ్ను. నా పేరు షాలిని"

"మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు"

"మీరు నన్ను చూడలేదు కాని నేను మిమ్మల్ని చాలా సార్లు అంటే వినయ్ ఇంట్లో చూసాను”

“ఔనా, మరి ఒక్కసారి కూడ పలకరిచుకొలేదు. . ”

“అదా మీ సందేహం. . ఎప్పుడు వినయ్ వాళ్ల ఇంటికి వచ్చినా మందు పార్టీలో ఉండేవాళ్లు. అప్పుడు మేము అటు వచ్చే వాళ్ళం కాదు"

"ఓహ్ అలాగ"

"వినయ్ కార్ తెచ్ఛాడా!"

"లేదు నేనె క్యాబ్లో వస్తా అన్నా"

"అయితే రండి. మా కార్లో డ్రాప్ చేస్తా"

"వద్దు నేను క్యాబ్లో వెళ్ళుతా"

"పర్వాలేదు. నేను కూడా పోయేది అటువైపే"

ఎందుకో షాలిని మీద అనుమానం రాలేదు. అలాగే బెంగళూరు దిగిన వెంటనే వినయ్ కు కాల్ చేసి చెప్పే అలవాటు కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్లినా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేయడం అలవాటు.

=========================================================

ఇంకా వుంది. . .

సంపత్ సినిమా కథలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో. .

=========================================================

S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link





Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.




46 views0 comments
bottom of page