top of page

నా మనసు దోచిన చెలికాడు...


'Naa Manasu Dochina Chelikadu' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

" నా జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజు… డియర్ డైరీ! అసలు ఏమి జరిగిందో తెలుసా ???

Ab+ బ్లడ్ కావాలి అని వాట్సాప్ గ్రూప్ కి వచ్చిన మేసేజ్ చూసి పరుగుపరుగున హాస్పిటల్ కి వెళ్ళాను. తీరా వెళ్లి చూస్తే ‘ఒకతను ఇప్పుడే ఇచ్చి వెళ్ళారు అండి’ అన్నారు. ఎవరు అని తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయాను.

‘అబ్బా! ఎవరు బాబు నువ్వు ఇంత అందంగా ఉన్నావు… ఆ కళ్ళు ఏంటి ఇంత షార్ప్ గా ఉన్నాయి .. అవి చూస్తూ లైఫ్ లాంగ్ నీతో బ్రతకవచ్చు’ అని మనసులో అనుకుంటున్నా...

ఇంతలో "హల్లో మిస్! మిమ్మల్నే.. ఎన్ని సార్లు పిలవాలి అండి. కొంచం అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను…”

అప్పుడు చూసాను.. నేను తనని చూస్తూ దారికి అడ్డంగా నిలబడ్డాను అని...

“సారీ అండి… మీరు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారా… నేను కూడా fb లో పోస్ట్ చూసి వచ్చాను అండి.. కానీ నా కన్న ముందే వచ్చి మీరు ఇచ్చారు.. నా పేరు అంజలి అండి” అని మాటలు కలిపాను. అతను ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. తను పార్కింగ్ వైపు వెళ్ళాడు.. నేను కూడా వెళదాము అనుకోని వెళుతుంటే “హల్లో మిస్’ అన్న పిలుపుతో వెనకకి తిరిగాను...

“ఇంకో హాస్పిటల్లో బ్లడ్ నీడ్ ఉందట . మీరు ఇస్తారా?” అని అడిగాడు...

“హా! తప్పకుండా అండి. అడ్రెస్స్ ఫార్వర్డ్ చేయండి’ అన్నాను నంబర్ ఇస్తాడు ఏమో అని ఆశతో.

కానీ అతను అడ్రెస్స్ చెప్పాడు.

“అయ్యో! నాకు ఆ అడ్రెస్స్ తెలీదండి.. కొంచం క్లియర్ గ చెబుతారా?”

“మీరు నా బైక్ ఫాలో అవ్వండి” అని చెప్పి తను బైక్ స్టార్ట్ చేసి కొంచం ముందుకు వెళ్ళాడు. నేను వెళ్లి స్కూటీ టైర్ కి గాలి తీసేసి వచ్చి తన దగ్గరకి వెళ్లి

“నా స్కూటీ పంచర్ అయింది అండి… నేను ఆటోలో మిమల్ని ఫాల్లో అవుతాను…” అన్నాను

“హల్లో మిస్! మనకంత టైమ్ లేదు. అక్కడ చాలా అవసరము ఉంటుంది. నా బైక్ ఎక్కు” అన్నాడు...

లోపల నేను తీన్మార్ డాన్స్ వేసుకొని తన బైక్ ఎక్కాను.

అసలు నేను ఏంటి? ఎవరో తెలియని వాడికి ఇలా ఎలా అట్రాక్ట్ అయ్యాను.. నా ఫ్రెండ్స్ ఎవరైనా 'ఆ అబ్బాయి చూడు.. ఎంత బాగున్నాడో..' అన్నా చూసేదాన్ని కాదు. ‘బాగా ఉన్నాడు చూడు’ అన్నా చూసే దానిని కాదు. అలాంటిది నేను వీడికి ఏంటి ఇంతలా పడిపోయాను. మే బీ వీడి హెల్పింగ్ నేచర్ అయి ఉండవచ్చు.. తన బైక్ ఎక్కి కూర్చొని ఎదో ఒకటి వాగుతూనే ఉన్నా తన నుంచి ఒక్క ముక్క సమాధానం కూడా రాలేదు.. ఇంతలో హాస్పిటల్ రావడంతో నేను లోపలకి వెళ్లి బ్లడ్ ఇచ్చి వచ్చాను. అతని కోసం చూసా. అతను కనపడలేదు. ఇంతలో ‘మిస్’ అన్న పిలుపు విని వెనకకి తిరిగాను. తను నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడు.

