top of page

సంపత్ సినిమా కథలు - 8


'Sampath Cinema Kathalu - 8' New Telugu Web

Series Written By S. Sampath Kumar

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

కావ్య తన కూతురన్న నిజం చెబుతుంది శివమ్మ.

దాంతో కిరణ్, కావ్యల ప్రేమకు అడ్డు తొలగుతుంది.

మెరుపు టివి ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది.

క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి విక్రమ్, కిరణ్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపెడతాడు.


ఇక 'సంపత్ సినిమా కథలు’ ఎనిమిదవ భాగం చదవండి.

షాలిని మీద నమ్మకంతో ఆమె కార్లో బయలు దేరాడు కిరణ్.

అలా షాలినితో పాటు కార్లో వెళుతున్న మధ్యలో వినయ్ చెల్లెలు తనకు ఎలా ఫ్రెండ్స్ అయినది చెబుతుంది. వింటూనే ఆమె ఇచ్చిన చాక్లెట్ తిన్న తరువాత కిరణ్ కు ఏమైందో తెలియదు. లేచి చూసేసరికి ఒక పాడుబడిన ఒక బంగ్లాలో ఒక రూము లో ఉన్నాడు. అప్పుడు తాను తిన్నది మత్తు చాక్లెట్ అని, మోసపోయి వచ్చానని తెలుసుకున్న కిరణ్ మత్తు నుండీ నిద్ర లేచేసరికి చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరు. నెమ్మదిగా లేచి ఆ రూంలో నుండీ బయటకి వచ్చి చూస్తే ఒక పెద్ద హలూ, కొంతమంది యువతీ యువకులు మత్తులో మునిగి తేలుతున్నారు.


అప్పుడు కిరణ్ కి అర్థం అయ్యింది. ఎవరో తెలిసిన వారే నన్ను కిడ్నాప్ చేసి ఈ డ్రగ్స్ మాఫియా ఉచ్చులో నెట్టాలని చేస్తున్నారు అని. తెలివిగా ఇక్కడ నుండి తప్పించు కొని వీళ్ళ గుట్టు రట్టు చేయలని మత్తులో ఉన్న యువతీ యువకులు ఫోటోలు, వీడియో సెల్ ద్వారా తీశాడు. తర్వాత ఇంకో రూమ్ లో కి వచ్చి చూస్తే ఒక పెద్ద మనిషి.. ఫేస్ సరిగా కనపడలేదు.. అతని ముందు ఉన్న ఇద్దరు డ్రగ్స్ సరఫరా గురుంచి వివరిస్తూ ఉన్నారు. అది కూడా వాళ్లు మాట్లాడుతుంటే వీడియో రికార్డు చేశాడు. వాతావరణం సైలెంట్ గా ఉంది కాబట్టి వాళ్లు మాట్లాడే మాటలు సృష్టంగా రికార్డ్ అయ్యాయి.


అక్కడ నుంచి ఎలాగైనా తప్పించు కొందామని అనుకొనే లోపల అప్పుడే బయట నుంచి వస్తున్న ఒకడు చూసి గట్టిగా అరచాడు. ఆ అరుపు విని కిరణ్ పారిపోతుంటే చుట్టు నలుగురు వచ్చి పట్టుకొన్నారు. వారినుంచి పెనుగులాడుతూ ఉంటే సెల్ అక్కడ ఉన్న చిన్న గుంతలో పడి పోయింది. ఆ సెల్ కనబకుండా అక్కడ ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ము ఆ గుంత మీదకు నెట్టాడు. తర్వాత షాలిని వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అంతే మత్తులోకి జారిపోయడు. తర్వాత ఇంక అప్పుడే విక్రమ్ తన పోలీస్ బృందంతో ‘రెడీ టూ ఎటాక్’ ఆపరేషనుతో అక్కడ ఎటాక్ చేశాడు.


