top of page

మేఘన- వందన- ఓ - మేకు



'Meghana Vandana O Meku' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

మేఘన -తులసి , ఆదిత్యల గారాల పట్టి ...ఆదిత్య టెక్స్ట్ టైల్ రంగంలో ఏకచక్రాధిపతి ..తులసి హౌస్ వైఫ్ ...వీరిది పెద్దలు కలిపిన బంధం ..పెళ్లి అయిన నాలుగు సంవత్సరాల తరువాత మేఘన పుట్టింది ..వాళ్ళ ఇద్దరికీ తానే లోకం ..

మేఘనకు ఇపుడు 10 సంవత్సరాలు..తనకు కోపం చాల ఎక్కువ ..కోపం వస్తే చాలు తన దగ్గరిలో ఉన్న వస్తువులను విసిరివేస్తుంది .... కోపంలో ఉన్నప్పుడు ఎదుట ఉన్నది ఎవరైనా సరే నోటికి ఏమి వస్తే అది మాట్లాడుతుంది... తులసి ,ఆదిత్యలను కూడా తిట్టేది .తులసి నచ్చ చెప్పాలి అని ఎన్ని సార్లు అనుకున్నా మేఘన వినేది కాదు ...వాళ్ళ ఇద్దరికీ తనని ఎలా మార్చాలో అర్థం అయేది కాదు ..

వందన, మేఘన ట్యూషన్ టీచర్ ..ఎవరి మాట వినని మేఘన వందన మాట వింటుంది ..ఇది గమనించిన తులసి వందనకు మేఘన విషయం చెప్పి బాధ పడింది ..

"మేడం మీరు బాధ పడకండి ..మీ పాపను మార్చే బాధ్యత నాది ...కొద్దిరోజుల ఓపిక పట్టండి" ...తులసికి ఆ మాట చాలా ఓదార్పు ఇస్తుంది..

రోజులాగే మేఘన తన ట్యూషన్ టీచర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ..

వందన : గుడ్ మార్నింగ్ కన్నా ..బ్రేక్ఫాస్ట్ అయిందా ...

మేఘన : వెరీ గుడ్ మార్నింగ్ మామ్ ..ఎస్ మామ్ అయింది ..మీది ..

వందన : నాది కంప్లీటెడ్ కన్నా ...

మేఘన : మామ్ మనం ఈ రోజు ఏమి టాపిక్ నేర్చుకుందాము ..

వందన : ఈ రోజు నీకు ట్యూషన్ లేదు ..మనం ఒక గేమ్ ఆడుదాము ...ఏమంటావు కన్నా ??

మేఘన : మేడం నాకు చాలా హ్యాపీగా ఉంది .నాకు ఓకే మామ్.. ఏంటి ఆ గేమ్ ??

వందన : నాతో పాటు రా కన్నా ?? అంటూ వాళ్ళ ఇంటి వెనుక వైపుకు తీసుకొని వెళ్ళుతుంది ..

అక్కడ ఉన్న గోడ వైపు చూపిస్తూ చూడు మేఘన గేమ్ ఏమిటి అంటే నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకును తీసుకొని వచ్చి ఇక్కడ గోడకు కొట్టాలి . ఏ రోజు నువ్వు గోడకు మేకు కొట్టకుండ ఉంటావో ఆ రోజు వచ్చి నాకు చెప్పు .. ఈ గేమ్ లాస్టులో నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెపుతుంది..

మేఘనకు గేమ్ చాలా నచ్చుతుంది...అలాగే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ...

ఆ రోజు నుంచి మేఘనకు కోపం వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటి వెనుక వైపు వెళ్లి మేకు కొట్టడం చేస్తుంది ..ఫస్ట్ రోజు 10 కొడుతుంది,తరవాత 8 ,7 ఇలా కొడుతూ పోతుంది ..


మేఘనకు ప్రతిసారి ఆలా వెనుక వెళ్లి కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది ..దీని కన్నా నా కోపాన్ని తగ్గించుకోవడం మంచిది కదా అని తన కోపాన్ని అదుపు చేసుకుంటుంది ..అలా ఒక రోజు తనకు ఏ మాత్రమూ కోపం రాదు ..