“ఇది తాగు కొంచం శక్తి వస్తుంది.. ‘

నేను అలాగే చూస్తూ ఉంటే తనే తాగించాడు అచ్చం మా నాన్న లా. నేను అతన్నే అలాగే చూస్తూ ఉన్నాను.

“హల్లో మిస్! మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, చేస్తాను. లేదు అంటే ఎదో ఒక ఆటో అయినా క్యాబ్ అయినా బుక్ చేస్తాను..”

“నా పేరు అంజలి. మిస్ కాదు” అన్నాను.

అడ్రస్ చెప్పాను. అతను నన్ను ఇంటి దగ్గర భద్రంగా దించాడు. నేను లోపలికి రమ్మని పిలిచాను. తను ‘పర్లేదు, బై’ అని చెప్పి వెళ్ళిపోయాడు...

నా ప్రాణం నా దగ్గర నుండి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చింది. అతని పేరు కూడా తెలియదు. కానీ నాకు ఎందుకు ఇంతలా నచ్చాడు. మళ్లీ కలుస్తానో లేదో’ అని రాసి డైరీ క్లోజ్ చేసింది అంజలి..

"ఏమైంది బంగారు తల్లి! డిన్నర్ వద్దు అన్నావు అంట.. అసలే ఈ రోజు బ్లడ్ ఇచ్చి వచ్చావు కదా తల్లి కొంచం తిను "

“ నాకు వద్దు నాన్నా!”

“ ఏమైంది రా !”

"నాకు వాడు కావాలి. ఎంత బాగా ఉంటాడో తెలుసా నాన్నా! నేను నీతో ఉంటే ఎంత హ్యాపీగా, సేఫ్ గా ఫీల్ అవుతానో తనతో ఉంటే కూడా అలాగే అనిపించింది” అని జరిగింది మొత్తం వాళ్ల నాన్నకి చెప్పి నాన్నను పట్టుకొని ఏడుస్తోంది.

"చూడు రా ! నీ ప్రేమ నిజం అయితే అతను ఎక్కడ ఉన్నా నీ దరికి చేరుతాడు".

" నా దగ్గర తన ఫోన్ నంబర్ లేదు నాన్నా! వాడి పేరు కూడా తెలీదు"

"పిచ్చి తల్లి! చూస్తూ ఉండు తనని అతి త్వర్రలో కలుస్తావు!"

"తను కలిసే టైమ్ కి నువ్వు హెల్తీగా ఉండాలి కదా..” అని ఫుడ్ తినిపించారు.

" ఏంటి పంకజం? అలా చూస్తూ ఉన్నావు మా వైపు…”

“మీ బాండింగ్ చూస్తే నాకు అసూయా గా ఉంది అండి. నాకు మీ లాంటి నాన్న ఉంటే బాగా ఉండు. కానీ ఆయన ఒక్క సారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదు అండి” అని బాధ పడింది.

"మై బేబీ ! తాతయ్య మాట్లాడకపోతే ఏమైంది.. అంతా కన్న ప్రేమగా చూసే మా డాడీ ఉన్నాడు కదా. త్వరలో నీకు అల్లుడు రాబోతున్నాడు. సో పిండి వంటలు అవి సిద్ధం చేయి నేను ఇప్పుడే వస్తాను"

"ఏమిటి అండి! ఎవరో తెలీదు.. ఎలాంటి వాడు తెలియదు.. మీరు ఇద్దరు వరసలు కలిపివేస్తున్నారు"

"ఏమో! నాకు తెలీదు. కానీ మన అమ్మాయి ఒక్క సారి అయినా ఇలా పరాయి వ్యక్తి గురించి మాట్లాడడం విన్నావా. లేదు కదా! చూద్దాము ఈ కథ ఎటు వైపు వెళ్తుందో"

