విద్య - ప్రాథమిక హక్కు
- Keerthidhar
- Mar 3
- 3 min read
#KalamKathaKeerthidhar, #కలంకథకీర్తిధర్, #VidyaPrathamikaHakku, #విద్యప్రాథమికహక్కు, #TeluguStories, #తెలుగుకథలు

Vidya Prathamika Hakku - New Telugu Story Written By Kalam Katha Keerthidhar
Published In manatelugukathalu.com On 03/03/2025
విద్య - ప్రాథమిక హక్కు - తెలుగు కథ
రచన: కలం కథ కీర్తిధర్
ఉపోద్ఘాతం:
మూడనమ్మకాలు మరియు నిరక్షరాస్యత రెండు పెద్ద సమస్యలు. ప్రతి మనిషికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానికి విజ్ఞానం తోడైతే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం.
కథ:
అది ఒక మారుమూల గ్రామం. నిరక్షరాస్యత ఎక్కువున్న గ్రామం. అక్కడ చదువుకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. వ్యవసాయమే ప్రధానము మరియు వారికి ఆధారంగా ఉండేది. పూరి గుడిసెలు మరియు పెంకుటిళ్లతో ఉన్న ఆ ఊరిలో ఎప్పుడో రాజుల కాలం నాడు నిర్మించిన ఒక రాజుగారి భవనం ఉండేది. అక్కడ ఖజానా ఉందని అందరూ నమ్ముతారు కానీ ఎప్పుడూ ఎవరూ తీసే సాహసం చేయలేదు. ఆ భవనాన్ని రైతులు వారి పండిన పంటలను పెట్టుకోవడానికి ఉపయోగించేవారు.
అయితే ఆ నిధి మీద ఎంతోమంది బయటి వారికి ఆశ ఉండేది. ఒక రోజు ఊరు అంత నిద్ర పోతోున్న సమయంలో ఎవరికీ తెలియకుండా అక్కడున్న ఆ భవనం లోకి ఒక నలుగురు చేరారు ఆ నిధిని దోచుకోవడానికి.
(మరుగుసటి రోజు....)
పడమట వైపున ఎర్రగా అస్తమిస్తున్న సూర్యుడు ఒకపక్క అప్పటి వరకు ఎంతో కష్టపడి స్వేదాన్ని చిందిస్తోన్న కార్మికుడు ఒక పక్క. రైతులు వారి పంట మరియు సామాగ్రిని భద్రపరచడానికి ఆ భవనం వైపు వెళ్తున్నారు. ఇంతలో పెద్ద విచిత్ర శబ్దాలు అలాగే కొత్త కొత్త విచిత్ర ఆకారాలలో భూతాల వంటివి రైతుల చెవులకు వినిపిస్తున్నాయి కంటికి కనిపిస్తున్నాయి. అవి చూసి భయపడ్డ రైతులు అక్కడ నుంచి పరుగెత్తారు.
(రైతులు మరియు ఊరిలో ప్రజలంతా ఒక చోట సమావేశం అయ్యారు...)
అందరూ ఏకతాటిగా ఒకే మాట చెప్పుతున్నారు. "అక్కడ భూతాల్ని చూశాం" అని, విచిత్ర శబ్దాలు విన్నాం అని. అక్కడ చేతబడులు చేసిన ఆనవాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఇదంతా విన్న ఊరి పెద్ద ఒక 10 రోజులు ఆ బంగళా వైపు ఎవరూ వెళ్ళ వద్దని అందర్నీ ఆదేశించాడు.
(2 రోజుల తర్వాత...)
అప్పుడే చదువు పూర్తి చేసుకుని ఆ ఊరికి నరసింహ తిరిగి వచ్చాడు. నరసింహ తన సామాను ఇంట్లో పెట్టి స్నానం చేసి తన నాన్నతో ఇలా అంటున్నాడు.
నరసింహ: "నాన్న, నేను ఊరు అంతా ఒకసారి చూసి వస్తా."
నాన్న: "నువ్వు ఎక్కడికైనా వెళ్లు కానీ ఆ భవనం వైపు మాత్రం వెళ్ళొద్దు" అని హెచ్చరించి చెప్పాడు.
(నాన్న మాటలు విని అసలు విషయం తెలుసుకునేందుకు ఆ మాటలు నరసింహలో ఆసక్తిని పెంచాయి)
నరసింహ తన చిన్ననాటి మిత్రుడు అయిన సాయిని వెంట తీసుకొని ఆ భవనం వైపు వెళ్తున్నాడు.
(సాయి కొంచెం చదువుకున్న, అప్పటికీ కొంచెం తెలివైనవాడు, ధైర్యవంతుడు)
అసలు ఇద్దరు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి బయలుదేరారు. వారికి ఆ విచిత్ర శబ్దాలు మరియు ఆ విచిత్ర ఆకారాలు కనపడాయి కానీ వారు భయపడలేదు.
