top of page
Writer's pictureVeereswara Rao Moola

ఈ బాబు కి పెళ్ళవుతుందా?

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


'Yee Babuki Pellavuthunda' - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 29/09/2024

'ఈ బాబు కి పెళ్ళవుతుందా' తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మురారి - కుర్రాడు బుద్దిమంతుడే, ఒక్కడే కొడుకు, సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం, పెళ్ళి వయసు వచ్చిందని సంఘం, బంధు మిత్రులు గుర్తించి పెళ్ళి పెళ్ళి అని చెవి లో జోరీగ లా పోరు పెట్టడం తో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టారు తల్లి తండ్రులు.


ముందుగా వచ్చిన సంబంధం మేనమామ మంగపతి కూతురు అలివేలు. అలివేలు కి ఏదో మొగుడికి వాట్సాప్ ఇచ్చే చదువు ఉంది. అలివేలు టాలెంట్ టెన్త్ దాటక పోవడం తో మంగపతి పెళ్ళి కి డిసైడయ్యాడు.


మురారి కాదన్నాడు ఈ సంబంధాన్ని. ఏం అంటే మేనరికం వద్దన్నారు సైన్స్ ప్రకారం అన్నాడు.సమరం చెప్పారన్నాడు.

మేనమామ తో సమరానికి సిద్దమన్నాడు.

 

"నా కూతుర్నే కాదంటున్నావు. నీకు పెళ్ళెలా కుదురుతుందో చూస్తాను" అన్నాడు మంగపతి కోపం గా!


 *******

మురారి తన వివరాలు మిధ్య మాట్రిమోని డాట్ కామ్ లో పెట్టాడు. 


విద్య అనే సాఫ్ట్ వేర్ అమ్మాయి పెళ్ళి చూపులకు పిలిచింది.ఇద్దరూ డాట్ నెట్టె నని ఎగిరిగెంతింది. 


అన్ని వివరాలు తెలుసుకొని మీరు మా శాఖే అని సంబర పడి హానిమూన్ ఎక్కడికి వెడదామంటారు అని అడిగింది.


సడెన్ గా అలా అడిగే సరికి మురారి కి ఏం చెప్పా లో తోచక "మలక్ పేట" అన్నాడు.


"అక్కడికి ఎందుకు?"


"మా ఫ్రెండ్ రమ్మన్నాడు."


" హనీమున్ కి మాల్దీవులు వెడతారు లేదా మనాలి వెడతారు. అంతే కాని మలక్ పేట లేదా గుంటూరు జిల్లాలో ఉన్న చిలకలూరి పేట వెళ్ళరు."


"సరే" అన్నాడు నీరసంగా. ఇదో దద్దోజనం అనుకుంది. 

ఆ సంబంధం అలా తప్పి పోయింది.


 *********

ఒకమ్మాయి profile తెగ నచ్చడం తో మురారి ఫోన్ చేసాడు.

"మీ పేరు" అడిగాడు మురారి.

"నళిని"

"బాగుంది"

"నా పూర్తి profile చదివారా? నాకు ఒక సారి పెళ్ళయ్యింది " అంది నళిని. 

"విధి వక్రీకరించి మీకు అలా జరిగింది. మీ భర్త ఏలా చనిపోయారు?" 

"విధి కాదు వంకాయ కాదు. గురక పెడుతున్నాడని పొడిచి పారేశాను" 

వెంటనే ఫోన్ పెట్టెసి గటాగటా గ్లాసుడు నీళ్ళు తాగాడు. 


 *****

తరువాత జాతకాలు నచ్చక కొన్ని, మురారి బామ్మ కి నచ్చక కొన్ని, అమ్మా నాన్న లకి నచ్చక కొన్ని, అలా సంబంధాలు తప్పి పోయాయి. ఒకమ్మాయి ఇల్లరికం వచ్చెయ్యమంది. ఆ అమ్మాయి తండ్రి కి పేపర్ మిల్లు, సా మిల్లు, రైస్ మిల్లు ఉన్నాయి. 


ఈ అమ్మాయి కు భర్త కావాల లేక "సా" మిల్లు లో పని చేసే పని వాడు కావాలా అని మురారి కి అనుమానం వచ్చింది. కాలం జరా జరా పాకి మురారి 

స్నేహితులకు పెళ్ళిళ్ళయి ఒక బిడ్డ కి జన్మ నిచ్చారు. 

 *******

ఏడాది తర్వాత ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంబంధం వచ్చిందీ. 

అమ్మాయి పేరు పరిమళ. పెళ్ళి చూపుల్లోనే అడిగింది ఇంట్లో షార్ట్ వేసుకుంటా అభ్యంతరమా అని. 

మురారి తండ్రి చెప్పాడు. 

"అమ్మా షార్ట్స్, బికిని లు సాంప్రదాయం కాదమ్మా" 


తరువాత ప్యాకేజి, ఏజ్ గ్యాప్ అడిగింది. 

మురారి ప్యాకేజి 1, 69, 000 రూ

పరిమళ ప్యాకెజీ 1, 70, 000. రూ.

ఏజ్ గ్యాప్ 3 సంవత్సరాల ఆరు రోజులు. అంతే సంబంధం వద్దనేసింది పరిమళ తల్లి పూర్ణ. 


 *******

మురారి స్నేహితుడు శేఖర్ కనబడి తన బాధ చెప్పుకున్నాడు. భద్రం బికేర్ ఫుల్ బ్రదరూ, షాది మాటే వద్దు గురూ అని పాడడం మొదలు పెట్టాడు. "పెళ్ళయి ఏడాదే కదా ఎందుకిలా పాడుతున్నావు?" అని అడిగాడు. 