"అంజలి.. వచ్చావా అమ్మా! మన కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. కానీ అది మనకు రావాలంటే మనం ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో.. నువ్వు తయారు చేసుకొని వెళ్లి ఇచ్చేసి రా. పైగా ఆ కంపెనీ మేనేజర్ కి ఒక్క పట్టాన ఏదీ నచ్చదట. జాగ్రత్తగా ప్రజెంట్ చేయి. నువ్వు అయితేనే కరెక్ట్ "

" సార్! నన్నే ఎందుకు ఈ ప్రాజెక్టుకి సెలెక్ట్ చేశారు??”

"మాటలతో ఎదుటివారిని నోరు ఎత్తకుండా చేస్తావు కాబట్టి"

“సార్! మీరు నన్ను తిట్టారా! పొగి డారా!”

“నీకు ఏది కావాలి అంటే అది అనుకో. ఈ మీటింగ్ సక్సెస్ అయితే మీ టీమ్ కి శాలరీ ఇంక్రిమెంట్ చేస్తా”.

అంజలి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళింది. అక్కడ ఉన్నవారు అందరికీ నచ్చింది కూడా. అక్కడ మేనేజర్ ఎవరో అర్ధం కాలేదు తనకి. ‘ఇక్కడ ఉన్న వారిలో ఎవరు మేనేజర్’ అని అడిగింది అక్కడే ఉన్న ఒక ఎంప్లాయ్ ని.

“ మా సర్ తన క్యాబిన్ నుంచే మీ ప్రెజెంటేషన్ చూశారు!”

“మేడమ్! మిమల్ని మా మేనేజర్ సర్ రమ్మని చెప్పారు” అని క్లర్క్ వచ్చి పిలవడంతో “ఎవరబ్బా ఈ మేనేజర్” అనుకుంటూ వెళ్ళింది. తీరా వెళ్లి చూస్తే అతనే తన కలల రాకుమారుడు.

అంజలి కళ్ళలో మెరుపు వచ్చి చేరింది. “మిస్ అంజలి! మీ ప్రజెంటేషన్ మాకు నచ్చింది.మేము మీతో టై అప్ అవుతాము” అన్నాడు...

అంజలి అతన్ని అలాగే చూస్తూ ఉంది పోయింది. అతను ఏమి చెప్పాడో కూడా వినలేదు ..

అతను గట్టిగా “అంజలి” అని పిలవడం తో ఈ లోకంలోకి వచ్చి నేమ్ ప్లేట్ వైపు చూసింది.

‘ఆనంద్’ అని ఉంది.

అంజలి నవ్వుతూ చూస్తూ ఆనంద్ దగ్గరకి వెళ్లి మోకాళ్ళ పైన కూర్చొని

" ఎందుకో నాకు తెలీదు ! నిన్ను చూడగానే నేను

ప్రేమించాను. నా మనసంతా నువ్వే నిండిపోయి ఉన్నావు. ఒక్క ఛాన్స్ నాకు ఇస్తావా? లైఫ్ లాంగ్ నీతో కడవరకు వస్తాను. విల్ యు మ్యారి మి?” అని అడిగింది.

ఆనంద్ షాక్ అయ్యాడు. ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. సైలంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు...

అంజలికి ఏమీ అర్ధం కాలేదు . ‘ఎందుకు ఆనంద్ సమాధానమివ్వకుండా వెళ్లి పోయాడు?’

బయటకు వెళ్లి చూస్తే తను అప్పటికే వెళ్ళిపోయాడు.

అంజలి టీమ్ కి తన బాస్ జీతం పెంచారు.

చాలాసార్లు అంజలికి ఆనంద్ ఎదురుపడినా తను తప్పించుకొని వెళ్లిపోయే వాడు… ఒక రోజు షాపింగ్ పూర్తి చేసుకొని లిఫ్ట్ లోకి వెళ్లి ఫోన్ లో ఆనంద్ కి తెలీకుండా తీసుకున్న ఫొటోస్ చూస్తూ ఉంటుంది....