అప్పుడు కొందరు చని పోయారు. మిగతా వాళ్లు తప్పించుకొన్నారు కాని దొరక లేదు. ఆధారాలు దొరక్కున్నా అక్కడ డ్రగ్స్ లో కూరుకున్న యువతీ యువకులను రక్షించి, వాళ్లను ఒక పోలీసు వ్యాన్ లో, కిరణ్ మాత్రం విక్రమ్ జీప్లో వస్తుంటే ఆ జీప్ ను ఒక లారీ వచ్చి గుద్దింది. అది డ్రగ్స్ రాకెట్ ముఠా లీడర్ చేయించాడని తెలియదు. ఆ ఆక్సిడెంట్ జరగిన వెంటనే ఆ డ్రగ్స్ రాకెట్ ముఠాలోని ఇద్దరు కోమాలో ఉన్న కిరణ్ దగ్గరకు వచ్చి వీడియో తీసిన సెల్ కనపడుతుందేమో అతని పాకెట్స్, తర్వాత ఆ చుట్టు పక్కల అంతా వెతికారు. వాళ్ళకు సెల్ దొరకలేదు. ఇంక ఆ సెల్ ఎక్కడ ఉంటుందో అర్థం కాలేదు. ఇంక కిరణ్ సృహలో వస్తే ఆ సెల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది.


క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఆ సెల్ కోసం వెతుకుతున్నాడని సృహాలోకి వచ్చిన కిరణ్ ఆ సెల్ ఎక్కడ ఉందో చెప్పాలనుకొని లింగస్వామి అంకుల్ కు కాల్ చేసి చెబుదామని అనుకున్నాడు. అప్పుడే విక్రమ్ కాల్ చేసి “అసలు ఆ ముఠాతో లింగస్వామికి లింక్ ఉంది. అన్ని విషయలు నేను అక్కడికి వచ్చి చెబుతా” అన్నాడు.


అక్కడకు వచ్చిన విక్రమ్ “లింగస్వామి మనషుల నిఘా ఉంటుంది కాబట్టి నీవు ఎలాగైనా బయటకు రా. నా మనిషి ఒకడు వచ్చి నిన్ను పలనా చోటుకు తీసుకొని వస్తాడు. అక్కడ నీకు అసలు విషయము చెబుతా” అని కిరణ్ కి కాల్ చేసి చెప్పాడు.


కిరణ్ సైకిల్ తీసుకోని విక్రమ్ ఉండే చోటుకు వచ్చాడు. అక్కడ అసలు విషయం కిరణ్ కు చెప్పాడు విక్రమ్. రాజారావుకి లింగస్వామి చాలా నమ్మకస్తుడు. రాజారావు బిజినెస్, ఆస్తుల వ్యహారాలూ అన్ని అతనే చూసుకుంటాడు. ఇంక రాజారావు కొడుకు కిరణ్ కు తన బిజినెస్, ఆస్తుల వివరాలు అంతగా తెలియవు.


ఒక రోజు లింగస్వామి బావమరిది భాస్కర్ వచ్చి

"బావ. . . మంచి బిజినెస్ ఉంది మొదలు పెడుదాం. ఎన్ని రోజులు ఒకరి కింద బానిస పని చేస్తావు. ఈ రోజు రాజారావు వున్నాడు. రేపు కొడుకు కిరణ్ వచ్చి బిజినెస్, ఆస్తుల వ్వహారంలో తల దురుస్తాడు. తర్వాత నీ పెత్తనం ఏమి ఉండదు. ఇంక నీ కొడుకు కూడ కిరణ్ దగ్గర గుమస్తా ఉండవలసిందే. " అన్నాడు.


అక్కడే ఉన్న లింగస్వామి కొడుకు"అవును నాన్నా, మామయ్య చెప్పింది నిజం. నేను నీలా గుమస్తాగా ఉండే కన్నా బిజినెస్ చేస్తాను" అన్నాడు.


ఇద్దరి మాటలు విన్నాక

"బిజినెస్స్ అంటే కోట్లతో పని. ఇప్పుడు ఆస్తులు లేకున్నా హుందాగా తిండికి లోటు లేకుండా బ్రతుకుతున్నాం " అన్నాడు లింగస్వామి.