సాయి ధైర్యంతో: "లోపలికి వెళ్లదాం పద" అన్నాడు.
నరసింహ: "అసలు మనం ముందు ఏమి జరుగుతుందో తెలుసుకుందాం" అన్నాడు.
నరసింహ కొద్దిసేపు ఆలోచించి సాయితో ఇలా అన్నాడు.
నరసింహ: "సాయి, అక్కడ శబ్దాలను గమనించావా? ప్రతి 2 నిమిషాలకు అవే మళ్ళీ వినిపిస్తున్నాయి" అని అన్నాడు.
(2 నిమిషాల తర్వాత...)
సాయి: "అవును రా, నువ్వు చెప్పింది నిజమే. అంటే అవి అబద్ధం అనమాట. మరి ఆ భూతాల సంగతి ఏమిటి?"
నరసింహ: "సాయి, మేము కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా మా స్నేహితులను ఆట పట్టించడానికి అలాచేశాం" అన్నాడు.
సాయి: "ఎలా నరసింహ?" అన్నాడు.
నరసింహ: "రేపు రా చూపిస్తా" అన్నాడు.
(మరుగుసటి రోజు ఇద్దరూ కలిశారు.)
నరసింహ తన దగ్గర ఉన్న గ్లాసులో ఒక మెటల్ సాల్ట్ ని వేసాడు. భూతం లాంటి ఆకారం ఏర్పడింది.
సాయి ఆశ్చర్యంతో: "ఎలా రా?" అన్నాడు.
నరసింహ: "ఏం లేదు రా, మన దగ్గర ఉన్న ఈ గ్లాస్ సోడియం సిలికేట్ కలిగి ఉంది. నేను ఎప్పుడుైతే కోబాల్ట్ క్లోరైడ్ ఆ గ్లాస్ లో వేసానో అది ఆ ఆకారంలో మారింది" అన్నాడు. "కాని ఊరిలో వారు చూసిన నిమ్మకాయలు, చేతబడీ ఆనవాలు అర్థం కావట్లే" అన్నాడు.
సాయి: "అది వారు మన ఊరి వారి మూడనమ్మకం అనే బలహీనతతో ఆడుకున్నారు అంతే. అవి నిజమైనవి కాదు" అన్నాడు.
నరసింహ: "మనం ఇది తొందరగా ప్రజలకు చెప్పకపోతే వారు ఆ ఖజానాను సొంతం చేసుకుంటారు."
(సాయి మరియు నరసింహ కలిసి ఊరిలో వారికి అర్థం అయ్యేలాగా చెప్పి ఆ భవనం దగ్గరకు తీసుకువెళ్ళారు.)
అక్కడ ఆ దొంగలు చేస్తున్న పని చూసి ఊరిలో వారికి అందరికీ కోపం వచ్చి అందర్నీ తరిమి కొట్టారు.
ఊరి పెద్ద: "భలే కనిపెట్టారా పిల్లలు! మీకు ఊరు అందరి తరపున కృతజ్ఞతలు."
నరసింహ: "అయ్య నాది ఒక కోరిక."
ఊరి పెద్ద: "ఏం కావాలన్న అడుగు రా."
నరసింహ: "మన ఊరిలో పాఠశాలను బాగా చెయ్యించండి. తర్వాత ప్రతి పిల్లాడు చదువుకునేల ఏర్పాటు చెయండి. ఇలాంటి మూడనమ్మకాల్ని మనం దూరం చేసుకోవాలంటే మనం విద్యకి దగ్గర కావాలి."
ఊరి పెద్ద: "వయసులో చిన్నవాడివి అయినా మంచి మాట చెప్పావు రా."
నరసింహ: "ఆ ఖజానా ఈ రాజ్య ప్రజలకు అందరి అవసరాలని తీర్చేల ఉపయోగ పడాలి అని ఆ భవనం లో సంస్కృతంలో రాశారు. మనం ప్రభుత్వాన్ని అడిగి ఆ ఖజానాని మన పాఠశాలకు మరియు ఊరి భవిష్యత్తుకి వాడమని చెప్పి చూద్దాం."
(అందరూ చదువు విలువ తెలుసుకున్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపడం మొదలు పెట్టారు.)
నీతి:
ఊరికి ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే ఇంతటి మార్పు. అదే ఒక ఊరు ఊరే చదువుకుంటే ఒక రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు. మనిషికి ఆహారం ఎలా అవసరమో విద్య కూడా అంతే అవసరం.
"జ్ఞానంలో చేసిన పెట్టుబడి అత్యుత్తమ లాభాన్ని అందిస్తుంది।" - బెంజమిన్ ఫ్రాంక్లిన్
"విద్యను అందిద్దాం విద్యార్థిగా మారుదాం దేశ యొక్క భవిష్యత్తును మారుదాం"
కలం కథ కీర్తిధర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
కలం పేరు: కలం - కథ - కీర్తిధర్
మంచి సందేశం నా ఉద్దేశం ❤️
Comments