"ఏం చెప్పను రా నా భార్య కి కిచెన్ ఎలర్జీ, షాపింగ్ ఎనర్జీ. మొత్తం క్రెడిట్ కార్డ్ గీకేస్తుంది. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ కట్టడానికి బ్యాంక్ లోన్ తీసుకున్నా. పెళ్ళికి ముందు నా భార్య వరమనుకున్నా. క్షవరమని తరువాత తెలిసింది” అని శేఖర్  వాపోయాడు. 


పెళ్ళయ్యాక, గృహ ప్రవేశం అంటే సింహం గుహ లోకి వెళ్ళడమె అని 

అనిపించింది మురారికి. 

 

 ****** 


 మేనమామ మంగపతి వచ్చి తన శాపం ఫలించిందన్నాడు. మురారి కి జీవితం మీద విసుగు వచ్చి ప్రజాపిత బ్రహ్మకుమారి లో జాయినవుతానన్నాడు. మధ్య లో శంకరుడి భజ గోవిందం చదవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత తెలిసున్న వాళ్ల ద్వారా ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం కామ్రేడ్ కామేశ్వరి. 


కామేశ్వరి కమ్యూనిస్ట్ పార్టీ లో పని చేసి బయటికి వచ్చింది. కామేశ్వరికి తల్లి, తండ్రి లేరు. మేనత్త మంగ లక్ష్మి ఉంది. 

 ****'**

కామేశ్వరి తో పెళ్ళి చూపులు ఏర్పాటయ్యాయి. 

"వంట పని, ఇంటి పని ఆడ వాళ్ళే చెయ్యాలా మీ అభిప్రాయం?" అడిగింది కామేశ్వరి. 

"సాధారణం గా వాళ్ళే చేస్తారు కదండి" 


"అనాది గా ఆడదాన్ని వంట ఇంటి కే పరిమితం చెయ్యాలన్నది మీ బూర్జువా మనస్తత్వానికి అద్దం పడుతోంది." 


"బూర్జువా" పదం విని మురారి దడుసుకున్నాడు. 

"కారల్ మార్క్స్ కాపిటల్ చదివారా? "


"ఇప్పుడే ఆ పేరు వింటున్నా" 


"మార్క్స్ ని చదవలేదంటే మార్పు అంగీకరించని మీ ఫ్యూడల్ సంస్క్రుతి తెలుస్తోంది. "


"ఓరి నాయనో ఇలా చావగొట్టైస్తోంది. బూర్జువా అంటుంది. ఫ్యూడల్ అంటుంది. అని నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు మురారి. 


"ఒక పాట పాడమ్మా" అడిగింది మురారి తల్లి. 


"నాంపల్లి టేసన్ కాడి రాజలింగో..." అని అందుకుంది. మురారి కీ స్ప్రుహ తప్పింది. 

 

 *******

పెళ్ళి అనేది ఒకటుందని, అదీ మగవాళ్ళు ఆడ వాళ్ళ ని చేసుకుంటారని. అని మర్చి పోయి మురారి బుద్ది గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. 


ఆ రోజు ఆదివారం. ప్రశాంతం గా నిద్ర పోయి లేచిన మురారి కళ్ళు ఎవరో మూసారు. ఎవరా అని చూస్తే ఎదురుగా అనుపమ! ఇంటర్మీడియట్ లో మురారి క్లాస్ మేట్. 

" నువ్వా అనూ.." 


" అవును అనూ నే, అప్పుడు లెటర్ రాసి చివాట్లు తిన్నావు" అని గలా గలా నవ్వింది. 


" ఇంటర్ తర్వాత నాన్న గారికి ట్రాన్సఫరయింది" 


"మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత, నా కోసమే వచ్చావా?" 


" కాదు వచ్చాక నువ్వు కనబడ్డావు" 


" సాఫ్ట్ వేరా?" 


"కాదు బ్యాంక్ ఉద్యోగం" అంది అనుపమ. 


"హమ్మయ్య, బ్రతికించావు. లవ్ యూ అనూ "

అని అనుపమ ని కౌగలించు కున్నాడు. 


" ఇలా అతిధులను కౌగలించుకుంటారా?" 


"నువ్వు తిధి లేకుండా నా జీవితం లో కి వచ్చిన దేవతవి"


" దేవతో మరొకటో అప్పుడే తీర్మానించకు "


" పెళ్ళయితే చాల్లే, మిగతా గొడవలు తరువాత చూద్దాం"


మురారి, అనుపమల వివాహం జరిగింది

 ********

రెండేళ్ళ తర్వాత.. 

తిరుపతి లో

ఒక అమ్మాయి కళ్ళ కి గాగుల్స్ పెట్టుకుని, పెదాలకి లిప్స్టిక్, హెండ్ బ్యాగ్ తో వయ్యారం గా నడుస్తోందీ. 


వెనకాల రెండు పెద్ద ట్రావెల్ బ్యాగ్ ల తో రొప్పూతూ నడుస్తున్నాడు మురారి. 


"ఏడు కొండల వాడా, మాకు పెళ్ళంటే రెండు ట్రావెల్ బ్యాగ్ లు. గోవిందా గోవిందా.." 


మురారి కేసి చిరు కోపం తో చూసి "నా వెనుక నీ నడక" అంది. 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






64 views0 comments

Comments


bottom of page