"బావ. . ఇప్పుడు నీ వయసుతో ఆలోచించవద్దు మా భవిష్యత్ గురించి అలోచించు. ఇంక పెట్టుబడి అంటావా. ఎలాగో నీవంటే నమ్మకం ఉన్న రాజరావును అడుగు. "


"నాకు ఒకసారి బిజినెస్ కోసం పెట్టుబడి పెట్టాడు, అది లాస్ అయ్యింది కదా.. మళ్ళీ ఇప్పుడు అడుగుతే బాగుండదు. "


"అబ్బా నాన్నా.. ఎప్పుడో ఒకసారి అలా జరిగింది అని ఇప్పుడు అలా జరుుతుంది అని భయపడితే ఇంక మన బ్రతుకులు అంతే. "


ఇద్దరూ బలవంతం చేస్తే "సరే సరే" అన్నాడు లింగస్వామి.

రాజారావు చాలా ఆనందంగా ఉన్నాడు, ఒక బిజినెస్ లో కోట్ల లాభం వచ్చిందని.

అప్పుడే లింగస్వామి వచ్చాడు.

"ఆరే లింగ.. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మందు తాగాలి. "


"మనం వారానికి ఒక్కసారి అనుకున్నాం. అది కూడ రెండే రెండు పెగ్గులు. ఇంక మన మందు వారం రావడానికి 4 రోజులు ఉంది. "


"ఔను, లాభం లేదు అనుకున్న మన బిజినెస్ లో అనుకోకుండా లాభాలు వచ్చాయి. "


రాజరావు మంచి మూడ్ లో వున్నాడు. ఇప్పుడే తన కొడుకు బిజినెస్ కు పెట్టుబడి అడిగే అవకాశం అని మందు ఏర్పాటు చేశాడు.


ఇద్దరు మందులో కూర్చొని రెండు పెగ్గులు తర్వాత

లింగ స్వామి "నా కొడుకు ఎంబీఏ కంప్లీట్ చేశాడు కదా, బిజినెస్ పెడుడమని అనుకుంటున్నాడు. మరి పెట్టుబడికి నీవే ఎలాగైనా సహాయం చెయ్యాలి" అన్నాడు.


లింగస్వామి ఆ మాట అనగానే రాజరావు బిగ్గరగా నవ్వుతూ

"ఒరే లింగ.. నీకే బిజినెస్స్ లో కలసి రాలేదు. ఇంక నీ కొడుకు కి ఏమీ కలసి వస్తుంది. నా మాట విని మీ వాడ్ని బుద్ది గా మా కిరణ్ దగ్గర అసిస్టెంట్ గా చేరమను. మంచి జీతం వస్తుంది. హాయిగ ఉండ వచ్చు. " లింగస్వామి దగ్గర ఉన్న చనువు తో అన్నాడు.


రాజరావు మాటలకు లింగస్వామి నొచ్చుకున్నాడు కాని ఏమీ అనలేదు. ఇప్పటి తన కోపం తనకే నష్టం అని "సరేలే రాజా. ఒక రకంగా నీవు చెప్పేది కూడ నిజమే" అన్నాడు.

రాత్రి లేట్ గా వచ్చిన లింగస్వామిని డిస్ట్రబ్ చేయడం ఎందుకు.. ఉదయం అతనే చెబుతాడు అని లింగస్వామి కొడుకు ఉదయ్, బావమరిది భాస్కర్ అనుకొన్నారు.

ఉదయం కొడుకుని, బావమరిదిని పిలిచాడు లింగస్వామి.

శుభ వార్త చెబుతాడు అనుకున్నారు. లింగస్వామి రాజరావుకి, తనకు మధ్యన జరగిన సంభాషణ చెప్పాడు.


"ఒరే బావ మరిది, నా కొడుకు ఉదయ్ ఎదగాలి. ఆ కిరణ్ కన్నా గోప్ప వాడు కావాలి ఎలా ఎలా" కోపంగా అన్నాడు లింగస్వామి.