సడన్ గా పక్కన చూస్తే తను ఉన్నాడు. లిఫ్ట్ లో ఉన్న ఒక్కోకరు దిగి వెళ్లిపోతూ ఉన్నారు. సడెన్ గా లిఫ్ట్ ఆగిపోతుంది… అంజలి భయంతో వణికిపోతూ ఉంది. ఆనంద్ తనని దగ్గరకి తీసుకొని ధైర్యం చెప్పుతూ ఉన్నాడు. అయిన సరే తను మామూలు మనిషి కాలేదు.

అంజలి కి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తే తనే నోటితో తనకు గాలిని అందే లాగ చేసాడు. అయిన కూడా తను కళ్ళు తీయదు అసలు...

" ప్లీజ్.. ప్లీజ్.. అంజు! కళ్ళు తీయి. నువ్వు లేకపోతే నేను బతకలేను” అని తనని పట్టుకొని ఏడుస్తున్నాడు ఆనంద్.

ఆనంద్ బాధ తన గుండెకి చేరింది ఏమో.. అంజలి కళ్ళు తెరచింది. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు...

డాక్టర్ వచ్చి “తనకి కొంచం సిక్ గ ఉంది. బాగా చూస్కోండి” అని చెప్పి వెళ్ళిపోతాడు… వెంటనే అంజలి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

“ఇప్పుడు ఎలా ఉంది అంజలి?”

"చాలా ఆనందంగా ఉంది!.”

“అదేంటి అలా అంటావు నువ్వు?"

"నాకు ఇలా జరగడమే వల్లే కదా! నీకు నా మీద ఉన్న ప్రేమ బయట పడింది .. చెప్పు ఆనంద్! ఎందుకు నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని లేనట్టు ఉన్నావు… ఏమిటి కారణం.??”

" నేను ఒక అనాధని. నాకంటూ ఎవరూ లేరు. హాస్టల్ లో పెరిగాను . కొంతమంది దాతల సహాయంతో చదువుకొని ఇలా జాబ్ చేస్తున్నా. నేను కూడా నిన్ను మొదట సారి చూసినప్పుడే ఇష్టపడ్డాను.. కానీ నాకు ఆ అర్హత లేదు. ఒక వేళ నేను నా ప్రేమను నీకు చెప్పానే అనుకో , మీ ఇంట్లొ వాళ్ళ కి నచ్చకపోవచ్చు. నా వల్ల నువ్వు వారికి దూరం కాకూడదు.."

“అలా ఎప్పటికీ జరగదు అల్లుడు గారు” అన్నారు అప్పుడే అక్కడికి వచ్చినా అంజలి వాళ్ళ నాన్న గారు.

“నాకు నా బిడ్డను నాలాగ చూసుకునే వాడు కావాలి కానీ కులం, గోత్రం అవసరం లేదు. అయిన మీరు అనాధ అని ఎప్పటికీ అనుకోకండి… ఈ రోజు నుండి .. కాదు ఈ క్షణం నుండి మీకు మేము ఉన్నాము..."

ఆనంద్ కి సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయి...

“అల్లుడు గారు! మీకు కట్నంగా ఏమి కావాలి...

ఏమి సందేహించకుండా అడగండి”.

“మీరు పెద్ద మనసుతో అంజలిని నాకు ఇవ్వడమే గొప్ప విషయం.కాకపోతే???”

“పర్లేదు అడగండి..???”

"నేను ఒక బిడ్డను.. అందులో అమ్మాయిని దత్తత తీసుకోవాలని నా చిన్నప్పటి నుంచి అనుకొన్నాను. మీరు ఒప్పుకుంటే??"

"మీరు ఇద్దరు ఒకరి కోసం మరో ఒకరు పుట్టినట్టు ఉన్నారు. అంజలి కోరిక కూడా ఇదే బాబు. తను పెళ్లి చేసుకునే అబ్బాయికి చెప్పి తను దత్తతకి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా, లేదు అంటే లేదు.. అని తను చెప్పింది. తను కోరుకున్నట్లు మీరు వచ్చారు, తన లైఫ్ లోకి. చాలా సంతోషం బాబు"

“గంతకు తగ్గ బొంత అంటే ఇదే అండి” అని పంకజం అనడంతో అందరూ నవ్వారు.