ఆ రోజు వాళ్ళ మేడం రాగానే ... నాతో పాటు రండి అని తనని.... మేకులు కొట్టిన ప్లేసుకి తీసుకొని వెళ్ళుతుంది ...

మేఘన : మేడం చూసారా ...ఈ రోజు నేను ఒక మేకు కూడా కొట్టలేదు ..నేను గేమ్ గెలిచినట్టు కదా ?? మరి నా గిఫ్ట్ ఏంటి మేడం !!

వందన : బంగారం !ఇంకా గేమ్ అవ్వలేదు ...ఈ రోజు నీకు కోపం రాలేదు అన్నావు కదా ... వెళ్లి నువ్వు గోడకు కొట్టిన ఒక మేకును తీసి వేయి ...

మేఘన అలాగే వెళ్లి మేకును తీసివేస్తుంది ...

వందన :ఇలాగే ..నీకు కోపం రాకుండా ఉండే ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి ..ఒక్కో మేకును తీసివేయి అర్థం అయిందా కన్నా !!!

మేఘన : అర్థం అయింది మేడం అలాగే చేస్తాను ...

ఆ రోజు నుంచి మేఘనకు కోపం రాకుండా ఉంటే చాలు ..వచ్చి గోడకు ఉన్నమేకును తీసివేయడం చేసింది..



గోడకు చాలా మేకులు ఉండడం వల్ల నెల రోజుల టైం పట్టింది ..

గోడకు ఉన్న మేకులు అన్నీ తీసివేసిన తరవాత మేఘనకు చాలా సంతోషంగా అనిపించింది ..

వందన రాగానే తనని తీసుకొని వెళ్లి ...చూసారా మేడం ..నేను గోడకు ఉన్న మేకులు అన్నీ తీసివేసాను ..నా కోపాన్ని కూడా అదుపులో ఉంచుకున్నా" అని చాలా గర్వంగా చెబుతుంది ..

వందన మేఘనకు ఇష్టమైన చాకొలేట్ ,ఒక చిన్న బార్బీడాల్ బొమ్మను ఇస్తుంది ...

"కన్నా! నువ్వు గోడకు ఉన్న అన్ని మేకులు తీసివేసావా?" అని అడుగుతుంది ..వందన ..

"హా తీసివేసాను కదా మేడం ..."

"లేదు కన్నా ఒకసారి బాగా చూడు .."

అపుడు చూస్తుంది మేఘన ..తాను మేకు తీసివేసిన ప్రతి చోట ఒక రంధ్రము పడి ఉంటుంది ..

అదే విషయం తనకి చెప్పుతుంది ..

చూసావా కన్నా నువ్వు మేకును తీసివేసినంతంగా దాని వల్ల పడ్డ రంధ్రాన్ని తీసివేయలేవు ..

అలాగే నువ్వు కోపంలో ఎవరయినా నువ్వు అన్న మాటలు కూడా అలాగే వాళ్ళ మనసులో ఉండిపోతాయి ..వాటిని నువ్వు చెరిపివేయలేవు .వాళ్ళ మనసు ఎంత బాధ ఉంటుంది ,,నువ్వు పగలకొట్టిన వస్తువులను తీసుకొని రా గలవా చెప్పు అర్థం అయిందా ..."

"మేఘనకు తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటుంది ...వాళ్ళ అమ్మను ,నాన్నను ఎలా ఇన్ని రోజులు బాధ పెట్టిందో అర్థం చేసుకొని పరుగు ఎత్తుతూ వాళ్ళ అమ్మ నాన్నను గట్టిగ హాగ్ చేసుకొని ఏడుస్తూ సారీ చెప్పుతుంది ...తులసి ,ఆదిత్య వందనకు వారి ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుతారు .. అప్పటి నుంచి మేఘన అసలు కోపం తెచ్చుకోదు...


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నమేస్తే నా పేరు ధన లక్ష్మి ..వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను ..మాది మదనపల్లి చిత్తూర్ జిల్లా ..కథలు ,కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం ...ఆనందంవేసినా ,బాధ వేసినా ,కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం ...నాలో మెదిలే భావాలకు ,నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు ..



140 views0 comments

Comments


bottom of page