"బావ.. ఎదో నమ్మకంగా రాజరావు దగ్గర పని చేస్తున్నావు కదా అని ఉదయ్ పెట్టే బిజినెస్ కు పెట్టుబడి అడుగు అన్నా. కాని నిన్ను ఇంతగా అవమాన పరుస్తాడు అనుకోలేదు. ఆ రాజరావు కన్నా ఎక్కువగా నీవు ఎదగాలంటే ఒక బిజినెస్ ఉంది. అది మంచి చెడులకి సంబంధించిన బిజినెస్. ఈ బిజినెస్ పకడ్బందీ ప్లాన్ తో నడిపుతే ఆరు నెలలలో కోట్ల కు పడగెత్తవచ్చు. "


"అవునా, అయినా పెట్టుబడి ఎలా"


"ఒకడు ఉన్నాడు. రేపు అతని దగ్గరకు వెళ్ళుదాం. అతనే ప్లాన్. చెబుతాడు"


"సరే. ఇక నుంచి ఆ పని మీద ఉండు. మరి బిజినెస్ ఎదో చెప్పలేదు"


"ఇది సుమారు వందల కోట్ల బిజినెస్ అదే బావ..

నేను ఎప్పటినుంచి పార్మారంగం బిజినెస్ చేద్దామనుకున్నా కదా. ఇంక ఆ బిజినెస్ లో దగ్గు మందు టానిక్ దానితో పాటూ చేసే చెడు బిజినెస్ మత్తుమందుల తయారు. చూడటానికి మంచి బిజినెస్ చేస్తున్న ప్రచారం.. వెనక చెడు ఈ మత్తుమందుల బిజినెస్. ఆ రాజారావు కొన్నేళ్లు కష్టపడి కోట్లు సంపాదిస్తే మనం ఒక్కఏడాదిలో అతనికి మించి సంపాదించవచ్చు. "


"ఎలా ప్లాన్ వేస్తవో తెలియదు. నా కోపం చల్లారక ముందే పనులు చక చక జరిగి పోవాలి. "


లింగస్వామి, ఉదయను తీసుకోని ఒక ఫైనాన్షియర్ దగ్గరకు వచ్చాడు భాస్కర్.


"నేను ఫైనాన్స్ ఇవ్వను కాని బ్యాంక్ లోన్ ఇప్పిస్తా.

వందల కోట్ల బిజినెస్ అంటే బ్యాంక్ పార్మలిటిస్ చాలా ఉంటాయి. కాని షురిటీ కింద లాండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా. "


"ఆ లాండ్ ఉంటే అమ్మి బిజినెస్ చేసేవాళ్ళం. ఇంక అప్పు ఎందుకు" అన్నాడు లింగస్వామి కొడుకు ఉదయ్.


"వందల కోట్ల లోన్ కావాలంటే బ్యాంక్ కు విలువైన స్థిర ఆస్తులు షూరీటి చూపించాలి. అన్నీ వున్నా బ్యాంక్ లోన్ శాంక్షన్ చెయ్యరు. అది మా లాంటి వాళ్లవలనే సాధ్యమవుతుంది. ముందు బిజినెస్ చేసేవాళ్లకు ఈ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇలాంటి వాళ్లను తెచ్చే ముందు అన్ని చెప్పి తీసుకుని రావాలి భాస్కర్. . . అనవసరంగా నా టైమ్ వెస్ట్. " అంటూ విసుక్కున్నాడు ఫైనాన్షియర్.


"సారి అన్నా, పిల్లోడు. వాడికి తెలియదు. కాని లాండ్స్ ఏమి లేవు. ఇంక ఏదైనా మార్గం చెప్పు"


"మీకు లాండ్ లేకున్నా ఇంక మీ వాళ్లవి ఎవరికైనా ఉన్నా పరవాలేదు"


"మా ఫ్రెండ్ లాండ్ డాక్యుమెంట్స్ ఇస్తాడు. కాని అతను బ్యాంక్ కు రాడు. మీరే బ్యాంక్ వాళ్లతో మాట్లాడి లోన్ శాంక్షన్ చేయించాలి. " అన్నాడు లింగస్వామి.


