'Sweets Nerpinche Nithi' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
అదో అందమైన ఊరు .. అక్కడ చిన్న ఫ్యామిలీ … ఆ ఇంటి పెద్ద నారాయణ గారు .. ఆ ఊరు సర్పంచ్ .. ఆయన భార్య లక్ష్మి గారు అక్కడ ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్లందరికి రాత్రి వేళలో చదువు చెప్పడమే కాకుండా వారికి స్వయంగా కుట్లు , అల్లికలు నేర్పించి వారికి స్వయం ఉపాధి కలిపించారు ... నారాయణ మరియు లక్ష్మి గారికి ఇద్దరు మగ పిల్లలు. ఒకరు ఇంటర్, మరొకరు పదవ తరగతి చదువుతున్నారు ... వారి పేర్లు సూర్య , కార్తీక్ ..
దీపావళి పండుగ షాపింగ్ వెళ్దాం అని ప్లాన్ చేస్తారు .. లక్ష్మి , పిల్లలు బజారు కి వెళ్తారు.. డ్రెస్లు తీసుకుంటారు .. అక్కడ పెద్ద షాప్ రంగుల రంగుల లైట్ ల తో కనపడుతుంది. అలాగే రక రకాలుగా దీపాలు మంచి డిజైన్ లో కనపడుతాయి .. కార్తీక్ వచ్చి వాళ్ళ అమ్మతో ‘అవి చూడు. ఎంత బాగా ఉన్నాయో! ప్లీజ్ మా.. మనము అవి కొందాం’ అని చెపుతాడు .. కానీ లక్ష్మి గారు ‘కొందాం కన్నా! కానీ ఇక్కడ కాదు కన్నా ..’ అని చెప్పి తాను బయటకు వచ్చి అన్ని ప్లేస్లో చూస్తుంది. కొంచం దూరంలో తనకి కావాల్సింది కనపడుతుంధి .. తాను వెళ్తూ ఉంటే పిల్లలు తనతో పాటు వెళ్తారు. అపుడు అక్కడ లక్ష్మి గారు ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్లి మట్టి ప్రమిదలను తీసుకొని ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తారు .. ఆవిడ సంతోషంగా లక్ష్మి గారికి థాంక్స్ చెపుతారు ...
తరవాత వాళ్లంతా ఇంటికి వెళ్లిన తరవాత పిల్లలకు మట్టి ప్రమిదలు ఇచ్చి వాటిని అందంగా డిజైన్ ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్లని చేయమంటారు .. కార్తీక్ వచ్చి అమ్మా! అక్కడ షాప్ లో డిజైన్ ఎంత బాగా ఉన్నాయి .. నువ్వు అక్కడ వదిలేసి వీరివి కొన్నావు. మళ్ళీ మాతో డిజైన్ వేయమంటావా? ఇది అన్యాయం అమ్మా! “ అంటాడు..
సూర్య వచ్చి “రేయ్ కార్తీ! కొట్టానంటే మూతి పచ్చడి అవుద్ది. అమ్మ ఏం చేసినా ఏదో ఒక అర్థం ఉంటుంది. ఫస్ట్ చెపింది విను …” అంటాడు.
కార్తీక్ అలుగుతాడు. అపుడు లక్ష్మి గారు వచ్చి “కన్నా! మనం ఆల్రెడీ డిజైన్ చేసిన వాటిని కొని, వాటిని యూస్ చేసేకన్నా మనం స్వయంగా అందంగా అలంకరించినవి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మనం ఎపుడూ పెద్ద షాప్స్ లోనే కాదు, ఆలా బజారులో పెట్టుకొన్నవారి దగ్గర కూడా కొనాలి. మనం అందరికీ హెల్ప్ చేయలేము కానీ ఒకరికి అయినా ఆలా హెల్ప్ చేయగలం, వాళ్ళ దగ్గర వస్తువులు కొని!
ఒక కథ చెపుతా విను..
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనకి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు.
రాజ్యంలో అందరికన్న బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా దండోరా వెయ్యించారు.రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.
ఊరి చివరలలో ఉన్న ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూసి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.ఇంటి దగ్గరకి వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది. ఇది చూసిన రాజుగారు, “అవ్వా! నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపాలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.