ఒక మంచి రోజు వారి పెళ్లిని గుడిలో సింపుల్ గా చేసుకొని ‘పెళ్లికి పెట్టే డబ్బుతో ఒక్క పేద విద్యార్థిని అడాప్ట్ చేసుకొని తనని చదవించాలి’ అనుకున్నారు ఇద్దరూ. అలాగే చేశారు కూడా..

అంజలి రూపంలో అంతులేని ప్రేమను, తను కోల్పోయిన అమ్మ నాన్నల ప్రేమను పొందుతున్నందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు ఆనంద్..

హేయ్ నందు… నేను ఫస్ట్ టైమ్ నీ బైక్ ఎక్కినప్పుడు ఒక్క పాట వేసుకున్నా మనసులో. తెలుసా?

“ అవునా బంగారం! ఏది.. ఒక్కసారి నా కోసం పాడవా....”

“//కల కాదుగా....నీ పరిచయం....

కల కాదుగా....నీతో బంధం....

మార్పు ఏదైనా....అడుగు ఏదైనా..

ప్రేమ అయిన...ద్వేషం అయిన......ఆది నీతోనే...నీతోనే.... అది నీతోనే//

//తెలియ లేదు కాలం నువ్వుంటే...

ఆగలేదు అడుగులు సాగుతూ నీవెంటే వస్తుంటే...

ఎవరు ఉన్నా... ఎందరిలో ఉన్నా...ఏమి చేస్తున్నా...

ఎవరు ఎదురుగా ఉన్నా… నీతోనే నా అడుగు ..

నీతోనే నా వలుపు ..నీతోనే... అది నీతోనే

వర్షం కోసం ఎదురు చూసే పుడిమిలాగ..

పూల లోని మకరందన్ని ఆశపడే తుమ్మెదా లా..

నీకై… నీ ప్రేమకై కాలంతో పరుగులు తీస్తున్న ...

నా భావాలను పంచు కోవాలని ఆరాట పడతు ఉన్నదీ ఈ హృదయం.....

కోరిక అయిన… ఆశ ఏదైనా అది నీ తోనే... అది నీతోనే//

//రాముని వెంట సీత లాగ... నువ్వు ఎక్కడ ఉన్న నేను నీ వేంటే...

కృష్ణుడు కోసం రాధ లాగ ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతో జీవిస్తున్నా....

కష్టం అయిన...ఎదురు చూపు అయిన అది నీతోనే... శివుడు కోసం పార్వతి లాగ...నీతో సగా భాగం అవాలన్ని...

లక్ష్మి దేవి లాగ నీ గుండెల్లో నా ముద్ర నిలిచి పోవాలని నా ఆశ ...నా అభిలాష.....

ప్రాణం పోయి చివరి క్షణం నీ ఒడిలోనే ...

చావు అయిన...బతుకు అయిన అది నీతోనే...///”


“ ఎలా ఉంది నందు ?”

“ ఇలా ఉంది” అని తన ప్రేమను తన ముద్దు రూపంలో చూపించాడు.

సిగ్గుతో తన కౌగిలిలో ఒదిగి పోయింది అంజలి...

న్యూస్ పేపర్ లో ఎవరో పాపను చెత్త కుండీ లో వదిలి పెట్టారు అని తెలిసి ఇద్దరు వెళ్లి అన్ని ఫార్మాలిటీ స్ పూర్తి చేసి పాపను ఇంటికి తెచ్చుకొని ఆకర్ష అని పేరు పెట్టుకొని పెంచుకో సాగారు...

రెండు సంవత్సరాల తరువాత అంజలి కి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారికి అధ్య, అరుణ్ అని పేరు పెట్టుకున్నారు.

ఆకర్ష, అధ్య, అరుణ్ చేసే అల్లరితో ఎల్లప్పుడూ సందడిగా, కోలాహలంగా ఉంటూ సంతోషాలకు నిలయమైంది ఆనంద్, అంజలిల నివాసం.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


92 views0 comments
bottom of page