"ఇలా అన్నావు బాగుంది కానీ మీరు పెట్టబోయే కంపెనీకి షురిటీ కింద నా లాండ్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను అని మీ ఫ్రెండు ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టీ రాసివ్వమను. లోన్ వచ్చే ఏర్పాటు బ్యాంక్ వాళ్లతో మాట్లాడి చేస్తా" అంటూ బ్యాంక్ లోన్ ఇప్పించే బ్రోకర్ తో మాట్లాడాడు.


తర్వాత బ్యాంక్ లోన్ ఇప్పించే బ్రోకర్ "ఒకే” అని కాస్త ఆలోచించి “దొంగ డాక్యుమెంట్స్ కాదు కదా" అన్నాడు.


"లేదు, డాక్యుమెంట్స్ పక్కా. అవి ఊటీలో తేయాకు తోటలకు సంబందించిన ల్యాండ్స్"


"సరే ఊటీకి వెళ్ళి ఆ తేయకు తోటల లాండ్ చూశాక చెబుతా”


లింగస్వామి, ఫైనాన్షియర్, భాస్కర్ బ్యాంక్ లోన్ ఇప్పించే బ్రోకర్ నలుగురు కలిసి ఊటిలో రాజరావు తేయాకు తోటల లాండ్ చూసి వచ్చారు.


"లోన్ ఇప్పిండానికి సిద్దంగా ఉన్నాము. మీకు షురిటి ఇచ్చే ఆ లాండ్ ఒనర్ బ్యాంకుకు రావాల్సింది ఉంటుంది. "


"బ్యాంక్ లోన్ ఇప్పించే బ్రోకర్ తో ఫైనాన్షియర్, “అతను రాడు. ఆ విషయము ఇంతకు ముందు చెప్పాను. " అన్నాడు.


మళ్ళీ ఫైనాన్షియర్ మాట్లాడుతూ “అయితే మీరు లోన్ ఇప్పించినందుకు మీకు ఇబ్బంది పెట్టకుండా నెల నెలకు లోన్. ఇ. యం. ఐ. మిస్ కాకుండా రెగ్యులర్ గా కట్టిస్తా. ఇంక వన్ యియర్ లో టోటల్ లోన్ కట్టేస్తారు" అన్నాడు.


"వందల కోట్ల బిజినెస్ అంటే బ్యాంక్ పార్మలిటిస్ చాలా ఉంటాయి. అది మీకు తెలుసు. ఒరిజనల్ డాక్యుమెంట్స్ షురిటి పెట్టిన అతను బ్యాంకుకు రావాలి. లోన్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాలి. కాని అతను బ్యాంకుకు రాడు అంటున్నారు. మరి అతను రాకుండ బ్యాంకులో మేనేజ్ చేయాలంటే చాలా రిస్క్ చేయాలి. కాబట్టి వచ్చే లోనులో మేము అడిగనంత పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి" అన్నాడు బ్యాంక్ లోన్ ఇప్పించే బ్రోకర్.


ఏమి ఆలోచించకుండా “ఓకే" అన్నాడు లింగస్వామి.

బ్యాంక్ వాళ్లు కొన్ని రోజుల తరువాత లోన్ ఇవ్వడానికి సరే అన్నారు.

ఇంటికి వచ్చాక లింగస్వామిని కొడుకు అడిగాడు, “రాజరావు తేయాకు తోటల లాండ్ డాక్యుమెంట్స్ ఎలా తెస్తావు" అని.


"నమ్మకంగా ఉన్నా కదా.. నవ్వుతూ అవమాన పరిచాడు. ఇప్పుడు నమ్మక ద్రోహంతో ఆ డాక్యుమెంట్స్ నమ్మకంగా తెస్తా. రాజరావు నవ్వుతూ నా మంచి కోసం చెప్పినా,

ఆ నవ్వు విషం నవ్వు లాగే నా కళ్ల ముందు కనిపిస్తుంది. ఇకనుంచి రాజరావు.. నీ పతనం మొదలు" కోపంగా అన్నాడు లింగస్వామి.