“నా దగ్గర రోజూ ఒక్క దీపం పెట్టేంత డబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను ఇక్కడ దీపం పెడుతున్నాను” అని చెప్పింది.
జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపాలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.
మరునాడు రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.
"ఎప్పుడూ మన స్వలాభం కోసం కాకుండా...సమాజం కోసం కూడా ఆలోచించాలి" ఈ కథలో నీతి..
కార్తీ ‘సారీ అమ్మా’ అని చెప్పి వాళ్ళ అమ్మ చూపినట్టు ప్రమిదలను అందంగా డిజైన్ చేస్తాడు ..
సూర్య వాళ్ళ అమ్మ చాల రకాల పిండివంటలు చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తుంటాడు .. అపుడు కార్తీ వచ్చి “అమ్మా! ఈ స్వీట్స్ కి కూడా కథ ఉందా .. ఉంటే చెప్పవా” అంటే..
లక్ష్మి గారు “కన్నా! కథ ఏమీ లేదు కానీ ప్రతి ఒక స్వీట్ మనకు మంచి నేర్పింస్తుంది. మన లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటుంది ..
‘సాఫ్ట్ గా ఉండడం బలహీనతేమీకాదు. కొన్ని సంధర్భాల్లో అది మనల్ని కాపాడుతుంది’ అని గులాబ్ జామున్...
‘ఎపుడూ డైమండ్ లాగా నువ్వు ఉన్న ఫీల్డ్ లో వెలగాలి’ అని కాజు కట్లీ ...
‘ఎన్ని ఇబందులు నీ లైఫ్ లో వచ్చినా సరే, నువ్వు నీ లాగే ఉండు. అపుడు నీకంటూ ఒక స్పెషల్ పేరు ఉంటుంది’ అని రసగుల్లా ...
‘నువ్వు ఎలా ఉన్నావు ,ఎలాంటి కలర్ లో ఉన్నావు అనేది కాదు ఇంపార్టెంట్. నీకంటూ ప్రతిభ ఉందా లేదా.. అపుడు అందరిలో నువ్వు స్పెషల్’ అని జిలేబి..
‘అందరూ నిన్ను ఇష్టపడకపోవచ్చు ..కానీ నువ్వు ఏంటో తెలిసిన వాళ్ళు నిన్ను వదలరు..’ -సోనుపాపిడి
‘ఒకోసారి నువ్వు చేసే చిన్ని కష్టం కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది’ అని లడ్డు
‘నువ్వు ఎన్ని కష్టాలు ,బాధను భరించినా తట్టుకొని నిలబడాలి’ అని బేసన్ లడ్డు నేర్పిస్తుంది "
అని చెపితే కార్తీక్,సూర్య లు నోరు తెరుస్తారు ..
వాళ్ళ అమ్మ ఇద్దరికి నోట్లో గులాం జామున్ పెడతారు ..వాళ్ళు అమ్మను గట్టిగా హాగ్ చేసుకొని “అమ్మా! నువ్వు చెప్పిన ప్రతిమాటా నిజం. ఏదో స్వీట్స్ తింటూ ఉన్నాము .. ఎపుడూ అంతంగా అబ్జర్వ్ చేయలేదమ్మా. థాంక్స్ అమ్మా!” అంటారు .. వాళ్ళ అమ్మ “నాకు మీ థాంక్స్ వద్దు. ఈ స్వీట్స్ అన్ని కలిపి పాకెట్స్ చేసి మన ఊరిలో ఉన్న అందరికి ఇస్తే అపుడు నేను హ్యాపీ” అంటారు . పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ యొక్క గొప్ప తనము చూసి గర్వపడి, స్వీట్స్ అన్నీ ప్యాక్ చేసి .. వాళ్ళు దాచిన ప్యాకెట్ మనీ తీసి కొన్ని టపాకాయలు కొని ఆ ఊరిలో పిల్లలకి ఇచ్చారు ..
"మనం అందరికీ సాయం చేయలేము కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా '
సహాయం చేసే మనసు ఉన్న వాళ్ళు చాల అందమైన వాళ్ళు ..
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
コメント