ఒక రోజు ఇంపార్టెంట్ పేపర్స్ తో పాటు ‘ఊటీ లో ఉన్న తేయాకు తోటలు సంబందించిన లాండ్ డాక్యుమెంట్స్ లింగస్వామి కొడుకు ఉదయ్ పెట్టే బిజినెస్ కోసం బ్యాంక్ ఇచ్చే లోన్ షూరిటి పెట్టడానికి అంగీకారంతో నేను రాసిస్తున్న బాండ్’ అని లింగస్వామి తయారు చేసిన బాండ్ పేపర్ మీద మోసం చేసి సంతకం రాజరావుతో పెట్టించుకున్నడు లింగస్వామి


రాజారావు తేయాకు తోటల లాండ్ డాక్యుమెంట్స్ షురిటితో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యింది.


అనుకున్న ప్రకారం పార్మా కంపెనీ కావాల్సిన పార్మలిటిస్ పూర్తి చేసి ‘ఫ్రెష్ కాఫ్ సిరప్’ అని పేరు అంటూ దగ్గు మందు కంపెనీ ఒకవైపు, ఇంకో వైపు మత్తు మందుల తయారు కంపెనీ మొదలు పెట్టారు.


ఇంక ఒక డ్రగ్స్ మాఫియాతో లవాదేవిలు మొదలు అవుతున్న తరుణంలో కిరణ్ కు బిజినెస్ అప్పజెప్పాలని రాజారావు నిర్ణయంతో తాను వేసుకున్న ప్లాన్స్ అన్ని నాశనం అవుతాయి.


కిరణ్ చదువు అయ్యాక వెంటేనే ఇండియాకు రాడు అనుకున్నాడు లింగస్వామి. కాని ముందు ఇప్పుడే ఇండియా రాను అని చెప్పిన కిరణ్ ఇండియాకు రావడం, వచ్చిన వెంటనే బిజినెస్ వ్యహరాలు చేపెట్టే పనిలో పడ్డాడు.


ఇప్పుడిప్పుడే లింగస్వామి కొడుకు ఉదయ్ పెట్టే బిజినెస్ ముందుకు పోతున్న సమయంలో కిరణ్ రావడం వలన అనుకున్నవి అన్ని తలకిందలకు అవుతావని పసిగట్టి ఇంకో ప్లాన్ వేశాడు లింగస్వామి.


ఆ ప్లాన్ ప్రకారం కిరణ్ ని కిడ్నాప్ చేసి మత్తు మందులకి అలవాటు చేస్తే, తమదారికి అడ్డు ఉండదని ఆ ప్లాన్ వేస్తే, అది కాస్త దెబ్బ తిని ఏకంగా డ్రగ్స్ మాఫియా రాకెట్ గుట్టురట్టు అవడానికి దారి తీసింది.


లింగస్వామి గురించి పూర్తి వివరాలు విక్రమ్ చెప్పగానే షాక్ అయ్యాడు కిరణ్.

"నమ్మకంగా ఉన్న లింగస్వామి అంకుల్ మాకు ఇంత నమ్మక ద్రోహం చేశాడంటే నమ్మ లేక పోతున్నాను. " అన్నాడు కిరణ్.


"నమ్మితేనే కదా ద్రోహం చేసేది. దానినే నమ్మక ద్రోహం అంటారు. అదే నమ్మకంతో నీవు కూడ నమ్మక ద్రోహం చేయాలి. ఆ నమ్మక ద్రోహం చెడు కోసం. ఈ నమ్మక ద్రోహం మంచి కోసం. "


"తప్పకుండా సార్, ఈ డ్రగ్స్ కు ఎందరో యువతి యువకులను బలి అవుతున్నారు. ఒక బాధ్యత గల యువకుడిగా ఈ యువత ను రక్షించడమే నా ప్రథమ కర్తవ్యం. "


"ముందు డ్రగ్స్ ముఠా నాయకుడికి సంబంధించిన మాటలు రికార్డు చేసిన సెల్ ఎక్కడ" అన్నాడు విక్రమ్.


"అది ఆ రోజు మీరు దాడి చేసేముందు ఒక చిన్న గుంతలో దాచాను. ఇప్పుడు అక్కడే ఉంది".

“నేను ముందే నీకు కాల్ చేయకుంటే లింగస్వామికి సెల్ ఎక్కడ ఉందో చెప్పే వాడివి. అవును. ఆ సెల్ లో వీడియో తీసేటప్పుడు అక్కడ ఉండే ఒకడు చూసి అరచాడు కదా. అప్పుడు సెల్ కోసం వాళ్లు వెతక లేదా. "


"నేను అప్పటికే సెల్ లో వీడియో తీసే ముందు నన్ను బంధించిన రూములో నాకు మత్తు నుంచి మెలకువ రాగానే నన్ను మళ్ళీ మత్తులోకి పంపాలని మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి ఒకడిని కాపలా పెట్టారు. కాని మత్తు నుంచి లేచిన వెంటనే వాడిని చితక బాది వాడికే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. తర్వాత సెల్ లో వీడియో తీసేటప్పుడు ఇంకోడు చూసి వీడియో తీస్తున్నాడు అని అరచాడు. అప్పటికే తీసిన వీడియో మొత్తం తీశాను. ఎలా గైన సెల్ లాక్కొంటారు అని తెలుసు. అందుకే నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్న వాడిని చితక బాది వాడికే మత్తు ఇంజెక్షన్ ఇచ్చా కదా.. వాడు సృహ తప్పి ఉన్నాడు. ఇంక వాడి పాకెట్ లో ఉన్న సెల్ తీసి నా పాకెట్ లో ఉన్న సెల్ అక్కడ ఉన్న చిన్న గుంతలో దాచాను. నన్ను పట్టు కోవాలని వచ్చిన వాళ్లతో పెనుగులాడతూ ఉంటే ఆ షాలిని వచ్చి నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. తర్వాత నా పాకెట్ లో ఉన్న వాడి సెల్ చూసి నా సెల్ అనుకోని తీసి పగల గొట్టారు. ఇంక మత్తులోకి వెళ్ళిపోయాను. మళ్ళీ కళ్ళు తెరచి చూసేసరికి ఈ ఊటి హాస్పటల్ లో ఉన్నా. "


"తర్వాత ఏమీ జరిగిందో నేను చెబుతా విను. నీవు మత్తులో అలా వెళ్ళగానే నాకు ఉండే సమాచారం ప్రకారం రెడీ టూ ఎటాక్ ఆపరేషను మొదలుపెట్టాక మత్తుకు బానిస అయిన యువతను కాపాడాను. కానీ ఆ డ్రగ్స్ రాకెట్ ముఠా వాళ్లు తప్పించుకొన్నారు. దొరికిన కొందరు తుపాకీ గుళ్ళుకు బలి అయిపోయారు. అప్పటికే మీ నాన్న నీ కోసం తనకు ఉన్న పొలిటికల్ పలుకుబడితో మా డిపార్ట్ మెంటు మీద వత్తిడి తెచ్చి తొందరగా ఆచూకీ తెలుసుకోమని చెప్పాడు. ఇంక అలాగే మీ నాన్న చాలా బెంగ పెట్టుకొని వున్నాడు. మా డిపార్ట్ మెంట్ కి సంబంధించిన హాస్పటల్ లో జాయిన్ చేసి మీ నాన్నకి సమాచారంకి ఇద్దామని నిన్ను నా జీప్ లో తీసుకొస్తూ మీ లింగస్వామి అంకుల్ కు కాల్ చేసి చెప్పాను. అలా చెప్పిన కొద్ది సేపటికే నా జీప్ ను ఒక లారీ వచ్చి గుద్దింది.

=====================================================

ఇంకా వుంది. . .

=====================================================

S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.




24 views1 comment

1 Comment


Om sai creations • 9 days ago

Very good idea this type up story telling in utubeU will be success andiBest of luck

REPLY0 replies

Like
bottom of page